కాకినాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఇక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో టిడిపి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీల్లో కనిపించడానికి, పత్రికలకు ఎక్కాలంటే తాను కూడా గట్టిగా మాట్లాడగలనని హెచ్చరించారు. వరద ప్రాంతాల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వరద సహాయంపై కాకినాడ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారుల పనితీరు బాగోలేదని పెద్దాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ సిఎంకు ఫిర్యాదు చేశారు.
అదే సందర్భంలో రాజానగరం తెలుగు దేశం ఎంఎల్‌ఎ పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ అధికారులు మీ ఆదేశాలను పట్టించుకోవడం లేదన్నారు. దాంతో సీఎం అతనిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
టీవీల్లో కనిపించడానికి నేనూ మాట్లాడగలను: సిఎం కిరణ్
Published Thu, Oct 31 2013 8:58 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement