సీఎం పర్యటనకు ఆర్భాటంగా ఏర్పాట్లు | CM to arrange a tour of the rhetoric | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు ఆర్భాటంగా ఏర్పాట్లు

Published Thu, Aug 7 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

CM to arrange a tour of the rhetoric

  •      రూ.కోటి వ్యయంతో వేదిక
  •      అధికారుల తీరుపై విస్తుపోతున్న ప్రజలు
  • చోడవరం : ఈనెల 8న జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనుండటంతో ఇదివరకెన్నడూ లేని హం గులు, ఆర్భాటాలు చేస్తోంది. ఎప్పుడూ సభా ప్రాంగణాన్ని పరదాలు, టెంట్లతో ఏర్పాటు చేసేవారు. ఈసారి ఇనుపరేకులు, పెద్దపెద్ద ఇనుప స్తంభాలతో సుమారు రూ. కోటి వ్యయంతో వేది కను నిర్మించింది.
     
    చోడవరం జూనియర్ కళాశాల మైదానంలో రైతు సభ వేదిక ఏర్పాట్లు, అధికారుల హడావిడి చూసి ప్రజలు విస్తుపోతున్నారు. గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎప్పుడూ ఇంత హడావిడి, ఆ ర్భాటం కనిపించ లేదని, ఈసారి చంద్రబాబు సభకు ఇంత ఖర్చు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుసభ సహా అనకాపల్లి-చోడవరం మార్గమధ్యంలో తుమ్మపాల, గంధవరం, గజపతినగరం గ్రామాల్లో ప్రజలతో ముఖ్యమంత్రి ముచ్చటించే కార్యక్రమం ఉండటంతో ఏర్పాట్లను కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

    ఇప్పటికే పలుమార్లు వచ్చిన కలెక్టర్ యువరాజ్, ఎస్పీ కె.ప్రవీణ్ బుధవారం కూడా పరిశీలించారు. ముఖ్యమంత్రి పేషీ నుంచి డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సభావేధిక పర్యవేక్షణ పో లీసు సెక్యూరిటీ బృందం పర్యటన మార్గాన్ని పరిశీలించింది. వీరివెంట చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.ఎన్.రాజు, ఆర్‌అండ్‌బి ఈఈ చంద్రన్, డీఈ రమేష్‌కుమార్, అనకాపల్లి డీఎస్పీ మూర్తి, జిల్లా అగ్నిమాపక దళాధికారి జ్ఞానసుందర్, డీపీఓ సుధాకర్, తహశీల్దార్ శేషశైలజ, సీఐ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
     
    సభ ఏర్పాట్ల పరిశీలన
     
    నక్కపల్లి : ఈనెల 9వ తేదీన నక్కపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను నర్సీపట్నం ఏఎస్పీ విశాల్‌గున్ని, అడిషనల్ ఎస్పీ డి.ఎన్.కిషోర్‌లు బు దవారం పరిశీలించారు. నక్కపల్లి చినజీయర్‌స్వామినగర్‌లో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉపమాక వెం కన్న దర్శనానంతరం చంద్రబాబు నక్కపల్లిలో బహిరంగ సభకు హాజరవుతారు. ఏ ఎస్పీ వెంట యలమంచిలి సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎస్‌ఐ విజయ్‌కుమార్  ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement