CM Jagan Review Meeting On Agriculture And Horticulture Departments, Check Details Inside - Sakshi
Sakshi News home page

వ్యవసాయంపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Wed, Mar 29 2023 5:14 PM | Last Updated on Wed, Mar 29 2023 6:36 PM

Cm Jagan Review On Agriculture And Horticulture Departments - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అకాల వర్షాలు వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ స్ధితి గతులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్‌ జరుగుతోందని, ఏప్రిల్‌ మొదటి వారంలో నివేదిక ఖరారు చేస్తామని, ఏప్రిల్‌ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదలచేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

రబీ సన్నాహకాలపైన సీఎం సమీక్ష.
ఇప్పటికే 100 శాతం ఇ-క్రాపింగ్‌ పూర్తైందని అధికారులు వెల్లడించారు. నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు,  కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలని సీఎం సూచించారు.

సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా 2023–24లో 10.5లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన అధికారులు. ఎరువులతో పాటు ఏపీ ఆగ్రోస్‌ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. నకిలీ, నాణ్యతలేని పురుగుమందులు లేకుండా చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. 

పొలంబడి శిక్షణ 
పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్న అధికారులు
ఆర్బీకేల ద్వారా ఆయా రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్న అధికారులు
ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయన్న అధికారులు
పత్తిలో 16శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9శాతం దిగుబడులు పెరిగాయన్న అధికారులు
పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు అన్న అధికారులు
26 ఎఫ్‌పీవో(ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌)లకు జీఏపి (గుడ్‌అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌) సర్టిఫికెట్‌ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు

వ్యవసాయ పరికరాల పంపిణీ
రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్‌
 యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందన్న సీఎం
 ఏప్రిల్‌లో  ఆర్బీకేల్లోని 4225 సీహెచ్‌సీలకు యంత్రాల పంపిణీ
జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్‌ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ
జులై లో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్‌ మధ్య మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ

మిల్లెట్స్‌ సాగుపై చర్యలు
రాష్ట్రంలో మిల్లెట్స్‌ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ఆదేశాలమేరకు అనేక చర్యలు తీసుకున్నామన్న అధికారులు
19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్‌ క్లస్టర్లు  పెట్టామన్న అధికారులు
3 ఆర్గానిక్‌ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడి
ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి సాగును ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు.
2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతిచేయదగ్గ వరి రకాలను సాగుచేస్తున్నామన్న అధికారులు
దాదాపు  6.29 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయ్యిందని వెల్లడి
2022–23 రబీలో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను సాగుచేశారని, 3.79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి ఉందని వెల్లడించిన అధికారులు
ఆర్బీకేల్లో కియోస్క్‌ల సేవలు పూర్తిస్థాయిలో రైతులకు అందాలని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్న సీఎం
ఉద్యానవన పంటల మార్కెటింగ్‌ పై  ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం
కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నకొద్దీ.. మార్కెటింగ్‌ ఉదృతంగా ఉండాలన్న సీఎం
దీనివల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులు ఉండవని, మంచి ఆదాయాలు కూడావస్తాయన్న సీఎం

ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌
ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను  వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం
భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ఫలితాలు ఆధారంగా పాటించాల్సిన సాగు విధానాలపై అవగాహన తదితర అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించుకోవాలన్న సీఎం
ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం
జూన్‌లో ఖరీఫ్‌ నాటికి పరీక్షల ఫలితాలు ఆధారంగా రైతుకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలన్న సీఎం
పంటలకు అవసరమైన స్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు ఉండాలన్న సీఎం
ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌... ఆర్బీకేల కార్యక్రమాలను ఒక దశకు తీసుకెళ్తాయన్న సీఎం
చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని

ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్‌ రెడ్డి, ఉద్యానవన శాఖ సలహాదారు శివప్రసాద్‌ రెడ్డి, ఏపీ ఆగ్రోస్‌ ఛైర్మన్‌ బి.నవీన్‌ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌. శ్రీధర్, మార్క్‌ఫెడ్‌ ఎండీ రాహుల్‌పాండే,  ఎపీఎస్‌ఎస్‌డీసీఎస్‌ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌ బాబు, ఏపీ ఆగ్రోస్‌ వీసీ అండ్‌ ఎండీ ఎస్‌.కృష్ణమూర్తి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement