
తిరుపతి: నిన్న అలిపిరిలో మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. నారా లోకేష్‌కు సంస్కారం లేదని, బుర్ర తక్కువ పనులు, పిచ్చి చేష్టలుగా పరిగణించాలని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి.. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యముంత్రి అయిన వైఎస్ జగనమోహన్‌రెడ్డికి సవాల్ విసిరే స్థాయి లేదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ప్రమాణం చేస్తావా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని మీరు ప్రమాణం చేయగలరా?.. పుష్కరాల్లో 29 మంది మృతికి కారణం చంద్రబాబు కాదని ప్రమాణం చేయగలరా? అంటూ లోకేష్‌ని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారణ చేస్తోందని చెప్పారు. ఇదే కాక, ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. లోకేష్‌కు, సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, అది తెలుసుకుని నడుచుకోవాలని హితవు పలికారు. గడిచిన ఎన్నికల్లో టీడీపీని ప్రజలే పీకి పాడేశారు. ఇక ప్రస్తుతం టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే అన్నారన్నారు.
( చదవండి: మీ శ్రేయస్సు దృష్ట్యా సభకు రాలేకపోతున్నా: సీఎం జగన్ )
Comments
Please login to add a commentAdd a comment