
భిన్న శైలితో దేనికదే ప్రత్యేక గుర్తింపు
టాలీవుడ్ ట్రాక్స్‌కు క్రేజీ బ్యాండ్స్ పెద్దపీట
కేఫ్స్, రెస్టారెంట్స్, ఈవెంట్స్‌లో సందడే సందడి
‘హాయ్ తెలుగు ట్రాక్ ప్లీజ్..’ కొన్నేళ్ల క్రితం ఈవెంట్స్, కేఫ్స్‌లో లైవ్ బ్యాండ్‌ని ఇలా అభ్యరి్థంచిన వ్యక్తిని.. మిగిలిన వాళ్లంతా ఎవరీ ఎర్రబస్సు అన్నట్టు చూసేవాళ్లు, బ్యాండ్ సభ్యులు నోటితో నవ్వేసి నొసటితో వెక్కిరించేవాళ్లు.. ఇదంతా గతం ఇప్పుడు క్లబ్‌లలో అత్యంత క్రేజీగా ఉండేనైట్స్ అంటే టాలీవుడ్ నైట్స్. బ్యాండ్ ఏదైనా సరే, ప్లేస్ ఏదైనా సరే ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, డీఎస్పీ.. మ్యూజిక్‌ని వినిపించాల్సిందే.. తెలుగు ట్రాక్స్‌కి పేరొందిన కొన్ని నగర సంగీత బృందాల విశేషాలివి..
గరంలో తెలుగు లైవ్
మ్యూజిక్‌కు క్లాప్ కొట్టింది కాప్రిíÙయో. పేరొందిన ట్రాక్‌ల మాషప్‌లతో వీరు తెలుగు శ్రోతల మనసులు గెలుచుకున్నారు. నేటికీ సిటీ లైవ్ మ్యూజిక్‌ని ఈ బ్యాండ్ శాసిస్తోందని చెప్పొచ్చు. తరచూ తెలుగు సినీ ప్రముఖుల ప్రైవేట్ పారీ్టస్‌లో వీరు కనిపిస్తారు. దేశ విదేశాల్లోనూ ప్రదర్శనలిచి్చన ఈ బ్యాండ్ ఉరుములు నీ నవ్వులై, యమహానగరి కలకత్తా పురి, మధుర మీనాక్షి.. తదితర తెలుగు పాటలతో పాటు సొంత ట్యూన్స్‌తో ఎనిమిదేళ్లుగా నగర సంగీతాభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
మా థ్రియరీయే వేరు..
తొమ్మిది మంది సభ్యుల బ్యాండ్ థ్రియరీ, సితార్, తబలా వయోలిన్‌లతో రాక్ సంగీతానికి భారతీయ హంగులను జోడించడం ద్వారా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. వీరి నుంచి రోజా, బొంబాయి వంటి సినిమాల్లో ప్రసిద్ధ వయోలిన్ ట్రాక్‌లను వినొచ్చు. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బ్యాండ్ తొలుత హిందీ, ఆంగ్ల సంగీతానికి పెద్ద పీట వేసినా.. ఇటీవలే తెలుగు, తమిళ సంగీతాన్ని కూడా అందిస్తోంది. ఫ్యూజన్ సంగీతాన్ని ఇష్టపడేవారికి థియరీ లైవ్ మ్యూజిక్ మంచి ఎంపిక. ఐఎన్‌సీఏ నుంచి బెస్ట్ లైవ్ యాక్ట్ బ్యాండ్ అవార్డును గెలుచుకోవడంతో పాటు 2018లో నగరంలో జరిగిన బ్రయాన్ ఆడమ్స్ ఈవెంట్లో వేదిక పంచుకోవడం, ఆ్రస్టేలియాలో సంగీత పర్యటన.. వంటివెన్నో వీరిని టాప్ బ్యాండ్స్‌లో ఒకటిగా మార్చాయి.
పల్లె మసాలా.. రామ్ మిరియాల..
తెలుగు సినీ గీతాభిమానులకు చిరపరిచితమైన పేరు రామ్ మిరియాల. ఆయన తొలుత బ్యాండ్ చౌరస్తాలో ప్రధాన గాయకుడిగా పేరొందారు. సూపర్ హిట్ ప్రైవేట్ సాంగ్స్ అందించారు. అనంతరం సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సొంత బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ప్రతి వారం నగరంలో ఎక్కడో ఒక చోట ఆయన బృందం ప్రదర్శన ఉంటుంది. డీజే టిల్లూ పేరు.. వీని స్టైలే వేరు.. దండకడియాల్.. వంటి ఆయన ట్రాక్‌లతో పాటు పల్లెదనానికి పట్టం గట్టే అనేక సొంత పాటలను కూడా వినిపిస్తారు.
జానపదమిస్తా.. చౌరాస్తా..
గ్రామీణ, తెలుగు జానపదాలతో చౌరాస్తా ధ్వని చాలా ప్రత్యేకమైనది. వీరి సంగీత శైలి హృదయాన్ని తాకుతుంది. రెగె, జానపద, రెట్రో బ్లూస్ రాగాలను వీరి ద్వారా వినొచ్చు. మాయ, ఊరెళ్లిపోతా మామా, లక్ష్మమ్మో తదితర హిట్ సాంగ్స్ వీరి సొంతం. తమ రెగె స్టైల్ ట్రాక్‌లలో గోరేటి వెంకన్న పాటలు సహా ఉత్తేజపరిచే సంగీతానికి జీవం పోస్తారు. ముఖ్యంగా 80ల జానపద సంగీతాన్ని ఇష్టపడే వారికి నప్పే, నచ్చే బ్యాండ్ ఇది
పార్టీస్‌కి డెక్కన్..
‘హైదరాబాద్స్ పార్టీ బ్యాండ్’ అని పేరు తెచ్చుకుంది. డెక్కన్ ప్రాజెక్ట్ ఫంక్, బ్లూస్, రాక్, స్వింగ్ ప్రభావాలను మిక్స్ చేస్తుంది. ఈ బ్యాండ్ సభ్యులు కళాశాల చదువుల నుంచి స్నేహితుల బృందంగా కొనసాగుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే తమ సంగీత కలలను సాకారం చేసుకుంటున్నారు. పెత్తరప్, కుర్రలు, హమ్మా హమ్మా.. ఇంకా ఎన్నో పాటలు వీరు అందిస్తారు. ఏడేళ్ల వయసున్న ఈ బ్యాండ్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం విశేషం. అలాగే రామ్‌చరణ్ ఆస్కార్ పారీ్టలోనూ వీరు మ్యూజిక్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment