Naidu
-
తెలుగు ప్రజల జీవనశైలి..
తెలుగు ప్రజల జీవన శైలిలో ప్రత్యేక స్థానం పొందిన పండుగ సంక్రాంతి. ఇది ప్రకృతితో, పంటలతో, కుటుంబ బంధాలతో ముడిపడి ఉంది. సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక. అలాంటి పండుగను ఒక వేడుకలా ప్రతి యేటా హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరపడం ఆనవాయితీ. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సంక్రాంతి వేడుకలను నాగరత్నం నాయుడు ఇక్కడ జరుపుతున్నారు. ప్రకృతికి హానిచేయొద్దు.. జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరీయసి.. అన్నారు. అందుకే వందల మైళ్లు ప్రయాణం చేసి సొంత ఊర్లకు వెళ్లి అక్కడి సంస్కృతిని పాడుచేయొద్దు. మన ఇంటిని కాపాడుకున్నట్లే.. మన సంస్కృతిని, వ్యవసాయాన్ని, చేతి వృత్తులను, పాడి పంటలను కాపాడుకోవాలి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి సంబరాన్ని చేసుకోవాలి. ఈ క్రమంలో ప్రకృతికి హానిచేయొద్దు. ఇటీవల కాలంలో జూదాలపై ఆసక్తి పెరుగుతోంది. వాటితో జీవితానుల పాడుచేసుకోవద్దు. ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతే మనల్ని పది కాలాల పాటు జీవించేలా చేస్తుంది. – గొట్టిపాటి సత్యవాణిసంప్రదాయాలు మర్చిపోకుండా.. మూడేళ్ల నుంచి మా ఫామ్ హౌస్‌లో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. అందుకే ఫామ్‌లో అన్ని రకాల పంటలూ పండిస్తాం. దీంతో పాటు యేటా నిర్వహించే సంక్రాంతి వేడుకలకు సాధారణ ఎంట్రీ ఫీజునే వసూలు చేస్తున్నాం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం.. కాబట్టి.. ఆ ఖర్చులను పార్టిసిపెంట్స్ భరిస్తుంటారు. నేను కేవలం బియ్యం, కూరగాయలు అందిస్తుంటాను. మిగతా ఖర్చంతా ఔత్సాహికులైన యువకులు పెట్టుకుంటారు. ముగ్గుల పోటీలు, ఎడ్లబండ్ల పోటీలు, టగ్ ఆఫ్ వార్ లాంటి పోటీలు నిర్వహించి మన సంస్కృతి పట్ల ఇప్పటి యువతకు అవగాహన కల్పిండమే నా సంకల్పం. ఆ ప్రయత్నంలో నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందుతున్నా.. అందరికీ సంక్రాంతి ఒక ఎమోషన్ అవ్వాలనేదే నా ఆకాంక్ష. – నాగరత్నం నాయుడు,ప్రోగ్రెసివ్ ఆర్గానిక్ ఫార్మర్ఏడాది కష్టాన్ని దూరం చేసే వేడుక.. మాది మణికొండలోని కళాకృతి డాన్స్ ఇన్స్టిట్యూట్. మా పిల్లలు డీ షో వంటి పెద్ద షోస్‌లో పాల్గొన్నారు. నేను డాన్స్ కోరియో గ్రాఫర్ని. బంగారి బాలరాజు, ఉత్తర, అసలేం జరిగిందంటే వంటి చిత్రాల్లో, రాములమ్మ సీరియల్ల్ హీరోయిన్గా నటించాను. తమిళ్ చిత్రాల్లోనూ నటించా. మనది వ్యవసాయ కుటుంబం. ఏడాది పాటు సాగులో పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చిన సందర్భంగా ఈ పండుగ చేసుకుంటాం.. మన సంస్కృతిని మర్చిపోకూడదు. అందుకే ఇలాంటి వేడుకల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. – కరొన్య కాథరిన్, సినిమా నటిఈ ఫామ్‌తో మంచి అనుబంధం ఉంది.. నేను రిటైర్డ్ పోలీస్ అధికారిని. మాకు పెద్దపల్లిలో ఫార్మ్ ఉంది. ముప్పై ఎకరాల్లో హార్టీ కల్చర్ చేస్తున్నాను. ఈ ఫామ్‌ని మూడు నాలుగు సార్లు విజిట్ చేశాను. ఇక్కడ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇక్కడకి చాలా మంది రైతులు వస్తుంటారు. ఈ ఫార్మ్ దాదాపు 25 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో మేము భాగా ఎంజాయ్ చేశాం. ఇక్కడికి నేనొక్కడినే వచ్చాను. నాకు ఈ ఫామ్‌తో మంచి అనుబంధం ఉంది. – చిట్టిబాబు, రిటైర్డ్ పోలీసు అధికారి -
చంద్రబాబుకే బురిడీ!
సాక్షి టాస్క్‌ఫోర్స్: పలమనేరు ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ పాపం కర్ణాటక నుంచి ఇక్కడికొచ్చి మెటల్ స్టోన్ క్రషింగ్ చేసుకుంటున్న జనార్దన నాయుడిని బెదిరించి దాన్ని కొట్టేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన జిల్లాలో పలుచోట్ల ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడారు. జనార్దన నాయుడుకు ఇంత అన్యాయం జరిగిందా అనుకున్నారుగానీ ఇప్పుడు చూస్తే అసలు ఆ క్వారీకి లీజుదారుడు జనార్దన్ నాయుడే కాదు. చిత్తూరు జిల్లా వి.కోట మండలానికి చెందిన శరత్కుమార్దిగా ఇక్కడి మైనింగ్ రికార్డుల్లో ఉంది. ఇన్నాళ్లు చంద్రబాబునే బురిడీ కొట్చించిన జనార్దన్ నాయుడు భలే వాడుగా ఉండాడే అంటూ ఇక్కడి జనం చర్చించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి రాగానే మాదిగబండ క్వారీనీ నాయుడు స్వాధీనం చేసుకుని తమ ప్రభుత్వం అధికారంలో ఉందని అధికారులను సైతం బెదిరించుకుంటూ జల్లి(కంకర)పనులు యథేచ్ఛగా చేస్తున్నాడు. నాయుడు కర్ణాటకలో బీజేపీ నాయకుడు, ఇక్కడేమో టీడీపీ లీడర్‌గా చలమాణి అవుతున్నాడు.ఆపరేటర్ మృతితో విషయం వెలుగులోకి...మూడు రోజుల క్రితం మాదిగబండ క్వారీలో ఓ జేసీబీ ఆపరేటర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీనిపై స్పందించిన ఇక్కడి వైఎస్సార్సీపీ నేతలు మృతుని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో క్వారీకి సంబందించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో ఇక్కడి క్వారీకి లీజుదారుగా ఉన్న జి.మోహన్‌బాబు తన క్వారీని శరత్‌కుమార్‌కు బదిలీ చేశారు. ఇందుకు సంబంధించిన స్థానిక మైనింగ్ శాఖలో ప్రొసీడింగ్స్ నెం:1059/టీక్యూఎల్/ఆర్ఎంబీఎస్/21 గా ఉంది. దీంతో శరత్‌కుమార్ లీజుదారుగా మారాడు. క్వారీకి సంబంధించి హెచ్‌టీ సర్వీస్ నెం:2503 పేరిట తీసుకున్నాడు. అయితే ఇదే క్వారీ ఇన్ ఎలిజిబుల్ జాబితాలో ఉందంటూ 2022 ఆగస్టు 1న మైనింగ్ డీడీ కేఎల్వీ ప్రసాద్‌రావు లీజుదారుడైన శరత్‌కుమార్‌కు ప్రొసీడింగ్స్ నెం:3522/క్యూ1గా నోటీసు జారీ చేశారు. దీంతో ఈ క్వారీ పనులు ఆగిపోయాయి. అనవసరంగా కరెంట్ చార్జీలు భారమెందుకు అనుకుని, 2024 జూన్ 6న స్థానిక ట్రాన్స్‌కో అధికారులకు అప్పటిదాకా ఉన్న బకాయిలను చెల్లించి సర్వీసును డీసీ చేయమని ట్రాన్స్‌కో ఎస్ఈ(ఆపరేషన్)కు అర్జీ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఈ క్వారీ జనార్దన్నాయుడుది కాదు శరత్కుమార్దని తేలిపోయింది.పంచాయతీకి సెస్‌లు కూడా లేవటకొలమాసనపల్లి పంచాయతీ సర్పంచ్ గోవిందుస్వామి సోమవారం స్థానిక మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తున్న జనార్దన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. పైగా పంచాయతీ పన్నులను వసూలు చేయించాలని విన్నవించారు.ఒకే నెంబరుతో రెండు ఆధార్ కార్డులుజనార్దన్నాయుడు 9041 1852 3636 అనే నంబరుతో దొడ్డ కంబలి, బంగారుపేట తాలుకా, కర్ణాటక పేరిట ఆధార్ కార్డు ఉంది. ఇదే నంబరుపై కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కెనమాకులపల్లిలోనూ ఆధార్ కార్డు కలిగి ఉన్నట్టు ఇక్కడి వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టాలని విన్నవించారు.నోరుమెదపని అధికారులుఅనర్హత జాబితాలోకి వచ్చిన మాదిగబండ క్వారీని స్థానిక మైనింగ్ అధికారులు ఎందుకు ఆపలేదో అర్థం కాలేదు. తనకు కరెంట్ వద్దని విన్నవించిన లీజ్దారుని కాదని ఇన్ని నెలలుగా ట్రాన్స్‌కో అధికారులు ఎలా సరఫరా ఇస్తున్నారో చెప్పడం లేదు. దీనిపై వారిని వివరణ కోరినా దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం.కూటమి అధికారంలోకి రాగానే..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనార్ధన్‌నాయుడు తన మనుషులతో వచ్చి మాదిగబండ క్వారీని స్వాధీనం చేసుకున్నాడు. అప్పటికే అక్కడున్న జల్లిని సైతం కర్ణాటకకు తరలించుకున్నాడు. దీనిపై లీజుదారుడైన శరత్‌కుమార్ జూన్ 16న స్థానిక సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ అధికారబలంతో నాయుడు రెచ్చిపోయి క్వారీవద్దకు ఎవరినీ రానీయకుండా స్టోన్‌క్రషింగ్ చేస్తున్నాడు. -
సైనికుడిపైనా టీడీపీ అరాచకం
నెల్లిమర్ల రూరల్/విజయనగరం అర్బన్: అధికార దర్పంతో చెలరేగిపోతున్న టీడీపీ మూకలు చివరకు దేశ సైనికుడినీ వదిలిపెట్టలేదు. టీడీపీకి ఓటేయలేదనే అనుమానంతో అతనిపై దౌర్జన్యానికి దిగాయి. టీడీపీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసి.. అధికార బలంతో అతని ఇంటిపైకి జేసీబీని దూకించాయి. 24 ఏళ్ల పాటు దేశానికి రక్షణగా నిలిచిన మాజీ జవాన్ ఇంటి ప్రహరీని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించాయి. తనకు ఏ రాజకీయ పారీ్టతోనూ సంబంధం లేదని అతను కన్నీటిపర్యంతమైనా టీడీపీ మూకలు, అధికారులు కనికరించలేదు. ఈ ఘటన శనివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. దన్నానపేటకు చెందిన పతివాడ వెంకినాయుడు 24 ఏళ్ల పాటు సైనికుడిగా దేశానికి సేవ చేశాడు. ఆ కష్టార్జితంతో ఇల్లు నిరి్మంచుకున్నాడు. అయితే ఆ ఇంటి ప్రహరీ ఆక్రమణలో ఉందని ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గేదెల రాజారావు అమరావతికి వెళ్లి ఆ పార్టీ నాయకులను కలిసి.. టీడీపీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి అందిన ఆదేశాల మేరకు ఆర్డీవో సూర్యకళ గురువారం గ్రామంలో పర్యటించారు. వెంకినాయుడు ఇంటి ప్రహరీ ఆక్రమణ భూమిలో ఉందని.. దానిని తొలగించాలని తహసీల్దార్ ధర్మరాజుకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో టీడీపీ నాయకుల ఆక్రమణలు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని తొలగించకుండా.. సైనికుడి ఇంటి మీదకు రావడమేంటని గ్రామస్తులు మండిపడ్డారు. కానీ, రెవెన్యూ అధికారులు శనివారం సుమారు 50 మందికి పైగా పోలీస్ సిబ్బందితో వచ్చి గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేశారు. ఆ వెంటనే జేసీబీతో వెంకినాయుడు, అతని సోదరుడు లక్ష్మణరావుకు చెందిన ఇంటి ప్రహరీని కూల్చివేశారు. వెంకినాయుడు దంపతులు కన్నీటిపర్యంతమై ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. దీంతో అధికారులు, టీడీపీ నేతల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆందోళనకు దిగారు. దీంతో తహసీల్దార్ ధర్మరాజు.. టీడీపీ నేతల ఆక్రమణలు కూడా తొలగిస్తామంటూ పేపర్‌పై సంతకం పెట్టి బాధితులకు అందజేశారు. జవాన్‌ను వేధించడమే మీ రాజకీయమా?: బొత్స దేశ రక్షణ కోసం సేవలందించిన జవాన్ ఇంటి ప్రహరీని అన్యాయంగా కూల్చేయడమే మీ మంచి సంప్రదాయమా? సైనికుడిని వేధించడమే మీ రాజకీయమా? అని నెల్లిమర్ల టీడీపీ ఎమ్మెల్యేపై, ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉగ్రవాది ఇంటికి వెళ్లినట్లుగా.. ఆర్మీ ఉద్యోగి ఇంటిపైకి 50 మంది పోలీసులతో వెళ్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. ‘మాజీ సైనికుడు వెంకినాయుడు ఇంటి ప్రహరీ కూల్చితే మీకొచ్చే లాభమేంటి? అదో మారుమూల గ్రామం. అయినా ఎందుకు కూల్చారు? కలెక్టర్, ఎస్పీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. రాజకీయాలకు కొత్తగా వచి్చన ఎమ్మెల్యే జిల్లాలోకి ఇలాంటి సంస్కృతిని తీసుకురావడం దారుణం’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ సురే‹Ùబాబు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. దేశానికి సేవ చేస్తే.. ఇదా బహుమతి! మాజీ సైనికుడు వెంకినాయుడు మీడియాతో మాట్లాడుతూ... ‘నేను 24 ఏళ్ల పాటు దేశ రక్షణ కోసం పని చేశా. అలాంటి నాకు ఇదా ఈ ప్రభుత్వమిచ్చే బహుమతి. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదనే కక్షతో గ్రామ టీడీపీ నేత గేదెల రాజారావు అమరావతి వరకు వెళ్లి మరీ నాపై ఫిర్యాదు చేశాడు. న్యాయం, ధర్మం అంటూ మాట్లాడే పవన్‌కళ్యాణ్, చంద్రబాబుకు ఈ మాజీ సైనికుడికి జరుగుతున్న అన్యాయం కనిపించడంలేదా? రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నాపై వేధింపులకు పాల్పడడం సరికాదు. గ్రామంలోని టీడీపీ నేతల ఆక్రమణలు తొలగించే వరకు నా పోరాటం ఆగదు. టీడీపీ వాళ్ల దౌర్జన్యాలను అడ్డుకొని రాష్ట్రపతి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
జట్టు ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా. పరి నాయుడు కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సుంకరి చిన్నప్పల నాయుడు కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
ఇంగ్లిష్‌లో ఇరగదీస్తాడు..మోసాల్లో మొనగాడు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అతనో మాటల మాయగాడు... ఎంతటి మాయగాడు అంటే ఎంపీ, ఎమ్మెల్యేలను అవలీలగా బురడీ కొట్టించి రూ.లక్షలు కొల్లగొట్టడంలో సిద్ధహస్తుడు. 12 ఏళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతని మోసాల పరంప కొనసాగుతోంది. అవతలి వారు ఎంతటి వారైనా తన మాటలతో బుట్టలో పడేసే మాటకారి. 30 చీటింగ్ కేసుల్లో నిందితుడైన అంతర్రాష్ట సైబర్ నేరగాడు. ఈ పన్నెండేళ్లలో రెండు రాష్ట్రాలకు చెందిన 35 మంది ప్రజాప్రతినిధుల నుంచి కోట్లు కొట్టేశాడు. కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు (42) పన్నెండేళ్ల నేర ప్రస్థానమిది. నాయుడు తాజాగా అమలాపురం ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి మాయ మాటలకు చెప్పి ప్రభుత్వ నిధులు మంజూరు చేయిస్తానని రూ.2 లక్షలు పేటీఎం ద్వారా ఆన్లైన్లో వేయించుకుని సైబర్ నేరానికి పాల్పడ్డాడు. విషయం తెలసుకున్న ఆ ప్రజా ప్రతినిధి తన వ్యక్తిగత సహాయకుడి చేత అల్లవరం పోలీసు స్టేషన్లో నాయుడుపై ఫిర్యాదు చేయించారు. దీంతో అతని నేరాల చిట్టా మరోమారు వెలుగు చూడడమే కాకుండా ఆ నేరగాడిని కటకటాల్లోకి నెట్టించారు. బీటెక్ చదవి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ సైబర్ నేరాల బాట పట్డాడు. పాల్వంచ, కరీంనగర్ ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాలంలో నాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్‌కు చిక్కుకుని సస్పెండయ్యాడు. 2008లో జరిగిన ఏసీబీ ట్రాప్ తర్వాత నాయుడి మోసాల చిట్టా తెరుచుకుని నేరాల పరంపర మొదలైంది. నాయుడి సైబర్ నేరాల తీరు ఇలా... నాయుడు అసలే మాటకారి కావడంతోపాటు ఇంగ్లిషులో మాట్లాడడం... అతని మోసాలకు బాగా ఉపయోగపడ్డాయి. తానో ప్రభుత్వ ఉద్యోగినని పరిచయం చేసుకుంటాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కొన్ని పథకాల పేర్లు చెప్పి ఈ నిధులు ఇంకా ఉన్నాయని... వాస్తవానికి ఆ పథకాల లబ్ధికి కాల పరమితి ముగిసి పోయినప్పటికీ ముందు డేట్ వేసి ఆ నిధులు వచ్చేలా చేస్తానని చెబుతాడు. ఇందుకోసం లబ్ధిదారుల తరఫున కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుందని... అయితే ఇప్పుడు అంత సమ యం లేదు కాబట్టి మీరే ముందుగా కొంత మొత్తాన్ని జమ చేస్తే నిధులు మంజూరవుతాయని నమ్మబలుకుతాడు. దీంతో ప్రజా ప్రతినిధులు నాయుడు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు వేస్తారు. బ్యాంక్ అకౌంట్ కూడా తనది కాకుండా తనకు తెలిసిన వారిది ఇస్తాడు. ఫోన్లు కూడా వేరొకరి నంబర్ల నుంచి కాల్ చేసి మాట్లాడి నేరం బయటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రకాశం, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, చిత్తూరు తదితర జిల్లాల్లో నా యుడు ప్రజాప్రతినిధులను మోసం చేసి రూ.లక్షలు కాజేశాడు. కరోనా లాక్డౌన్ సమయంలో కూడా నాయుడి మోసాలు ఆగలేదు. జిల్లాల సరి హద్దులు దాటుతూ అతడు భీమవరం, కర్నూలు చెక్‌పోస్టుల వద్ద దొరికిపోయి క్వారంటైన్లకు కూ డా వెళ్లాడు. అక్కడ సైతం కొందరి ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి డబ్బులు గుంజాడు. క్వారెంటైన్లో ఉన్న నాయుడిని పోలీసులు అక్కడ నుంచి రప్పించి అరెస్ట్ చేసి కటకటాలపాల్జేశారు. -
ఫిడేల్ నాయుడు గారు
1914 ప్రాంతంలో విశాఖపట్నం ‘మై ఫ్రెండ్స్’ సంఘంలో ఓ ఇరవైయేళ్ల కుర్రాడు సుశ్రావ్యమైన గోష్ఠి చేస్తే, అతడి వాయులీన వైదుష్యాన్ని మెచ్చుకొని మారేపల్లి రామచంద్ర శాస్త్రి బంగారపు ఉంగరం వేలికి తొడుగుతూ ఆ విద్వాంసుడికి ‘ఫిడేలు నాయుడు’ అని నామకరణం చేశారు. తదాది ఆ వేలికి ఉంగరం, ఆ వ్యక్తికా పేరు స్థిరంగా ఉండిపోయాయి. తర్వాత ద్వారం వేంకట స్వామి నాయుడుగారు విజయనగరం కోటలో కచేరి చేసినపుడు, ఆస్థాన విద్వాంసుడు ఆదిభట్ల నారాయణ దాసు విని వివశుడై ‘జీనియస్’ అంటూ ఆరున్నర శృతిలో అన్నారట. చివరిదాకా ఆదిభట్ల ఆ మాట మీదే ఉన్నారు. అంతకుముందు సంగీతంలో మెలకువలు, పైసంగతులు నేర్వాలని ద్వారం విజయనగర సంగీత పాఠశాల ద్వారంలో నిలబడితే– ఆయన వేదనని, వాదనని విని ‘నువ్వు గురు స్థానంలో ఉండాల్సిన వాడివి’ అంటూ విజయనగరం సంగీత కళాశాల ఉచితాసనమిచ్చి కూర్చోబెట్టింది. వజ్రం వెతకదు, వెతకబడుతుంది. ఆధార షడ్జమంలోనే నాయుడు ‘రవ’ళిం పుని జాతి పసిగట్టింది. ఇక తర్వాతిదంతా చరిత్ర. ‘ఈ చిన్న కర్రముక్కని చేతికిచ్చి ఈ సంగీత సముద్రం ఈదమన్నాడు దేవుడు. నావల్ల ఏమవుతుంది?’ అని భయపడుతూనే సంగీత సాగరంలో లక్షలాదిమందిని ఓలలాడించి ధన్యులయ్యారు ఫిడేలు నాయుడుగారు. ఆయన సిద్ధుడు. అనితర సాధ్యమైన సాధనతో వాయులీనాన్ని పూర్తిగా వశపరచుకుని గుండెలకు హత్తుకుని వాయులీన అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. రాగ ప్రస్తా రాన్నిబట్టి మొహమల్ వస్త్రంమీద ముత్యాలు జారినంత మృదువుగా ఉక్కుతీగెలను పలికించగలరు. కొన్ని సందర్భాలలో పున్నాగ పరిమళం శ్రోతల్ని కమ్ముకుంటుంది. ఆయన ఉన్న రోజుల్లో దక్షిణాది ప్రజ హారతులు పట్టింది. దేశం ఫిడేలు నాయుడు గారిని గుర్తించింది. 1957లో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. అప్పటికే ప్రతిష్టాత్మకమైన బంగారు పతకాలు అందుకున్నారు. పౌర సన్మానాలు, దర్బారు ఆహ్వానాలు లెక్కకుమించి జరిగాయి. గాంధర్వ విద్యాభూషణ, గానకళా విశారద, సంగీత కళానిధి, డాక్టర్ ఆఫ్ లెటర్స్ (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం) నాయుడుగారిని అలంకరించాయి. 1950లో ఆంధ్రా యూనివర్సిటీ కళాప్రపూర్ణతో గౌరవించింది. 1964లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన సంగీత విద్వాంసునిగా నియమించి రాష్ట్రం సత్కీర్తి పొందింది. ద్వారం వారికి శాస్త్రీయ కృతుల నుంచి జానపదాల వరకు అన్నీ ఇష్టమే. వయొలిన్‌పై ఎంకి పాటలకు శాశ్వతత్వం తెచ్చారు. అన్నిటికన్నా మిన్నగా ‘రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ’ అన్న కృతిని కదన కుతూహల రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యరుగారు వ్యాప్తిలోకి తెచ్చారు. మహాకవి శ్రీరంగం నారాయణ బాబు ద్వారంకి హితులు, సన్నిహితులు. నారాయణ బాబు ద్వారంపై రాసిన కవితలో– ‘నాయుడుగారూ/ మీ వేళ్లు/ ఘన రాగ పంచకం/ మీ శరీర/ మాకాశం/ మీ హస్తం/ హరివిల్లు/ చిత్ర చిత్ర వర్ణాలు/ శ్రీవారి వేళ్లు/’ అంటూ కొనసాగించారు. ఆనాటి మహా కవులలో విశ్వనాథ, జాషువా, తుమ్మల ఫిడేలు నాయుడుగారిని ప్రస్తుతిస్తూ పద్యాలు చెప్పారు. చమత్కారంగా మాట్లాడుతూ, మధ్య మధ్య చుట్ట పొగ సుతారంగా పీలుస్తూ చూడవచ్చిన వారిని పాటలతోనే కాక మాటలతో కూడా ముగ్ధులను చేసే నైజం నాయుడు గారిది. మీ కచేరీ వేళ రెండు పాములు ఆడాయని చెబితే అది నేల మహత్యం అన్నారు. మీరు దీపక రాగం వాయిస్తే అక్కడ వస్త్రాలు అంటుకున్నాయండీ అంటే పాపం ఎవరో బీడీయో చుట్టో కాలుస్తూ ఏమరుపాటున ఉండి ఉంటారు అన్నది ఆయన తీర్మానం. ఆయనొకసారి వయొలిన్‌ని శృతి చేసుకుని, కమాన్ని కూడా పరిక్షించుకుని పక్కన పెట్టారట. వెంటనే నిండు సభ కరతాళ ధ్వనులతో మార్మోగిందట. నమ్మకం కుదిరితే అలాగ ఉంటుందన్నారు నాయుడుగారు. ‘ఈ వాయులీన సాహిత్య మాధుర్యముల్/ దేవతా స్త్రీ కంఠ దీప్తరావమ్ములో/ పారిజాతామోద భావమ్ములో/ సురనీద్ జీవమ్ములో/ ఈ వాయులీన సాహిత్య సాహిత్యముల్/ పలుకరించిన తొట్రుపాటెరుంగని యట్టి/ పలుకులో కలకండ పలుకులో/ చిరునవ్వు మొలకలో...’ – విశ్వనాథ మనకి కూడా ఫిడేలు నాయుడుగారి స్మృతి చిహ్నం విధిగా ఉండాలి. ఈ నెల 8న ద్వారం వారి జయంతి. ఆరోజున నాయుడుగారి జ్ఞాపకాలతో ఒక విశేష సంచిక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు కె. రామచంద్రమూర్తి చేతులమీదుగా విడుదల అవుతుంది. ఉదయం 11 గంటలకు వీవీఐటీ ప్రాంగణం, నంబూరు (గుంటూ రు)లో జరిగే ఈ సభకు అందరూ ఆహ్వానితులే. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సుధీర్.. నోరు అదుపులో పెట్టుకో..
శ్రీకాళహస్తి : టీడీపీ శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని... ఆయన దబాయింపులకు ఎవరూ భయపడరని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అన్నారు. చిన్నవాడు భవిష్యత్ ఉన్నవాడు పెద్దలను గౌరవించడం... మర్యాదగా మాట్లాడం నేర్చుకోవాలని సూచించారు. మంగళవారం ఎస్సీవీ నాయుడు ఆయన నివాస గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ మీ ఆరోపణలు స్వీకరిస్తున్నా.. ఎవరి వద్ద కమీషన్లు తీసుకున్నానో నిరూపించు, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా ఎప్పుడు.. ఎక్కడ కూర్చుని మాట్లాడుకుందామో... చెప్పండి అంటూ సవాల్ విసిరారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఆయన తండ్రి బొజ్జల గంగసుబ్బరామిరెడ్డిని శ్రీకాళహస్తిలోకి రానీయకుండా అడ్డగిస్తే వారికి అండగా నిలిచి సహాయ సహకారాలు అందించింది తామేనని చెప్పారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చెల్లవని, నీచ రాజకీయాలు శ్రీకాళహస్తిలో చేయలేరని తెలిపారు. ‘పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లం మేము.. సొమ్ములు చేసుకుంది సంపాదించింది మీరే...’ అంటూ ధ్వజమెత్తారు. ‘మీరేమైనా రాజుల కుటుంబంలోంచి వచ్చారా... మీ తాత ఓ కాంట్రాక్టర్... అది తెలుసుకో, మేము నీ కింద పనిచేసే గుమస్తాలం కాదు, నీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. ‘తప్పులు ఉంటే సరిదిద్దుకో, మేము సరిదిద్దుకుంటాం ...బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడివి అనే అర్హత తప్ప నీకు ఏమీ లేదు..’ అని విమర్శించారు. ఎవరి సత్తా ఏమిటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ తొట్టంబేడు మండల కన్వీనర్ ఉన్నం వాసుదేవనాయుడు మాట్లాడుతూ ఉపాధి పనులు తాను చేయలేదని, తాను కమీషన్లు ఇచ్చినట్లు తనపై ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. ఏర్పేడు మాజీ ఎంపీపీ ప్రకాష్ యాదవ్, నాయకులు గురుదశరథన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మ్యాగీక్లారా తదితరులు పాల్గొన్నారు. -
నీరు లేకుండా జాతికి అంకితమా!
వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పురుషోత్తపట్నం పథకంపై ఎద్దేవా సీతానగరం (రాజానగరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిమిక్కులతో ప్రజలను మోసం చేయవచ్చని అనుకుంటున్నారని, వాటిని మానుకోవాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సూచించారు. బుధవారం సీతానగరంలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పలు విధాలుగా ప్రజలను మోసం చేస్తూ వచ్చారని, ఆయన మాటలు ప్రజలు నమ్మడం లేదని గుర్తు చేశారు. దీనికి నిదర్శనం నంద్యాల ఎన్నికలేనన్నారు. రూ 1,640 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నెలకొల్పి, కమీషన్లు రూపంలో వందలాది కోట్లు తమ జేబులో వేసుకుంటున్నారన్నారు. పథకం పనులు పూర్తి కాకుండానే చంద్రబాబు జాతికి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పలుమార్లు జాతికి అంకితం చేశారని, అలాగే పురుషోత్తపట్నం పథకాన్నీ ప్రారంభిస్తారన్నారు. పరిహారం అందించడకుండా రైతులను గృహనిర్బంధాలు చేసి, సెక్షన్ 30, 144 వంటి పలు సెక్షన్లు రాష్ట్రంలో ఉంచి పాలన జరిపే ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ నెల 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రార ంబోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు మోటార్లను తిప్పి నీరు వచ్చిందని భావించి గొప్పగా జాతికి అంకితం చేశామని డప్పులు కొట్టుకునే రీతికి టీడీపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. పోలవరం ఎడమ కాలువలోకి పరుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి చుక్క నీరు కూడా రాలేదని, పైప్‌లైన్ పనుల పూర్తి కాకుండానే పథకాన్ని జాతికి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని కించపరుస్తూ సీఎం అంటే, మేము తీసిపోలేదన్నట్లుగా ఎస్సీలు చదువుకోరు, శుభ్రంగా ఉండరు అని టీడీపీ మంత్రులు అంటున్నారని, ఎస్సీలను ఎప్పటికప్పుడు హేళన చేసి మాట్లాడటం సరికాదని హితవుపలికారు. పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చల్లమళ్ల సుజీరాజు, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు అంబటి రాజు తదితరులు పాల్గొన్నారు. -
హిట్లర్ పాలనను తలపిస్తోంది
టీడీపీ ప్రభుత్వంపై జక్కంపూడి ఆగ్రహం ధవళేశ్వరంలో 23 మంది కాపు నాయకుల అరెస్టు ధవళేశ్వరం : రాష్ట్రంలో హిట్లర్ పాలన తలపించే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలనను సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. శనివారం ఆమె ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కాపు సంఘ నాయకులను కలిసి సంఘీభావం తెలిపారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలు దేరిన కాపు సంఘ నాయకులను పోలీసులు స్టేషన్ సెంటర్లో అడ్డుకున్నారు. అక్కడే నిరసనకు దిగిన కాపు సంఘ నాయకులను అరెస్ట్ చేశారు. విషయం తెలసుకున్న జక్కంపూడి విజయలక్ష్మి ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ చేరుకొని దక్షిణ మండల డీఎస్పీ నారాయణరావుతో చర్చించారు. అనంతరం అరెస్ట్ అయిన కాపు నాయకులను విడుదలచేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ కాపులపై వివిధ సెక్షన్లు ప్రయోగిస్తూ చంద్రబాబు వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కాపు ప్రజాప్రతిని«ధులు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ భూములను గంటా శ్రీనివాసరావుకు, అంగన్వాడీ కేంద్రాలను మంత్రి నారాయణకు నజరానాగా ఇవ్వడం వల్లనే వారు విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ధవళేశ్వరం బస్టాండ్సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేశారు. కాపు సంఘ నాయకులు పెన్నాడ జయప్రసాద్, మెండా సత్తులు, గరగ శ్రీనివాసరావు, బండారు బంపి, దొండపాటి శ్రీనివాస్, సాధనాల చంద్రశేఖర్ (శివ), ఏజీఆర్ నాయుడు, ముత్యాల పోసికుమార్, శ్రీరంగం బాలరాజు, యడ్ల మహేష్, యడ్ల వెంకటేష్, అల్లంపల్లి ముత్యాలు, పందిళ్ల భానుప్రసాద్, దూది సాయి, నూకరాజు, గపూర్, గాలి ప్రసన్నకుమార్, దళిత సంఘ నాయకులు రేగుళ్ల రఘు, మిరప రమేష్, రాజేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఫొటో లేకపోతే కార్లు వెనక్కు తీసుకోండి
కలెక్టర్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ఆదేశం ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 2,177 కోట్లు గొల్లప్రోలు (పిఠాపురం) : ఎస్సీ లబ్ధిదారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ సబ్సిడీపై అందజేసిన ఇన్నోవా కార్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో లేకుంటే వాటిని వెనక్కు తీసుకొని కొత్త లబ్ధిదారులకు అందజేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వరంలో గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాలులో పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ నిరుద్యోగ యువత, అంబేడ్కర్ సంఘాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జూపూడి, కలెక్టర్ కార్తికేయమిశ్రా హాజరయ్యారు. తొలుత డాక్టర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, బాలయోగి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూపూడి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 2,177 కోట్లు వివిధ పథకాల ద్వారా 1,26,519 మంది ఎస్సీ లబ్ధిదారులకు అందజేశామన్నారు. జిల్లాలో రూ. 300 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయన్నారు. ఎస్సీ లబ్ధిదారులంతా వివిధ పథకాలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 120 ఇన్నోవా కార్లు అందజేశామని, ఈఏడాది మరో 220 ఇన్నోవాకార్లు, 500 ట్రాక్టర్లు, బొలేరో వాహనాలు ఎస్సీ యువత ఉపాధి కోసం అందజేస్తామని తెలిపారు. యూత్‌వే పోర్టల్‌లో 2.96 లక్షల మంది రిజిస్టరైన నిరుద్యోగులకు నైపుణ్యశిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ యాక్షన్‌ప్లాన్ రూపొందించిన ఘనత జూపూడికి దక్కుతుందన్నారు. భూమి కొనుగోలు చేసుకునే రైతులు అర్జీలు పెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ నియోజవర్గంలోని 4 వేల మంది నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే ధ్యేయంతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగయువత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు అందజేశారు. గొల్లప్రోలు, కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యులు మడికి సన్యాసిరావు, బత్తుల చైతన్యరాజేష్‌కుమార్, పిఠాపురం ఎంపీపీ ముంజవరపు విజయలత, సెంట్రల్బ్యాంకు డైరెక్టర్ గుడాల రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వి. డేవిడ్‌రాజు, ఎస్సీ నాయకులు దానం లాజర్‌బాబు, లింగంరాజు, ఆలపు సూరిబాబు, భీమారావు, ఎంపీడీఓలు పి. విజయథామస్, నారాయణమూర్తి, తహసీల్దార్లు వై. జయ, రత్నకుమారి, సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
అనంత వేదన పట్టదా బాబూ ?
చంద్రబాబు విధానాల వల్లే వ్యవసాయ సంక్షోభం మూడేళ్లలో 4 లక్షల మంది వలస.. 180 మంది ఆత్మహత్య కరువు పోవాలంటే చంద్రబాబు పీఠం దిగాలి రైతు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరంలో కదంతొక్కిన అన్నదాతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ధర్మవరం : రైతులు, ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. కరువు, చంద్రబాబు కవలపిల్లలని, ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించితే కానీ రాష్ట్రంలో కరువు పోదని అన్నారు. కరువు సహాయక చర్యలు, రైతాంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతుధర్నా చేపట్టారు. ముందుగా బత్తలపల్లి మండల కేంద్రం నుంచి ధర్మవరం వరకు 13 కిలో మీటర్ల మేర భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాకు నియోజకవర్గంలోని రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు తరిమెల శరత్‌చంద్రారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోటి సూర్యప్రకాష్‌బాబు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఈ మూడేళ్ల పాలనలో రైతులకు అందుతున్న అన్ని పథకాలను నిలిపివేశారన్నారు. వైఎస్సార్ హయాంలో ఉపాధి హామీ ద్వారా వలసలను నివారిస్తే..ప్రస్తుతం ఉపాధి నిధులను రోడ్లు వేసేందుకు మళ్లించి ‘తమ్ముళ్ల’కు ప్రయోజనం కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల జిల్లాలోని రైతులు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారన్నారు. గతంలో నలుగురికి పని ఇచ్చిన రైతులు ప్రస్తుతం ఆత్మాభిమానాన్ని చంపుకుని రోడ్లు ఊడ్చే కూలీలుగా మారారని, మురికికాలువల పక్కన జీవిస్తున్నారని తెలిపారు. మరికొందరు భిక్షాటన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కోర్ డ్యాష్‌బోర్డు ద్వారా తనకు నేరుగా తెలుస్తుందని చెప్పుకునే చంద్రబాబు.. అనంతపురం జిల్లాలో కరువు, వలసలు, రైతు ఆత్మహత్యల గురించి తెలుసుకోకపోవడం విడ్డూరమన్నారు. గత ఖరీఫ్‌లో నాలుగు రోజుల్లోనే ఐదు లక్షల ఎకరాల్లో పంటను కాపాడామని చెప్పి జిల్లా రైతాంగాన్ని మోసం చేశారని, రెయిన్గన్ల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా ఇస్తామని చెప్పి ఆరు నెలలు కావస్తున్నా ఒక్క రైతుకూ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాలోని అన్ని చెరువులకు నీరిస్తామని గొప్పలు చెప్పుకున్నారని, కనీసం ఒక్క ఎకరానికీ ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. బిల్లులు ఆపేసి పండ్లతోటల రైతులను నాశనం చేస్తున్నారన్నారు. రూ.కోట్లు ఎలా వెనకేసుకోవాలి.. తన కొడుకును ఎలా వృద్ధిలోకి తీసుకురావాలనే ధ్యాస తప్ప చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రమూ పట్టడం లేదన్నారు. రైతు సమస్యలపై పోరాడే నాయకుడు ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబును గద్దె దించి.. జగన్మోహన్రెడ్డిని సీఎం చేసి రైతాంగానికి పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ధర్మవరం ఆర్డీఓ బాలానాయక్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు పోతుకుంట రామయ్య, బగ్గిరి బయపరెడ్డి, వడ్డిరామలింగారెడ్డి, ఇందుకూరి నారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు గడ్డం కుళ్లాయప్ప, కౌన్సిలర్లు బీరే ఎర్రిస్వామి, చందమూరి నారాయణరెడ్డి, చిన్న తిమ్మన్న, గొట్లూరు సింగిల్‌విండో అధ్యక్షులు గిరక రామాంజినేయులు, సర్పంచ్ల సం ఘం అ«ధ్యక్షులు గెలివి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
సాగు లేదు .. పరిహారమూ రాదు
మారని ‘బతుకు’ బీటీపీ ఆయకట్టు రైతుల దుర్భర జీవితాలు ప్రత్యామ్నాయం చూపడంలో చంద్రబాబు విఫలం ఊరిస్తున్న సీఎం హామీలు పేరుకే తరిభూములు.. ఐదేళ్లకోసారి కూడా సాగులోకిరావు. మెట్ట రైతులతో సమానంగా అన్నింటా నష్టపోతున్నా పైసా కూడా పరిహారం దక్కదు. ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తన వేరుశనగ సైతం ముందుగా మెట్ట ప్రాంత రైతులకు పంపిణీ చేసిన తర్వాత ఏదైనా మిగిలితే ఇస్తారు. తమ బాధలు అర్థం చేసుకుని మెట్ట ప్రాంత రైతుల్లాగే ప్రభుత్వ రాయితీలు దక్కేలా చూడాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల కాళ్లావేళ్లా పడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇది జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన బైరవాని తిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ) పరిధిలోని వేలాది మంది ఆయకట్టు రైతుల ఆవేదన. దుర్భర జీవితాలను అనుభవిస్తున్న బీటీపీ ఆయకట్టుదారులకు ప్రత్యామ్నాయ వ్యవస్థ చూపడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ఇదిగో.. అదిగో.. అంటూ హామీలతో ఊరిస్తూ కాలం వెల్లదీస్తుండడంతో ఆయకట్టుదారుల బతుకులు మారడం లేదు. గుమ్మఘట్ట మండలం బైరవాని తిప్ప సమీపంలోని వేదావతి నదిపై రూ.1.5 కోట్ల వ్యయంతో 2.5 టీఎంసీల సామర్థ్యంతో 1954లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సుదీర్ఘంగా సాగిన ఈ పనులు 1961లో పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు 4.9 టీఎంసీల నీటిని కేటాయించి కుడి, ఎడమ కాలువల ద్వారా రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోని గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాల్లో 12,400 ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించారు. అయితే ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కర్ణాటకలోనే ఉండడం, అంతేకాక అక్కడి ప్రభుత్వం అక్రమ బ్యారేజీలు నిర్మించి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో సమస్య మొదలైంది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి అక్కడి చెరువులు, చెక్‌డ్యామ్‌లు తెగితే తప్ప బీటీపీకు నీరుచేరని దుస్థితి నెలకొంది. దీంతో ఈ ప్రాంతాల్లోని రైతులు జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి కట్టడాలూ ఉండరాదన్న బ్రిజేష్‌కుమార్, బచావత్ ట్రిబ్యునల్ తీర్పులను ధిక్కరిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయడంతో ఐదేళ్లుగా బీటీపీకు చుక్క నీరు చేరలేదు. ఫలితంగా రిజర్వాయర్ బీటలు వారింది. ప్రత్యామ్నాయం చూపని సీఎం : ఆరేళ్లుగా బీటీపీ పరిధిలోని ఆయకట్టు బీడుపడిపోయి రైతులంతా కూలీలుగా మారిపోయారు. గ్రామాలు వదిలి పట్టణ ప్రాంతాల్లో సెక్యూరిటీగార్డులు గాను, దుకాణాల్లో పనులకు చేరిపోయి పొట్టపోసుకుంటున్నారు. బీటీప్రాజెక్టుకు శాశ్వత నీటి మోక్షం కల్పించే వరకూ తరి పేరును మార్చి ప్రభుత్వ రాయితీలు అందిస్తే తప్ప తమ బతుకులు మారవని వేలాది మంది రైతులు కోరుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆఖరుకు బీటీప్రాజెక్ట్ ఆయకట్టుదారులకు ప్రత్నామ్నాయ మార్గాలను సైతం ఆయన చూడం లేదంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనికరించడం లేదు ఆరేళ్లలో ప్రాజెక్ట్ గేట్ల వరకు ఒక్కసారి కూడా నీరు చేరలేదు. పచ్చగా కళకళలాడాల్సిన ఆయకట్టు భూములు కంపచెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి కళావిహీనంగా మారాయి. అన్నింటా నష్టపోతున్న మాకు ప్రభుత్వ రాయితీలు మాత్రం అందడం లేదు. మా బాధలు ఎందరితో చెప్పినా ఏ ఒక్కరూ కనికరించలేదు. ఈసారైనా మా గోడును పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలి. – అంగడి తిప్పేస్వామిరెడ్డి, రైతు, బీటీపీ కలెక్టర్‌ను కలుస్తాం బీటీప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు రాయితీల మంజూరులో జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్‌ను కలిసి వివరిస్తాం. ప్రాజెక్టుకు శాశ్వత నీటి లభ్యత లభించే వరకూ అన్ని రకాల రాయితీలనూ వర్తింపచేయాలని కోరుతాం. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. అవసరమైతే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించేలా చూస్తాం. – కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం -
పోరాటయోధుడు బీబీ నాయుడు
వందలాది మందితో అంతిమ యాత్ర కోటిలింగాలపేటలో దహన సంస్కారాలు కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మికోద్యమ నేత, సీఐటీయు నాయకుడు బీబీ నాయుడు చూపిన బాటలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నడవాలని వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. మూత్ర పిండాల వ్యాధితో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన సీఐటీయూ నాయకుడు బీబీ నాయుడు భౌతిక కాయానికి శనివారం మధ్యాహ్నం కోటిలింగాల పేట కైలాస భూమిలో అంతిమ సంస్కారం నిర్వహించారు. పేపరు మిల్లు ఎదురుగా ఉన్న బీటీఆర్ భవ¯ŒS నుంచి బీబీ నాయుడు భౌతిక కాయానికి వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన యాత్ర పేపరుమిల్లు మీదుగా నందం గనిరాజు జంక్షన్, జాంపేట, గణేష్‌చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా కోటిలింగాల పేట కైలాస భూమికి చేరుకుంది. మధ్యాహ్నం దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రముఖుల నివాళి ఎర్ర జెండా పట్టుకుని అదే జెండా కింద నిబద్ధతతో నడిచిన బీబీ నాయుడు బాటలో అంతా నడవాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి అన్నారు. నాయుడు మృతి కార్మిక లోకానికి తీరనిలోటన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణే ఊపిరిగా బీబీనాయుడు బతికారని మాజీ ఎంపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మిడియం బాబూరావు అన్నారు. కుల రహిత సమాజం కోసం అంతా పోరాడాలని మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకరచౌదరి సూచించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్ని కృష్ణ, సీసీసీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు, సీపీఎం అర్బ¯ŒS జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సీపీఐ నాయకులు మీసాల సత్యనారాయణ, నల్లా రామారావు, బయ్యా జోసఫ్, ట్రేడ్ యూనియ¯ŒS నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, డి.శేషుబాబ్జీ మాట్లాడారు. -
కార్మిక నేత కన్నుమూత
బీబీ నాయుడుకు ప్రముఖుల నివాళి l నేడు అంత్యక్రియలు కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మిక ఉద్యమనేత, సీఐటీయూ నాయకుడు బగాది బలుసు నాయుడు (బీబీ నాయుడు ) (69) శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య భారతి, కుమార్తెలు వాణి, రాణి ఉన్నారు. దీర్ఘకాలంగా సుగర్ వ్యాధితో బాధపడుతున్న నాయుడు గురువారం ఉదయం అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో ఆయన మృతి చెందారు. ఆయన మృతి కార్మిక ఉద్యమానికి, సీపీఎం పార్టీకి తీరని లోటని సీపీఎం, సీఐటీయూ నాయకులు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయానికి శనివారం ఉదయం 10 గంటలకు కోటిలింగాల ఘాట్‌లోని కైలాస భూమిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. నాయుడు పాత్ర కీలకం కార్మిక ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన కార్మిక నేత బీబీ నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అయోధ్యపురం గ్రామంలో 1948 నవంబరు 9న జన్మించారు.1971లో రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లులో రీవైండింగ్లో ట్రైనీ కార్మికునిగా చేరారు. 1973లో సీఐటీయూలో చేరారు. నిబద్ధతతో ఎదిగి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. నాయుడు రాష్ట్రంలోని వివిధ పేపరు మిల్లులను సందర్శించి యూనియన్లు ఏర్పాటు చేసేందుకు చేసిన కృషి ఎనలేనిది. అన్ని యూనియన్ నాయకులను ఏకం చేసి కార్మికోద్యమాలను నిర్వహించి విజయం సాధించారు. పలువురి సంతాపం బీబీ నాయుడి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఫోన్ ద్వారా సందేశం పంపగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబూరావు, దడాల సుబ్బారావు, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, అర్బన్ జిల్లా కార్యదర్శి టి.అరుణ్, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం, వివిధ కార్మిక సంఘాల నేతలు ఆనందనగర్ వద్ద గణపతి నగర్‌లోని బీబీ నాయుడు స్వగృహానికి చేరుకుని నివాళులర్పించారు. పేపరు మిల్లు ఎదురుగా ఉన్న సీఐటీయూ కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. -
స్మార్ట్‌సిటీ జాబితాలోకి కొత్తగా 40 పట్టణాలు
గాంధీనగర్: పట్టణాభివృద్ధిలో భాగంగా ‘స్మార్ట్ సిటీస్’ జాబితాలోకి మరో 40 పట్టణాలను చేర్చుతామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం వెల్లడించారు. ఈ నెలలో లేదా వచ్చే నెలలో కొత్త పట్టణాల జాబితాను విడుదలచేయనున్నారు. కొత్త వాటితో కలుపుకుని జాబితా వందకు చేరనుంది. గత ఏడాది జనవరిలో ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతీ పట్టణంలో మౌలికవసతులను మెరుగుపరిచేందుకు రూ.200కోట్ల నిధులు కెటాయించారు. -
యువతను కార్యోన్ముఖుల్ని చేద్దాం
హామీల అమలుకు ప్రభుత్వం మెడలు వంచుదాం జగన్‌ను ముఖ్యమంత్రిని చేసే వరకు సైనికుల్లా కృషిచేద్దాం వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపు 21న విస్తృత సేవా కార్యక్రమాలు తిరుపతిలో పార్టీ యువజన, విద్యార్థి విభాగాల మేధోమదన సదస్సు తిరుపతి రూరల్: రాష్ట్రంలో అవినీతి, అక్రమ, అనైతిక పాలన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత, విద్యార్థి లోకాన్ని కార్యోన్ముఖులను చేయాలని పార్టీ యువజన, విద్యార్థి విభాగాల రాష్ట్ర పరిశీలకుడు, వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల రాష్ట్ర స్థాయి మేధోమదన సదస్సు శుక్రవారం తిరుపతిలో జరిగింది. సమావేశంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఓ ప్రైవేటు కంపెనీలాగా మార్చారని ఆయన ఆరోపించారు. హామీలను అమలు చేయకుండా ద్రోహిగా సీఎం మిగిలిపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం వైఖరి చూస్తుంటే తుగ్లక్‌ను తలపిస్తున్నారన్నారు. పార్టీని ప్రతిష్టం చేసే చర్యల్లో యువజన విభాగాదే కీలకపాత్ర అన్నారు. ఎదగడానికి అడ్డదారులు ఉండవని, అంకితభావం, చిత్తశుద్దితో అప్పగించిన పనులను పూర్తి చేయాలని, పదవులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి నుంచే ప్రభుత్వ వైఫల్యాలపై పోరు మొదలు పెడుతున్నట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో క్షేత్ర స్థాయిలో ముందుకు నడవాలని యువతకు సూచించారు. 21న జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామ, మండల స్థాయిల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి సూచించారు. సామాజీక సేవ కార్యక్రమాలు వైపు యువతను నడిపించాలని పార్టీ యువజన విభాగం ఆనంతపురం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి సూచించారు. జిల్లాలో 16వేల ఎకరాలను విదేశి కంపెనీల పరం చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, అందుకోసం సెజ్ ప్రాంతంలో పాదయాత్ర చేద్దామని విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాంబాబు పేర్కొన్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపోందించాలని ప్రకాశం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రామానాయుడు సూచించారు. బూత్‌లెవల్ నుంచి పార్టీని కార్యక్రమాలను యువజన విభాగం పర్యావేక్షిస్తు ఉండాలే ప్రణాళికలను రూపోందించాలని కడప యువజన విభాగం జిల్లా అ«ధ్యక్షుడు రాజశేఖర్ పేర్కొన్నారు. భారీ బైక్ ర్యాలీ.. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా తిరుపతికి వస్తున్న జక్కంపూడి రాజాకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. కరకంబాడి నుంచి లీలామహాల్ సుబ్బలక్ష్మి సర్కిల్ మీదుగా ఉదయ్ ఇంటర్నేషన్ హోటల్ వరకు వందలాది బైక్‌లతో ర్యాలీ జరిగింది. ఈ సదస్సులో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మురళీ, కృష్ణచైతన్యయాదవ్, కిషోర్, లక్ష్మిపతి, ఇమామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
స్నేహమేరా జీవితం
‘‘జీవితంలో డబ్బు ముఖ్యం కాదు. స్నేహం అంతకంటే విలువైంది’’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మనీ ఈజ్ హని’. జె.వి. నాయుడు, రోషన్, ఎం.ఆర్, వెంకీ, అభిషేక్, రచనా స్మిత్, రష్మిజా, బాబు పోకల ముఖ్య పాత్రల్లో జనార్ధన్ శివలంకి దర్శకత్వంలో జాలె వాసుదేవనాయుడు నిర్మించారు. జి.వసంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేసి, మరో నిర్మాత రాజ్ కందుకూరికి అందించారు. ట్రైలర్‌ను కల్యాణ్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మంచి కథ తయారు చేసుకున్న తర్వాత నిర్మాత కోసం వెతకడం మొదలుపెట్టా. ఆ టైమ్‌లో మా గురువు వాసుదేవనాయుడుగారు సినిమా చేస్తానని ముందుకొచ్చారు. నా తొమ్మిదేళ్ల కష్టమే ఈ చిత్రం. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించాం’’ అన్నారు. సాయివెంకట్, ఆర్.కె.గౌడ్, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీని అఫ్గాన్‌గా మారుస్తున్న చంద్రబాబు
హామీలను నెరవేర్చలేక పోలీసు పాలన వైఎస్సార్సీపీ సేవాదళ్ చైర్మన్ చెవిరెడ్డి ధ్వజం కడియం : ఆంధ్రప్రదేశ్‌లో పాలన అధోగతిలో సాగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్ , చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని జేగురుపాడులో పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో బుదవారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక వాళ్ళ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో పోలీసులను ముందు పెట్టి పాలన సాగిస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు తన పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను ఆఫ్గాన్ గా మారుస్తున్నారన్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకొనే ధైర్యం లేక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. కొందరు పోలీసు అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు బలవంతంతో పచ్చచొక్కాలు తొడుక్కుని వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వారి స్వార్థం కోసం తప్పుడు కేసులు పెడుతున్నారని, వారి నిర్ణయాలకు పోలీసు అధికారులు బలికాకుండా చూసుకోవాలని హితవుపలికారు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో కాపులను వెంటాడి కేసులు పెడుతున్నారన్నారు. చంద్రబాబును అందలం ఎక్కించిన పాపానికి కాపులు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై ఎన్నిసార్లు కేసులు పెడతారని ప్రశ్నించారు. ప్రజల కోసం పోరా>డే నాయకులు కేసులకు భయపడరని స్పష్టం చేశారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని, కోర్టుద్వారా అవి తప్పుడు కేసులేనని నిరూపిస్తామని చెప్పారు. దమ్మున్న నాయకుడు, పోరాటయోధుడు, పేదల పక్షపాతిగా ఉన్న జగన్ ప్రతి వైస్సార్ సీపీ కార్యకర్తకు అండగా ఉంటారన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, వేగుళ్ళ లీలాకృష్ణ, ముత్తా శశిధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు, యాదల సతీష్‌చంద్ర స్టాలిన్ , విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యుడు సలాం బాబు తదితరులు పాల్గొన్నారు. -
దక్కని హామీ
'అనంత' అధికార పార్టీ నేతలతో సీఎం ప్రత్యేక సమావేశం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌పై ఆలోచిస్తామన్న చంద్రబాబు నేతల మధ్య విభేదాలపై ఫిర్యాదులందితే చర్యలు తప్పవని హెచ్చరిక శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణకు ఆదేశం వచ్చే నెల 2న జిల్లాకు సీఎం...గొల్లపల్లి రిజర్వాయర్‌లో గంగపూజ వరుస కరువులతో అల్లాడిపోతున్న 'అనంత' రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించలేకపోయారు. కష్టకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని గట్టి హామీ ఇవ్వలేకపోయారు. జిల్లా అభివృద్ధి, పార్టీ పరిస్థితుల నేపథ్యంలో 'అనంత' నేతలు శుక్రవారం రాజధానిలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది వర్షాభావంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని పలువురు నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన.. ‘రెయిన్గన్లతో ఎండిన ప్రతి ఎకరాకు నీరిచ్చాం కదా?! కాపాడామని ప్రభుత్వం తరఫున ప్రకటన కూడా చేశాం. మీరు కూడా 'థ్యాంక్యూ సీఎం' అని కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు పంట నష్టపరిహారం అంటే.. రెయిన్గన్లు విఫలమయ్యాయని ప్రభుత్వమే అంగీకరించినట్లవుతుంది కదా?!’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ రెయిన్గన్ల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేదని, అధికారులు తప్పుడు లెక్కలతో మభ్యపెట్టారని, సీఎంగా మీరు నాలుగురోజులు 'అనంత'లోనే మకాం వేయడంతో పంటలను కాపాడామని తాము కూడా మాట్లాడామని, కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని వివరించారు. ఇన్‌పుట్‌సబ్సిడీ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం రెయిన్గన్లను తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం 'అనంత' రైతుల్లో జరుగుతోందని, ఈ క్రమంలో పరిహారం ఇవ్వడమే ఉత్తమమని చెప్పినట్లు తెలిసింది. చివరకు జిల్లాలో ఎంత పంట ఎండింది, ఎంత పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే అంచనాలు సిద్ధం చేయించి నివేదికలు పంపితే ఆలోచిద్దామని సీఎం చెప్పారు. ఇన్సూరెన్స్పైనా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణ : శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో 12 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, దానిపై విచారణ చేయించాలని జిల్లానేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణకు కమిటీ వేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. 12కిలోమీటర్లకు అదనంగా నిధులు కేటాయించి పైపులైన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. అలాగే వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో తలెత్తే ప్రమాదముందని, నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లానేతలు చంద్రబాబును కోరారు. దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తనకు నివేదికను పంపాలని ఆయన సూచించారు. వచ్చే నెల 2న గొల్లపల్లిలో గంగపూజ : 2012లో జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా నీళ్లొచ్చినా, ఇప్పటి వరకూ గొల్లపల్లికి చేరలేదు. అయితే.. డిసెంబర్ 2న గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొదిలి గంగపూజ చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆరోజు గొల్లపల్లికి నీళ్లివ్వడంతో పాటు చెర్లోపల్లి రిజర్వాయర్‌కు ఎప్పటిలోగా నీరిస్తామనే తేదీని కూడా ప్రకటిస్తామని, అందుకు వీలుగా పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో తెలుసుకోవడానికి అధికారులు, ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి ఓ నివేదికను పంపాలని మంత్రులను సీఎం ఆదేశించారు. జిల్లానేతల మధ్య విభేదాలపై సీఎం గట్టిగానే హెచ్చరించారు. పార్టీలో వర్గాలను ప్రోత్సహించడం, ఓ నియోజకవర్గంలో మరో నేత జోక్యం చేసుకోవడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని చెప్పారు. ఒకట్రెండుసార్లు చెప్పి చూస్తామని, అయినా మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశానికి అనంత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి గైర్హాజరయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సీఎంకు కన్పించి సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. -
తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి
నందలూరు: తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని వైఎస్సార్సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆర్అండ్బి బంగ్లా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతూ బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, దీంతో విసిగి పోయిన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఒక్కొక్కరు వైఎస్సార్‌సిపీలోకి వలసలు వస్తున్నారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సేవచేయడమే మార్గంగా ఎన్నుకుని ముందుకు వెళుతున్నారని అన్నారు. రానున్నరోజుల్లో తెలుగుదేశంపార్టీకి డిపాజిట్ కూడా దక్కదని ఆయన జోçస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడప కార్యక్రమంలో ప్రజలనుంచి అపూర్వ స్పందన వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలవద్దకు వెళ్లినపుడు చంద్రబాబునాయుడు గురించి, తెలుగుతమ్ముళ్ళ అరాచకాలగురించి తమకు ఫిర్యాదుచేస్తున్నారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడే నిజమైన నాయకుడని, ప్రజలను మరిచిన ఏ నేత ఎదిగినట్లు చరిత్రలో లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గడికోట వెంకటసుబ్బారెడ్డి, నడివీధి సుధాకర్, సిద్దవరం గోపిరెడ్డి, పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి, గుండు గోపాల్‌రెడ్డి, గీతాల నరసింహారెడ్డి, మల్లికార్జునరెడ్డి, అజీజ్, సుభాన్, మోడపోతుల సుధాకర్, శివారెడ్డి, చల్లా నాగేంద్ర, అరిగెల సౌమిత్రి, విజయ్‌కుమార్, గాదెల శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి
నందలూరు: తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని వైఎస్సార్సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆర్అండ్బి బంగ్లా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతూ బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, దీంతో విసిగి పోయిన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఒక్కొక్కరు వైఎస్సార్‌సిపీలోకి వలసలు వస్తున్నారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సేవచేయడమే మార్గంగా ఎన్నుకుని ముందుకు వెళుతున్నారని అన్నారు. రానున్నరోజుల్లో తెలుగుదేశంపార్టీకి డిపాజిట్‌కూడా దక్కదని ఆయన జోçస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడప కార్యక్రమంలో ప్రజలనుంచి అపూర్వ స్పందన వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలవద్దకు వెళ్లినపుడు చంద్రబాబునాయుడు గురించి, తెలుగుతమ్ముళ్ళ అరాచకాలగురించి తమకు ఫిర్యాదుచేస్తున్నారన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడే నిజమైన నాయకుడని, ప్రజలను మరిచిన ఏ నేత ఎదిగినట్లు చరిత్రలో లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గడికోట వెంకటసుబ్బారెడ్డి, నడివీధి సుధాకర్, సిద్దవరం గోపిరెడ్డి, పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి, గుండు గోపాల్‌రెడ్డి, గీతాల నరసింహారెడ్డి, మల్లికార్జునరెడ్డి, అజీజ్, సుభాన్, మోడపోతుల సుధాకర్, శివారెడ్డి, చల్లా నాగేంద్ర, అరిగెల సౌమిత్రి, విజయ్‌కుమార్, గాదెల శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
బత్తలపల్లి : పంటనష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోకుండా అబద్ధాలతో మోసపుచ్చుతున్నారని వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం బత్తలపల్లి మండలం పోట్లమర్రిలో ఎండిపోయిన వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు. బాధిత రైతు పెద్దిరెడ్డితో మాట్లాడారు. ‘నేను మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన విత్తనాలే వేశాను. పూతే రాలేదు సార్. ఊడలు దిగే సమయంలో వర్షాలు పడలేదు. పంట ఎండిపోతున్నా రెయిన్గన్లు కూడా ఇవ్వలేదు’ అని రైతు తెలిపాడు. అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వర్షాభావంతో పంటలు ఎండి.. రెయిన్గన్లతో రక్షక తడులు అందక నష్టాలపాలైన రైతులకు ఎకరాకు రూ.20 వేలు ఇన్పుట్ సబ్సిడీ, బీమా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ.170 కోట్లు ఖర్చు పెట్టి రెయిన్గన్లను తీసుకువచ్చి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఇంటిలో భద్రపరుచుకుంటే రైతులు పంటలను ఎలా కాపాడుకుంటారని ప్రశ్నించారు. రైతులను ఆదుకోకపోతే కంచుకోటగా ఉన్న ‘అనంత’లో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వేరుశనగకు ఫసల్ బీమా వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు అక్కిం నరసింహులు, మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వెంగళరెడ్డి, సర్పంచులు సూర్యనారాయణరెడ్డి, సంజీవు, కాశప్ప, జయచంద్రారెడ్డి, జయరామిరెడ్డి, చల్లా క్రిష్టా, ముసలయ్య, పరేష్, లింగారెడ్డి, కప్పల నారాయణస్వామి, ప్రసాద్‌రెడ్డి, పాళ్యం అప్పస్వామి, పామాల నాగభూషణ, బాల ఈరప్పగారి అప్పస్వామి, తప్పెట పెద్దన్న, టీసీ కాటమయ్య, పోట్లమర్రి హనుమంతరెడ్డి, వెంకటరెడ్డి, సుధాకరరెడ్డి, కమతం ఆంజనేయులు, ధర్మవరం మండల నాయకులు పాల్గొన్నారు. -
ప్రజల యోగక్షేమాలు చూసేది ఎల్ఐసీ ఒక్కటే
ఆదికవి నన్నయ్యయూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు ముగిసిన ఎల్ఐసీ బీమా వారోత్సవాలు ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ప్రజలు యోగక్షేమాలు చూసేది భారతీయ జీవితబీమాసంస్థ(ఎల్ఐసీ) ఒక్కటేనని ఆదికవి నన్నయ్య యూనవర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఎల్ఐసీ డైమండ్‌జూబ్లీ బీమా వారోత్సవాలు ముగింపు వేడుకలు స్థానిక సూర్య గార్డెన్స్‌లో బుధవారం సాయంత్రం సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు అధ్యక్షతనజరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రైవేటు సెక్టార్ల కంటే ప్రభుత్వ సెక్టార్లు మంచిసేవలు అందిస్తున్నాయన్నారు. ఎల్ఐసీ సేవాకార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు మాట్లాడుతూ 60 ఏళ్ల కాలంలో ఎల్ఐసీ సాధించిన ప్రగతిని వివరించారు. మార్కెటింగ్ మేనేజర్ ఈఏ విశ్వరూప్, సీఆర్ఎం డిప్యూటి మేనేజర్ కె.కేశవరావు మాట్లాడుతూ బీమా వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. యూనియన్ నాయకులు ఎస్.గన్నియ్య ఎల్ఐసీ ద్వారా అందిస్తున్న స్కాలర్ షిప్పులు అందుకున్న విద్యార్థులను పరిచయం చేసి వారికి బహమతులను అందజేశారు. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, ఎల్ఐసీ ఉద్యోగులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ఉద్యోగులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎల్ఐసీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు,ఏజెంట్లు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రజల యోగక్షేమాలు చూసేది ఎల్ఐసీ ఒక్కటే
ఆదికవి నన్నయ్యయూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు ముగిసిన ఎల్ఐసీ బీమా వారోత్సవాలు ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ప్రజలు యోగక్షేమాలు చూసేది భారతీయ జీవితబీమాసంస్థ(ఎల్ఐసీ) ఒక్కటేనని ఆదికవి నన్నయ్య యూనవర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఎల్ఐసీ డైమండ్‌జూబ్లీ బీమా వారోత్సవాలు ముగింపు వేడుకలు స్థానిక సూర్య గార్డెన్స్‌లో బుధవారం సాయంత్రం సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు అధ్యక్షతనజరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రైవేటు సెక్టార్ల కంటే ప్రభుత్వ సెక్టార్లు మంచిసేవలు అందిస్తున్నాయన్నారు. ఎల్ఐసీ సేవాకార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు మాట్లాడుతూ 60 ఏళ్ల కాలంలో ఎల్ఐసీ సాధించిన ప్రగతిని వివరించారు. మార్కెటింగ్ మేనేజర్ ఈఏ విశ్వరూప్, సీఆర్ఎం డిప్యూటి మేనేజర్ కె.కేశవరావు మాట్లాడుతూ బీమా వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. యూనియన్ నాయకులు ఎస్.గన్నియ్య ఎల్ఐసీ ద్వారా అందిస్తున్న స్కాలర్ షిప్పులు అందుకున్న విద్యార్థులను పరిచయం చేసి వారికి బహమతులను అందజేశారు. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, ఎల్ఐసీ ఉద్యోగులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ఉద్యోగులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎల్ఐసీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు,ఏజెంట్లు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
ర్యాంకుల జాబితాలో చంద్రబాబుకు షాక్
-
లక్షన్నర చేస్తామని చెప్పాం, ఆ విధంగా మాఫీ చేశాం
-
రైతులకు సమగ్ర పంటల భీమా పథకం
-
హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపింది నేనే..
-
'ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర'
-
బాబు పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది..
-
108 డ్రైవర్‌కు వేధింపులు.. ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం: వేధింపులు తాళలేక 108 వాహన డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో 108 వాహన డ్రైవర్‌గా గొట్టాపు అన్నం నాయుడు(38) పని చేస్తున్నాడు. సెలవు ఇవ్వకుండా సూపర్వైజర్ మన్మథరావు వేధింపులకు గురిచేస్తుండటంతో నాయుడు ఆదివారం ఎండ్రిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం నాయుడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నితీశ్‌ను చూసైనా నేర్చుకోండి
సీఎంకు వాసిరెడ్డి పద్మ సూచన సాక్షి, హైదరాబాద్: బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీవల్ల ఏమీ ప్రయోజనం లేదంటూ తమకు ప్రత్యేక హోదానే కావాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ డిమాండ్ చేస్తుంటే మన రాష్ట్రంలో చంద్రబాబు మాత్రం ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీ ఇచ్చినా చాలంటూ ప్రాధేయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. నితీష్‌ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని సూచించింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం సాధారణంగా రాష్ట్రాల్లో అమలు చేసే పథకాల ఖర్చు చేసే మొత్తాలు కాకుండా బీహార్‌కు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో అదనంగా చూపించింది కేవలం రూ.5000 కోట్లకు మించి లేదని గణాంకాలతో నితీష్‌కుమార్ వివరించారని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు మాత్రం విభజన తరువాత రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కాదని, కేంద్రం ప్యాకేజీతో సరిపెట్టాలని చూస్తుంటే సరేనంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఏదో ఇస్తున్నట్టు, ఈయనేదో మోసుకొస్తున్నట్టు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్పటి ప్రధాని ఇచ్చిన హామీతో రాష్ట్రం రెండు ముక్కలయినా ఏపీకి హోదావల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం పెట్టుకున్న ప్రజలు గుండెలు ఇప్పుడు ఆగిపోతున్నాయన్నారు. హోదా లేని రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చిన దాఖలాలు లేవు ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాలకు తప్ప దేశంలో ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీల పేరుతో ప్యాకేజీ ఇచ్చిన దాఖలాలు లేవని పద్మ తెలిపారు. ఇప్పటివరకు హోదా దక్కిన 11 రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం రాయితీలు కల్పించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో శనివారం నిర్వహించిన తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. చంద్రబాబు తన వంతుగా బంద్‌ను విజయవంతం చేసి, ప్రజల ఆలోచనలను కేంద్రానికి వివరించడం ద్వారా మన రాష్ట్ర హక్కును సాధించాలని పద్మ సూచించారు. -
రేపు ఢీల్లీకి చంద్రబాబు
-
పిడుగు కాటు
డిగ్రీ విద్యార్థి దుర్మరణం పొలం పనులు చేస్తుండగా దుర్ఘటన దేవరాపల్లి: పిడుగు పాటుకు విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం మండల కేంద్రం దేవరాపల్లి కొరుపోలు వారి కల్లాలు వద్ద చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొరుపోలు సింహాచలం నాయుడు (21) వర్షం కురుస్తున్నప్పటికీ వరినాట్లుకు అనుకూలంగా పారపని చేస్తున్నాడు. అకస్మాత్తుగా పిడుగు నేరుగా అతనిపై పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇతడు ప్రస్తుతం బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రామ్మూర్తి రెండేళ్లు క్రితం చనిపోవడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. ఇతనికి తల్లి దేముడమ్మ ఉంది. ఇప్పుడామె ఒంటరిదయింది. దేవరాపల్లిలో విషాదం అందరితో కలిసి మెలిసి ఉండే సింహాచలం నాయుడు పిడుగు పాటుకు మరణించాడని తెలియడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అతని మృతదేహాన్ని చూసేందుకు పీహెచ్‌సీకి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. తల్లి దేముడమ్మ, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. పోస్టుమార్టానికి మృతదేహాన్ని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దేవరాపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు. -
ప్రతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు..
న్యూఢిల్లీ : ప్రతి విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని, అయితే ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఆయా రాష్ట్రాలు కోరితేనే పరిశీలిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ అన్ని విషయాల్లో కేంద్రం కల్పించుకోదని చెప్పారు. స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీల ఎంపికలో ఎటువంటి రాజకీయం లేదన్నారు. స్మార్ట్ సిటీలు, నగరాల అభివృద్ధి, అందరికీ ఇళ్లు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభిస్తారన్నారు. 40 క్రితం ఎమర్జెన్సీ తన జీవిత గమనాన్ని మార్చేసిందని వెంకయ్య అన్నారు. ఆనాటి ఆరాచకాలను యువతకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
హామీలు గాలికొదిలిన చంద్రబాబు
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ కొత్తచెరువు : రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు..విదేశీ మోజుతో విమానాలను బాడుగలకు తీసుకుని తిరుగుతున్న దగాకోరుకు రైతుల కష్టాలేం కనబడతాయని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకర్‌నారాయణ విమర్శించారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో శంకర్‌నారాయణ మాట్లాడారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ ఇంటర్నెట్లో కాగితాలకే పరిమితమైందన్నారు. ఇప్పటి వరకు కొత్తరుణాలు కానీ, రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు. ఉపాధి కరువై పొట్ట నింపుకోవడానికి బెంగుళూరుకు వలసలు పోయే దుస్థితి ఏర్పడిందన్నారు. రైతులు పంటల సాగు కోసం అప్పులు చేసి, అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం పనీపాట లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రైతులు, చేనేత కార్మికుల సమస్యలపై అసెంబ్లీ గట్టిగా పోరాడుతున్నారని తెలిపారు. కరువుతో అల్లాడుతున్న జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హంద్రీ నీవా ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు తెప్పించేందుకు అప్పట్లో రూ.5,800 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఆయన చేపట్టిన పనులను ప్రస్తుత టీడీపీ నేతలు తామే చేసి నీరు తెప్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పార్టీ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి కొత్తకోట సోమశేఖర్‌రెడ్డి ప్రసంగించారు. పార్టీ మండల కన్వీనర్ నారేపల్లి జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ మాణిక్యం బాబా, మాజీ సర్పంచ్ లోచర్ల రాజారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, రెడ్డప్పరెడ్డి, గూడూరు శ్రీనివాసులు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వాల్మీకి శంకర్, ఉపసర్పంచ్ వెంకటరాముడు, నేతలు అలివేలమ్మ, సంజీవరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి,మాణిక్యం షౌకత్ అలీ, యల్లప్ప పాల్గొన్నారు. -
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కష్టమే..
ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడవద్దని టీడీపీకి చెప్పా విజయవాడలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి కేటాయింపులు కష్టం సాక్షి, విజయవాడ బ్యూరో/మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పరోక్షంగా తేల్చి చెప్పారు. శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఒక హోటల్లో జరిగిన ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో నాకు తెలుసు. కానీ కేంద్రంలోనూ అనేక ఆర్థిక సవాళ్లున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అనేక రకాల ఇబ్బందులున్నాయి. అందుకే బిల్లు పెట్టేటప్పుడు వీటిన్నింటినీ ప్రణాళికా సంఘం సమావేశంలో పెట్టి ఆ తర్వాత పార్లమెంటుకు తీసుకురావాలని యూపీఏ ప్రభుత్వానికి చెప్పా. వారు వినలేదు. ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడవద్దని టీడీపీ వారికి కూడా చెప్పాను’’ అని తెలిపారు. కేంద్రంలో కూడా ఆర్థిక సవాళ్లు ఉన్నాయని, కేంద్ర బడ్జెట్లో నుంచి ఏపీకి డబ్బు ఇవ్వడం కష్టమని స్పష్టం చేశారు. కొత్త రాజధానిలో రాజ్‌భవన్‌తో పాటు సచివాలయం, శాసనసభ, డ్రెయినేజీ, తాగునీటి సరఫరా, రింగురోడ్లు, మెట్రో రైలు ప్రాజెక్టు వంటి వాటికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి ఆయా మంత్రిత్వ శాఖలకు పంపితే.. ఆయా కేంద్ర విభాగాల ద్వారా బడ్జెట్లో కేటాయింపులు చేస్తారని ఏపీకి ఇచ్చే సాయంపై స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి రాయితీలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నామన్నారు.భూసేకరణ సమస్య వల్ల పరిశ్రమల స్థాపన ఆగిపోయిందని అందుకే ఆ చట్టంలో మార్పులు చేశామని చెప్పారు. కమ్యూనిజం వైఫల్యమైందనేందుకు రష్యా, చైనాలే ఉదాహరణలన్నారు. మిస్టరీగా మహనీయుల మరణాలు.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కొంతమంది మహనీయులు అనుమానాస్పద స్థితిలో మరణించారని వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణానదీ తీరంలో నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఇచ్చిన స్థలంలో డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు భవనానికి వెంకయ్య భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్య్రోదమంలో పోరాడిన సుభాష్ చంద్రబోస్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి వంటివారి మరణాలు మిస్టరీగా మారాయన్నారు. అనంతరం కృష్ణాజిల్లా ఆత్కూరు గ్రామంలో స్వర్ణభారత్ ట్రస్టు విజయవాడ చాప్టర్ భవన నిర్మాణానికి వెంకయ్యనాయుడు భూమి పూజ చేశారు. భవిష్యత్తులో తెలంగాణ , హైదరాబాద్‌లోనూ ట్రస్టు శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. అంతర్జాతీయ మెడికల్ హబ్‌గా ఏపీ అంతర్జాతీయ పర్యాటక మెడికల్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరముందని వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల పదో వార్షికోత్సవం, అంతర్జాతీయ పీఎంఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య, వైద్యం అందించేందుకు నేటి యువత పరిశోధనారంగంపై దృష్టి సారించాలన్నారు. రాజధాని రైతులకు అవమానం శ్యామ్ ముఖర్జీ ట్రస్టు భూమి పూజ సమయంలో రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి రైతులకు అవమానం జరిగింది. వెంకయ్యనాయుడిని కలవడానికి వచ్చిన సుమారు 50 మంది రైతులను ఆ కార్యక్రమం ప్రారంభానికి ముందు తాడేపల్లి సీఐ సీహెచ్ కోటేశ్వరరావు అక్కడ నుంచి బలవంతంగా పంపించివేశారు. వెళ్లకపోతే రౌడీషీట్లు తెరుస్తామని రైతులను హెచ్చరించారు. దీంతో భయపడ్డ రైతులు సభాస్థలిని వదిలి వెళ్లిపోయారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము కేంద్ర మంత్రిని కలసి తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించేందుకు వచ్చామని, గొడవ చేయడానికి కాదని వివరించారు. తాము విజ్ఞాపన పత్రం అందజేయాలని భావిస్తే సీఐ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తుళ్లూరు ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు పండే జరీబు భూములకు అదనంగా ప్యాకేజీ పెంచాలని ఆ గ్రామానికి చెందిన బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిశోర్, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని సత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తొండపు రామశివగుప్తా, ఇతర రైతులు కేంద్ర మంత్రి వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. -
నేడు దావోస్‌కు సీఎం బాబు
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు మంగళవారం నుంచి 5 రోజుల పాటు విదే శీ పర్యటనకు వెళ్తున్నారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. తిరిగి ఈ నెల 25న హైదరాబాద్ చేరుకుంటారు. మంగళవారం ఉదయం 4.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా మధ్యాహ్నం 12.20కి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ చేరుకుంటారు. ఇక్కడ జరిగే ఒక సమావేశంలో పాల్గొని.. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. రాత్రి ఏడున్నర నుంచి 8 గంటల వరకు ఫోరం సమావేశంలో భాగంగా జరిగే స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. ఫోరం సమావేశాల్లో పట్టణాభివృద్ధి భవితవ్యం అనే అంశంపై జరిగే సదస్సులో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సీఎం బృందంలో.. సీఎం వెంట వెళ్లే ప్రతినిధి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కంభంపాటి తదితరులు ఉన్నారు. 27 న మంత్రిమండలి భేటీ దావోస్ నుంచి సీఎం చంద్రబాబు తిరిగి వచ్చాక ఈ నెల 27న మంత్రిమండలి భేటీకానుంది. -
చంద్రబాబు రైతు ద్రోహి
అనంతపురం అగ్రికల్చర్: రైతుల చేతికి పైసా ఇవ్వకుండా రుణమాఫీతో మాయాజాలం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరకు రైతుద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటచౌదరి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విజన్ 2029 పేరుతో నవ్యాంధ్ర చేస్తానని, సింగపూర్‌ను తలపించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబునాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు లేక, పంటలు పండక, ఇన్పుట్, ఇన్సూరెన్స్ అందక, రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు తీసుకోలేక... ఒకటేమిటి చంద్రబాబు హామీలు నమ్మి రైతులు దారుణంగా మోసపోయారన్నారు. వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు చివరకు పంట రుణాలు, బంగారు రుణాలు రూ.లక్షన్నర వరకు మాఫీ చేస్తానని నమ్మబలికారన్నారు. కానీ... అధికారం చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా రుణమాఫీ అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. జిల్లాలో రూ.4,944 కోట్లు మేర పంట, బంగారు రుణాలు ఉంటే అందులో తొలివిడతగా కేవలం రూ.780 కోట్లు మాఫీలోకి చేర్చడంతో రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మిగతా రైతుల రుణాలు ఎలా మాఫీ చేస్తారో తక్కిన అప్పులు ఎలా రద్దు చేస్తారో చంద్రబాబుకే అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. చేసిన మాఫీ చివరకు వడ్డీకి కూడా సరిపోయే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయం, పాడి, పండ్లతోటలకు సంబంధించిన పథకాలు పూర్తీగా పడకేశాయన్నా రు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాతనే 50 మంది దాకా రైతులు బలన్మర ణం చెందారని, వారి కు టుంబాలు అనాథలుగా మారిపోయాయన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాం కుల్లో ఉన్న బంగారు రుణాలు వేలం వేయడానికి బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు చాలా బ్యాంకుల్లో బంగారు వేలాలు ఉన్నాయన్నారు. వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అడ్డుకుంటుందని హెచ్చరించారు. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయాన్ని రైతుపక్షపాతిగా గట్టెక్కించిన ఘతన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు, పథకాలు అమలు చేసి అన్నదాత ఇంట సంతోషం నింపారన్నారు. సమావేశంలో రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, పార్టీ యూత్ నగర కమిటీ అధ్యక్షుడు మారుతీనాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు, రైతు ద్రోహి, కె.వెంకటచౌదరి, Naidu, a farmer mole, k venkatachaudari -
ఒంగోలు గిత్త
గుండ్లకమ్మ... దేవరంపాడు చెక్‌డ్యామ్ క్రీ.శ.1878 శ్రీరాములునాయుడు ఒంగోలు పక్కన మామిడిపాలెం మునసబు. చెన్నపట్నం నుంచి ఒంగోలు స్టేషన్ దాకా రైలుబండి నడుస్తుంది. ఉత్తరాన పదిమైళ్ల దూరంలో గుండ్లకమ్మపై రైలువంతెన నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయితే ఒక్క రోజులో పొగబండి మీద బెజవాడకి పోవచ్చు. విన్సెంట్ పుణ్యమా అని ఎడ్లబండిలో కాకుండా రైలుపట్టాల మీద ట్రాలీలో రావడం వల్ల పని చూసుకొని సాయంత్రానికి ఇల్లు చేరొచ్చు. ‘అయ్యగారూ... చీకటి పడేలోగా ఒంగోలు పోవాల. ట్రాలీ నాలుగింటికల్లా బయలు దేరకపోతే మా స్టేషన్ మాస్టర్ ఊరుకోడు’ అన్నాడు విన్సెంట్. ‘సరేలేరా. రాముడిని చూసుకొని అట్లాగే వచ్చేస్తా’ అని కేకేసి రంగయ్య వైపు నడవసాగాడు. ‘అదేందయ్యా? రేపు జాతరకి ఉండట్లా’ అడిగాడు వెనకగా నడుస్తున్న పాలేరు కోటిగాడు. ‘లేదురా. రాత్రికి ఇంటికి పోవాల. నువ్వుగూడా పద’ ‘అయ్యా. నీవు కూకలేయనంటే ఒక మాట’ తుండు విదిలించి తల గోక్కుంటూ నసిగాడు. చెప్పకుండానే కారణం గ్రహించాడు నాయుడు. ‘ఏందిరా. మతంగానీ మార్చుకుంటున్నావా’ తలూపాడు కోటిగాడు. దూరం నుండే చేయూపి ఎదురొచ్చాడు పాస్టర్ రంగయ్య. అతడు నాయుడికి మేనమామ కొడుకు. నెల్లూరు చర్చీబళ్లలో అప్ఫోర్తు చదివాడు. పదేళ్ల క్రితం జ్యూయెట్ అమ్మ మతమిచ్చింది. ప్యాంటూ చొక్కాతో అచ్చం దొరల్లే ఉన్నాడు. గత ఆరేళ్లుగా దేశాన్ని కరువు రక్కసి పీడిస్తోంది. బాధితులని ఆదుకునేందుకు పనికి ఆహార పథకం కింది క్లోవ్ దొరకి సర్కారు కాలవ కాంట్రాక్టు వచ్చింది. ఆ పనంతా రంగయ్య మీదే. ‘ఏంది ఇలా వచ్చావ్ బావా? రాముడిని చూట్టానికా లేకపోతే...నా మాట విని మతంగానీ పుచ్చుకుంటున్నావేంది?’ అడిగాడు రంగయ్య. ‘నా సంగతి సరేగానీ రేపు ఏంది హడావుడి?’ ‘పద ఆ పక్కకి పోయి మాట్లాడుదాం’ అని వేపచెట్టు కిందున్న గుడారంలోకి దారి తీసాడు రంగయ్య. బల్ల, రెండు కుర్చీలు, విశ్రాంతికి మడతమంచం. బల్ల మీద రెమింగ్టన్ టైప్మిషను. కాగితాల దొంతర. అది క్లోవ్ దొర ఆఫీసు. నిలువు గుంజకి తగిలించిన శిలువా, ఈతచాప, ఆయన ప్రార్థనా మందిరం. గత ఐదేళ్లుగా బాధితుల మధ్యనే క్లోవ్‌దొర జీవనం. చలువకుండలో మంచినీళ్లు ఎత్తి నోట్లో పోసుకుంటూ కావాలా అని సైగ చేశాడు రంగయ్య. దాంతో నాలుక పిడచ కట్టుకుపోతున్నా ‘వద్దులే’ అన్నాడు నాయుడు. ‘నీవేమీ మారలేదు బావా. పరవాలేదులే ఇవి నా కోసం ఏటి నుండి తెప్పించినవే’ అని నీళ్లందించాడు రంగయ్య. చెంబు అందుకుని తాగకుండా పక్కన పెట్టాడు. ‘ఏముంది. ఆరేళ్లు గడిచినా కరువు తీరే ఆశ లేదు. ఇప్పుడు కాలవ పనిలో ఆరువేలకి పైచిలుకే ఉన్నారు. నిన్నటికి నిన్న పాతికమంది పడమటోళ్లు దిగారు. బొత్తిగా ఎముకల గూళ్లు. కాలవ పనా... పూర్తిగావచ్చింది. సర్కారు సహాయం కూడా ఇక రాదు. ఆయినా అదెంత. మనిషికి పౌను ధాన్యం, అణా బత్యం. అదీ మగాళ్లకే. ఆడాళ్లకీ పిల్లలకీ అర్ధణా మాత్రమే. పిల్లా మేకా తిండానికి ఏంది? అమెరికాలో క్రైస్తవులని దేహీ అని వాళ్లిచ్చిన చందాలతో నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు సర్కారు కాంట్రాక్టు లేకపోతే వీళ్లకి గంజికి కూడా దిక్కుండదు’ వింటున్న నాయుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘మరెలారా’ బొంగురుపోయిన గొంతుతో అడిగాడు. ‘మన క్లోవ్‌దొర సంఘం పేరు అమెరికన్ బాప్టిస్ట్ మిషన్. నీకు తెలుసుగా? అమెరికాకి ఫొటోలూ పాంప్లెట్లూ ఎన్ని పంపించినా మన బాధలు వాళ్లకెలా పట్టేట్టు? మత ప్రచారం అంటే అక్కడి దొరలకికాస్తా ఆసక్తి. కానీ ఒకటీ అరాతో లాభం లేదు. ఏదైనా బ్రహ్మాండమైన పని చేస్తేగానీ అక్కడ పత్రికలలో రాయరు. అలాగైతేనే ఒంగోలు మిషన్కి చందాలు తెచ్చుకోవడానికి వీలవుతుంది అని క్లోవ్‌దొర వాదం’ ‘బ్రహ్మాండమా.. అంటే’ ‘ఏమీ లేదు. మద్రాస్ నుండి అమెరికా పత్రికల వాళ్లు వస్తున్నారు. వారి ముందు సామూహికంగా రెండు వేల మందికి గుండ్లకమ్మలో దివ్యస్నానం ఇచ్చి మతం మారిస్తే ఇక చూస్కో. అమెరికాలో ఒంగోలు మిషన్ పేరు దద్దరిల్లుద్ది. దాంతో పదివేల మందికి మరో పదేళ్లు అన్నం పెట్టొచ్చు. సర్కారు కాంట్రాక్టు లేకపోయినా ఒంగోలులో ఆసుపత్రి, చర్చీ, స్కూలు కట్టించి జనాలకి పని కల్పించవచ్చు. ఏమంటావ్ బావా’ ‘ఆహ్’ అని బిత్తరపోయి చెంబులో నీళ్లు గడగడా తాగేశాడు నాయుడు. ఏటి ఒడ్డున డచ్చి ఫారం. ‘రాముడికి చూసి చాలా దినాలయింది. నన్ను చూడందే వాడు పచ్చిగడ్డయినా ముట్టేవాడు కాదు. ఎలా ఉన్నాడో? వెంట తీసుకుపోదామంటే ఊళ్లో పాటిదబ్బల మీద కూడా గడ్డి మొదలవడం లేదు’ అన్నాడు శ్రీరాములు నాయుడు. ‘కర్మయ్యా. కానీ ఈడ పర్లేదయ్యా. ఆవుల దొర మనోడిని కన్నబిడ్డల్లే చూసుకుంటుండాడు’ ‘అవున్రా. ఆ దొరే లేకుంటే ఊళ్లలో ఈ మాత్రం పాడి కూడా మిగిలేది గాదు’ ‘అయ్యా! మరోమాట. రంగయ్యన్న చెబుతా... అదేదో నెట్టల (సౌతాఫ్రికాలో న్యేటల్) దేశమంట. నెలకి పది రూపాయల జీతమంట. ఎటు చూసినా నీళ్లు, చెరుకు తోటలంట. చెన్నపట్నంలో ఓడెక్కితే ఇక అంతా వాళ్లే చూసుకుంటారంట. నేనూ నా ఆడదీ’.. ఒక క్షణం తటపటాయించి ‘అయ్యా నీ అనుమతి అయితేనే’ అని దీనంగా ముఖం పెట్టాడు. ‘ఆరినీ... నీవట్లా దేశాలు పట్టి పోతే ఇంట్లో నీ ముసిలాళ్లకి ఎవరు చూస్తార్రా’ గదిమాడు. ‘దానికి ముందస్తుగానే మణిషికి ముప్పై రూపాయలు ఈడనే ఇస్తారంటయ్యా. ముసలోళ్లకెంతయ్యా? రోజుకి అర్దణా కర్సు. నాలుగేళ్లు తిండికి ఇబ్బంది లేదు. కావస్తే ఒక పది రూపాయలు పారేసి రెండెకరాలు కొనుక్కొని యవసాయం చేయొచ్చు’ ‘హూ... ముప్పై రూపాయలు. ఇద్దరికి అరవై. అంటే దాదాపు వెయ్యి అణాలు. నాలుగైదేళ్లు తిండికి ఢోకాలేదు. అన్నాళ్లు బతికుంటే సేద్యమే చేస్తారులే’ వేళ్లపై గుణించుకుంటూ ముందుకు సాగాడు. ఫారం ఇంకా ఫర్లాంగ్ దూరంలో ఉండగానే యజమానిని ఎలా పసిగట్టాడో కంచె దూకి ఉరుకుతూ ఎదురొచ్చాడు రాముడు. మూపురం వద్దకు ఎనిమిదడుగుల ఎత్తు, మచ్చలేని తెల్లని ఒంగోలు గిత్త. రాముడి మెడపై ముఖం ఆనించిన శ్రీరాములు నాయుడికి కళ్లలో నీళ్లూరాయి. రాముడి ఉరుకు చూసి వెంటబడి పరిగెత్తుకు వచ్చాడు పశువుల డాక్టరు వోన్‌ట్రోప్ దొర. అతడి వెనుకనే ఫాదర్ క్లోవ్. ‘నాయుడు గారూ. మన్చీ టైమ్‌కి వచ్చినారూ. రేపు పేద్ద పండగ వున్దీ. పెద్దలూ మీరూ ఉండావలె’ అన్నాడు ఫాదర్ క్లోవ్. ‘అవును. రంగయ్య చెప్పాడు. మీరు చేస్తున్న పనికి మేమూ మా ఊరూ ఎప్పుడూ ఋణపడి ఉంటాం. కానీ నాకు వెళ్లక తప్పదు’ రాముడి గంగడోలు నిమురుతూ అన్నాడు. ‘సరే యువర్ విష్. మీకూ ఒక్క విషయమూ చెప్పావలె. డాక్టర్ వోన్‌ట్రోప్ వచ్చే నెల రోటర్‌డ్యాం పోతూనారు. ఇక్డ నున్చి కొన్ని మంచి స్పెసిమెన్స్ వాల్లతో తీస్కుపోతారు. మీ రామ్‌డూ మంచీ సీడ్బుల్. వాల్లతో తీస్కుపోతాన్కి మీ పర్మిషన్ కోరినారు. బట్ రామ్‌డూ మీకూ కొడుకూ లాన్టీవాడు. అన్దూకే నో అని చెప్పాను’ అన్నాడు ఫాదర్ క్లోవ్. ట్రాలీలో బెంచీ మీద కూర్చున్న నాయుడికి దుఃఖం ఆగడం లేదు. రైలు పట్టాలపై పరిగెత్తుతూ ట్రాలీని తోసి గెంతి పక్కన చేరాడు విన్సెంట్. ‘ఊరుకోండి అయ్యగారూ... ఇంకెన్నాళ్లు? ఈ యేడు కాస్త వానలు కురిస్తే రాముడిని ఇంటికి తీసుకురావచ్చు’ అన్నాడు సముదాయింపుగా. ‘ఇంకెక్కడి రాముడురా... వెంకడూ. వంద రూపాయలకి నా కొడుకుని అమ్ముకున్నాన్రా’ అంటూ కండువాలో ముఖం దాచుకున్నాడు శ్రీరాములు నాయుడు. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
మరుగుదొడ్డి మహిళల ఆత్మగౌరవం
‘స్వచ్ఛ సత్తెనపల్లి’లో ఏపీ సీఎం చంద్రబాబు అభివర్ణన సాక్షి, గుంటూరు: ‘‘మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. మరుగుదొడ్డికి ఆత్మగౌరవం అనే పేరు పెడుతున్నాను. ప్రతి ఒక్కరు ఆత్మగౌరవం కాపాడుకోవాలి’’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లాలోని తన నియోజకవర్గం సత్తెనపల్లిలో 20 వేల మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయగా.. సీఎం బుధవారం వాటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ సత్తెనపల్లి కార్యక్రమంలో భాగంగా ఆయన కంకణాలపల్లి, ఇరుకుపాలెం, సత్తెనపల్లి బహిరంగసభల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. స్పీకర్ కోడెల ఆత్మగౌరవ చాంపియన్ అంటూ.. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో రాష్ట్రంలో సేవా కార్యక్రమంగా మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పర్యవేక్షిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాలను ఉద్యమ స్ఫూర్తిగా చేపట్టాలని పిలుపునిచ్చారు.త్వరలో పింఛన్లను డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఇంకా 63 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలి.. తరతరాల మరుగుదొడ్ల సమస్యకు నేడు పరి ష్కారం దొరికిందని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. స్వచ్ఛ సత్తెనపల్లి తరహాలో రాష్ట్రమంతా ఉద్యమంలా మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామన్నారు. 13 జిల్లాల్లో ప్రతి ఇంటికీ టాయిలెట్ నిర్మించాలంటే ఇంకా 63 లక్షలు నిర్మించాల్సి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు కుమార్తె లక్ష్మి రూ. 2.35 లక్షలు, నల్లపాటి చిన్నబ్బి రూ. 3.5 లక్షలు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి విరాళం ప్రకటించారు. స్వచ్ఛభారత్ పోస్టర్‌ను యునిసెఫ్ ప్రతినిధి ముఖ్యమంత్రిచే ఆవిష్కరించారు. -
‘మతమార్పిడి’పై పట్టువీడని ప్రతిపక్షం
ఉభయ సభలను అడ్డుకున్న విపక్షాలు న్యూఢిల్లీ: మత మార్పిడుల అంశంపై సోమవారం రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించగా.. లోక్‌సభలో ప్రకంపనలు సృష్టించింది. మత మార్పిడుల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని, వాటితో ప్రభుత్వానికి, బీజేపీకి సంబంధం లేదని ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన సమాధానం విపక్షాలను తృప్తి పర్చలేదు. గత వారపు తమ నిరసనను కొనసాగిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభలో సోమవారం ఉదయమే ఈ అంశాన్ని లేవనెత్తాయి. దానికితోడు బీజేపీ ఎన్నికల హామీలైన నల్లధనం వెలికితీత, ఉపాధి కల్పనలపై నినాదాలు చేస్తూ, ‘ప్రధాని జవాబివ్వండి’, ‘పీఎంజీ, నల్లధనం వెనక్కు తెండి’ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్, ఎస్పీ, జేడీయూ, టీఎంసీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ‘నో పీఎం.. నో హౌజ్’ అంటూ కాంగ్రెస్ సభ్యులు జతకలిసి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. చర్చ పూర్తయినందున మరోసారి దీనిపై చర్చ సాధ్యం కాదని అధికారపక్ష నేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రధాని సభకు వచ్చి మతమార్పిడులపై సభ్యుల ఆందోళనలకు సమాధానమివ్వాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలన్న వెంకయ్య అభ్యర్థనను విపక్షం చెవిన పెట్టలేదు. ఉదయం నుంచీ మధ్యాహ్నం 3 గంటల వరకు నాలుగు సార్లు వాయిదా పడిన సభ.. విపక్షాలు శాంతించకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. ఈ వివాదం లోక్‌సభనూ కుదిపేసింది. ప్రధాని జవాబివ్వాలన్న కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, జేడీయూ సభ్యుల నిరసనలు రెండు సార్లు సభ వాయిదాకు కారణమయ్యాయి. మీది గాంధీ పరివార్.. నాది సంఘ్ పరివార్ ఆరెస్సెస్ నేపథ్యం తనకు గర్వకారణమన్న వెంకయ్య ఇటీవలి వ్యాఖ్యలను ఖర్గే గుర్తు చేశారు. దాంతో.. ‘మీకు గాంధీ పరివార్(కుటుంబం) గర్వకారణం. నాకు సంఘ్‌పరివార్ గర్వకారణం’ అని వెంకయ్య వ్యంగ్యంగా బదులిచ్చారు. ‘వెంకయ్య కుర్చీలో స్ప్రింగ్‌లున్నాయేమో, మాటిమాటికీ లేచి నిల్చుని మాట్లాడుతున్నార’న్న ఖర్గే వ్యాఖ్యపై.. ‘మాది క్రియాశీల ప్రభుత్వం. విపక్ష వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకున్నా జవాబిస్తున్నాం’ అని అన్నా రు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు వా కౌట్ చేశాయి. కాగా, ఈ వివాదానికి ముగింపు ఏ విధంగా పలకాలన్న దానిపై మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో బీజేపీ, సంఘ్ కీలక నేతలు సోమవారం సమావేశమై చర్చలు జరిపారు. -
కాపులను మోసగిస్తున్న చంద్రబాబు
హైదరాబాద్: కాపులకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై ఏపీ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు వన్నంపూల నారాయణస్వామి నిప్పులు చెరిగారు. నారాయణస్వామి రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు జిల్లాల కాపు నాయకులు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. కాపులకు ఇచ్చిన హామీ పట్ల చంద్రబాబు వ్వవహరిస్తున్న ఉదాసీన వైఖరి సరికాదన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటుతున్నా బీసీ కమిషన్ నియామకంగాని, బీసీల్లో చేర్చేందుకు అవసరమైన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ సర్వేకుగాను రూ. కోటి కేటాయించకుండా కాపుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి వల్ల అధికారంలోకి వచ్చామో చంద్రబాబు గుర్తెరగాలన్నారు. హామీ మేరకు కాపులకు బీసీ రిజర్వేషన్ అందించాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. హామీలపై సీఎం చంద్రబాబును కలవనున్నట్టు చెప్పారు. -
బహిరంగ చర్చకు సై
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు టీఆర్ఎస్ సవాల్ విసిరింది. గురివింద గింజ లాగా తన తండ్రి పాలనలోని లోపాలను చూడకుండా.. టీఆర్ఎస్పై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. బుధవారం ఇక్కడ తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘టీడీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటే నేను, మా ఎంపీ బూర నర్సయ్య గారు కలసి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పాం. లోకేశ్ టీఆర్స్ పాలనపై ట్విటర్లో ఏదో రాశార ట.. నేను మళ్లీ చెబుతున్నా.. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం. నీకు దమ్మూ, ధైర్యం ఉంటే చర్చకు రా’ అని పేర్కొన్నారు. -
చంద్రబాబు మాటలు నీటి మూటలు
కూడేరు: ఎన్నికల హామీ మేరకు రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయకుండా రోజుకొక ప్రకటనల తో మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలని తేలిందని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయనను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మండల కేంద్రంలో శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన స మావేశమయ్యారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాపై ఎమ్మెల్యే చర్చించారు. మం డలం నుంచి వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, రైతులు, మహిళలు ధర్నాకు తర లి రావాలని పిలుపు నిచ్చారు. అపద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, పింఛన్లు కోల్పోయిన బాధితులు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న డ్వా క్రా మహిళలు, చేనేత కార్మికుల కష్టాలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదన్నారు. ఆయనకు సింగపూర్ ధ్యాస తప్ప ఏమి పట్టడం లేదన్నారు. చంద్రబాబు నిర్వాహకంతో రుణాలు పొందిన రైతులు బ్యాంక్ మెట్లు ఎక్కలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించలేక డిఫాల్ట్‌ర్లు మా రిపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ధర్నాతో ప్రభుత్వం దిగిరావాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, మండల వైఎస్ ఎంపీపీ రాజశేఖర్, సర్పంచ్‌లు రామ్మోహన్, క్రిష్టప్ప, వెంకటేశులు, మండల నాయకులు మాదన్న, తిమ్మారెడ్డి, శశికాంత్ రెడ్డి, మలోబులేసు, రాచనగౌడ్, భాస్కర్‌రెడ్డి, చితంబరం, నారాయణరెడ్డి, శంకర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, ఓబులేసు, మల్లిఖార్జున, గోవింద్, శంకర్ నాయక్, శ్రీనివాసులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దేశంలోనే ప్రథమ మోసగాడు బాబు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చిల్లకూరు : అధికారం కోసం అలవికాని హామీలిచ్చారు. ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నా.. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా దేశంలోనే ప్రథమ మోసగాడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపు పొందారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆ పార్టీ మండల కన్వీనర్ ఎద్దల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల కమిటీల ఎంపిక నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తానని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు. అవసరం ఉన్నప్పుడు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుని, పనయ్యాక దగా చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు మరిచిపోయారని, రాజధానిని సింగపూర్ చేస్తానంటూ రైతుల పొట్ట కొట్టే పనిలో తలమునకలై ఉన్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కాకుండా ఆయన ఏర్పాటు చేసిన కమిటీలు పరిపాలన చేస్తున్నాయన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చడంలో నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తెలుగుగంగ నీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిం దని, చంద్రబాబు ప్రభుత్వం మరో 20 ఏళ్లు వెనక్కు నెట్టే ప్రయత్నాలు చేస్తుందన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ అధికారంలో లేనప్పటికీ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల జోలికి వస్తే ఇతర పార్టీల నాయకుల బండారాలను బయటపెడతామన్నారు. అనంతరం పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
పండక్కి పామాయిల్ హుళక్కేనా?
11 లక్షల కార్డుదారులు ఎదురు చూపు గుడ్లవల్లేరు : సాధారణ రోజుల్లో తిన్నా తినకపోయినా కనీసం పండగ రోజైనా పాయసం తిని పిండి వంటలు చేసుకోవాలనే పేదవాడి ఆశ నిరాశగానే మిగిలిపోతోంది. పేదలతో సహా సాధారణ, మధ్య తరగతి ప్రజానీకం సాదక, బాధకాలను పట్టించుకోని ప్రభుత్వపాలకులు, అధికారుల అలసత్వమే అందుకు కారణభూతమవుతోంది. దసరాకు ఎలాగో లేదు... ఈ దీపావళి పండుగకయినా రేషను దుకాణాల్లో పామాయిల్ సరఫరా చేస్తారనుకుంటే ఆ పరిస్థితులేవీ కనబడడం లేదు. గత దసరా నుంచే పామాయిల్‌ను పంపిణీ చేస్తామని మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఆ విషయాన్నే మరచిపోయింది. ఎన్నికల ముందు అమ్మహస్తం పథకం సమయంలో పామాయిల్‌ను అందుకున్న వినియోగదారులకు మళ్లీ రేషను సరుకుల్లో పామాయిల్ కనబడకుండా పోయింది. అమ్మహస్తం పథక నిర్వహణ సమయంలోనే ఆ సరుకులకు ప్రభుత్వం టెండర్లు పిలిచినపుడు కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో కిరణ్ ప్రభుత్వం జిల్లాలో పామాయిల్ పంపిణీ నిలిపేసింది. చంద్రబాబు సర్కార్ వచ్చాక పామాయిల్‌ను వినియోగదారులు అందుకున్న పాపం లేదు. అమ్మహస్తం పథకం స్థానే వేరే పథకం పేరిట ఏఏ సరుకులు ఇవ్వాలనే విషయంలోప్రభుత్వం తర్జనభర్జన పడుతోందని తెలిసింది. కానీ దసరా నుంచి పామాయిల్ విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఈ దీపావళికి కూడా అందించే టట్లుగా కనబడటం లేదు. పామాయిల్‌పై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకునే లోగా హుదూద్ విలయతాండవంతో ఆ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని సమాచారం. నిర్ణయం తీసుకుని ఏపీలో పామాయిల్ పంపిణీ చేసేందుకు జనవరి వరకూ సమయం పడుతుందని సమాచారం. ఈ విషయమై డీఎస్వో సంధ్యారాణిని వివరణ కోరగా ఎన్నికల ముందు నుంచి పామాయిల్ పంపిణీ నిలిచిపోయిందన్నారు. అమ్మహస్తం సరుకుల స్థానే మార్పు చేసి, ఏఏ సరుకులకు ప్రాధాన్యత ఇచ్చి విడుదల చేస్తారనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపారు. పామాయిల్ పంపిణీపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రాలేదని తేల్చి చెప్పారు. -
నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య!
విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెస్తామంటూ మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం దాదాపుగా చంద్రబాబు రుణమాఫీ నినాదమంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని ఇరకాటంలో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందాలని సోనియా ‘నల్లధనం మాటేమిటి?’ అని నిలదీస్తున్నారు. ‘నల్లధనం మాటేమి టి?’ మహారాష్ట్ర ఎన్నికల సమరంలో సోనియా గాంధీ సంధించిన తాజా అస్త్రం ఇది. ‘విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పించడమే నా ప్రధాన లక్ష్యం’ అంటూ నేటి ప్రధా ని నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానమే ఆయన గెలుపునకు కారణం కావచ్చు. కానీ అది చం ద్రబాబు రుణమాఫీ నినాదం అంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని, మోదీని ఇరకాటంలో పెట్టి లబ్ధి పొందవచ్చని సోనియా తాపత్రయం. యూపీఏ ప్రభుత్వంపైకి ఎల్కే ఆద్వానీ, మోదీలు సంధించిన అస్త్రాన్నే ఆమె కూడా అందుకున్నారు. ఏ ఎన్నికల్లోనైనా అన్ని పార్టీలు చేయక తప్పని జపం ఇది. చిత్తశుద్ధికి వస్తే అన్నీ ఒక తానులోని ముక్కలే. మోదీ ప్రభుత్వం నల్లధనం గుట్టు రాబట్టడానికి ‘సిట్’ను ఏర్పాటు చేసిందని ఘనంగా చెప్పుకోన వసరం లేదు. దానికి సుప్రీం కోర్టు విధించిన గడువే కారణం. ‘విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెన క్కు తెప్పించాల’ని కోరుతూ 2009లో రామ్జెఠ్మ లానీ తదితరులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశా రు. ‘ప్రభుత్వం కళ్లుగప్పి విదేశీ బ్యాంకుల్లో డబ్బును అక్రమంగా దాచుకున్న వారి పేర్లను వెల్లడించండి’ అంటూ 2011 జనవరిలో సుప్రీం మధ్యంతర ఉత్త ర్యులను జారీ చేసింది. ప్రభుత్వం తాత్సారం చేస్తుం డటంతో 2011 జూలై 4న కోర్టే ‘సిట్’ను (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దానికి మాజీ న్యాయమూర్తి జీవన్‌రెడ్డి నేతృ త్వం వహించాలని నిర్దేశించింది. ‘సిట్’కేవలం జీవ న్‌రెడ్డికి మాత్రమే దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించాలని జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ఎస్ఎస్ నిజ్జార్లు సూచించారు. (సుప్రీం సూచించే ఇలాంటి నైతిక సూత్రాలను హోంశాఖ కింద పనిచేసే ఏ దర్యాప్తు సంస్థ లేదా బృందం పాటించడం అరుదు). ‘ఇలాంటి నేరాలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతగా భావిస్తున్నాం’ అని కోర్టు నిష్కర్షగా పేర్కొంది. ప్రభుత్వం దాన్ని అవమానంగా భావిం చి ‘ఇది ప్రభుత్వ అసమర్థత కిందికి రాదు’ అంటూ అప్పీలుకు వెళ్లింది. ఈలోగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పదవీ విర మణ చేయగా ఆయన స్థానంలో జస్టిస్ అల్తమస్ కబీర్ నియమితులయ్యారు. నిజ్జార్‌కు భిన్నంగా ఆయన ప్రభుత్వ వాదనతో ఏకీభవించ డంతో ‘మూడవ అభిప్రాయం’ కోసం అది పైకి వెళ్లి అక్కడే ఉండిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కిం చుకునే ఆశల్లేని సోనియా యూపీఏ ప్రభుత్వం 2014 ఏప్రిల్‌లో స్విట్జర్లాండ్‌లోని ‘లిచ్ టెనిష్టియన్ బ్యాంక్’ ఇచ్చిన 26 మంది పేర్లను సుప్రీం కోర్టుకు అందజేసింది. ఇది రాబోయే ప్రభుత్వాన్ని ఇరకా టంలో పెట్టడానికి వేసిన ఎత్తుగడే. ప్రపంచ అక్రమార్జనాపరుల స్వర్గసీమ స్విట్టర్లాండ్‌లో 312 బ్యాంకులున్నాయి, వాటికి 3,120 శాఖలున్నాయి. వివిధ దేశాల నుండి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కోరితే సంబంధిత ఖాతాదారుల వివరాలను వెల్లడించాలనే నిబంధన ఇటీవలి కాలంలో అక్కడ అమల్లోకి వచ్చింది. విదే శాల్లో నల్లధనాన్ని దాచేవారు సాధారణంగా బినా మీల పేర్లతోనే ఖాతాలు తెరుస్తారు. నల్లధనాన్ని వెలికి తీసే ప్రయత్నాలు వేగంగా జరగాల్సి ఉంటుం ది. పూనెకు చెందిన హసన్ ఆలీ ఖాన్ అనే పందెపు గుర్రాల వ్యాపారి పేరు రచ్చకెక్కేటప్పటికే అతగాడు దాచిన డబ్బు అక్కడి నుండి రెక్కలు కట్టుకుని ఎగిరి పోయింది. ఇటీవలి కాలంలో స్విట్జర్లాండ్‌ను తల దన్నేలా సింగపూర్‌లాంటి నల్లధనం కోటలు చాలా నే పుట్టుకొచ్చాయి. నల్లధనం వెలికితీతపై ‘సిట్’ ఏర్పాటుకు సుప్రీం తుది గడువు 2014 మే 29. దీంతో మోదీ మే 28 మంత్రివర్గ సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఎమ్బీ షా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ జస్టిస్ జీవన్‌రెడ్డి. బీజేపీకి చెందిన రామ్‌జెఠ్మలానీ పిటీషన్ వేసి ఐదేళ్లు నిండాయి. ‘సిట్’ని నియమించాలని సుప్రీం ఆదేశించి మూడేళ్ల యింది. హడావుడిగా ‘సిట్’ను నియమించి ఐదు నెల్లు గడుస్తున్నా దాని అతీ గతీ మోదీకి పట్టలేదు. ఇప్పుడు సోనియాలాగే ఆయనకు కూడా మహా రాష్ట్ర ఎన్నికల జ్వరం పట్టుకున్నట్టుంది. ఏదో చేస్తు న్నామనిపించుకోవడానికి రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతి నిధి బృందాన్ని స్విట్జర్లాండ్‌కు పంపుతున్నట్టు తాజా గా ప్రభుత్వం ప్రకటించింది. చట్ట విరుద్ద మార్గాల ద్వారా సేకరించిన అక్రమార్జనాపరుల జాబితాలను పరిగణనలోకి తీసుకునేదే లేదని, ఖాతాదారుల వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదని ఫిబ్రవరిలో వచ్చిన సమాధానమే వస్తుంది గామోసు. సుప్రీం కోర్టు నల్లధనంపై కొరడా విసరడానికి ముందు స్విట్టర్లాండ్‌లోని మన నల్లధనం 5 లక్షల కోట్ల డాల ర్లు కాగా, ప్రస్తుతం అది 5 వేల కోట్ల డాలర్లకు చిక్కి పోయిందని అంచనా! మిగిలిన ఆ నాలుగు రాళ్లూ ‘సిట్’ దర్యాప్తు చేసి స్వయంగా ఖాతాదార్ల పేర్లు కనిపెట్టేసరికి మిగలవు. నల్లధనం మన ఎన్నికల వ్యవస్థకు ఊపిరిగా ఉన్నంత కాలం దానిపై పోరు ఎన్నికల నినాదంగానే మిగలక తప్పదు. - నన్నూరి వేణుగోపాల్ -
ఊహల్లో విహరిస్తున్న సీఎం
మొదటి ఐదు సంతకాలకే దిక్కులేదు ఆచరణకు వీలుకాని హామీలతో జనాన్ని మోసం చేశారు విజయవాడ, గుంటూరు మినహా సీఎంకు ఏదీ కనపడడంలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు నమ్మి చంద్రబాబుకు పట్టం కట్టారని, ఇప్పటివరకు ఒక్క హామీనీ నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో ఉండడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. హామీల అమలు గురించి ఆలోచించకుండా ప్రకటనలు, మంత్రివర్గ ఉప సంఘాలు, కమిటీలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఒక భాగం పెన్షన్లు తీసివేశారని, ఇక కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారో అర్థం కావడం లేదని అన్నారు. పెన్షన్ల కోసం టీడీపీ కార్యకర్తలతో కమిటీలు వేయడం వారి స్వార్థ గుణానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతమిస్తున్న రెండు వందల పెన్షన్ కూడా పేదలకు రాకుండా చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నుతోందని దుయ్యబట్టారు. సీఎం ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన ఐదు సంతకాలకు దిక్కులేకుండా పోయిందన్నారు. రుణమాఫీ చేస్తారని రైతులు, వ్యాపారులు, మహిళలు నమ్మి ఓట్లు వేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా కమిటీలతో కాలయాపన చేయడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంపై ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. బాబు రాగానే జాబు పోవడంతో చాలామంది రోడ్డున పడ్డారని, నిరుద్యోగ భృతి అమలుకు నోచుకోవడంలేదని విమర్శించారు. మాటమీద నిలబడలేని మోసపూరిత వ్యక్తిగా చంద్రబాబు చరిత్ర పుటల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు మినహా బాబుకు రాష్ట్రంలో ఏదీ కనపడడంలేదన్నారు. తన సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం భూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలన్న ధ్యాస ఈ ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు. ప్రత్యేకంగా మైనారిటీల సంక్షేమం కోసం వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని తెలిపారు. ఈ సమావేశంలో పోకల అశోక్‌కుమార్, జెడ్పీటీసీలు ఎం.రెడ్డిబాషా, జయరామచంద్రయ్య, పీలేరు ఎంపీపీ కే.మహితాఆనంద్, మండల ఉపాధ్యక్షుడు కంభం సతీష్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాషా, పార్టీ నాయకులు ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, బీడీ.నారాయణరెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, ఉదయ్‌కుమార్, రెడ్డిబాషా, భవనం వెంకట్రామిరెడ్డి, కే.ఆనంద్, అమరనాథరెడ్డి, రమేష్ పాల్గొన్నారు. -
సమస్యలు చెప్పేందుకు..తరలుదాము రండి!
సన్నద్ధమవుతున్న జనం నేటి నుంచి జన్మభూమి-మన ఊరు ప్రత్యేకాధికారిగా జేసీ శర్మ ‘తరలుదామురండి...మనం జన్మభూమికి’ అని పదేళ్ల కిందట ఊరువాడ మార్మోగిన పాట మళ్లీ గురువారం నుంచి పల్లెసీమల్లో వినిపించనుంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులను పల్లెబాట పట్టిస్తోంది. అయితే అధికారం చేపట్టిన నాలుగు నెలల్లో ఒక్క ప్రజా ఉపయోగ కార్యక్రమం కూడా చేపట్టని ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకు ప్రజలు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా రుణమాఫీ, కొత్తగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం, పింఛన్లు తీసివేత, ఆదర్శరైతుల తొలగింపు, మంచినీరు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పెండింగ్.. ఇలా ప్రతి సమస్యపై జన్మభూమిలో గళం విప్పనున్నారు. సాక్షి, చిత్తూరు: ‘జన్మభూమి-మనఊరు’ కార్యక్రమాన్ని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరులో ర్యాలీ ద్వారా ప్రారంభించనున్నారు. జన్మభూమి ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ బదులు జేసీ శర్మ నియమితులయ్యారు. 20వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమాన్ని జేసీ శర్మ పర్యవేక్షించనున్నారు. ప్రజలకు బోలెడు హామీలిచ్చి అధికారంలో వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కహా మీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు బాబు హామీ ఇచ్చారు. అధికారం దక్కిన తర్వాత సవాలక్ష ఆంక్షలు విధించి రూ.1.50లక్షల వరకూ మాత్రమే మాఫీ చేస్తామన్నారు. కనీసం ఈ హామీనైనా నిలబెట్టుకున్నారా? అంటే అదీ లేదు. దీంతో కొత్త రుణాలు అందక రైతులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటసాగుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జన్మభూమి పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెల్లోకి వెళితే ప్రజల నుంచి నిరసనలు, ప్రతిఘటనలు అనివార్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పింఛన్ల తొలగింపుపై నిలదీత జన్మభూమిలో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని తీసుకోవాలని సీఎం సూచించారు. అయితే తీసుకున్న అర్జీలకు న్యాయం జరిగే పరిస్థితులు కన్పించడం లేదు. తనిఖీల పేరుతో జిల్లా వ్యాప్తంగా 34,459 మందికి పింఛన్లు తొలగిం చారు. మరో 10 వేల మంది తీసివేత జాబితా లో చేరనున్నారు. వీరిలో సింహభాగం అర్హులే ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛను సొమ్ము అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పటికీ పింఛనుదారుల జాబితా సిద్ధం కాలేదు. ఈ క్రమంలో నామమాత్రంగా ఒకరిద్దరికి పెంచిన పింఛను ఇవ్వడం మినహా అర్హులందరికీ పింఛన్ అందే పరిస్థితులు లేవు. అలాగే జిల్లావ్యాప్తంగా 1846 మంది ఆదర్శరైతులను తొలగించారు. ‘బాబు వస్తే జాబు’ అని ఉన్న ఉద్యోగాలను తీసేయడంపై ఆదర్శరైతులు జన్మభూమిని అడ్డుకోనున్నారు. అలాగే ఇందిర్మబిల్లులు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై కూడా ప్రశ్నాస్త్రాలను సంధిం చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని మహిళలు నిలదీయనున్నారు. ప్రతీ ‘సారీ’ మాట తప్పడం ఏంటీ ‘బాబూ..!’ జిల్లాలో ప్రతిగ్రామానికీ అక్టోబర్ 2 నుంచిస్వచ్ఛమైన తాగునీటి అందిస్తామని రాష్ట్ర కేబినెట్ రెండు నెలల కిందట ప్రకటించింది. అయితే ప్రభుత్వం కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో నడపాలని నిర్ణయించడంతో ఎవరూ ముందుకు రాక ‘సుజల’ ఆరంభశూరత్వమైంది. చివరకు నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా ప్రారంభించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదికూడా సాధ్యం కాక అధికారులు చేతులెత్తేశారు. కేవలం కుప్పం, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, చిత్తూరు మండలాల్లోని ఒక్కొక్క గ్రామం చొప్పున పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే తిరుపతి కార్పొరేషన్‌కు మాత్రమే పరిమితం చేశారు. దీంతో తక్కిన ప్రాంతాల్లో కోతలు యాథావిధిగా ఉండే పరిస్థితి. మొత్తానికి అరచేతిలో స్వర్గం చూపించేలా మాటలు కోటలు దాటేలా చెప్పి ప్రతి అంశంలోనూ మాట తప్పుతున్న చంద్రబాబు సర్కారు జన్మభూమిలో ఊరు దాటి రావడం కత్తిమీద సామే! -
‘కూచిపూడి’కి మహర్దశ !
నాట్య అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం ఎమ్మెల్యే కల్పన సూచనలకు సీఎం సానుకూలం కూచిపూడి : దేశవిదేశాల్లో గుర్తింపు పొందిన కూచిపూడి నృత్యానికి, గ్రామానికి త్వరలోనే మరింత ప్రాచుర్యం లభించనుంది. విఖ్యాత నాట్యక్షేత్రమైన కూచిపూడి గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ఇటీవల పలు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కూచిపూడి గ్రామంలో నాట్య అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ అకాడమీని తెలుగు విశ్వవిద్యాలయం అధీనంలో ఉన్న శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠంలో ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. పసుమర్తి వారిధర్మచెరువులో గ్రామం పంచాయతీ కేటాయించిన ఎకరం పైగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు. అకాడమీ ఏర్పాటు చేస్తే కూచిపూడి నృత్యానికి, తమ గ్రామానికి మహర్దశ పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎందరో ఉద్దండుల కృషి వల్ల విశ్వవ్యాపితం.. కూచిపూడి నృత్యం సనాత భారతీయ సంస్కృతికి దర్పణంగా నిలుస్తుంది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సంప్రదాయాలను ప్రతిబింబింపజేస్తుంది. ఇంతటి ఘనతను పొందిన ఈ నృత్యం... ప్రఖ్యాత నాట్యాచార్యులు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం, పద్మశ్రీ డాక్టర్ వేదాంతం సత్యనారాయణశర్మ, భరత కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి, భరత కళాప్రపూర్ణ వేదాంతం రాఘవయ్య, కులపతి భాగవతుల రామకోటయ్య, కులపతి పీవీజీ కృష్ణశర్మ వంటి ఉద్దండుల కృషి, అంకితభావం కారణంగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ నాట్యాన్ని ఒకే రీతిలో పుట్టినింట నేర్చుకోవడానికి ప్రభుత్వం నిబంధనలు విధిస్తే కళాకారులకు, గురువులకు మరింత శోభ లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు, పొరుగు రాష్ట్రాల కళాకారులు, అభిమానులు తరలివచ్చి శ్రీ సిద్ధేంద్రుడు నడయాడిన ఈ గ్రామాన్ని సందర్శించే అవకాశముందని చెబుతున్నారు. నిరుపయోగంగా పర్యాటక శాఖ భవనం శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠం భవనం పై అంతస్తులో సుమారు రూ.50లక్షలతో నిర్మించిన పర్యాటక శాఖ భవనం నిరుపయోగంగా మారింది. ఆ భవనంలో నృత్య అకాడమీ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 25న పర్యాటక శాఖ కార్యక్రమాలు? పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పర్యాటక శాఖ అధికారిణి, విజయవాడ సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఈ నెల 25న కూచిపూడి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కూచిపూడి నాట్య ప్రదర్శనల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో కూచిపూడిలో నాట్య అకాడమీ ఏర్పాటుపై జిల్లా పర్యాటక అధికారిణి దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
హంగులన్నీ ఉంటేనే రాజధాని
గన్నవరం ఎయిర్ పోర్టు తాత్కాలిక అభివృద్ధి పౌరపాలన మెరుగైతేనే నగరాభివృద్ధి అప్పులు మాఫీ అంటే అభివృద్ధి శూన్యమే స్మార్ట్ సిటీగా విజయవాడ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, విజయవాడ : రాజధానిగా ఉండే నగరానికి అన్ని హంగులుండాలని, ముఖ్యంగా రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండడంతో పాటు ప్రజలు తాగేందుకు మంచినీరు, చక్కగా జీవించేందుకు విద్యా, వైద్య, ఎంటర్టైన్మెంట్ సౌకర్యాలుండాలని కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం స్థానిక బందరు రోడ్డులోని ఓ హోటల్లో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీస్ అనే అంశం పై జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్మార్ట్ సిటీస్‌పై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని, నిర్ణయం తీసుకున్న తరువాత విజయవాడకు స్మార్ట్ సిటీ హోదా వస్తుందని హామీ ఇచ్చారు. అంతకంటే ముందు రాజధాని వైపు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు తరలి రావాలంటే కొన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు బాగుండాలని, ప్రస్తుతం గన్నవరం ఎయిర్ పోర్టును శరవేగంగా అభివృద్ధి చేసినా మూడేళ్లపైనే పడుతుందని అన్నారు. అందువల్ల తాత్కాలికంగా అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకురావచ్చన్నారు. విజయవాడ చుట్టుపక్కల కొత్త రాజధాని ఎక్కడ వచ్చినా ప్రజలు విజయవాడలోనే నివశిస్తారని తెలిపారు. రాబోయే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని సూచించారు. పౌరపాలన మెరుగైతేనే.... నగరాభివృద్ధి జరగాలంటే ప్రజల ఆలోచనా ధృక్పదంలో మార్పు రావాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పన్నులు వేసి పనులు చేస్తే ప్రజలు స్వాగతిస్తారని, పన్నులు వేయం..పనులు చేయం అంటే ఉపయోగం లేదని అన్నారు. నిధులు ఉంటేనే విధులు నిర్వహించగలుగుతారన్నారు. ప్రజా సహకారంతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని అన్నారు. 12 ఏళ్లుగా నగరంలో పన్నులు పెంచలేదని, ఇప్పుడు రెండు మూడు నెలలుగా కార్పొరేషన్ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అప్పులు మాఫీ అంటే అభివృద్ధి మాఫీయేనని ఆయన అభిప్రాయపడ్డారు. నగరాభివృద్ధి జరగాలంటే రోడ్లు వెడల్పు చేయాలని, కాల్వలు శుభ్రం చేయాలని, మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్, సీవరేజ్ వంటి సౌకర్యాలు మెరుగు పరచాలని మెట్రో రైలు తీసుకురావాలని...... ఇవ్వన్నీ జరగాలంటే పౌరసహకారం ఎంతైనా అవసరమని ఉద్ఘాటించారు. నేతల తీరుపై జనం ఆవేదన... వెంకయ్యనాయుడు ప్రసంగం పూర్తయిన తరువాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వేదికపై నుంచి తమ సందేహాలు, సలహాలను తెలియజేశారు. విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ రాజధాని వస్తుందని ప్రకటించినా రాజకీయ నేతలు చేరి ఎకరాలకు ఎకరాల భూమి కొనుగోలు చేసి రేట్లు పెంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ గోకరాజు గంగరాజు, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీ కృష్ణ పాల్గొన్నారు. -
ప్రభుత్వ విధానాలతో రైతు ఆత్మహత్యలు
అనంతపురం టవర్ క్లాక్ : ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర రైతు సంఘం నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వీకే భవన్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను రైతు సంఘం జాతీయ నాయకుడు కొల్లి నాగేశ్వర్రావ్ పార్టీ జెండాను విష్కరించి ప్రారంభించారు. అన్ని జిల్లాల రైతు సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, జాతీయ నాయకులు, శాస్త్ర వేత్తలు హాజరయ్యారు. వ్యవసాయ శాస్త్రవేత్త, జయంతీ ఘోష్ కమిషన్ సభ్యుడు కేఆర్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో లాభసాటి వ్యవసాయంపేరుతో దండగ చేస్తున్నారన్నారు. చిన్న సన్నకారు రైతులు పట్టణాలకు వలసలు పోతున్నారన్నారు. లాభాలే పరమావధిగా విత్తన కంపెనీలు వ్యవహరిస్తుండడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారన్నారు. విత్తన ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరళికృత విధానాలను వీడాలన్నారు. ఖర్చులు పెరగడం, మద్దతు ధర లభించకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని మానేస్తున్నారన్నారు. బ్యాంకులు కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు అందచేస్తుండగా, మిగిలినవారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ రంగంగా మార్చేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు. సుస్థిర వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలన్నారు. రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలే శరణ్యమన్నారు. రైతులు, ప్రజాసంఘాలు నీటి కోసం ఉద్యమించాలన్నారు. చంద్రబాబును నిలదీసి హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులకు నీరందించేందుకు వంద టీఎంసీల వాటాను రాబట్టుకోవాలన్నారు. ‘ప్రకృతి విపత్తులు- ఎదురయ్యే సమస్యలు’ ‘వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెట్లు, గిట్టుబాటుధరలు’, రైతాంగానికి అనుకూల పరిస్థితి, విధివిధానాలు, బ్యాంకుల, రుణమాఫీ తదితర అంశాలపై రైతులకు వివరించారు. దేశీయ పాడిపరిశ్రమ, ఎరువులు తయారు చేసుకొనే పద్ధతులు, పురుగుమందులేని వ్యవసాయ విధానాలను వివరించారు. రైతు సంఘం రాస్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వెంక య్య, సీనియర్ రైతు సంఘం నేతలు ఎంవి రమణ, సూర్యనారాయణరెడ్డి, రాష్ర్ట్ర కార్యదర్శి జగన్నాథం, రాష్ట్ర కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద ఆల్ఇండియా కిసాన్ జాతీయ నాయకురాలు శీతారామమ్మ, గంగాభవాపీ, సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీష్, రైతు సంఘం కార్యదర్శి కాటమయ్య, శిల్పకాలేశ్వర్, సువర్ణ, వివిధ జిల్లాల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు మాదన్న(కర్నూలు), లెంకాలలక్ష్మి(విజయనగరం),సుబ్బారావు(పశ్చిమగోదావరి), యానాదరావు(కృష్ణా), ప్రసాద్ (ప్రకాశం ), వెంకటేశ్వర్లు( నెల్లూరు), ఉమాపతినాయుడు(చిత్తూరు), సుబ్బారెడ్డి(వైఎస్సార్‌జిల్లా), రైతులు పాల్గొన్నారు. -
బొజ్జలే.. భూబకాసురుడు
శ్రీకాళహస్తి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుగారూ... రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు విరాళంగా ఇవ్వాలని కోరుతున్నారు.. బాగానే ఉంది. అయితే మీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భూబకాసురుడి అవతారమెత్తారు. ఆయన మాటేంటో స్పష్టం చేయండి.’’ అని వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూఆక్రమణలపై పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం రైతులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ విదేశాల భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు పూజలు చేయించుకుంటూ ఈ ప్రాంత ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని, మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాత్రం శ్రీకాళహస్తి ప్రాంతానికే భూమచ్చ తెచ్చారని విమర్శిం చారు. సొంత మండలంలోని ప్రభుత్వ మిగుల భూములను ఆక్రమించుకోవడానికి బొజ్జల నలుగురు కింకరులను తయారుచేశారని ఆరోపించారు. వంద రోజుల్లో మండలంలోని నలుగురు టీడీపీ నాయకులు ఇనగలూరు, గోవిందరావుపల్లె, మన్నవరం, కలవగుంట గ్రామాల్లో వెయ్యి ఎకరాల భూములను ఆక్రమించి చరిత్ర సృష్టించారని అన్నారు. ఇనగలూరు గ్రామంలో 300 ఎకరాల భూములు ఆక్రమించి నెల్లూరు జిల్లా పొదలకూరు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి ఒత్తిడితో 300 ఎకరాలు ఆక్రమించిన వ్యకిపై కేసు కూడా నమోదుచేయకపోవడం.. రెవెన్యూ అధికారులు వారి కార్యాలయంలో ఆ నాయకుడితో చర్చలు జరిపి పంపడం సిగ్గుచేటన్నారు. ఒక్క క్షణం కూడా బొజ్జల మంత్రిగా కొనసాగడానికి అర్హుడుకాదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి చరిత్రలో ఇంతటి భూకుంభకోణం ఇప్పటి వరకు లేదన్నారు. బొజ్జల సొంత మండలంలో భూఆక్రమణల్లో మంత్రి హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి వెంటనే శ్రీకాళహస్తి మండలంలోని భూ ఆక్రమణలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గకండి ‘సార్ ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాసీనత చూపకండి.. మండలంలో వెయ్యి ఎకరాలు ఆక్రమిస్తే నిద్రపోతున్నారా...’ అంటూ తహశీల్దార్ చంద్రమోహన్‌ను నాయకులు, రై తులు నిలదీశారు. మండలంలోని భూములపై ఆంక్షలు విధించామని చెప్పారు.. టీడీపీ నాయకులకు ఆంక్షలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. భూములు స్వాధీనం చేసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ చంద్రమోహన్ మాట్లాడుతూ తాను నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గే అధికారిని కాదని.. మండలంలో భూఆక్రమణలపై పూర్తి సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా భూములు స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
జమ్మూ కాశ్మీర్లో వరదలు
-
కాశ్మీర్ వరదల్లో కాకినాడ వాసులు
-
కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న కాకినాడ వాసులు
శ్రీనగర్ : కాశ్మీర్ వరదల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన దంపతులు చిక్కుకున్నారు. దైగోలుపాడుకు చెందిన నాయుడు, వరలక్ష్మి రూరల్ డెవలప్మెంట్ ప్రోగామ్ కోసం కాశ్మీర్ వెళ్లారు. హెలీప్యాడ్ వద్ద వరదల్లో చిక్కుకున్నట్లు బాధితులు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 30మంది వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో వరద ఉధృతి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. జలవిలయంతో తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకూ 47 వేల మంది బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగినా, ఇంకా 4 లక్షలమందికిపైగా జనం జలదిగ్బంధంలోనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, వరదనీరు తగ్గనిచోట్ల బాధితులు ఇంకా ఇళ్లపైకప్పులపైనే గడుపుతున్నారు. భారీవర్షాలు వరదల్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లుకూలడం వంటి సంఘటనల్లో ఇప్పటివరకూ దాదాపు 200మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నావికాదళం నిర్విరామంగా పాల్గొంటున్నాయి. -
చంద్రబాబు వల్ల డ్వాక్రా వ్యవస్థ చిన్నాభిన్నం
కొత్త రుణాలు పుట్టక మహిళలకు తప్పని అవస్థలు ఐద్వా జిల్లా మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రమాదేవి నర్సీపట్నం టౌన్: సక్రమంగా నడుస్తున్న డ్వాక్రా వ్యవస్థను రుణమాఫీ ఆశ చూపి చిన్నాభిన్నం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమాదేవి విమర్శించారు. అధికారం కోసం ఎన్నికల ముందు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన బాబు ఇప్పుడు మాట తప్పడం మహిళలను మోసం చేయడమే అన్నారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో ఆదివారం ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా 14వ మహాసభ నిర్వహించారు. ఐద్వా జెండాను జిల్లా అధ్యక్షురాలు కె.వి.సూర్యప్రభ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అబీధ్ సెంటర్ వరకు మహిళలు ఐద్వా జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలను మేలు కొలుపుతూ గీతాలు ఆలపించారు. అనంతరం జరిగిన సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత కారణంగా తీసుకున్న రుణాలు మాఫీ కాక, బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వక డ్వాక్రా మహిళలు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు ఎన్నికల హమీకి కట్టుబడి డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. మహిళలపై పెరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం ఏవిధమైన చర్య లు తీసుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశా రు. బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని ఏర్పాటు చుట్టూ తిరుగుతూ ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా చేస్తానంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. వంట కార్మికులు, ఆశా వర్క ర్లు, అవుట్సోర్సింగ్ పనుల్లో రాజకీయ జోక్యం పెరుగుతోందన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్న వారిని తొలగించి అనుచరులను పెట్టుకోవడానికి చూస్తున్నారన్నారు. బెల్టుషాపులు ఎత్తివేశామని చెప్పి విచ్చలవిడిగా మద్యం షాపులను ఏర్పాటు చేసి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. పాలకులు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ప్రభావతి, గ్రేటర్ విశాఖ ప్రధాన కార్యదర్శి రమా, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.గౌరీ, జిల్లా నలుమూలల నుంచి మహిళలు పాల్గొన్నారు. -
చంద్రబాబు అవకాశవాద రాజకీయాలనుఎండగట్టేందుకే పోటీ
పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నందిగామలో కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం నందిగామ : సీఎం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే నందిగామ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని నిలిపినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓట్ల రూపంలో తెలియజేయడానికి, తద్వారా చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూసేందుకే తాము పోటీలో ఉన్నట్లు వివరించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం రఘువీరారెడ్డి ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం కూడా పాల్గొని అయ్యదేవర కాళేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుటుంబానికి తాము ఎటువంటి నష్టం చేయలేదన్నారు. తంగిరాల కుటుంబానికి ఏదైనా నష్టం జరిగితే.. అది తెలుగుదేశం పార్టీ వల్లే అని పేర్కొన్నారు. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే సంస్కృతికి టీడీపీ తిలోదకాలు ఇచ్చిందని పేర్నొన్నారు. తంగిరాల కుటుంబంపై కాంగ్రెస్‌కు సానుభూతి ఉందని, చంద్రబాబుకే లేదని, అందువల్లే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభాకరరావుకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. తంగిరాల ప్రభాకరరావు కుమార్తెపై టీడీపీకి సానుభూతి ఉంటే ఆమెకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చి మంత్రిని చేయాలని డిమాండ్‌చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకు తిరుగుతున్న ముఖ్యమంత్రి దివాలాకోరు తనాన్ని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రుణమాఫీ, డ్వాక్రా మహిళలు, ఎస్సీలకు బడ్జెట్లో నిధులను నామమాత్రంగానే కేటాయించారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు ప్రచారం : జేడీ శీలం కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతిపాలు చేసేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని చెప్పారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించిందని, త్వరలోనే బీజేపీ ఆ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో అమలుచేసిన పథకాల వల్ల పేదలకు ఎంతో మేలు కలిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బోడపాటి బాబురావు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ), మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఆ పార్టీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, పాలేటి సతీష్, జాఫర్, బొబ్బెళ్లపాటి శ్రీగోపాలకృష్ణసాయి, తలమాల డేవిడ్‌రాజు, కామ శ్రీను, రేపాల మోహనరావు, యండ్రపల్లి నారాయణరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అంతా భ్రాంతియేనా?
ఎమ్మెల్యేల్లో నిరుత్సాహం నింపిన సీఎం పర్యటన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడంపై కినుక తమకంటే అధికారులకే అధిక ప్రాధాన్యంపై గుర్రు మంత్రుల ఆధిపత్య సమస్యపై మౌనంతో నీరసం అధికారపార్టీ ఎమ్మెల్యేలకు అధిష్టానంపై క్రమేపీ భ్రమలు తొలగిపోతున్నాయి. ప్రభుత్వం తమదే కావడంతో ఇక తిరుగులేదని భావించిన నేతలకు క్రమంగా తత్వం బోధపడుతోంది. పేరుకు అధికారపార్టీ వారే అయినా కేవలం అలంకారప్రాయంగా మారే వైనంతో మింగలేక కక్కలేక తమనితాము నిందించుకుంటున్నారు. సాక్షి,విశాఖపట్నం: జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబుకు సమస్యలు వినిపించి నియోజకవర్గాలకు నిధులు,హామీలు పొందేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నీరసపడిపోయారు. సీఎంగా రెండు రోజుల పర్యటనలో కనీసం తమ సమస్యలు కూడా వినే ప్రయత్నం చేయకపోవడంతో వారిలో నిరుత్సాహపు నీడలు కమ్ముకుంటున్నాయి. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంగపడుతున్నారు. తమకంటే అధికారులకే ప్రాధాన్యం పెరగడంతో ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో శుక్ర,శనివారాల్లో చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో పర్యటించి వివిధ సదస్సుల్లో పాల్గొన్నారు. అధినేతకు నియోజకవర్గాల సమస్యలు వినిపించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకునేందుకు దాదాపు అందరు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఏమేమి అడగాలనేదానిపై కాగితాలు కూడా తయారుచేసుకున్నారు. కానీ చంద్రబాబు కనీసం నియోజకవర్గ సమస్యలు కూడా వినే ప్రయత్నం చేయకపోవడంతో గుర్రుగా ఉన్నారు. ఎంతసేపూ విశాఖను ముంబై చేస్తా..రింగ్‌రోడ్డు వంటి ప్రకటనలతో నిరాశకు గురయ్యారు. నీరుగార్చేసిన బాబు చంద్రబాబు తన పర్యటనలో ఎమ్మెల్యేలను దగ్గరకురాానిచ్చినా కేవలం పొడిపొడిగానే పలకరించడంతో అవాక్కయ్యారు. తమకంటే అధికారులకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తొలిరోజు పర్యటనలో‘పొలం పిలుస్తోంది’ పేరుతో చోడవరంలో నిర్వహించిన రైతు బహిరంగ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్రాజు నియోజకవర్గ సమస్యలను వేలాదిమంది మధ్య సీఎంకు వినిపించారు. సుమారు అరగంటపాటు ప్రసంగించి నియోజకవర్గం అభివృద్ధికి ఏమి కావాలో కోరారు. చంద్రబాబు ఏ ఒక్క దానికి స్పందించకపోవడం విశేషం. ఇక శనివారంనాటి డ్వాక్రా సంఘాల నక్కపల్లి సదస్సులో స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక అధికారులు కావాలనే ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇవ్వలేదా అన్న విషయంపై టీడీపీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రోటోకాల్ప్రకారం ఈ సదస్సుకు ఎమ్మెల్యే అధ్యక్షత వహించాలి. ముఖ్య అతిథులను ఆమె వేదికపైకి ఆహ్వానించాలి. ఆమె మాట్లాడిన అనంతరం ప్రాధాన్యతా క్రమంలో మిగతావారు మాట్లాడాలి. చివరగా ముఖ్యఅతిథి ప్రసంగంతో సభ ముగించాలి. ఇవేవీ సదస్సులో కనిపించలేదు. ఎంపీ అవంతి శ్రీనివాస్‌ది కూడా ఇదే పరిస్థితి. సీఎం ప్రసంగం ప్రారంభం కాకుండానే ఆయన నిష్ర్కమించారు. ఇదిచూసి చాలామంది ఎమ్మెల్యేలు తాము ఏం అడిగినా ఇదే పరిస్థితి వస్తుందనే ఆలోచనతో వెనక్కు తగ్గారు. వాస్తవానికి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం పేరుతో ఏటా రూ.కోటివరకు నిధులొస్తాయి. తామిచ్చిన మామీలు కొంతలోకొంత వరకు నెరవేర్చుకోవడానికి ఎమ్మెల్యేలకు ఇదో మార్గం. కాని బాబు సీఎం అయిన తర్వాత ఈ పథకాన్ని ఎత్తేసి ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారు. ప్రజాప్రతినిధులంతా సీఎంపైనే ఆధారపడేలా చేశారు. ఇప్పుడు ఆయన్ను కలిసి సమస్యలు వివరించినా కనీసం పట్టించుకోకపోవడంతో భవిష్యత్తు ఏమిటనే ఆలోచన దాదాపు అందరిలోనూ నెలకొంది. మరోవైపు మంత్రులు గంటా,అయ్యన్న ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలను బేఖాతరు చేస్తున్నారు. అటు సీఎం ఖాతరు చేయక, ఇటు నిధులు రాక, మంత్రులూ పట్టించుకోక తమ పరిస్థితి ఏంటో అర్థంకాక మథనపడుతున్నారు. -
నమ్మించి..! నట్టేటముంచి..!!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ ఉద్యోగులను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మాటలతో ఊరించి.. చేతలతో ఉసూరుమనిపించారు. ఎన్నికల ప్రచారంలో టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీని తన మనుషుల ద్వారా అడ్డుకున్నారనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం 2008లో అప్పటి బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రణాళిక రచించారు. ఆ మేరకు టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారు. తిరుపతి సమీపంలో బ్రాహ్మణపట్టు, ఎస్వీ డెయిరీ ఫామ్, ఎస్వీ లెప్రసీ ఆస్పత్రి, ఎస్వీ పూర్ హోమ్ భూములను టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఒక్కో ప్లాట్‌ను రూ.50 వేల నామమాత్రపు ధరతో టీటీడీ ఉద్యోగులకు పంపిణీ చేయాలని సంకల్పించారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయలేకపోయారు. 2009 ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి సీఎంగా వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రమాణస్వీకారం చేశాక తిరుపతిలో పర్యటించిన సమయంలో ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. టీటీడీ ఉద్యోగులకు తక్షణమే ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ హఠాన్మరణంతో ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్ పడింది. ఆ తర్వాత టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీపై వివాదం చెలరేగింది. భక్తితో దేవునికి ఇచ్చిన భూములను టీటీడీ ఉద్యోగులకు ఎలా ఇస్తారంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. 2006 నాటి మార్కెట్ విలువ ప్రకారం టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు బ్రాహ్మణపట్టులో 125 ఎకరాల భూమిలో ఒక్కొక్కరికి 40 అంకణాల చొప్పున వెయ్యి మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఇదే భూమిలో 25 శాతం భూమిని సంబంధిత రైతులకు ఇవ్వాలని నిశ్చయించారు. ఎస్వీ పూర్ హోమ్‌కు చెందిన 23 ఎకరాల భూమిలో ఒక్కొక్కరికి 33 అంకణాల చొప్పున 448 మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్వీ డెయిరీ ఫామ్‌కు చెందిన 20 ఎకరాల భూమిలో ఒక్కొక్కరికి 33 అంకణాల చొప్పున 394 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని భావించారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ సమీపంలోనూ, వినాయక్‌నగర్ సమీపంలోనూ ఉన్న భూమిలో డీ-టైప్ క్వార్టర్స్ నిర్మించి.. 1020 మందికి ప్లాట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇది పసిగట్టిన టీడీపీ నేతలు.. ఆ ఇంటి పట్టాలను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉద్యోగులకు పంపిణీ చేయిద్దామని టీటీడీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన టీటీడీ ఉన్నతాధికారులు ఇంటి పట్టాల పంపిణీని వాయిదా వేశారు. ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు.. తమ మనుషుల ద్వారా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దాతలు దానం చేసిన భూమిలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు ఎలా ఇస్తారంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారించిన సుప్రీం కోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. దాంతో.. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు దక్కకుండా పోయాయి. ఈ వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబు ఉన్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తే.. ఇదే రకమైన డిమాండ్ ఆర్టీసీ, ఎస్పీడీసీఎల్, తుడ, మున్సిపల్ కార్పొరేషన్ వంటి సంస్థల సిబ్బంది నుంచి కూడా వస్తుందని ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆ సంస్థల ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబే తన మనుషులతో సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేయించి హైకోర్టు తీర్పుపై స్టే తీసుకొచ్చారని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. -
గొడవ చేస్తే రుణాలు రద్దు కావు
ముఖ్యమంత్రి సభలో బుద్దిగా కూర్చోండి డ్వాక్రా మహిళలకు అధికారుల హెచ్చరిక యలమంచిలి, నాతవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు చె ప్పేది వినండి.. సభలో గొడవ చేశారో? మీ గ్రూపులకు డ్వాక్రా రుణాల రద్దు వర్తించదు. డ్వాక్రా మహిళలకు అధికారుల హెచ్చరికలివి. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా జిల్లాలో చంద్రబాబు పర్యటన సభ నిర్వహణకు అధికారులు పోటీ పడుతున్నారు. సభ విజయానికి కొన్ని రోజులుగా రేయింబవళ్లూ శ్రమిస్తున్న అధికారులు సభలో మహిళలు మౌనంగా ఉండాలని హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. నక్కపల్లి సభకు దాదాపు 30 వేల మంది మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామని అధికారం చేపట్టిన చంద్రబాబు గ్రూపుకు రూ.లక్ష మాఫీ హామీ మహిళలను ఏమాత్రం సంతృప్తిపరచడం లేదు. మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబు వద్ద తమ గోడును వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభలో మహిళలు ఆందోళనకు దిగితే చంద్రబాబు ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్న భయంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఎంత వారించినా మహిళలు మాత్రం డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్న డిమాండ్‌తోనే సభలకు హాజరవుతున్నారని తెలిసింది. తాళం వేసే వారినే తరలించండి ముఖ్యమంత్రి సభల్లో మహిళల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురవకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన పర్యటనకు అధికంగా రైతులు, డ్వాక్రా మహిళలను అధిక సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అన్ని మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. నాతవరం మండలానికి ప్రత్యేకాధికారిగా నియమితులైన డీఆర్డీఏ ఏపీఎం కనక దుర్గ గురువారం ఐకేపీ కార్యాలయంలో మండలంలోని ముఖ్య డ్వాక్రా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్న మహిళలను మాత్రమే తరలించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీసే వారిని సమావేశాలకు తీసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండలం నుంచి ఈనెల 9న నక్కపల్లి ప్రాంతంలో జరిగే ముఖ్యమంత్రి సభకు 25 బస్సుల్లో సుమారుగా వెయ్యి మందిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఐకేపీ ఏపీఎం శివ ప్రసాద్‌ను అదేశించారు. -
సీఎం పర్యటనకు ఆర్భాటంగా ఏర్పాట్లు
రూ.కోటి వ్యయంతో వేదిక అధికారుల తీరుపై విస్తుపోతున్న ప్రజలు చోడవరం : ఈనెల 8న జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనుండటంతో ఇదివరకెన్నడూ లేని హం గులు, ఆర్భాటాలు చేస్తోంది. ఎప్పుడూ సభా ప్రాంగణాన్ని పరదాలు, టెంట్లతో ఏర్పాటు చేసేవారు. ఈసారి ఇనుపరేకులు, పెద్దపెద్ద ఇనుప స్తంభాలతో సుమారు రూ. కోటి వ్యయంతో వేది కను నిర్మించింది. చోడవరం జూనియర్ కళాశాల మైదానంలో రైతు సభ వేదిక ఏర్పాట్లు, అధికారుల హడావిడి చూసి ప్రజలు విస్తుపోతున్నారు. గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎప్పుడూ ఇంత హడావిడి, ఆ ర్భాటం కనిపించ లేదని, ఈసారి చంద్రబాబు సభకు ఇంత ఖర్చు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుసభ సహా అనకాపల్లి-చోడవరం మార్గమధ్యంలో తుమ్మపాల, గంధవరం, గజపతినగరం గ్రామాల్లో ప్రజలతో ముఖ్యమంత్రి ముచ్చటించే కార్యక్రమం ఉండటంతో ఏర్పాట్లను కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వచ్చిన కలెక్టర్ యువరాజ్, ఎస్పీ కె.ప్రవీణ్ బుధవారం కూడా పరిశీలించారు. ముఖ్యమంత్రి పేషీ నుంచి డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సభావేధిక పర్యవేక్షణ పో లీసు సెక్యూరిటీ బృందం పర్యటన మార్గాన్ని పరిశీలించింది. వీరివెంట చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.ఎన్.రాజు, ఆర్అండ్బి ఈఈ చంద్రన్, డీఈ రమేష్‌కుమార్, అనకాపల్లి డీఎస్పీ మూర్తి, జిల్లా అగ్నిమాపక దళాధికారి జ్ఞానసుందర్, డీపీఓ సుధాకర్, తహశీల్దార్ శేషశైలజ, సీఐ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. సభ ఏర్పాట్ల పరిశీలన నక్కపల్లి : ఈనెల 9వ తేదీన నక్కపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను నర్సీపట్నం ఏఎస్పీ విశాల్‌గున్ని, అడిషనల్ ఎస్పీ డి.ఎన్.కిషోర్‌లు బు దవారం పరిశీలించారు. నక్కపల్లి చినజీయర్‌స్వామినగర్‌లో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉపమాక వెం కన్న దర్శనానంతరం చంద్రబాబు నక్కపల్లిలో బహిరంగ సభకు హాజరవుతారు. ఏ ఎస్పీ వెంట యలమంచిలి సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎస్ఐ విజయ్‌కుమార్ ఉన్నారు. -
తిరుపతి స్మార్ట్ సిటీ ?
సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కార్పొరేషన్, తుడా అధికారులతో సమీక్షించిన కలెక్టర్ సిద్ధార్థ జైన్ తిరుధామం ఇక సుందర నగరంగా రూపుదిద్దుకోనుందా? ఆధ్యాత్మిక నగరంలో ఇకపై ‘ట్రాఫిక్’ ఉండదా? తాగడానికి సురక్షితమైన మంచినీళ్లు అందరికీ అందుబాటులోకి వస్తాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికారవర్గాలు. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించడంపై శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్, తుడా అధికారులతో కలెక్టర్ సిద్ధార్థ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించడం ఇందుకు మరింత బలం చేకూర్చుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి/ తిరుపతి కార్పొరేషన్ : దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఇందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.7,060 కోట్లను కేంద్రం కేటాయించిన విషయం విదితమే. ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌ను ఆదేశించారు. దాంతో శుక్రవారం తిరుపతికి చేరుకున్న కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సకలారెడ్డి, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, మెప్మా పీడీ నాగపద్మజ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ వీరారెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్మార్ట్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేయడానికి డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధికారికవర్గాలు వెల్లడించాయి. స్మార్ట్ సిటీ అంటే.. 2050 నాటికి తిరుపతిలో పెరిగే జనాభా.. భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఆ ప్రజల అవసరాలు తీర్చేలా డీపీఆర్‌ను రూపొందించి కేంద్రానికి పంపనున్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెద్దపీట వేయనున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్లై ఓవర్ల నిర్మాణంతోపాటు మెట్రో రైలు వంటి వాటిని ప్రవేశపెట్టనున్నారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తారు. ఎక్కడైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు పగిలిపోయి.. మ్యాన్‌హోల్స్ ఓపెన్ అయినా తక్షణమే కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించేలా సాంకేతిక వ్యవస్థను అనుసంధానం చేస్తారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి అవుటర్ రింగ్ రోడ్డును ఏర్పాటుచేయనున్నారు. భద్రతకోసం అధునాతన పోలీసు విధానాన్ని ప్రవేశపెడతారు. కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతారు. నగర విద్యుత్ అవసరాలను తీర్చడానికి సంప్రదాయేతర ఇంధన వనరులు(పవన విద్యుత్, సౌర విద్యుత్)కు పెద్దపీట వేస్తారు. వ్యర్థాలను కంపోస్టు ఎరువుగా మార్చుతారు.. వ్యర్థ జలాలను ప్రాసెసింగ్ ద్వారా మంచినీటిగా మార్చుతారు. ఆ నీటితో కూరగాయలు పండించి నగర ప్రజలకే విక్రయిస్తారు. ఇలా అన్ని రంగాల్లోనూ నగరాన్ని అభివృద్ధి చేస్తారు. పన్నుల మోతే.. స్మార్ట్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తే ప్రజల సమస్యలైతే పరిష్కారం అవుతాయి. కానీ.. పన్నుల మోత మోగడం ఖాయం. ఎందుకంటే.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో చేపట్టనున్నారు. తాగునీటి సరఫరా దగ్గర నుంచీ ట్రాఫిక్ సిగ్నల్స్.. రహదారుల నిర్వహణ వరకూ ప్రతి అంశం ప్రైవేటు సంస్థలతో ముడిపడి ఉంటుంది. ప్రజలకు చేసిన సేవలకు ప్రతిఫలంగా యూజర్ చార్జీలు, వివిధ రకాల పన్నుల రూపంలో ప్రైవేటు సంస్థలు పిండుకోవడం ఖాయం. ఇందుకు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలోనే బీజం పడటం గమనార్హం. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన డీపీఆర్‌ను రూపొందించే పనిని టెండర్ విధానం ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. ఆ సంస్థ రూపొందించే డీపీఆర్‌ను కేంద్రానికి పంపనున్నారు. ఆ డీపీఆర్‌పై కేంద్రం ఆమోదం వేశాక.. ఆ ప్రాజెక్టు అమలుకు టెండర్లు పిలుస్తుంది. ఈ టెండర్లలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టును చేజిక్కించుకున్న ప్రైవేటు సంస్థ నగరాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిఫలంగా ప్రజల నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో పిండుకోనుందన్న మాట..! -
ఆర్ధిక భారం తగ్గించుకునే యోచనలో చంద్రబాబు
-
తెలంగాణ, ఏపీ ఐఎంఏ కార్యవర్గాల ఎన్నిక
విజయవాడ,హన్మకొండ: రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 56వ రాష్ట్ర మహాసభలు (ఉమ్మడి రాష్ట్రం) ఆదివారం ముగిశాయి. ఉమ్మడి రాష్ట్ర కౌన్సిల్‌ను ఆంధ్ర, తెలంగాణలుగా విభజిస్తూ తీర్మానించారు. ఏపీ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన డాక్టర్ పి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా సీతారామయ్య (ఒంగోలు), కె.ఆనందనాయుడు (తిరుపతి), జె.సి.నాయుడు (విజయనగరం), కార్యదర్శులుగా కృష్ణారెడ్డి (నెల్లూరు), కె.వెంకటేశ్వర్లు (నెల్లూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో ఐఎంఏ నేతలు ఎన్.అప్పారావు, జి.సమరం, సుబ్రహ్మణ్యం, యాదగిరి పాల్గొన్నారు. ఐఎంఏ తెలంగాణ అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా వరంగల్ నగరానికి చెందిన డాక్టర్ కొండపల్లి సుధాకర్‌రెడ్డి నియమితులయ్యూరని జాతీయ ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి తెలిపారు. 2015 నుంచి తెలంగాణ మెడికల్ అసోసియేషన్ పూర్తి సంస్థగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొన్నారు. జనరల్ సర్జన్ అరుున సుధాకర్‌రెడ్డి ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. -
టీడీపీలోకి ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి?
సీఎం రమేష్ ద్వారా బాబుతో మంతనాలు నేడో,రేపో పార్టీలో చేరికకు ముహుర్తం ఖరారు ఆయనతో పాటే ఆయన సోదరుడు, వర్గీయులు పలమనేరు: జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. జిల్లాకు చెందిన ఇరువురు ముఖ్యనేతలతో పాటు సీఎం రమేష్ ద్వారా ఇప్పటికే చంద్రబాబుతో చర్చించారని, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. నేడో, రేపో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న రెడ్డెప్పరెడ్డి కిరణ్ సర్కార్ చొరవ తో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కిరణ్ రాజీనామా చేశాక జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పరోక్షంగా పనిచేశారు. కానీ ఆ పార్టీలో భవిష్యత్తు ఉండదని భావించి పరోక్షంగా టీడీపీకి మద్దతు పలుకుతూ వచ్చారు. సోమవారం మంచి రోజు కావడంతో ఆ రోజే పార్టీలో చేరనున్నట్టు ఆయన సోదరుడు విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. రెడ్డెప్పరెడ్డితో పాటు ఆయన సోదరుడు, నియోజకవర్గంలోని అనుచరులు పలమనేరు పట్టణానికి చెందిన ఇరువురు మైనారిటీ నాయకులు టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ చేరికతో మారనున్న సమీకరణలు పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా సుభాష్‌చంద్రబోస్ వ్యవహరిస్తున్నారు. రెడ్డెప్పరెడ్డి రాకతో ఇన్చార్జ్ బాధ్యతలు ఆయనకే దక్కుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలోని కొందరు స్థానిక నేతలు రెడ్డెప్పరెడ్డి నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఎన్నికల్లో కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన బోస్ పార్టీకి అండగా ఉండగా ఎమ్మెల్సీని పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరమేమొచ్చిందని అదే పార్టీకి చెందిన కొందరు మధనపడుతున్నారు. -
'నాయుడు అంటే నాయకుడు అని గుర్తుపెట్టుకోండి'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా సహించేది లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హెచ్చరించారు. శనివారం విజయవాడ వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో వెంకయ్య మాట్లాడుతూ ఇరు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దని సూచించారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పక లభిస్తుందన్నారు. ఆ నాయుడు...ఈ నాయుడు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యలు సరికాదని, నాయుడు అంటే నాయకుడు అని గుర్తు పెట్టుకోవాలన్నారు. పోలవరం ఆంధ్రా ప్రజల జీవన రేఖ అని వెంకయ్య అన్నారు. ముంపు మండలాలను తాము బంగ్లాదేశ్‌లో కలపలేదని... ఆరు మండలాలు అటు కలిసినా... ఇటు కలిసినా పోయేదేమీ లేదన్నారు. అలాగే తెలంగాణకు నష్టం జరగనివ్వమని వెంకయ్యనాయుడు అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సమయం పడుతోందని ఆయన తెలిపారు. -
ప్రజల శ్రేయస్సే లక్ష్యం
కేంద్ర మంత్రులు సదానంద గౌడ, వెంకయ్య నాయుడు, అనంతకుమార్, సిద్దేశ్వర్ కేంద్ర మంత్రుల హోదాలో తొలిసారిగా ఉద్యాన నగరికి రాక ఘనంగా సన్మానించిన బీజేపీ రాష్ర్ట శాఖ ఓపెన్ టాప్ వాహనంలో ఊరేగింపు సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని కేంద్ర మంత్రులు సదానందగౌడ, వెంకయ్యనాయుడు, అనంతకుమార్, సిద్దేశ్వర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రుల హోదాలో శువ్రారం తొలిసారిగా బెంగళూరు వచ్చిన వీరికి రాష్ర్ట పార్టీ స్థానిక ప్యాలెస్ మైదానంలో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సదానంద గౌడ మాట్లాడుతూ... ఎంతో నమ్మకంతో ప్రతిష్టాత్మకమైన రైల్వే శాఖను నరేంద్రమోడీ తనకు కేటాయించారన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్ల పెంపునకు తన వంతు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా దక్షిణభారత దేశ ప్రవేశ ద్వారంగా పేరుగాంచిన కర్ణాటకలో రైల్వే సౌకర్యాలు పెంచాల్సి ఉందన్నారు. ఇప్పటికే కర్ణాటకకు అవసరమైన రైల్వే పనులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి ఆర్.అశోక్, ప్రహ్లాద్‌జోషి తదితరులు నివేదిక తయారు చేశారన్నారు. వచ్చే జులైలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతకుమార్ మాట్లాడుతూ.. ఈసారి దేశ ప్రజలకు అవ సరమైన విత్తన, ఎరువుల కొరత రానివ్వబోమన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారన్నారు. దేశంలో అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన రిక్ షాపులను ప్రారంభించనున్నామన్నారు. ‘జన ఔషధ’ పేరుతో పథకాన్ని ప్రారంభించి ప్రాణాంతక వ్యాధులకు వాడే మందుల ధరలు వాటి మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రధాని నరేంద్రమోడీ ఆశయమన్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపునకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లను సమకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జీ.ఎం సిద్దేశ్వర మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అర్థమవుతోందన్నారు. ఈ ఫలితాలతో బీజేపీపై ఎక్కువ బాధ్యత పెరిగిందన్నారు. తన వల్ల కర్ణాటకకు సాధ్యమైనంత మేరకు మేలు చేకూరుస్తానన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి, మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్ తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు వీధి పోరాటాలు చేస్తున్నా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. అపూర్వ స్వాగతం : ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించి మొదటిసారిగా బెంగళూరు వచ్చిన రాష్ట్రానికి చెందిన సదానందగౌడ, వెంకయ్యనాయుడు, అనంతకుమార్, జీఎం సిద్దేశ్వరకు రాష్ట్ర బీజేపీ శాఖ ఘనంగా స్వాగతించింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓపెన్‌టాప్ వాహన ంలో వారిని పురవీధుల్లో ఊరేగించారు. దారి పొడవునా ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. -
చంద్రబాబు హామీలన్నీ నెరవేర్చాల్సిందే : నరహరిశెట్టి
విజయవాడ, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు. సీటీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నరహరిశెట్టి మాట్లాడుతూ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామన్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రారుణాలు రద్దు, ఇంటికో ఉగ్యోగం వంటి హామీలను చంద్రబాబు నెరవేర్చాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఇప్పటికే చంద్రబాబు స్వరం మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎటువంటి ఆటంకం లేకుండా బాబు కొనసాగించాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగడానికి కారణమయిన కలెక్టర్, ఎస్పీ, పోలీస్ కమిషనర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జరి గిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బూత్‌స్థాయి నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు దేవి నేని అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడతామని, ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. ఆకుల శ్రీనివాసరావు, వేములపరమేశ్వరరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్రం, సుంకర పద్మశ్రీ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సమన్యాయమే మా విధానం
-
పర్చూరులో దగ్గుబాటి ఫ్లెక్సీలపై రగడ
పర్చూరు, న్యూస్‌లైన్ : సొంత ఇంటికి స్వాగతం అంటూ మంగళవారం వేకువజామున పర్చూరు నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఫ్లెక్సీపై దగ్గుబాటితో పాటు ఎన్టీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోలుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి టీడీపీలోకి వెళ్తున్నట్లు పుకార్లు వెలువడుతున్న సమయంలోనే .. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ కేంద్రమైన పర్చూరు బొమ్మలసెంటర్‌లో ఐదు, మార్టూరులో ఆరు ఫ్లెక్సీలు, యద్దనపూడిలో రెండు చోట్ల, యనమదల గ్రామంలో ఒకచోట దగ్గుబాటి, చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా, ఫ్లెక్సీలన్నిటినీ టీడీపీ కార్యకర్తలు తొలగించారు. మార్టూరులో రాజుపాలెం అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని డేగర్లమూడి గ్రామంలో కాల్చివేశారు. ఫ్లెక్సీల ఏర్పాటు, తొలగింపుపై టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పరసర్పం ఆరోపణలకు దిగారు. ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో టీడీపీ బలపడటాన్ని ఓర్వలేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలను అయోమయానికి గురిచేయడానికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రకటన ఇచ్చిన వారిలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రావి రమణయ్యచౌదరి, జిల్లా కార్యదర్శి కొల్లా సుభాష్‌బాబు, పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణారావు తదితరులున్నారు. అమానుషమైన చర్య... ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని ఇలా తొలగించడం అమానుషమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, దగ్గుబాటి అభిమానులు పేర్కొన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీల తొలగింపుపై మాట్లాడారు. తమ నాయకుని ఫొటో ఉన్న ఫ్లెక్సీని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెక్సీలు తొలగించిన తీరు చూస్తుంటే ఏర్పాటు చేసిన వారే తొలగించారనే సందేహం కలుగుతోందన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పోలూరి శివారెడ్డి, మాజీ ఎంపీపీ కోట హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కారుమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీ తొలగింపుపై కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
పొలిటికల్ గేమ్
-
సమైక్యంపై మారని బాబు తీరు
-
కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది చంద్రబాబే