నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కామిక్ స్ట్రిప్స్, వీడియోలు, ఫొటోగ్రాఫ్‌లు, రీల్స్... ఒక్కటనేమిటి... సమస్త సాధనాలు,
వేదికల ద్వారా పర్యావరణహిత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు యంగ్–ఎకో వారియర్స్.
‘కళలో సామాజిక సందేశం కూడా ఇమిడి ఉంది’ అనే నిజాన్ని రుజువు చేస్తున్నారు.
వాతావరణానికి హాని కలిగించే ఉత్పత్తులు, వాటికి ప్రత్యామ్నాయాలు, షాపింగ్ మార్గాలు... మొదలైన వాటి గురించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ ఎడ్యుకేటర్ అండ్ ఎకో–యూట్యూబర్ నయన ప్రేమ్‌నాథ్.
సస్టెయినబుల్ లివింగ్‌పై కంటెంట్ రూపోందిస్తోంది. క్లైమెట్–డామేజ్ ప్రాడక్ట్స్‌కు ప్రత్యామ్నాయాలు ఏమిటో చెబుతోంది. ఉదా: సస్టెయినబుల్ షాపింగ్, సస్టెయినబుల్ ఫ్యాషన్... మొదలైనవి.
‘పర్యావరణ హిత వీడియోలు చేస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషమే శక్తిగా నన్ను ముందుకు నడిపిస్తోంది’ అంటుంది ప్రేమ్‌నాథ్.
ప్రయాణ ప్రేమికుడిగా ఆశాశ్ మన దేశంలోని ఎన్నో; ప్రాంతాలకు వెళ్లాడు. తాను వెళ్లిన ప్రాంతాలలో రోడ్డు పక్కన ΄్లాస్టిక్ చెత్త కనిపించేది. ‘ఏమిటి ఇది’ అనుకునేవాడు. అయితే లడఖ్ అందాల మధ్య పాస్టిక్ వ్యర్థాలను చూసి ఆకాష్ షాక్ అయ్యాడు. ఆ షాక్ అతడిని కొత్తదారి వైపు తీసుకువెళ్లింది.
‘ఆ రోజు నుంచి పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలలో భాగం కావాలనే ఆలోచన అంతకంతకూ పెరుగుతూ వచ్చింది’ అంటాడు ఆకాశ్ రాణిసన్.
పర్యావరణానికి సంబంధించిన సంక్లిష్ట విషయాలను సామాన్యులకు అర్థం అయ్యేలా సోషల్ మీడియాలో కంటెంట్ రూపోందించప్రారభించాడు. ‘గ్రీన్ వాషింగ్’ అంటే ఏమిటో వివరించడంతో పోటు వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడానికి చూడాల్సిన డాక్యుమెంటరీల గురించి చెప్పడం వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఆకాష్ ‘క్లైమెట్ చేంజ్ ఎక్స్‌ప్లెయిన్‌డ్: ఫర్ వన్ అండ్ ఆల్’అనే పుస్తకం రాశాడు.
అహ్మదాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన పంక్తీ పాండే లాక్‌డౌన్ టైమ్‌లో సస్టెయినబుల్ లివింగ్‌పై కంటెంట్ క్రియేషన్ మొదలు పెట్టింది. జీరో–వేస్ట్‌పాక్టీషనర్‌గా పేరు తెచ్చుకుంది పంక్తీ. రోజువారీ జీవితంలో పర్యావరణ స్పృహతో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి ఎంపికలు అవసరం... మొదలైన విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది.
‘నాలుగు మంచి మాటలు చెప్పినంత మాత్రాన ప్రజల్లో మార్పు వస్తుందా... లాంటి నిరాశపూరిత మాటలు వినడం నాకు కష్టంగా అనిపించేది. నేను మాటలకే పరిమితం కాలేదు. జీరో వేస్ట్‌పై నా ఇల్లే ప్రయోగశాలగా ఎన్నో ప్రయోగాలు చేశాను. నేను సాధన చేస్తున్న విషయాలను ఫేస్‌బుక్‌లో జీరో అడ్డా పేజీ ద్వారా ఇతరులతో పంచుకుంటున్నాను’ అంటుంది పంక్తీ పాండే.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రిసెర్చర్ అయిన రస్లీన్ గ్రోవర్ కంటెంట్ క్రియేటర్ కూడా.
సోషల్ మీడియాలో వాతావరణ విధానాలకు సంబంధించిన కంటెంట్‌ను ఇన్‌ఫర్‌మేటివ్ అండ్ ఎంటర్‌టైనింగ్ విధానంలో రూపోందిస్తోంది రస్లీన్.
‘నా కంటెంట్ ద్వారా ప్రజల జీవనశైలిలో ఏ కొంచెం మార్పు వచ్చినా సంతోషం అనుకొని ప్రయాణం ్ర΄ారంభించాను. నా ప్రయత్నం వృథాపోలేదు’ అంటుంది రస్లీన్.
చెన్నైకి చెందిన కీర్తి, దిల్లీకి చెందిన కృతి, ముంబైకి చెందిన రష్మీ పెయింటింగ్‌లో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ ముగ్గురికి ఇష్టమైన సబ్జెక్ట్ పర్యావరణం.
వారి చిత్రాలలో పర్యావరణ హిత ఆలోచనల వెలుగు కనిపిస్తుంది.‘వాతావరణ మార్పుల గురించి తెలుసుకుంటున్న యువతరం నిట్టూర్పుకు మాత్రమే పరిమితం కావడం లేదు. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన విషయాలను తమకు తోచిన రీతిలో ప్రచారం చేస్తున్నారు’ అంటుంది క్లైమెట్ యాక్టివిస్ట్, ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైర.
పర్యావరణ పాట
‘ఆహా’ అనుకునే పాటలు కొన్ని. ‘ఆహా’ అనుకుంటూనే ఆలోచించేలా చేసే పాటలు కొన్ని. అనుష్క మాస్కే ΄ాటలు రెండో కోవకు చెందినవి. సింగర్–సాంగ్ రైటర్ అనుష్క మాస్కే పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచారానికి పాట’ బలమైన మాధ్యమం. సిక్కింకు చెందిన అనుష్క తొలి ఆల్బమ్ ‘థింగ్స్ ఐ సా ఏ డ్రీమ్’లో పర్యావరణ స్పృహ కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment