సాక్షి, అమరావతి: రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కాగా వ్యవసాయ, అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు రూ.1584 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలిదశలో రూ.659 కోట్లతో 1255 బహుళ ప్రాయోజిత కేంద్రాలను, రెండో దశలో రూ.925 కోట్లతో 1276 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే నవంబర్ నాటికి తొలిదశ నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. కొత్తగా మరో 25 రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
చదవండి: రికార్డు స్థాయిలో వాక్సినేషన్ చేస్తున్నాం: ఆళ్ల నాని
Comments
Please login to add a commentAdd a comment