
సాక్షి, అమరావతి: పంటలకు గిట్టుబాటు ధరలపై సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు ఈ విషయంపై సమీక్షించారు. కలెక్టర్లు, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్లతో మాట్లాడిన కన్నబాబు, మంగళవారం నుంచి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని తెలిపిన ఆయన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఏ రైతు ఇబ్బంది పడటానికి వీల్లేదని.. మామిడి, ఇతర పండ్ల ధరలు పడిపోకుండా చూడాలి అధికారులకు కన్నబాబు దిశానిర్దేశం చేశారు.