
ప్రతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు..
న్యూఢిల్లీ : ప్రతి విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని, అయితే ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఆయా రాష్ట్రాలు కోరితేనే పరిశీలిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ అన్ని విషయాల్లో కేంద్రం కల్పించుకోదని చెప్పారు. స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీల ఎంపికలో ఎటువంటి రాజకీయం లేదన్నారు. స్మార్ట్ సిటీలు, నగరాల అభివృద్ధి, అందరికీ ఇళ్లు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభిస్తారన్నారు. 40 క్రితం ఎమర్జెన్సీ తన జీవిత గమనాన్ని మార్చేసిందని వెంకయ్య అన్నారు. ఆనాటి ఆరాచకాలను యువతకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.