సాక్షి, తూర్పుగోదావరి: సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా100 డీసీసీబీ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులతో పాటుగా డ్వాక్రా సంఘాలకు సహకార రంగం ద్వారా ఋణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారని, ఆయన వారసునిగా పోలవరం పూర్తి చేయడానికి సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వచ్చినా రాకపోయిన పర్వాలేదు.. కాంట్రాక్టులు తమకు వస్తే చాలన్న విధంగా ఆప్పుడు చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment