– ప్రచారానికే పరిమితమైన నివారణ చర్యలు
– అభివృద్ధి పథకాల పేరుతో చెట్ల నరికివేత
– భయపెడుతున్న బయో కాలుష్యం
– మానవుడి మనుగడకు సవాల్ విసురుతున్న వైనం
– యేటేటా పెరుగుతూ పోతున్నా ఉష్ణోగ్రతలు
– నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇది కర్నూలులోని డాక్టర్్స కాలనీలో ఉన్న ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక్కడ రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2 వేల మొక్కలను నాటింది. తర్వాత వాటి పెంపకంపై దృష్టిసారించకపోవడంతో చాలా మొక్కలు చనిపోయాయి. ప్రస్తుతం అక్కడక్కడ కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి.
పర్యావరణం కాలుష్యమవుతుండటంతో ఓజోన్ పొర తీవ్రంగా దెబ్బతిని అతినీల లోహిత కిరణాలు నేరుగా మానవుడి శరీరంపై పడి పలు రకాల రోగాల బారిన పడుతున్నాడు. జూన్ 5వ తేదీని ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్ష్యాలు, మార్గదర్శకాలను నిర్ణయించుకోవడం తప్ప వాటితో సాధించిన ఫలితాలు మాత్రం శూన్యం.
పట్టణీకీకరణతో ప్రమాదం.....
ఒకప్పుడు భారతదేశంలో గ్రామీణ వాతావరణం ఉండేది. క్రమక్రమంగా ప్రజలు బతుకు దెరువు కోసం పట్టణాలకు వలస మొదలు పెట్టారు. నేడు పట్టణాల్లో దాదాపు 40 శాతం మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇది 2050 నాటికి 60 శాతానికి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి పరంగా లభించే ఆహార పదార్థాలు, గాలి, వాన, నీరుకు డిమాండ్ ఏర్పడి కొరత నెలకొనే ప్రమాదం ఉంది. దీంతో ప్రజలు కృత్రిమంగా వాటిని సృష్టించుకోవడానికి పలు రసాయన పదార్థాలు, వాయువులను వినియోగించడంతో వాతావరణం కలుషితమవుతోంది. ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజల ఉపాధికి మార్గాలు చూపితే పట్టణీకీకరణపై మొగ్గుచూపకపోవచ్చు.
నిస్తేజమైపోతున్నా నేలలు...
ఒకప్పుడు పశువుల పెండను ఎరువుగా వాడేవారు. ప్రస్తుతం పశు సంపద రోజురోజుకు తగ్గిపోతుండడంతో అన్నదాతలు విషపూరిత పెస్టిసైడ్లు, రసాయన మందులను వాడుతున్నారు. దీంతో సహజసిద్ధమైన నేల నిస్సారమై పోతోంది. వాటి ద్వారా పండే పంటలను తిన్న ప్రజలకు రకరకాల వ్యాధులు వస్తున్నాయి.
భయపెడుతున్నా ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ భూవిస్తీర్ణాన్ని బట్టి 23 శాతం అడవులు ఉండాలి. అయితే ఈ శాతం రోజురోజుకు తగ్గిపోతోంది. అభివృద్ధి పథకాల పేరుతో ఉన్న అడవులను నరికివేస్తున్నారు. ముఖ్యంగా రహదారులు, పరిశ్రమల కోసం ఎక్కువగా అడవులు నరికివేస్తున్నారు. దీంతో వర్షాలు సక్రమంగా కురవక భూగర్భజలాలు ఎండిపోతున్నాయి. 600–700 అడుగుల లోతులో నీళ్లు కనిపించడంలేదు. దీంతో ఇప్పటికే జిలా్లలోని కుంటలు, బావులు ఎండిపోయాయి. అంతేకాక కాంక్రీటు నిర్మాణాలతో చల్లదనం కరువై ఉషో్ణగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం 47, 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో భూవాతావరణం వెడెక్కి వాతావరణంలోని నైట్రోజన్, కార్బన్ డయాకై్సడ్, క్లోరోఫ్లోరోకార్బన్‌లు ఓజోన్‌ను పొరను తీవ్రంగా దెబ్బతిస్తున్నాయి. ఫలితంగా అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడటంతో జీవకోటి మనుగడ కష్ట సాధ్యంగా మారింది.
ప్రకృతితో ప్రజల మమేకం చేసేందుకు..
పర్యావరణ సమతూల్యత దెబ్బతింటుడంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని యూనైటేడ్ నేషన్స్ కోరుతోంది. అందులో భాగంగా ఈ యేడాది ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో ప్రజలను మమేకం చేసేందుకు ‘కనెక్టింగ్ పీపుల్ టూ నేచర్, ఐ యామ్ విత్ నేచర్ అనే ఇతివృత్తాని ఎన్నుకున్నారు.
ప్రతి ఒక్కరి బాధ్యత – రాజేంద్రారెడ్డి, జోనల్ అధికారి, పీసీబీ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ సమష్టిగా సహజ సిద్ధ సంపదను పరిరక్షించుకోవాలి. లేదంటే మానవుడు కాలుష్య కోరల్లో చిక్కి అంతరించిపోయే ప్రమాదం ఉంది. మొక్కలను విరివిగా పెంచాలి. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అయినప్పుడే పర్యావరణ సమతూల్యతను కాపాడవచ్చు.