గాంధీనగర్: పట్టణాభివృద్ధిలో భాగంగా ‘స్మార్ట్ సిటీస్’ జాబితాలోకి మరో 40 పట్టణాలను చేర్చుతామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం వెల్లడించారు. ఈ నెలలో లేదా వచ్చే నెలలో కొత్త పట్టణాల జాబితాను విడుదలచేయనున్నారు. కొత్త వాటితో కలుపుకుని జాబితా వందకు చేరనుంది. గత ఏడాది జనవరిలో ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతీ పట్టణంలో మౌలికవసతులను మెరుగుపరిచేందుకు రూ.200కోట్ల నిధులు కెటాయించారు.