CM Jagan Review Meeting On Agriculture And Civil Supplies Department - Sakshi
Sakshi News home page

ఆ బాధ్యత మనదే.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..

Published Mon, Jun 27 2022 5:09 PM | Last Updated on Mon, Jun 27 2022 7:39 PM

CM Jagan Review Meeting On Agriculture And Civil Supplies Department - Sakshi

సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ, పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ నేపథ్యంలో ఇ-క్రాపింగ్, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు అంశాలపై సీఎం సమీక్షించారు.  ఖరీఫ్‌ ప్రారంభం అవుతోందని.. రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ-క్రాపింగ్‌ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
చదవండి: ఆ రెండు వేల కోసం విమర్శిస్తున్నారు: సీఎం జగన్‌

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...
ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుంది
ఇ-క్రాప్‌ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలి
ఇ-క్రాప్‌ చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతోపాటు, ఫిజికల్‌ రశీదుకూడా ఇవ్వాలని గతంలో నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను
డిజిటల్‌ రశీదును నేరుగా రైతు సెల్‌ఫోన్‌కు పంపాలి
ఒకవేళ తనకు నష్టం వస్తే.. ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వారికి వస్తుంది
దీనికి సంబంధించిన ఎస్‌ఓపీని బలోపేతం చేయాలి
వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ల జాయింట్‌ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలి
ఆ గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్‌ రిజిస్టర్‌ను వీరికి అందుబాటులో ఉంచాలి
జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్‌ ఇ–క్రాప్‌లో లోడ్‌ చేయాలి
జూన్‌ 15 నుంచి ఇ– క్రాపింగ్‌ మొదలుపెట్టి, ఆగస్టు చివరినాటి పూర్తిచేయాలి
సెప్టెంబరు మొదటివారంలో సామాజిక తనిఖీచేపట్టాలి
జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి
ఉన్నతాధికారుల స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి ఇ–క్రాపింగ్‌పై సమీక్ష, పర్యవేక్షణ చేయాలి
మండలస్థాయి, జిల్లా స్థాయిల్లో అధికారులు ఇ–క్రాపింగ్‌ జరుగుతున్న తీరును తనిఖీచేయాలి

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసివేయాలి
ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలి
ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదు
ధాన్యం కొనుగోలు బాధ్యత పౌర సరఫరాల శాఖదే
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత కూడా పౌరసరఫరాల శాఖదే
రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత... ఆ ధాన్యాన్ని వేరే వే-బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలి
దీనివల్ల రైతుకు ఎంఎస్‌పీ  లభిస్తుంది
రావాల్సిన ఎంఎస్‌పీలో ఒక్క రూపాయికూడా తగ్గకుండా రైతుకు రావాలి

పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారిపక్షాన నిలవాలి
వారి పక్షం నుంచి మనం ఆలోచన చేయాలి
రైతుల విషయంలో కూడా అంతే
వారి పంటలకు అందే ధర విషయంలో రైతుల పక్షాన మనం నిలవాలి
కొనుగోలు చేయడమే కాదు, ఎంఎస్‌పీ కూడా కల్పించాల్సిన బాధ్యత మనది: అధికారులకు స్పష్టం చేసిన సీఎం జగన్‌

సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి,  సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి,  మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి వై మధుసూధన్‌ రెడ్డి, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి హరి కిరణ్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement