బొకేలొద్దు.. మొక్కలివ్వండి
కర్నూలు (ఓల్డ్‌సిటి) : ఫంక్షన్‌లలో బొకేలకు బదులు చిన్నమొక్కలు ఇచ్చే సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ కన్నబాబు సూచించారు. కోరారు. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిధిలో కృషి చేయాలన్నారు. ఆంద్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కర్పొరేషన్ అండ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం కల్లూరు ఏస్టెట్స్‌లో పారిశ్రామిక పర్యావరణ మెరుగుదల కార్యక్రమం నిర్వహించారు. ఏపీఐఐసీ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుంచి జూలై 5వ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. కార్యక్రమంలో పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే అంశంపై చర్చించారు.
పరిశ్రమలే ప్రధానం: వాతావరణ కాలుష్యానికి చాలా వరకు పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, ఇతర వాయువులే కారణమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని జేసీ కన్నబాబు పారిశ్రామిక వేత్తలకు సూచించారు. ప్రతీ కుటుంబం నాలుగు కార్లను వాడడం ఫ్యాషన్‌గా మరిందని, ఒక్కకారు వాడితే వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించిన వారవుతారన్నారు. కార్యక్రమంలో సుందర్‌రావ్ (జీఎమ్‌డీఐసీ), రమణ (సెట్కూర్ మేనేజర్), సుభాన్ (ఏపీపీసీబీ), శ్రీనివాసరావ్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ), సిల్వర్‌జూబ్లి కాలేజీ లెక్చరర్ రంగనాథ్, సర్వీస్ సొసైటీ చైర్మన్ జీఆర్‌కెరెడ్డి, రంజిత్(జడ్‌ఎమ్ ఏపీఐఐసీ) తదితరులు పాల్గొన్నారు.