'టీడీపీకి కచ్చితంగా బుద్ధిచెబుతారు' | YSRCP Leader Kanna Babu Slams TDP | Sakshi
Sakshi News home page

'టీడీపీకి కచ్చితంగా బుద్ధిచెబుతారు'

Published Tue, Aug 29 2017 8:28 PM | Last Updated on Tue, Sep 12 2017 1:17 AM

YSRCP Leader Kanna Babu Slams TDP

సాక్షి, కాకినాడ: కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అధికార పార్టీ నాయకులు వేల రూపాయలు పంచారని వైఎస్సార్‌ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోవున్నా ఇతర జిల్లాల టీడీపీ నేతలు కాకినాడలోనే మకాం వేశారని తెలిపారు. వార్డులవారీగా ప్రలోభాలకు గురిచేశారని అన్నారు. టీడీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా వైఎస్సార్‌ సీపీదే విజయమన్నారు. ప్రభుత్వానికి కాకినాడ ప్రజలు కచ్చితంగా బుద్ధిచెబుతారన్నారు.

కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ తీరును మేధావులు కూడా అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని ఆయన అన్నారు. కాగా, కాకినాడ ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్‌ 1న వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement