సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ
వ్యవసాయంలో నలుగురికీ మెళకువలు నేర్పుతూ
మూడేళ్లుగా సంక్రాంతి సంబరాలు జరుపుతూ
ఫామ్ హౌస్ నిర్వాహకులు నాగరత్నం నాయుడు కృషి
తెలుగు ప్రజల జీవన శైలిలో ప్రత్యేక స్థానం పొందిన పండుగ సంక్రాంతి. ఇది ప్రకృతితో, పంటలతో, కుటుంబ బంధాలతో ముడిపడి ఉంది. సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక. అలాంటి పండుగను ఒక వేడుకలా ప్రతి యేటా హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరపడం ఆనవాయితీ. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సంక్రాంతి వేడుకలను నాగరత్నం నాయుడు ఇక్కడ జరుపుతున్నారు.
ప్రకృతికి హానిచేయొద్దు..
జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరీయసి.. అన్నారు. అందుకే వందల మైళ్లు ప్రయాణం చేసి సొంత ఊర్లకు వెళ్లి అక్కడి సంస్కృతిని పాడుచేయొద్దు. మన ఇంటిని కాపాడుకున్నట్లే.. మన సంస్కృతిని, వ్యవసాయాన్ని, చేతి వృత్తులను, పాడి పంటలను కాపాడుకోవాలి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి సంబరాన్ని చేసుకోవాలి. ఈ క్రమంలో ప్రకృతికి హానిచేయొద్దు. ఇటీవల కాలంలో జూదాలపై ఆసక్తి పెరుగుతోంది. వాటితో జీవితానుల పాడుచేసుకోవద్దు. ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతే మనల్ని పది కాలాల పాటు జీవించేలా చేస్తుంది.
– గొట్టిపాటి సత్యవాణి
సంప్రదాయాలు మర్చిపోకుండా..
మూడేళ్ల నుంచి మా ఫామ్ హౌస్‌లో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. అందుకే ఫామ్‌లో అన్ని రకాల పంటలూ పండిస్తాం. దీంతో పాటు యేటా నిర్వహించే సంక్రాంతి వేడుకలకు సాధారణ ఎంట్రీ ఫీజునే వసూలు చేస్తున్నాం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం.. కాబట్టి.. ఆ ఖర్చులను పార్టిసిపెంట్స్ భరిస్తుంటారు. నేను కేవలం బియ్యం, కూరగాయలు అందిస్తుంటాను. మిగతా ఖర్చంతా ఔత్సాహికులైన యువకులు పెట్టుకుంటారు. ముగ్గుల పోటీలు, ఎడ్లబండ్ల పోటీలు, టగ్ ఆఫ్ వార్ లాంటి పోటీలు నిర్వహించి మన సంస్కృతి పట్ల ఇప్పటి యువతకు అవగాహన కల్పిండమే నా సంకల్పం. ఆ ప్రయత్నంలో నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందుతున్నా.. అందరికీ సంక్రాంతి ఒక ఎమోషన్ అవ్వాలనేదే నా ఆకాంక్ష.
– నాగరత్నం నాయుడు,ప్రోగ్రెసివ్ ఆర్గానిక్ ఫార్మర్
ఏడాది కష్టాన్ని దూరం చేసే వేడుక..
మాది మణికొండలోని కళాకృతి డాన్స్ ఇన్‌స్టిట్యూట్. మా పిల్లలు డీ షో వంటి పెద్ద షోస్‌లో పాల్గొన్నారు. నేను డాన్స్ కోరియో గ్రాఫర్‌ని. బంగారి బాలరాజు, ఉత్తర, అసలేం జరిగిందంటే వంటి చిత్రాల్లో, రాములమ్మ సీరియల్ల్ హీరోయిన్‌గా నటించాను. తమిళ్ చిత్రాల్లోనూ నటించా. మనది వ్యవసాయ కుటుంబం. ఏడాది పాటు సాగులో పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చిన సందర్భంగా ఈ పండుగ చేసుకుంటాం.. మన సంస్కృతిని మర్చిపోకూడదు. అందుకే ఇలాంటి వేడుకల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది.
– కరొన్య కాథరిన్, సినిమా నటి
ఈ ఫామ్‌తో మంచి అనుబంధం ఉంది..
నేను రిటైర్డ్ పోలీస్ అధికారిని. మాకు పెద్దపల్లిలో ఫార్మ్ ఉంది. ముప్పై ఎకరాల్లో హార్టీ కల్చర్ చేస్తున్నాను. ఈ ఫామ్‌ని మూడు నాలుగు సార్లు విజిట్ చేశాను. ఇక్కడ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇక్కడకి చాలా మంది రైతులు వస్తుంటారు. ఈ ఫార్మ్ దాదాపు 25 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో మేము భాగా ఎంజాయ్ చేశాం. ఇక్కడికి నేనొక్కడినే వచ్చాను. నాకు ఈ ఫామ్‌తో మంచి అనుబంధం ఉంది.
– చిట్టిబాబు, రిటైర్డ్ పోలీసు అధికారి
Comments
Please login to add a commentAdd a comment