World Environment Day
-
పర్యావరణహితం యువతరం సంతకం
కామిక్ స్ట్రిప్స్, వీడియోలు, ఫొటోగ్రాఫ్‌లు, రీల్స్... ఒక్కటనేమిటి... సమస్త సాధనాలు, వేదికల ద్వారా పర్యావరణహిత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు యంగ్–ఎకో వారియర్స్.‘కళలో సామాజిక సందేశం కూడా ఇమిడి ఉంది’ అనే నిజాన్ని రుజువు చేస్తున్నారు.వాతావరణానికి హాని కలిగించే ఉత్పత్తులు, వాటికి ప్రత్యామ్నాయాలు, షాపింగ్ మార్గాలు... మొదలైన వాటి గురించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ ఎడ్యుకేటర్ అండ్ ఎకో–యూట్యూబర్ నయన ప్రేమ్‌నాథ్.సస్టెయినబుల్ లివింగ్పై కంటెంట్ రూపోందిస్తోంది. క్లైమెట్–డామేజ్ ప్రాడక్ట్స్‌కు ప్రత్యామ్నాయాలు ఏమిటో చెబుతోంది. ఉదా: సస్టెయినబుల్ షాపింగ్, సస్టెయినబుల్ ఫ్యాషన్... మొదలైనవి.‘పర్యావరణ హిత వీడియోలు చేస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషమే శక్తిగా నన్ను ముందుకు నడిపిస్తోంది’ అంటుంది ప్రేమ్‌నాథ్.ప్రయాణ ప్రేమికుడిగా ఆశాశ్ మన దేశంలోని ఎన్నో; ప్రాంతాలకు వెళ్లాడు. తాను వెళ్లిన ప్రాంతాలలో రోడ్డు పక్కన ΄్లాస్టిక్ చెత్త కనిపించేది. ‘ఏమిటి ఇది’ అనుకునేవాడు. అయితే లడఖ్ అందాల మధ్య పాస్టిక్ వ్యర్థాలను చూసి ఆకాష్ షాక్ అయ్యాడు. ఆ షాక్ అతడిని కొత్తదారి వైపు తీసుకువెళ్లింది.‘ఆ రోజు నుంచి పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలలో భాగం కావాలనే ఆలోచన అంతకంతకూ పెరుగుతూ వచ్చింది’ అంటాడు ఆకాశ్ రాణిసన్.పర్యావరణానికి సంబంధించిన సంక్లిష్ట విషయాలను సామాన్యులకు అర్థం అయ్యేలా సోషల్ మీడియాలో కంటెంట్ రూపోందించప్రారభించాడు. ‘గ్రీన్ వాషింగ్’ అంటే ఏమిటో వివరించడంతో పోటు వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడానికి చూడాల్సిన డాక్యుమెంటరీల గురించి చెప్పడం వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆకాష్ ‘క్లైమెట్ చేంజ్ ఎక్స్ప్లెయిన్డ్: ఫర్ వన్ అండ్ ఆల్’అనే పుస్తకం రాశాడు.అహ్మదాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన పంక్తీ పాండే లాక్డౌన్ టైమ్‌లో సస్టెయినబుల్ లివింగ్పై కంటెంట్ క్రియేషన్ మొదలు పెట్టింది. జీరో–వేస్ట్పాక్టీషనర్గా పేరు తెచ్చుకుంది పంక్తీ. రోజువారీ జీవితంలో పర్యావరణ స్పృహతో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి ఎంపికలు అవసరం... మొదలైన విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది.‘నాలుగు మంచి మాటలు చెప్పినంత మాత్రాన ప్రజల్లో మార్పు వస్తుందా... లాంటి నిరాశపూరిత మాటలు వినడం నాకు కష్టంగా అనిపించేది. నేను మాటలకే పరిమితం కాలేదు. జీరో వేస్ట్‌పై నా ఇల్లే ప్రయోగశాలగా ఎన్నో ప్రయోగాలు చేశాను. నేను సాధన చేస్తున్న విషయాలను ఫేస్బుక్లో జీరో అడ్డా పేజీ ద్వారా ఇతరులతో పంచుకుంటున్నాను’ అంటుంది పంక్తీ పాండే.ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రిసెర్చర్ అయిన రస్లీన్ గ్రోవర్ కంటెంట్ క్రియేటర్ కూడా.సోషల్ మీడియాలో వాతావరణ విధానాలకు సంబంధించిన కంటెంట్‌ను ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ విధానంలో రూపోందిస్తోంది రస్లీన్.‘నా కంటెంట్ ద్వారా ప్రజల జీవనశైలిలో ఏ కొంచెం మార్పు వచ్చినా సంతోషం అనుకొని ప్రయాణం ్ర΄ారంభించాను. నా ప్రయత్నం వృథాపోలేదు’ అంటుంది రస్లీన్.చెన్నైకి చెందిన కీర్తి, దిల్లీకి చెందిన కృతి, ముంబైకి చెందిన రష్మీ పెయింటింగ్‌లో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ ముగ్గురికి ఇష్టమైన సబ్జెక్ట్ పర్యావరణం.వారి చిత్రాలలో పర్యావరణ హిత ఆలోచనల వెలుగు కనిపిస్తుంది.‘వాతావరణ మార్పుల గురించి తెలుసుకుంటున్న యువతరం నిట్టూర్పుకు మాత్రమే పరిమితం కావడం లేదు. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన విషయాలను తమకు తోచిన రీతిలో ప్రచారం చేస్తున్నారు’ అంటుంది క్లైమెట్ యాక్టివిస్ట్, ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైర.పర్యావరణ పాట‘ఆహా’ అనుకునే పాటలు కొన్ని. ‘ఆహా’ అనుకుంటూనే ఆలోచించేలా చేసే పాటలు కొన్ని. అనుష్క మాస్కే ΄ాటలు రెండో కోవకు చెందినవి. సింగర్–సాంగ్ రైటర్ అనుష్క మాస్కే పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచారానికి పాట’ బలమైన మాధ్యమం. సిక్కింకు చెందిన అనుష్క తొలి ఆల్బమ్ ‘థింగ్స్ ఐ సా ఏ డ్రీమ్’లో పర్యావరణ స్పృహ కనిపిస్తుంది. -
సమయం లేదు మిత్రమా!
ప్రపంచంలోని 175 దేశాలు... దాదాపు 1000 మంది ప్రతినిధులు... అయిదు రోజుల చర్చోప చర్చలు... ఎట్టకేలకు ప్రపంచ సమస్యకు పరిష్కారం దిశగా చిన్న ముందడుగు. మే 29 నుంచి జూన్ 2 వరకు ప్యారిస్‌లో ప్లాస్టిక్‌పై ఐరాస అంతర్ ప్రభుత్వ చర్చల సంఘం2 (ఐఎన్‌సీ–2) సమావేశంలో జరిగింది ఇదే. ప్లాస్టిక్ కాలుష్యభూతాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా విశ్వవ్యాప్త ఒప్పందానికి చిన్నగా అడుగులు పడ్డాయి. ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని పారద్రోలండి’ అన్నది ఈసారి ప్రధానాంశమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొద్దిగా ముందు జరిగిన ఈ సమావేశం ఆ మేరకు ఆనందించదగ్గది, అయితే, నవంబర్‌లో నైరోబీలో జరిగే ‘ఐఎన్‌సీ–3’ నాటికి కేవలం ఆలోచనలు ఏకరవు పెట్టే చిత్తు ప్రతి తయారీనే ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకోవడం ఆశ్చర్యకరం. పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పసి ఫిక్ మహాసముద్రంలో కదులుతున్న కృత్రిమ ద్వీపంలా తయారైన వేళ ఇది అతి జాప్యమే. నిజానికి, వచ్చే 2024 చివర లోపల ప్లాస్టిక్ భూతంపై ఈ చర్చోపచర్చలు ముగించాల్సి ఉంది. అందులో భాగంగా తలపెట్టిన అయిదు సమావేశాల్లో తాజా ప్యారిస్ సమావేశం రెండోది. ఆరు నెలల క్రితం ఉరుగ్వేలో జరిగిన తొలి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని దేశాలు విశ్వవ్యాప్త కార్యాచరణ కోరితే, మరికొన్ని దేశాలు జాతీయ పరిష్కారాలు కావాలన్నాయి. ఇంకొన్ని దేశాలు రెండూ కావాల్సిందే అన్నాయి. తీరా ఆరునెలల తర్వాత తాజా సమావేశంలోనూ తొలి రెండు రోజులూ ఉద్రిక్తత నడుమ వృథా అయ్యాయి. సహజంగానే ప్లాస్టిక్‌తో తమ ఆర్థిక అంశాలు ముడిపడ్డ చమురు, సహజవాయు, పాలిమర్ ఉత్పాదక దేశాలు ఏకాభిప్రాయం కుదరనివ్వక తమకు అనుకూల వాదనను ఎంచుకుంటూ, చర్చలను జాప్యం చేశాయి. ఎట్టకేలకు మూడో రోజున చర్చల రథం కొంత ముందుకు కదిలింది. ఆర్థిక ప్రయోజనాలు అర్థం చేసుకోదగినవే కానీ, వాటి కోసం ప్రపంచమే ప్రమాదంలో ఉన్నా పట్టదంటే ముమ్మాటికీ తప్పే. మానవాళికి ప్లాస్టిక్ పెనుభూతమే. ప్రపంచంలో ఏటా 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. అందులో సగానికి పైగా ఉత్పత్తులు పరిమిత కాలం ఆయువున్నవే. ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్‌లో మూడింట రెండు వంతులను వ్యర్థాలుగా పారేస్తున్నారు. పది శాతం ప్లాస్టిక్కే రీసైక్లింగ్‌కు నోచు కుంటోంది. అతి కొద్దిభాగం ప్లాస్టిక్ వ్యర్థాలనే దహనం చేస్తున్నారు. అత్యధిక భాగం భూమిలో, జల వనరుల్లో, సముద్రాల్లో చేరిపోతున్నాయి. ఇది సమస్త జీవరాశికీ ముప్పు. ఇలా పేరుకుంటున్న వ్యర్థాల పరిమాణం వచ్చే 2060కి మూడు రెట్లవుతుంది. అందులో అయిదోవంతే రీసైకిల్ చేయడా నికి వీలుంటుంది. ఇక, 2019లో ప్రపంచవ్యాప్త ఉద్గారాల్లో 3 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాల పాపమే. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ఈ ప్రమాదాలపై తాజాగా అప్రమత్తం చేసింది. కొత్తగా మైక్రో ప్లాస్టిక్స్ మరో పెను ఆందోళన. చేపలు, బ్లూ వేల్ లాంటి సముద్రచరాలు రోజూ కోటి ముక్కల మైక్రో ప్లాస్టిక్‌ను పొట్టలో వేసుకుంటున్నాయి. వాటిని భుజిస్తున్న మన రక్తంలో, చనుబాలలో, చివరకు గర్భస్థ మావిలో సైతం చేరి, ఆరోగ్య సమస్యగా మారాయి. కానీ, ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిమితం చేయాలంటున్న దేశాలకూ, వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే సరి అంటున్న దేశాలకూ మధ్య భేదాభిప్రాయాలు మరోసారి ప్యారిస్ సాక్షిగా బయటపడ్డాయి. మన దేశంతో సహా సౌదీ అరేబియా, చైనా తదితర దేశాలూ నియంత్రణ చర్యలపై మెజారిటీ ఓటింగ్ కాక, ఏకాభిప్రాయం కావాలని పట్టుబట్టడం చిత్రం. లెక్కల్లో మన దేశ తలసరి ప్లాస్టిక్ వినియోగం అనేక ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. కానీ మన మొత్తం జనాభా, అన్ని కోట్లమంది అవసరాలకై ప్లాస్టిక్ ఉత్పత్తి, తత్ఫలి తంగా వ్యర్థాలు మాత్రం ఎక్కువే. పైపెచ్చు, ఎప్పటికప్పుడు అది అధికమవుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తిని నియంత్రిస్తూ, కాలుష్యాన్ని మొగ్గలోనే తుంచేసే అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒడంబడిక ప్రపంచానికి ఇప్పుడు అవసరమంటున్నది అందుకే. ప్యారిస్ పరిణామాలు, అధిగమించా ల్సిన అడ్డంకుల్ని చూస్తుంటే ఆ ఒడంబడిక అంత త్వరగా వచ్చేలా లేదు. ఇవాళ్టికీ సామాన్య ప్రజలు తమ జీవితంపై ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావాన్ని గుర్తించడం లేదు. ఆ వైఖరిని మార్చడం విశ్వ ఒడంబడికను మించిన సవాలు. అలాగే వచ్చే ఏడాది చివరకి అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉండే చట్టబద్ధమైన విశ్వవ్యాప్త ఒడంబడిక తెద్దామని యోచన బాగున్నా, అందుకు కట్టుబడి ఉండడం కీలకం. ఒప్పందంలోనూ శషభిషలు లేకుండా ప్లాస్టిక్‌పై కఠిన కార్యాచరణ మరీ కీలకం. అలాకాక, మునుపటి పర్యావరణ ఒప్పందాల్లా ఈ కొత్త ఒడంబడికనూ కాలయాపన వ్యవహారంగా, ధనిక దేశాలకు అనుకూలంగా మారిస్తే ఫలితం శూన్యం. వర్ధమాన దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. ప్యారిస్ సమావేశం ప్రారంభ చర్చల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అన్నట్టు, ప్లాస్టిక్ కాలుష్యం ఇప్పుడు ఓ టైమ్ బాంబ్. తక్షణ చర్యలకు దిగకపోతే, పర్యావరణానికీ, జీవవైవిధ్యానికీ, యావత్ ప్రపంచ మానవాళి ఆరోగ్యానికే ప్రమాదం. దీన్ని కేవలం వ్యర్థాల నిర్వహణ అంశంగానే చూస్తే ఇబ్బందే. కేవలం రీసైక్లింగ్కో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధానికో పరిమితం కాకుండా పాలు, నీళ్ళ నుంచి తిండి దాకా అన్నీ ప్యాకెట్లూ ప్లాస్టిక్మయమైన ఈ రోజుల్లో ప్రజల జీవన విధానాన్ని మార్పించడంపై దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై త్వరపడాలి. ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల పైనే బాధ్యత మోపే ఆలోచన చేయాలి. ముప్పు ముంచుకొచ్చిన వేళ ఆలసిస్తే ఆనక ఏ ఒడంబడి కైనా నిరుపయోగమే. మెక్రాన్ మాటల్లోనే చెప్పాలంటే... ఆట్టే సమయం లేదు మిత్రమా! -
World Environment Day: ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నాం
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్‌తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
‘మిషన్ లైఫ్ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం’
విజయవాడ: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిస్తాం, పర్యావరణాన్ని కాపాడుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞపూనాలని పర్యావరణ దినోత్సవం-2023 సందర్భంగా రాష్ట్ర ఇంధన, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి సందర్శించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తరువాత ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లకు ప్రత్యామ్నాయంగా క్లాత్ తో రూపొందించిన బ్యాగ్ ను అందించే ఎనీ టైం బ్యాగ్ (ఎటిబి) వెండింగ్ మిషన్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగంను నివారించడం, కాలుష్యాన్ని నియంత్రించాలంటూ పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పర్యావరణహిత కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిశ్రమలు, ఆస్పత్రులు, స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తూ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, 1975 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటున్నామని గుర్తచేశారు. అందరిలోనూ పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు, పర్యావరణంకు ముప్పు లేని జీవన విధానంను అలవర్చుకునేందుకు ఐక్యరాజ్యసమతి ఈ దినోత్సవంను ప్రకటించిందని వివరించారు. ఈ ఏడాది ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న కాలుష్యం, దానికి పరిష్కారాలు అనే అంశంపై ప్రపంచం అంతా పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ గతంలో విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగాగ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్నిమంత్రి గుర్తుచేస్తూ తిరుమలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగిందన్నారు. ఇదే మాదిరిగా పలు దేవాలయాలు, మున్సిపల్ కార్పోరేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేదించామని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ది, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే ఈ ఘనతను సాధించగలిగామన్నారు. అంతేగాక ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో నీటి ఆదా, విద్యుత్ పొదుపు, సరైన ఆహార విధానంను అలవరుచుకోవడం, వ్యర్థాలను తగ్గించుకోవడం, స్వచ్ఛతా కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించుకోవడం అనే ఏడు అంశాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు. అంతేకాదు మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో భాగంగా మన రాష్ట్రంలోని సముద్రతీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ప్రజాభాగస్వామ్యంతో చేపట్టామని పేర్కొన్నారు. అలాగే అన్ని పట్టణాలు, నగరాల్లో కాలువలు, చెరువుల్లో క్లీనింగ్ కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే బైక్ ర్యాలీలు, ప్రధాన ట్రాఫిక్ కూడళ్ళ వద్ద పర్యావరణ అంశాలపై ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ పొదుపు చర్యలు, నీటి పరిరక్షణ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి గానూ గత మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, వారితో సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నామన్నారు. ఈ సదస్సులో మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, రూ. 9 లక్షల కోట్లు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలో వచ్చాయని వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయేతర వనరులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్యూలన కోసం 'ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్' ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఘన వ్యర్థాలను సురక్షితంగా నిర్మూలన చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో తాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రిగా రాష్ట్రంలో జగనన్న పచ్చతోరణం కింద కోటి మొక్కలను నాటించడం జరిగిందన్నారు. వాటిని పర్యవేక్షించేందుకు కూడా నరేగా నుంచి నిధులను వినియోగించామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొక్కలను తీసుకువచ్చి 16 వేల కిలోమీటర్ల పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ కింద 65 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్నారు.. ప్రస్తుతం అటవీశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలోని 120 అర్బన్ ప్రాంతాల్లో నగర వనాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎకో పార్క్ లను అభివృద్ది చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మన రాష్ట్రంలో 37,392 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి అంటే 23 శాతంగా ఉన్న అడవులను 33 శాతంకు పెంచాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారన్నారు. కమ్యూనిటీ ఫారెస్ట్ వంటి కార్యక్రమాలు, రైతులకు బీడు భూముల్లో ఉద్యానవనాల పెంపకంను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో చాలా పరిశ్రమలు ఉన్నాయని, రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా పచ్చదనంను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని భావిస్తున్నామన్నారు. పర్యావరణం సురక్షితంగా ఉంటేనే మానవాళితో పాటు అన్ని జంతు, జీవజాలాల మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.పర్యావరణంను కాపాడుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని కోరుకుంటున్నానన్నారు. పర్యావరణహితం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రతిఏటా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నాడు సన్మానిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచానికి ఒకే భూమి ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ విధిగా కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం గుర్తుచేశారు. ఏపి పిసిబి ద్వారా గాలి, నీటి కాలుష్యంను తగ్గించుకునేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ను జాగ్రత్తగా నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేకమైన కార్యాచరణను నిర్ధేశించామన్నారు. పర్యావరణంను కాపాడేందుకు బొగ్గుతో జరిగే విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఆలాగే పెట్రో ఇంధనంతో నడిచే వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. అంతర్జాతీయంగా యుఎన్ నిర్వహించిన మిషన్ లైఫ్ లో ప్రధానమంత్రి పాల్గొని కాలుష్య కారకమైన ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని, ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నియంత్రించడం, సరైన విధానంలో ప్లాస్టిక్ ను సేకరించి, వాటిని రీసైకిల్ చేసేందుకు తగు చర్యలు చేపట్టామని నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం మన దైనందిన జీవనంలో భాగమైందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం 80 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటే, దీనిలో 9 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోందని గణాంకాలతో సహా వివరించారు. మిగిలిన ప్లాస్టిక్ నదులు, సముద్రాలు, భూమిలో కలిసి విపరీతంగా కాలుష్యం పెరుగుతోందన్నారు. ప్లాస్టిక్ ను నిర్వీర్యం చేసేందుకు దానిని తగులబెట్టడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలిగించే విష వాయువులు గాలిలో కలుస్తున్నాయని, ఇది మానవాళికే ప్రమాదకరమన్నారు. ప్లాస్టిక్ వినియోగంపై వచ్చిన కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నామని తెలిపారు. గాలి, నీటి,భూ కాలుష్యంను తగ్గించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందిచగలుగుతామని శ్రీధర్ అన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న హాని నుంచి బయటపడాలంటే, నిపుణులు చేస్తున్న సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. విజయవాడ నగర పాలకసంస్థ ప్లాస్టిక్ ను నిషేదించిందని, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నామన్నారు. పర్యావరణంను పరిరక్షించేందుకు నగరంలోని కాలువలను శుద్ధి చేస్తున్నామన్నారు. దాదాపు 5000 టన్నుల చెత్తను వెలికితీసిన విషయాన్ని మల్లాది విష్ణు గుర్తు చేశారు.అర్భన్ ఫారెస్ట్రీ కింద విజయవాడ నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఎపి పిసిబి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణను వివరిస్తూ వేదికపై భాగవతుల వెంకట రామశర్మ శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్లాస్టిక్ సంచులు వాడొద్దు.. నార సంచులు, గుడ్డ సంచులు వినియోగించాలని ప్లాస్టిక్ భూతంపై పాడిన పాట, వివిధ రకాల కాలుష్యాలను వివరిస్తూ, భూమిని కాపాడుకుందాం అని పాడిన పాట, పర్యావరణం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ రాజమహేంద్రవరానికి చెందిన విభూది దళం బ్రదర్స్ ప్రదర్శించిన బుర్రకథ ఆద్యంతం ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా పర్యావరణ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రుల ప్రతినిధులకు, స్థానిక సంస్థలకు కలిపి మొత్తం 13 అవార్డులను మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశారు. డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, లావురుస్ లేబరేటరీస్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, కియా మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్స్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు మంత్రి అవార్డులను అందజేశారు. ఆసుపత్రుల విభాగంలో విశాఖపట్నం అపోలో హాస్పిటల్స్, విజయవాడ సెంట్రల్ రైల్వే హాస్పిటల్, విజయవాడ ఆయూష్ హాస్పిటల్, సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ మెడికల్ సైన్సెస్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రతినిధులకు అవార్డులను అందజేశారు. అలాగే అర్బన్ లోకల్ బాడీస్ కేటగిరిలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ. మల్లాది విష్ణు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ. నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిబి మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా యాదవ్, జెఎన్టియు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.జె. మురళీకృష్ణ, ప్రొఫెసర్ రామకృష్ణ, ఏపీ పీసీబీ మెంబర్ శివకృష్ణారెడ్డి, ఎన్విరాన్ మెంట్ చీఫ్ ఇంజనీర్ ఎన్.వి.భాస్కర్ రావు, పలువురు పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణంలో తెలంగాణ ‘ఫస్ట్’!
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్‌లో నిలిచింది. అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెంపు (చేంజ్ ఇన్ ఫారెస్ట్ కవర్)తోపాటు మున్సిపల్ వ్యర్థాల నిర్వహణలో అగ్రస్థానంలో నిలవగా.. వినియోగంలో లేని జలవనరుల శాతం, భూగర్భ జలాలు, నదుల కాలుష్యం వంటి అంశాల్లో వెనుకబడింది. అయితే అన్ని అంశాలను కలిపిచూస్తే ఓవరాల్‌గా దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రమే టాప్ స్కోర్ సాధించింది. తాజాగా ‘సెంటర్ ఫర్ సైన్స్ ఎన్వి రాన్మెంట్’విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వి రాన్మెంట్ 2023– ఇన్ ఫిగర్స్’నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రాల్లో వ్యవసాయం, పశు సంపద, వైల్డ్‌లైఫ్–బయోడైవర్సిటీ, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, నీరు–నదులు, విద్యుత్, ఆరోగ్యం అంశాల ఆధారంగా.. పర్యావరణం, వ్యవసాయం, ప్రజారోగ్యం, ప్రజా మౌలిక సదుపాయాలు, మానవాభివృద్ధి, మున్సిపల్ ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్, హానికర వ్యర్థాలు, ఇతర వ్యర్థాల నిర్వహణలో పాయింట్లను కేటాయించారు. ఏయే అంశాలకు గరిష్టంగా ఎన్ని పాయింట్లు ఇచ్చారు? ♦ 2019తో పోల్చితే అటవీ విస్తీర్ణం పెంపునకు 3 పాయింట్లు. ♦ మున్సిపల్ ఘనవ్యర్థాల నిర్వహణ (2020–21లో)కు 1.5 పాయింట్లు ♦ 2020 జూన్ 30నాటికి మురుగునీటి శుద్ధి చర్యలకు 1.5 పాయింట్లు ♦ 2019–20తో పోల్చితే 2020–21 నాటికి పునరుత్పాదక విద్యుత్ పెంపునకు 1 పాయింట్ ♦ 2018తో పోల్చితే 2022 నాటికి కాలుష్యం బారినపడ్డ నదుల ప్రక్షాళన చర్యలకు 1 పాయింట్ ♦ 2022లో భూగర్భజలాల వెలికితీత అంశానికి 1 పాయింట్ ♦ 2022లో వినియోగంలో లేని నీటి వనరుల శాతానికి 1 పాయింట్ (ఇందులో అటవీ విస్తీర్ణం పెంపు, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తెలంగాణకు ఎక్కువ పాయింట్లు వచ్చాయి. దీనితో ఎక్కువ పాయింట్లతో దేశంలోనే టాప్‌లో నిలిచింది.) పర్యావరణహిత రాష్ట్రం కోసమే: కేటీఆర్ పర్యావరణహితంలో దేశంలో అగ్రస్థానంలోనే తెలంగాణ నిలవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎస్ఈ విడుదల చేసిన నివేదికలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడాన్ని ప్రస్తావిస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఇది తెలంగాణ ప్రభుత్వ సమగ్ర, సమతుల్య పర్యావరణ విధానాలకు, పర్యావరణం పట్ల సీఎం కేసీఆర్ నిబద్ధతకు దక్కిన గుర్తింపు. భవిష్యత్తుతరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యం కోసమే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ పచ్చదనం, పర్యావరణ కార్యక్రమాలలో భాగస్వాములైన రాష్ట్ర ప్రజలకు అభినందనలు’ అని తెలిపారు. ఎక్కువ పాయింట్లు తెలంగాణకే.. ♦ వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రాలకు మొత్తంగా 10 పాయింట్లు కేటాయించగా.. తెలంగాణ 7.213 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్ (6.593 పాయింట్లు), గోవా (6.394), మహారాష్ట్ర (5.764), హరియాణా (5.578 పాయింట్లు) నిలిచాయి. ♦రాజస్తాన్ అతి తక్కువగా 2.757 పాయింట్లతో అట్టడుగున 29వ స్థానంలో నిలవగా.. నాగాలాండ్ 3.4 పాయింట్లతో 28వ, బిహార్ 3.496 పాయింట్లతో 27వ, పశ్చిమ బెంగాల్ 3.704 పాయింట్లతో 26వ స్థానాల్లో నిలిచాయి. ♦ తక్కువ పాయింట్లతో అట్టడుగున నిలిచిన పది రాష్ట్రాల్లో ఆరు ఈశాన్య రాష్ట్రాలే కావడం గమనార్హం. -
‘పండో’.. వంద ఎకరాల చెట్టు..
కొమ్మలకు ఊడలు వేస్తూ విస్తరించే భారీ మర్రి చెట్లు మనకు తెలుసు. నాలుగు ఎకరాల్లో విస్తరించిన పిల్లల మర్రిచెట్టు తెలుసు. కానీ వందకుపైగా ఎకరాల్లో, 47 వేలకుపైగా కాండాలతో విస్తరించి, వేల ఏళ్లుగా బతికేస్తున్న ఓ అతి పెద్ద చెట్టు ఉంది తెలుసా? సోమవారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా.. ఆ చెట్టు విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ అది ఒక చెట్టు అడవి.. అమెరికా దక్షిణ ఉటా ప్రాంతంలో ఒకేచోట 47 వేలకుపైగా ఆస్పెన్ చెట్లు (పొడవుగా పెరిగే అశోకా చెట్ల వంటివి) పక్కపక్కనే ఉన్నాయి. వాటిపై ఇటీవల పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు అవన్నీ ఒకే చెట్టు శాఖలని.. అన్నింటి వేర్లు పూర్తిగా అనుసంధానమై ఉన్నాయని గుర్తించారు. ఒక ప్రధాన చెట్టు వేర్లు భూమిలో విస్తరిస్తున్నకొద్దీ.. వాటి నుంచి కాండం ఉద్భవిస్తూ మరోచెట్టులా ఏర్పడినట్టు తేల్చారు. ఈ చెట్టును ‘పండో’ అని పిలుస్తున్నారు. లాటిన్ పదమైన దీనికి అర్థం ‘నేను విస్తరిస్తా’ అని అర్థం. అతి పెద్ద జీవి ఇదే.. ♦ మొత్తం 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న ఈ చెట్టు వయసు 9 వేల ఏళ్లకుపైగా ఉండవచ్చని, బరువు 6 వేల టన్నులు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద బరువు, పరిమాణం పరంగా అతి పెద్ద జీవి ఇదేనని అంటున్నారు. ♦ ‘పండో’ చెట్టు వేలాది కాండాలకు ఉన్న ఆకులు కదిలిన శబ్దం.. వాటి వేళ్ల నెట్వర్క్ ద్వారా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా జెఫ్ రైస్ అనే సౌండ్ ఆర్టిస్ట్.. ఈ వేర్లపై దూరం దూరంగా పలుచోట్ల మైక్రోఫోన్లు, హైడ్రోఫోన్లు (నీటిలో, భూమిలోపల ధ్వనులను రికార్డు చేసేవి) అమర్చి శబ్దాలను రికార్డు చేశారు. ఎక్కడో ఒక ఆస్పెన్ కాండంపై మెల్లగా తడితే.. వందల అడుగుల దూరంలోని వేర్ల వద్ద ఆ ధ్వని వినిపిస్తున్నట్టు గుర్తించారు. ♦ ‘పండో’ చెట్టు, దాని చిత్రమైన వేర్ల వ్యవస్థపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. వేల ఏళ్ల కిందటి పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం, మొక్కలు/చెట్ల మధ్య అనుసంధానం వంటి అంశాలను దీని నుంచి గుర్తించవచ్చని భావిస్తున్నారు. వేల ఏళ్ల నుంచి ‘సింగిల్’గా.. చిలీ దక్షిణ ప్రాంతంలోని అడవిలో ఉన్న అతి పురాతనమైన సైప్రస్ చెట్టు ఇది. ‘పండో’లా వేర్వేరు చెట్ల తరహాలో కాకుండా.. ఒకే కాండంతో, ఒకేసారి పుట్టి పెరిగిన చెట్లలో ఇదే అత్యంత ఎక్కువ వయసున్నది అని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీనికి ‘గ్రేట్ గ్రాండ్ ఫాదర్’ అని పేరు పెట్టారు. ♦సుమారు 5,400 ఏళ్ల వయసు ఉంటుందని భావిస్తున్న ఈ సైప్రస్ చెట్టు ఎత్తు 91 అడుగులు, కాండం వెడల్పు 13 అడుగులు కావడం విశేషం. ♦ ఇన్ని వేల ఏళ్లుగా మారుతూ వచ్చిన వాతావరణాన్ని, కార్చిచ్చులను, ఫంగస్‌లను తట్టుకుని బతికిన ఈ చెట్టు కొన్నేళ్లుగా దెబ్బతింటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని రక్షించుకునేందుకు చర్యలు చేపట్టారు. ♦దీనికన్నా ముందు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘మెతుసలే’ అనే పైన్ చెట్టు 4,853 ఏళ్ల వయసుతో.. భూమ్మీద అత్యంత ఎక్కువ వయసున్న చెట్టుగా రికార్డుల్లో నమోదైంది. -
విశాఖ ‘గ్రీన్’ప్లాంట్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిసరాలు ప్రత్యేక వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్లాంట్ స్థలంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి రహదారికి ఇరువైపులా ఉండే పరిసరాలను చూస్తే విశాఖ నగరంలో ఉన్నామా లేక మరెక్కడైనా ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వేడిని చల్లార్చేలా వాతావరణ సమతుల్యత కోసం తీసుకుంటున్న చర్యల వల్ల నగరంంలో కంటే స్టీల్‌ప్లాంట్ ప్రాంతంలో 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో దేశంలోనే పర్యావరణ హిత ప్లాంట్‌గా ఖ్యాతి గాంచింది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టీల్ ప్లాంట్ గ్రీన్ ప్లాంట్‌గా ఎలా మారిందన్నదానిపై ప్రత్యేక కథనం.. ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో.. స్టీల్‌ప్లాంట్ ప్రారంభం నుంచి పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం స్టీల్‌ప్లాంట్ ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో మొదటి దశలో టన్ను స్టీల్ ఉత్పత్తికి ఒకటి చొప్పున మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని మూడు మిలియన్ చెట్లు నాటి ఆదర్శంగా నిలిచింది. ప్లాంట్ మొదటి దశలో హరిత వనాల పెంపునకు రూ.360 కోట్లు వ్యయం చేయగా.. విస్తరణ యూనిట్లలో మొక్కల పెంపునకు రూ.1,150 కోట్లు వ్యయం చేస్తున్నారు. నిబంధనల మేరకు పరిశ్రమలోని 33 శాతం గ్రీన్ బెల్ట్‌కు వినియోగించాల్సి ఉండగా.. స్టీల్‌ప్లాంట్ ఆ రికార్డును అధిగమించి 2,600 హెక్టార్లలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసింది. 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అనుగుణంగా 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్ ముందుకు సాగుతోంది. 2023 మే నెల నాటికి 5.51 మిలియన్ మొక్కలు నాటారు. తుపానులు, సునామి వంటి ఉప ద్రవాలను తట్టుకునేలా సుమారు 24 లక్షల కాజురీనా మొక్కలు నాటారు. కాలుష్యాన్ని నివారించేందుకు 18 లక్షలు ఏఏ ఫోర్మిస్, మామిడి, కొబ్బరి, జీడి, జామ, వేప, సుబాబుల్, సపోటా, రావి, మర్రి, టేకు మొక్కలు నాటారు. అదేవిధంగా 2.50 లక్షల యూకలిప్టస్ మొక్కలు నాటారు. బయోడీజిల్‌ను ప్రోత్సహించేందుకు సుమారు 4.50 లక్షలు పాల్మైరా, పొంగామియా, జట్రోపా మొక్కలు నాటారు. పర్యావరణంతో పాటు సంస్థకు ఆదాయం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. లక్షలాది మొక్కలను నాటడం ద్వారా నగరంలోని పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా సంస్థకు లక్షలాది రూపాయలు ఆదాయం కూడా లభిస్తోంది. సంస్థపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఆదాయం సమకూరుస్తున్నాం. – వీఎల్పీ లాల్, డీజీఎం, ఆగ్రో ఫారెస్ట్ విభాగం నగర కాలుష్యాన్నీ తగ్గించేలా.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన గ్రీన్ విశాఖ ప్రాజెక్ట్‌లో 4.50 లక్షల మొక్కలు నాటేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. 2012–19 మధ్యకాలంలో 4.50 లక్షలు మొక్కలు నాటి నగర పర్యావరణానికి సహకారం అందించారు. కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ (సీఈఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా 2019–23 వ్యవధిలో వివిధ ఫల జాతులకు చెందిన 55 వేల మొక్కలు నాటారు. 2020లో నగరంలోని ఐఐఎం క్యాంపస్‌లో గ్రీనరీ పెంపునకు రూ.40 లక్షలు అందజేశారు. సీఈఆర్లో భాగంగా స్టీల్‌ప్లాంట్ పరిసర గ్రామాల్లోని రైతులకు సుమారు 75 వేల జామ, మామిడి, సపోటా, కొబ్బరి మొక్కలు అందజేశారు. -
సేవ్ అవర్ సాగర్స్
-
‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో కేంద్రం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని ఆరంభించనుంది. దేశాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రయత్నం ముమ్మరంచేసింది. ఆ ప్లాస్టిక్ వాడకాన్ని ఈ నెలాఖరుకల్లా దశల వారీగా నిర్మూలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పట్టణ, స్థానిక సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు అడ్వైజరీని పంపింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాల మేరకు 2,591 నగర మున్సిపాలిటీలు ఆ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేశాయి. మరో 2,100 నగర మున్సిపాలిటీల్లోనూ ఈ నెల 30లోగా నిషేధం క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్న ‘హాట్ స్పాట్’లను గుర్తించి, వాటిని తొలగించాల్సిన బాధ్యత పట్టణప్రాంత స్థానిక సంస్థలదే అని కేంద్రం స్పష్టంచేసింది. ఆ ప్లాస్టిక్ వినియోగం నిషేధాలను అమలు చేయడం కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డ్‌ల సాయం తీసుకోవాలంది. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ల ఏర్పాటు, ఆకస్మిక తనిఖీలు, ఉల్లంఘనులపై భారీ జరిమానా విధించాలని కేంద్రం సూచించింది. దేశంలో 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం/ వాడి పడేసిన ప్లాస్టిక్‌తో తయారైన క్యారీ బ్యాగ్‌ల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమల్లో ఉంది. -
ప్రపంచ పర్యావరణ దినం: ఒక్కటే భూమి..ఒక్కటై కాపాడుకుందాం
భూగోళం వేడెక్కిపోతోంది. వాతావరణంలో కనీవినీ ఎరుగని విపరిణామాలు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న ఆదర్శం కాగితాలకే పరిమితమైంది. పారిస్ ఒప్పందాన్ని అమలు చెయ్యాలన్న పర్యావరణ శాస్త్రవేత్తల పిలుపులు కంఠశోషగానే మిగులుతున్నాయి. ఏడాదికోసారి పర్యావరణ పరిరక్షణ సదస్సులతో సరిపెడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే కనీవినీ ఎరుగని నష్టాలను చవిచూడటం ఖాయమని, ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు... జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాదితో దీనికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1972లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు స్వీడన్ ఆతిథ్యం ఇచ్చింది. వాతావరణ మార్పులను గమనించి, అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అప్పుడు తొలిసారిగా గుర్తించారు. 1973 నుంచి జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ‘ఓన్లీ వన్ ఎర్త్’ థీమ్‌తో ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. గ్రీన్ లైఫ్ స్టైల్‌ను అలవర్చుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వాలేం చేయాలి? ► పర్యావరణ పరిరక్షణకు అతి ముఖ్యమైన అడవులు, నదులు, సముద్రాలు , తేమ ప్రాంతాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. 1990వ దశకంలో ఏడాదికి 1.6 కోట్ల హెక్టార్ల చొప్పున అడవులను కోల్పోయాం! 2015–2020 మధ్య కూడా ఏటా కోటి హెక్టార్ల చొప్పున తగ్గింది. అడవుల్ని కాపాడుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. ► ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం మాంసాహారం తయారీ, రవాణా వల్ల 18% దాకా కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పశు పెంపకానికి నీటి వాడకమూ పెరుగుతోంది. దీన్ని తగ్గించాలంటే వ్యవసాయ రంగంలో చిన్న కమతాల్ని ప్రోత్సహించాలి. ► ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య 2015–2019 మధ్య 21 నుంచి ఏకంగా 58 శాతానికి పెరిగింది. దీన్నింకా పెంచడానికి దేశాలన్నీ కృషి చేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి వల్ల 35 శాతం ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అందు కే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. సోలార్, విండ్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలివ్వాలి. ► గ్లోబల్ వార్మింగ్‌కు 30 నుంచి 35 శాతం దాకా కారణమవుతున్న బ్లాక్ కార్బన్, మీథేన్, ఓజోన్, హైడ్రో ఫ్లోరో కార్బన్స్ నియంత్రణకు గట్టి విధానాలు రూపొందించాలి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడకుంటే.. ► ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 నుంచి 2 డిగ్రీల దాకా పెరుగుతాయి. అప్పుడు జనాభాలో 14% అత్యంత తీవ్రమైన ఎండ వేడిమికి గురవుతారు. అది క్రమంగా 37 శాతానికి చేరే ప్రమాదముంది. ► 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మెగా నగరాల్లోని 35 కోట్ల మందిని ఎండ వేడి బాధిస్తుంది. నీటి కరువుతో, కాటకాలతో నగర ప్రాంతాలు అల్లాడిపోతాయి. దక్షిణాసియా దేశాలకే ఈ ముప్పు ఎక్కువ. ► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, ఢాకా, కరాచీ నగర వాసులు ఎండతీవ్రతకి గురవుతారు. ► సముద్ర మట్టాలు 24 నుంచి 38 సెంటీమీటర్లు పెరిగి బ్యాంకాక్, జకార్తా, మనీలా నగరాలు మునిగిపోవచ్చు. ► 2050 నాటికి సగం జనాభాకు మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ ముప్పుంటుంది. అస్తమా వంటి వ్యాధులు పెరిగిపోతాయి. ► కీటకాలు, మొక్కలు, జంతువుల ఆవాస ప్రాం తాలు సగానికి తగ్గి జీవ వైవిధ్యం నశిస్తుంది. మనం చేయాల్సిందేమిటి? ► ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల బదులు రీ యూజబుల్ బ్యాగులు వాడాలి. ► కాగితం వాడకాన్ని తగ్గించాలి. అత్యవసరమైతే తప్ప ప్రింట్లు తీయొద్దు. ► వారానికి ఒక్క రోజన్నా శాకాహారమే తినాలి. వీగన్ డైట్ ద్వారా కర్బన్ ఉద్గారాలను 73 శాతం తగ్గించవచ్చు. ► కారు బదులు బైక్ వాడితే కిలోమీటర్‌కు 250 గ్రాముల కర్బన్ ఉద్గారాలను కట్టడి చయగలం. ► ఇంట్లో నీళ్ల పైపుల లీకేజీని ఎప్పటికప్పుడు సరి చేస్తే కోట్లాది గాలన్ల నీరు ఆదా అవుతుంది. ► ఇళ్లల్లో ఫ్లోరోసెంట్ బల్బులు వాడితే 75% కరెంటు ఆదా అవుతుంది. ► రీ యూజబుల్ కరోనా మాస్కులు వాడాలి. యూజ్ అండ్ త్రో మాస్కులతో జంతుజాలానికి ఎనలేని హాని జరుగుతోంది. ► డిటర్జెంట్స్, వాషింగ్, లిక్విడ్ సోపుల్లో కనిపించని ప్లాస్టిక్ కణాలుంటాయి. నేచరల్ ప్రొడక్టులు వాడటం మేలు. ► ఇంటా బయటా అందరూ పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీవ భద్రతకు ‘జన్యు సవరణ’ కూడదు!
‘జన్యు మార్పిడి’ చేసిన (జెనిటికల్లీ మాడిఫైడ్–జీఎం) వంగ డాల ఉత్పత్తి, జన్యు మార్పిడి ఆహారోత్పత్తులకు సంబంధించి మన దేశంలో కఠినమైన జీవ భద్రతా నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ సాంకేతికత ప్రజల ఆరోగ్యాన్నీ, రైతుల జీవనో పాధినీ, పర్యావరణాన్నీ వెనక్కి తీసుకోలేని రీతిలో ప్రభావితం చేయగలిగినదై ఉండటం వల్లనే మనం పటిష్ఠమైన జీవ భద్రతా చట్టం రూపొందించుకున్నాం. మన దేశంలో ఇప్పటికి ప్రభుత్వ అనుమతి పొందిన ఏకైక జీఎం పంట బీటీ పత్తి మాత్రమే. జీవ భద్రతాపరమైన సమస్యల కారణంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో బీటీ వంగ, బీటీ ఆవాలు తదితర జన్యు మార్పిడి వంగడాలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇన్నాళ్లూ అన్ని రకాల ‘జన్యు మార్పిడి’ పంటలకు వర్తించే కఠిన జీవ భద్రతా నిబం ధనల పరిధి నుంచి కొన్ని రకాల ‘జన్యుపరంగా సవరించిన’ (జీనోమ్ ఎడిటెడ్) పంటలను పూర్తిగా మినహా యిస్తూ భారత ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వు జారీచేయటం పట్ల నిపుణులు, పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం–1989 నిబం ధనల ప్రకారం... జన్యు మార్పిడి సాంకేతికతలకు సంబంధించిన అంశాలన్నీ కేంద్ర పర్యావరణ శాఖకు అనుబంధంగా ఉన్న జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రయిజల్ కమిటీ (జీఈఏసీ) పరిధిలోకి వస్తాయి. అయితే, వాణిజ్యపరమైన దృష్టితో మొక్కల్లో ‘జన్యు సవరణ’ చేసే రెండు రకాల ప్రక్రియలను ఈ నిబంధనల పరిధి నుంచి పూర్తిగా మినహాయిస్తూ ఈ ఏడాది మార్చి 30న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ నుంచి ‘ఆఫీస్ మెమో’ జారీ అయ్యింది. ఈ మెమో జన్యు సాంకేతి కతలను మూడుగా వర్గీకరిం చింది. ఒక జాతి మొక్కలోకి వేరే జాతి జన్యువును చొప్పిం చటమే ‘జన్యు మార్పిడి’. పంట మొక్కల్లో ఉన్న కొన్ని జన్యువులను పనిచేయకుండా చేయటం /తొలగించటం లేదా కొన్ని జన్యువుల ప్రొటీన్ వ్యక్తీ కరణ తీరులో మార్పులు చేయ టమే ‘జన్యు సవరణ’. ఈ రెండు జన్యు సవరణ ప్రక్రియ లలో ఇతర జాతుల నుంచి జన్యు మార్పిడి జరగటం లేదు కాబట్టి... జీఈఏసీ పర్యవేక్షించే కఠిన జీవ భద్రతా నియమా వళి పరిధి నుంచి జన్యు సవరణ పంటలను పూర్తిగా మినహా యిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంటే, జీనోమ్ ఎడిటెడ్ మొక్కలపై పరిశోధన, అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమైన ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశోధనా సంస్థలు ఇక మీదట జీఈఏసీ నుంచి ఏ అనుమతులూ తీసుకునే పనిలేదు. జన్యు సాంకేతికతలను నియంత్రించే విషయంలో రాజీ ధోరణితో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉప సంహరించుకోవాలని ఆహార, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వాళ్లు డిమాండ్ చేశారు. ఆహార జీవ భద్రతనూ, పర్యావర ణాన్నీ, మన ఎంపిక స్వేచ్ఛనూ పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీఎం ఫ్రీ ఇండియా కోకన్వీనర్లు కపిల్ షా, శ్రీధర్ రాధాకృష్ణన్ డిమాండ్ చేశారు. ‘భారత రాజ్యాంగం అప్పగించిన నియంత్రణ బాధ్యతను ప్రభుత్వం విస్మరించటం తగదు; జన్యు మార్పిడి మాదిరిగానే జన్యు సవరణలను కూడా అత్యంత జాగరూకత, ముందస్తు జాగ్రత్తలతో పూర్తిగా నియంత్రించవలసిన అవ సరం ఉందని ప్రభుత్వం గుర్తించా’లన్నారు. ‘జన్యు మార్పిడి, జన్యు సవరణ ప్రక్రియలను విభజించి చూడటం అశాస్త్రీయం మాత్రమే కాదు, అత్యంత ప్రమాద భరితం కూడా! జీఈఏసీ పరిధి నుంచి జన్యు సవరణ ప్రక్రియలను మినహాయించటం తగ’దని అలయన్స్ ఫర్ సస్టయినబుల్ అగ్రికల్చర్ కన్వీనర్ కవితా కురుగంటి వ్యాఖ్యా నించారు. జన్యు సవరణ ప్రక్రియ చేపట్టే క్రమంలో ఇతర జాతుల డీఎన్ఏ మార్పిడి చోటు చేసుకోదని చెప్పలేమని స్వతంత్ర విధాన విశ్లేషకుడు డా. దొంతి నరసింహారెడ్డి కేంద్రా నికి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఆరేళ్ల క్రితం దక్షిణ కొరియాలో ఓ శాస్త్రవేత్త రంగు పుట్టగొడుగులకు జన్యు సవరణ చేసినప్పుడు స్వల్ప మాత్రంగా అన్య డీఎన్ఏ మార్పిడి కూడా అసంకల్పంగా జరిగినట్లు తర్వాత తేలిందన్నారు. అందువల్ల, ప్రభుత్వం జన్యు సవరణ ప్రక్రియలను కూడా పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థ పరిధిలోనే ఉంచాలని కోరారు. జన్యు మార్పిడితో పాటు జన్యు సవరణ ప్రక్రియలను సైతం జీవ భద్రతా నియంత్రణ వ్యవస్థల పరిధిలోనే ఉంచటం ద్వారా జన్యు కాలుష్యానికి ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించ జాలదు. ఈ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటే వెనక్కి తీసుకోలేని దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని అందరూ గ్రహించాలి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం) -
పెట్రోల్‌లో 20% ఇథనాల్!
న్యూఢిల్లీ: కాలుష్యకారక కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు విదేశాల నుంచి చమురు దిగుమతుల తగ్గింపే లక్ష్యంగా మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ముందడుగు వేసింది. ప్రతీ లీటర్ ఇథపెట్రోల్లో నాల్ మిశ్రమ పరిమాణాన్ని 20 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025 నాటికి ఇది అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ‘ఇథనాల్ రోడ్‌మ్యాప్ 2020–25’ను శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. చెరకు నుంచి ఇథనాల్‌ను తయారుచేస్తారు. పాడైపోయిన గోధుమలు, నూక(విరిగిన బియ్యం)లు, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను భారీ మొత్తంలో ఉత్పత్తిచేయొచ్చు. బయో ఇంథనమైన ఇథనాల్ వాటాను లీటర్ పెట్రోల్‌లో 20 శాతానికి పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని భారీ మొత్తంలో తగ్గించవచ్చు. ఇథనాల్ వాడకం పెరగడంతో విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై భారత్ ఆధారపడటమూ తగ్గనుంది. వ్యవసాయ వ్యర్థాల నుంచే ఇథనాల్ ఉత్పత్తి సాధ్యం కనుక రైతులకు ఇది మంచి ఆదాయ వనరుగా మారనుంది. సమీకరణకు రూ.21వేల కోట్లు వచ్చే ఏడాదికల్లా 10 శాతం కలపాలని, 2030కల్లా 20% కలపాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. 2014లో పెట్రోల్‌లో 1–1.5 శాతం ఇథనాల్ కలిపేవారు. ప్రస్తుతం ఇది 8.5 శాతానికి చేరింది. గతంలో 39 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కేంద్రం సమీకరించగా ప్రస్తుతం 320 కోట్ల లీటర్లను సమీకరిస్తోంది. గత ఏడాది ఇథనాల్ సమీకరణ కోసం చమురు సంస్థలు రూ.21వేల కోట్లు ఖర్చు చేశాయి. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. దేశీయ డిమాండ్‌లో 85% చమురు విదేశాల నుంచే వస్తోంది. 10% ఇథనాల్ కలపాలంటే భారత్ 400 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను సమీకరించాల్సిఉంటుంది. అంతకుముందే లక్ష్యాన్ని సాధించాలి ‘పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ వాటా అనే లక్ష్యాన్ని 2030 ఏడాదికల్లా సాధించాలని గతంలో అనుకున్నాం. కానీ, అంతకుముందే(2025కల్లా) సాధించాలనేది మా ఆకాంక్ష. ఇథనాల్ వినియో గం పెరిగితే అది పర్యావరణానికీ మంచిదే. రైతుల ఆదాయం పెరిగి వారి జీవితాలు మెరుగు పడతాయి. పర్యావరణ సమతుల్యత కోసం భారత్ అంతర్జాతీయంగా పోరాడుతోంది. భారత పునరుత్పాదక ఇంథన సామర్థ్యం 250 శాతం పెరిగింది. ఈ విభాగంలో భారత్ ప్రపంచంలో టాప్–5లో నిలిచింది. భారత సౌర శక్తి సామర్థ్యం గత ఆరేళ్లలో 15 రెట్లు పెరిగింది. గృహాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు 37 కోట్ల ఎల్ఈడీ బల్బులు, 23 లక్షల ఎనర్జీ ఎఫీషియన్సీ ఫ్యాన్లు, వంట గ్యాస్‌ను అందించాం’అని రోడ్‌మ్యాప్ ఆవిష్కరణ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు మోదీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రైతులతో మాట్లాడారు. -
పచ్చందనమే పచ్చదనమే... తారలు ఏమంటున్నారంటే?
పర్యావరణాన్ని పరిరక్షించేది చెట్లే... చుట్టూ పచ్చని చెట్లు ఉంటే ఆహ్లాదానికి ఆహ్లాదం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పచ్చందమనే పచ్చదనమే.. అంటూ ఉల్లాసంగా ఉండొచ్చు. శనివారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు ప్రముఖ తారలు. ‘‘పర్యావరణం రోజు రోజుకు మరింత నాశనం అవుతోంది. ఈ సందర్భంగా పర్యావరణ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించడానికి ఈరోజు అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన భూ గ్రహాన్ని పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం’’ అని పేర్కొన్నారు మహేశ్‌బాబు. హీరో అల్లు అర్జున్ తన ఇంటి వద్ద మొక్కను నాటి, నీళ్లు పోస్తున్న ఫొటోని ట్విట్టర్లో షేర్ చేసి, ‘‘భూమిని రక్షించుకునేందుకు మనందరం మొక్కలు నాటుదామని, పర్యావరణాన్ని కలుషితం చేయని అలవాట్లను అలవరుచుకుంటామని, భవిష్యత్తు తరాల కోసం మన భూమిని పచ్చదనంగా మార్చుదామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం’’ అన్నారు. ‘‘మనకు ఉన్న ఏకైక ఇల్లు భూమి. అలాంటి భూమిని నాశనం చేయడం ఆపేసి బాగు చేయడానికి సమయం కేటాయిద్దాం.. మనందరం చేతులు కలిపి మన ఇంటిని రక్షించుకుందాం’’ అని పోస్ట్ చేశారు సాయి తేజ్. ‘‘ప్రకృతి చేతుల్లోనే మనందరి ఆనందం, శాంతి దాగి ఉన్నాయి. అందుకే ప్రకృతిని సంరక్షించుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి చాలా మాట్లాడుకుంటాం. అయితే ఆ ఒక్కరోజే కాదు.. ప్రకృతి పట్ల ప్రతిరోజూ మనందరం బాధ్యతగా ఉందాం’’ అన్నారు రాశీ ఖన్నా. -
సహజవనరులే మన సంపద: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం.. సహజవనరులే మన సంపద అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘ప్రకృతి.. దేవుడు మనకు అందించిన గొప్పవరం. సహజవనరులే మన సంపద. మొక్కలు పెంచి కాలుష్యాన్ని నియంత్రిస్తూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ.. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలి.భావితరాలకు పచ్చని భూమిని పదిలంగా అందించాలి.. ఇది మనందరి బాధ్యత’’అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్పవరం. సహజవనరులే మన సంపద. మొక్కలు పెంచి కాలుష్యాన్ని నియంత్రిస్తూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలి. భావితరాలకు పచ్చని భూమిని పదిలంగా అందించాలి. ఇది మనందరి బాధ్యత. #WorldEnvironmentDay — YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2021 చదవండి: YS Jagan అద్భుతాలు చేస్తున్నారు -
ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలు
ఢిల్లీ: వ్యవసాయ వ్యర్థాలతో ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున.. ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ 2025 కల్లా పూర్తి చేయాలని చెప్పారు. వాయు కాలుష్యం నివారణకు జాతీయ స్వచ్చ వాయు ప్రణాళిక రూపొందిందన్నారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని రైతులతో భేటీ అయ్యారు. ఇథనాల్ ఉత్పత్తి పంపిణీకి పుణె ల్యాబ్ ఈ-100 పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు. చదవండి: Corona downtrend: దేశంలో తగ్గుతున్న కొత్త కేసులు -
ధరిత్రికి ప్రాణవాయువు పర్యావరణమే
పర్యావరణంతో కలిసి జీవించడం మనందరి ప్రాథమిక బాధ్యత. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది. ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ కానీ కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్నవనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నేడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1972లో ప్రారంభించింది. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. భూమికి చెందిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించాల్సిన అత్యవసర అవసరాలపై ప్రజలు, ప్రభుత్వాలు, వివిధ ప్రజా సంఘాల దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించడమే ఈ సారి ఐక్యరాజ్యసమితి ముఖ్యఉద్దేశం. జీవ వైవిధ్యాన్ని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవులది కీలక పాత్ర. ‘చెట్లే మనిషికి గురువులు’ అన్నాడు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ ఆ మానవులే నేడు చెట్లను తమ స్వార్థం కోసం అభివృద్ధి, సాంకేతికత పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల్లో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం, కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం.. పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించింది. భూతాపాన్ని తగ్గించే విషయంలో అడవులది కీలక పాత్ర. విస్తారమైన అడవులు భూగోళానికి ఊపిరి తిత్తులవంటివి. మన దేశంలో జాతీయ సగటు అడవుల శాతం 24.06%గా ఉంటోంది. దక్షిణ భారత దేశంలో అత్యధికంగా కేరళలో 54.42 శాతం ఉండగా, తమిళనాడు 20.17, కర్ణాటక 20.11, తెలం గాణ 18.36, ఆంధ్రప్రదేశ్ 17.88 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉండగా హిమాచల్ ప్రదేశ్ 66.52%తో ఉంది. గత దశాబ్ద కాలం (2009–2019)లో భారత దేశ పట్టణీకరణ దాదాపు 34.47% మేర పెరిగింది. పట్టణాల విస్తీర్ణం వేగంగా పెరుగుతుండటంతో అడవులు తీవ్రంగా నరికివేతకు గురవుతున్నాయి. తద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఈ దశాబ్దం చివరినాటికి వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అప్పుడు ఋతుపరివర్తన జరిగి అకాల వర్షాలు, వరదలు, అధిక ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడి అపార నష్టం సంభవిస్తుంది. దీనివల్ల సమస్త మానవజాతి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యంతో రూపొందిన పారిస్ వాతావరణ ఒప్పందానికి ప్రపంచ దేశాలు కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. ఇది జరగాలంటే.. ఇప్పటి కన్నా 25% తక్కువగా కర్బన ఉద్గారాలు విడుదలయ్యేలా మానవాళి తన అలవాట్లను, జీవనశైలిని విప్లవాత్మకంగా మార్చుకోగలగాలి. మానవ నాగరికత నది తీరాల్లోనే మొదలైందనేది కాదనలేని సత్యం. మనదేశంలో అనేక పవిత్ర నదులు, త్రివేణి సంగమాలు ఉన్నాయి. ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభిం చాల్సి ఉంది. ఆయా నదులు వాటి తీరాలు ఆక్రమణకు గురి కాకుండా వాటిల్లో చెత్తా చెదారాలు వేయకుండా శుభ్రంగా చూసుకోవడం మనందరి కనీస బాధ్యత. నది తీరాల వెంబడి కాలుష్య పరిశ్రమలను స్థాపించి వాటి చెత్తా చెదారం అంతా నదుల్లోకి పారబోస్తున్నారు. ఉదాహరణకి గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో, యాత్రికులు పడేసే చెత్తతో కలుషితమై పోయి, తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటోంది. పైగా గంగా నదిలో శవాల విసిరివేత మనందరికీ సిగ్గుచేటు. సరస్సులు, చెరువుల ఆక్రమణను అరికట్టాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకై తగు చర్యలు చేపడుతుండడం ఎంతో ముదావహం. కేంద్రం 20 వేల కోట్ల రూపాయలతో ‘నమామి గంగే’ పేరు తో గంగానది తీర ప్రక్షాళనకు పూనుకోవడం బృహత్తర చర్య. అలాగే ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ద్వారా పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్కరు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ‘టాయిలెట్స్ బిఫోర్ టెంపుల్స్’ పేరుతో దేశంలో ఇప్పటివరకు కొత్తగా 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం ఎంతో గొప్ప చర్య. అలాగే ‘గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ద్వారా దేశ యువతకు సరికొత్త ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు గత మూడేళ్లలో దాదాపు 6,778 చదరపు కిలోమీటర్ల మేర కొత్త అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం దాదాపు 36.73 కోట్ల ఎల్ఈడీ బల్బులను అందుబాటులోకి తెచ్చి, పెద్దఎత్తున వాటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో దాదాపు 38 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగాం. ఉజ్వల పథకం కింద 8 కోట్ల కుటుంబాలకు పొగ రహిత వంటగదులు అందుబాటులోకి తెచ్చినట్లైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కార్యక్రమమని చెప్పవచ్చు. హిమాచల్‌ప్రదేశ్ ‘నగర్ వన్ ఉద్యాన్‘ పేరుతో అన్ని పట్టణాలలో కృతిమ ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తోంది. అలాగే ‘మోడల్ ఎకో విలేజ్ ‘పేరుతో ఉత్తమ పర్యావరణ గ్రామాలను ఎంపిక చేసి వాటికీ ప్రోత్సాహకాలు అందిస్తుంది. అయితే పర్యావరణాన్ని పరిరక్షించటానికి కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది. పర్యావరణంపై ప్రభావం చూపుతున్న పారిశ్రామిక కాలుష్య ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరి కట్టాలి. ప్రజలు మొక్కలను పెంచడం ఒక వ్యాపకంగా మార్చుకోవాలి. నదులను పునరుజ్జీవింప చేయడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో సమాజంలోని అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి అదే మానవాళికి ఒక గుణపాఠం కూడా నేర్పింది. ప్రకృతి, పర్యావరణం, వాతావరణ సమతుల్యత, వ్యక్తిగత పరిశుభ్రత, మంచి ఆహారపు అలవాట్లు మానవ మనుగడకు ఎంత ముఖ్యమో కరోనా మహమ్మారి నొక్కి చెప్పింది. దేశీయ ఆహారపు అలవాట్లు ఐన కొర్రలు, రాగులు, సజ్జలు లాంటి చిరు, తృణ ధాన్యాల వాడకం విరి విగా పెరిగింది. అలాగే శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, వాతావరణ పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ కానీ కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్న వనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల హెచ్చరిక. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే దానిని ప్రేమిస్తే చాలు దానిని కాపాడుకోవాలనే తపన ఉంటే చాలు. మనందరి దైనందిన జీవనంలో ప్రకృతి పరిరక్షణ ఒక అలవాటుగా చేసుకుందాం. ‘సుజలాం సుఫలాం మలయజ శీతలామ్’ ‘సస్యశ్యామలాం మాతరం వందేమాతరం’ బండారు దత్తాత్రేయ వ్యాసకర్త గవర్నర్, హిమాచల్ ప్రదేశ్ (నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా) -
మనదేశంలో ప్రకృతి అద్భుతాలు
వెబ్‌డెస్క్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న ప్రతీ ఏడు జరుపుతుంటారు. పర్యావరణం అనగానే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌజ్ గ్యాస్,, కాలుష్యం పెరుగుదల ఇలా సాగిపోతుంది వరస. పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు నాటడం, చెట్లు పెంచడం ఎంతో అనివార్యం కూడా. మాటల్లో చెప్పినట్టు చేతల్లో ఫలితాలు సాధించాల్సిందే. అయితే పర్యావరణం అంటే చెట్లు, చేమలే కాదు కొండలు, లోయలు, సేలయేర్లు, మంచు, ఏడారి ఇలా ప్రతీది పర్యావరణంలో భాగమే. ప్రతీది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని వింతలకు, విశేషాలకు నెలవై ఉంటాయి. మన దేశంలో పర్యావరణంలో భాగమైన ప్రకృతి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్నింటినీ ఓసారి చూద్దాం. లూనార్ క్రాటర్ లేక్ ప్రకృతి అద్భుతాల్లో ఒకటి మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న లూనార్ క్రాటర్ లేక్. యాభై రెండు వేల సంవత్సరాల క్రితం గ్రహశకలాలు భూమిని బలంగా ఢీ కొట్టడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి వెడల్పు దాదాపు 1.8 కిలోమీటర్ల వెడల్పు, లోతు 137 మీటర్లు ఉంటుంది. గ్రహశకలాలు ఢీ కొట్టడం వల్ల ఏర్పడిన గొయ్యిలలో ఇదే ప్రపంచంలోనూ మూడో అతి పెద్దది. ఈ గొయ్యి నిండా ఆమ్ల లక్షణాలు ఉన్న నీరు చేరుకోవడంతో దీన్ని లూనార్ క్రాటర్ లేక్‌గా పిలుస్తున్నారు. గ్రావిటీ హిల్ వేసవి వచ్చిందంటే చాలు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న బైకర్లు, అడ్వెంచరిస్టుల్లో చాలా మంది లద్ధాఖ్‌కు చేరుకుంటారు. లద్ధాఖ్ - కార్గిల్ హైవేలో ఉన్న మరో ప్రకృతి వింత గ్రావిటీ హిల్. లేహ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఈ వింతైన ప్రదేశం ఉంది. ఇక్కడ ఇంజన్ ఆఫ్ చేసినా సరే ఎత్తుగా ఉన్న వైపుకు వాహనాలు నడుస్తూనే ఉంటాయి. దీనికి ఆప్టికల్ ఇల్యూషన్ అని పేరు పెట్టినా .. భూమ్యాకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరిగే ఈ వింతకు గల అసలైన కారణం ఇప్పటి వరకు తేలలేదు. లోక్తాల్ సరస్సు ప్రపంచం మొత్తం మీద నీటిపై తేలియాడే సరస్సు మణిపూర్‌లో ఉంది. దీన్ని లోక్తాల్ అంటారు. నీరు, భూమి కలిసిపోయి ఉండే సరస్సు కనుల విందుగా ఉంటుంది. నీళ్లపై నేల తేలియాడుతుందా అనేట్టుగా ఈ సరస్సు కనిపిస్తుంది. జీవ వైవిధ్యానికి ఇది నెలవు. ఇక్కడ వందల రకాల పక్షులు, మొక్కలు, ఇతర జీవరాశులు నివసిస్తున్నాయి. సూది బెజ్జం మనదగ్గర రామప్ప శిల్పి సూది బెజ్జం పట్టెంత నైపుణ్యంతో వందలాది శిల్పాలను చెక్కాడు. కానీ ప్రకృతి కొండల్ని వింతైన ఆకారాలుగా మాలిచిన చోటు మహారాష్ట్రలోని గోలేవాడి ప్రాంతంలో ఉంది. ఎత్తైన కొండ మీదున్న రాళ్లలో ఒకటి సూది బెజ్జంలా కనిపిస్తుంది. మరోవైపు ఇదే ఆకారం ఏనుగు తొండంలా కూడా కనిపిస్తుంది. నీడిల్పాయింట్ లేదా ఎలిఫెంట్ పాయింట్‌గా చెప్పుకునే ఈ ప్రదేశం చక్కని టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేర్ల వంతెనలు ప్రపంచలోనే అత్యధిక వర్షపాతం మేఘాలయలోని చిరపుంజిలో నమోదవుతుంది. నిత్యం ఇక్కడ కురిసే వర్షాలతో ఈ కొండ ప్రాంతంలో వరద నీరు ఎప్పుడు ఉరుకులు పరుగులు పెడుతుంది. దీంతో ఇక్కడ వంతెనల నిర్మాణం అంత సులువు కాదు. అందుకే 500 ఏళ్ల క్రితమే ఇక్కడి ప్రజలు వేర్లతో వంతెనలు కట్టే పద్దనికి కనుక్కొని అమలు చేస్తున్నారు. రబ్బరు చెట్ల వేర్లతో ఏర్పాటు చేసిన ఈ బ్రడ్జిలు చూడలను చూడటం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఉప్పు ఎడారి మగధీర సినిమాలో రామ్‌చరణ్ తెల్లటి ఉప్పు ఎడారిలో గుర్రం స్వారీ చేసే దృశ్యాలు రోమాంచితంగా ఉంటాయి. ఆ ఏడాది ఎక్కడో విదేశాల్లో లేదు. మన గుజరాత్‌లోని రన్ ఆఫ్ కచ్‌లో ఉంది. ఇసుక ఎడారి, మంచు ఎడారి తరహాలో ఇది ఉప్పు ఎడారి. 2,897 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ ఉప్పు ఎడాది విస్తరించి ఉంది. పౌర్ణమి రోజుల్లో ఇసుక కూడా ఉప్పులానే కనిపిస్తుంది. లావా స్థంభాలు సాధారణంగా సముద్ర తీరంలో ఉన్న కొండలు, రాళ్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎగుడుదిగుడుగా, మొన తేలిన రాళ్లతో కూడి ఉంటాయి. కానీ కర్నాటక తీరంలో సెయింట్మేరిస్ ద్వీపంలో ఉన్న లావా స్థంభాలు ఇందుకు విరుద్ధం. అరేబియా సముద్ర తీరంలో పోత పోసిన షట్భుజి స్థంభాలాలు విరివిగా కనిపిస్తాయి. లక్షల సంవత్సరాల క్రితం బద్దలైన అగ్నిపర్వతం లావా నుంచి ఈ శిలలు ఏర్పడి ఉంటాయని అంచనా. కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న మాల్పే నుంచి బోటు ద్వారా ఈ దీవికి చేరుకోవచ్చు. ప్రకృతి హృదయ స్పందన కేరళ రాష్ట్రంలోని చంబ్రా కొండలపైనా సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న కొలను ఉంది. పై నుంచి చూస్తే ఈ కొలను ప్రేమకు చిహ్నమైన హృదయం ఆకారంలో కనిపిస్తుంది. -
జీవవైవిధ్యాన్ని కాపాడుదాం
న్యూఢిల్లీ: భవిష్యత్ తరాల కోసం భూమిని సంరక్షించుకోవడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాని ట్విటర్లో తన సందేశాన్ని ఉంచారు. ‘‘చెట్టు, చేమ భూమిపై నున్న సమస్త జీవజాలాన్ని కాపాడుకోవడానికి మనమంతా సమష్టిగా చేయగలిగినదంతా చేయాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన భూమిని సుసంపన్నం చేసే జీవవైవిధ్యాన్ని కాపాడతామని అందరూ ప్రతిన బూనాలి’’అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. భవిష్యత్ తరాల వారు ఈ భూమిపై హాయిగా జీవించేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నొక్కి చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో తాను ప్రస్తావించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘‘ఈ ఏడాది థీమ్ జీవ వైవిధ్యం. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్ధితుల్లో ఇది అత్యంత అవసరం, గత కొద్ది వారాల లాక్డౌన్ సమయంలో జనజీవనం కాస్త నెమ్మదించింది కానీ, మన చుట్టూ ఉన్న ప్రకృతి, జీవవైవిధ్యం గురించి ఆలోచించే అవకాశమైతే వచ్చింది’’అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. వాయుకాలుష్యం, శబ్ద కాలుష్యంతో ఇన్నాళ్లూగా ఎన్నో రకాల పిట్టలు అదృశ్యమైపోయాయని, ఈ లాక్డౌన్ కారణంగా పొద్దున్న లేస్తూనే మళ్లీ శ్రావ్యమైన పక్షుల కిలకిలారావాలు వినే అవకాశం ప్రజలకు వచ్చిందన్నారు. -
భవిష్యత్ తరాలకు స్వచ్చమైన భూగ్రహాన్ని అందిద్దాం
-
ప్రమాదంలో పర్యావరణం
శృంగవరపుకోట రూరల్: మానవ తప్పిదాలు, అశ్రద్ధ వల్ల వాతావరణం కలుషితమవుతోంది. పెరిగిన యంత్రాలు, రసాయనిక ఎరువులు, వాహనాలు, ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం, పరిశ్రమల, అవి విడుదల చేస్తున్న కాలుష్య వాయువులు వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతో భూమిపై వేడి పెరిగిపోయి తీవ్ర అతివృష్టి, అనావృష్టి సంభవిస్తున్నాయి. మానవాళికి ఎంతో మేలు చేస్తున్న మొక్కలను పెంచటం, పాత వృక్షాలు, అడవులను రక్షించటం ద్వారా వాతావరణ సమతుల్యత, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్య సమితి కోరుతోంది. 1974వ సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించి కొన్ని సూచనలు చేసింది. ♦ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మన కనీస బాధ్యత. మనం వాడే పరికరాల వల్లే కాలుష్యం పెరుగుతోంది. ♦ కాలుష్యాన్ని కలిగించే వస్తువులను తగ్గించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు కలిసిపోదు. ∙పర్యావరణ పరిరక్షణకు చెట్లను విరివిగా పెంచాలి. కాలుష్య నివారణోపాయాలు ♦ ఇంటి దగ్గర చెట్లు నాటండి. ఇంట్లోని చెత్తను కాల్చకుండా కుండీలో పడేయండి. ♦ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఏమైనా కొనాలనుకున్నప్పుడు ఒక సంచి తీసుకెళ్లండి, మంచినీరు కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్లండి, ప్లాస్టిక్ సీసాల వాడకం తగ్గించండి. ♦ ఇంధన వాడకాన్ని తగ్గించండి. చేరవలసిన గమ్యం దగ్గరైతే నడిచి వెళ్లండి. ఆరోగ్యానికి కూడా మంచిది. కాలుష్యం తగ్గుతుంది. కావలసినవి మాత్రమే కొనండి. ఏ వస్తువైనా పనికి రాదనిపిస్తే పాత వస్తువులను కొనే దుకాణంలో అమ్మండి. 4 లక్షల మొక్కలు నాటాం ఇప్పటివరకు 4 లక్షలకు పైగా మొక్కలు నాటాం. అందులో 40 శాతం మొక్కలను సంరక్షించగలిగాం. మొక్కలను నాటడం కాకుండా..నాటిన మొక్కలను విధిగా సంరక్షించేలా చర్యలు చేపట్టాలి. – బొబ్బిలి రామకృష్ణ,వ్యవస్థాపకుడు, గ్రీన్‌ఎర్త్ ఆర్గనైజేషన్, శృంగవరపుకోట -
ప్రాణం ఉన్న కథ చెబుతా
‘‘మనదేశంలోని ఓ అందమైన మహారణ్యంలో ఉంటున్న జంతుజీవాల గురించి ఎవరూ చెప్పని, ఎక్కడా వినని ప్రాణం ఉన్న కథను చెబుతాను’’ అంటున్నారు ప్రకాష్‌రాజ్. వచ్చే నెల 5న ప్రపంచపర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఓ ప్రముఖ చానెల్లో జూన్ 5న ‘వైల్డ్ కర్ణాటక’ అనే ఓ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీకి తెలుగు, తమిళ భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు ప్రకాష్‌రాజ్. ‘‘ప్రకృతికి గొంతుగా మారిన నా ఈ కొత్త ప్రయాణం అర్థవంతమైనది. వైల్డ్‌లైఫ్‌కి సంబంధించిన ఈ డాక్యుమెంటరీకి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు ప్రకాష్‌రాజ్. ఈ ‘వైల్డ్ కర్ణాటక’ కన్నడ వెర్షన్‌కు రిషబ్‌శెట్టి, హిందీ వెర్షన్‌కు రాజ్‌కుమార్ రావ్ వాయిస్ ఓవర్ అందించారు. -
మారుతి ఆఫర్ : పొల్యూషన్ చెక్, డ్రై వాష్ ఫ్రీ
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణతోపాటు, వినియోగదారులకు కూడా ఉచిత ప్రయోజనాలను అందివ్వనుంది. తద్వారా తక్కువ నీటి వినియోగం, పర్యావరణంపై అవగాహన కల్పించనుంది. ఉచిత కాలుష్య చెక్, కాంప్లిమెంటరీ డ్రైవాష్ సౌకరాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ 2019 జూన్ 10 వరకు ఈ ఆఫర్ చెల్లుతుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా ప్రధాన నగరాల్లో ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. వాహనాల డ్రై వాష్ ద్వారా 2018-19 ఏడాదిలో సుమారు 656 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేశామని సుజుకి పేర్కొంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో నీటి పొదుపు అంశాన్ని తమ వర్క్‌షాపులలో మూడు రెట్లు పెంచినట్టు వెల్లడించింది. తాజాగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, నాగ్‌పూర్, చెన్నై ఆరు నగరాల్లో వాహనాల డ్రై వాష్ ద్వారా 160 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయాలని భావిస్తోంది. తమ వర్క్‌షాపుల వద్ద డ్రై వాష్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని 18 మిలియన్లకుపైగా ఉన్న వినియోగదారులకు ఆటో మేజర్ విజ్ఞప్తి చేసింది. తద్వారా రాబోయే తరాలకోసం నీటిని ఆదా చేయాలని మారుతి సుజుకి ఇండియా సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ కోరారు. -
వైఎస్ఆర్సీపీ నేతల కాటన్ బ్యాగ్‌ల పంపిణీ
-
‘పర్యావరణ సమతుల్యం పాటించాలి’
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలు పర్యావరణ సమతుల్యం పాటించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి విఙ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యావరణ సమతుల్యాన్ని పాటించాల్సిన ఆవశ్యకతను వివరించారు. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి విజయబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. -
గ్రేటర్‌కు గ్రీన్ "చాలెంజ్ "
గ్రేటర్ నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అంటే 1.54 లక్షల ఎకరాల్లో విస్తరించింది. సిటీలో 30 శాతం హరితం ఉండాలి.. కానీ ఉన్నది 8 శాతం.. మహానగరంలో సుమారు 12,320 ఎకరాల్లో మాత్రమే గ్రీన్‌బెల్ట్ ఉంది. దీన్ని కనీసం 24,710 ఎకరాలకు(16 శాతం) పెంచడం తక్షణ కర్తవ్యంప్రపంచ పోకడలను ఒంటబట్టించుకుని జెట్ స్పీడ్‌తో దూసుకు పోతున్న మహానగరం పర్యావరణ పరంగాతిరోగమనంలో పయనిస్తోంది. ఉన్న చెట్లను నరికేసి బహుళ అంతస్తుల భవంతులు నిర్మించడంలో చూపుతున్న శ్రద్ధ.. పచ్చదనంపై చూపడం లేదు. దీంతో ఏటా గ్రేటర్లో వేసవి ఉష్ణోగ్రతలువిపరీతంగాపెరిగిపోతున్నాయి. మున్ముందు ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారేఅవకాశముంది. కోటికి పైగా జనాభా ఉన్న సిటీలో ‘హరితం’ శాతం గణనీయంగాతగ్గిపోతుండడంతో ఇటీవల 44 డిగ్రీల మేర నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేయడం ప్రతి ఒక్కరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా గ్రేటర్ నగరం గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించక తప్పదు. సాక్షి, సిటీబ్యూరో :సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీపరిధిలో గతేడాది కోటి మొక్కలు నాటగా.. వీటిలో 50 శాతం మొక్కలే బతికాయి. ఇందులో ఇళ్లకు పంపిణీ చేసే తులసి, కలబంద, క్రోటన్, పూల మొక్కల వంటి చిన్న మొక్కలే అధికంగా ఉన్నాయి. ఖాళీ ప్రదేశాలు, చెరువులు, పార్కుల వద్ద నాటే విషయంలో బల్దియా యంత్రాంగంవిఫలమైంది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవనిఅధికారులు చెబుతుండడం గమనార్హం ఏటా వర్షాకాలంలో చేపట్టే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సిటీజన్లు ఉద్యమించకుంటే భవిష్యత్ తరాలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమంలో మొక్కలు నాటకుంటే వచ్చే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మహానగరాన్ని ‘గ్రీన్ సిటీ’గా మార్చేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా నిర్వహించిన హరితహారం ఉద్దేశం బాగానే ఉన్నా.. నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు అది అంతగా దోహదం చేయలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహానగరంలో చేపట్టిన హరితహారంలో 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలనే పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో ఐదు శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెట్రోనగరాల్లో హరితం ఇలా.. దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో ప్రణాళికబద్ధ నగరం ఛంఢీగడ్ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన దేశరాజధాని ఢిల్లీలో 20.20 శాతం, గ్రీన్‌సిటీగా పేరొందిన బెంగళూరులో 19 శాతం, కోల్‌కతాలో 15 శాతం, ముంబైలో 10 శాతం, చెన్నైలో 9.5 శాతం గ్రీన్‌బెల్ట్ ఉన్నట్లు పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మన నగరంలో మాత్రం హరితం 8 శాతానికే పరిమితమవడం ఆందోళన కలిగించే అంశం. గ్రేటర్లో హరితం హననం శతాబ్దాలుగా తోటల నగరం(బాగ్)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గిపోతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరంలో హరిత వాతావరణం కనుమరుగై మహానగర పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్(హరిత వాతావరణం)ఉండాలి. కానీ నగరంలో కేవలం 8 శాతమే గ్రీన్‌బెల్ట్ ఉండడం గమనార్హం. దీంతో పెరుగుతున్న కాలుష్యంతో నగరంలో ప్రాణవాయువు కనుమరుగై సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతేకాదు ఒకప్పుడు ఉబ్బసం వ్యాధి గ్రస్తులకూ నగర వాతావరణం ఉపశమనం కలిగిస్తుందన్న నానుడి ఉండేది. కానీ ఈ పరిస్థితిని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. శరవేగంగా రహదారుల విస్తరణ, బహుళ అంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా.. గ్రీన్‌టాప్ అంతకంతకూ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రీన్హౌస్ వాయువులైన కార్బన్ డయాక్సైడ్,కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల ఉద్గారాలు పెరిగిపోతన్నాయి. దీంతో వేసవి తాపంఉక్కిరిబిక్కిరిచేస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో ప్రస్తుతం గ్రేటర్లో ఉన్నగ్రీన్బెల్ట్ను 8 శాతం నుంచి కనీసం 16 శాతానికి పెంచాలని చెబుతున్నారు. ఇలా చేస్తే ఎంతో మేలు ♦ నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. ♦ తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. ♦ సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ♦ నూతనంగా ఏర్పడిక కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. హరితంతో కాలుష్యం దూరం చెట్ల ఆకులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీంతో మనం పీల్చేగాలిలో ఆక్సిజన్ మోతాదు పెరుగుతుంది. చెట్లు ఎయిర్ ఫిల్టర్లుగా పనిచేస్తాయని అందరూ గ్రహించాలి. చెట్లు చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా విద్యుత్ వంటి ఇంధనాన్ని ఆదా చేస్తాయి. కాలుష్య ఉద్గారాలను బాగా తగ్గిస్తాయి. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి, ఆక్సిజన్ అందించేవి, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప, రావి, మర్రి, మద్ది, చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరుగుతుంది. వాటితో ఆక్సిజన్ శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. ప్రస్తుత హరితహారంతో నర్సరీల నిర్వాహకులకే లాభం చేకూరుతోంది తప్ప ప్రజలకు ఉపయోగకరంగా ఉండడం లేదు.– జీవానందరెడ్డి,పర్యావరణవేత్త