Venkaiah
-
సీపీఎం సీనియర్ నేత జక్కా వెంకయ్య కన్నుమూత
నెల్లూరురూరల్: సీపీఎం సీనియర్ నేత, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన జక్కా వెంకయ్య (88) అనారోగ్యంతో మంగ ళవారం కన్నుమూ శారు. ఐదు రోజుల క్రితం ఆయనకు గుండె సమస్య తలెత్తడంతో స్థానిక సింహపురి స్పెషాలిటీ ఆస్ప త్రిలో సీపీఎం నాయకులు వైద్యం కోసం చేర్పిం చారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారు. దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్యకు వరుసకు సోదరుడయిన జక్కా వెంకయ్య ఆయన సహచరుడిగా అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. సీపీఎం కేంద్ర కమిటీలో పనిచేశారు. జిల్లాలో భూపోరాటాలకు కేంద్రబిం ధువుగా నిలిచారు. పేదలకు వేలాది ఎకరాలు భూములు దక్కేందుకు కారణమయ్యారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన సారా వ్యతిరేక ఉద్యయంలో కీలకపాత్ర పోషించారు. జక్కా వెంకయ్య రాసిన రాజకీయ ‘అర్ధశాస్త్రం, అదనపు విలువ–శ్రమ దోపిడీ’ అనే పుస్తకాలు విస్తృత పాఠకాదరణ పొందాయి.ఉద్యమకారులకు కరదీపికలుగా ఉపయోగపడ్డాయి. జక్కా వెంకయ్య నెల్లూరు జిల్లా దామరమడుగులో జక్కా రమణయ్య, శంకరమ్మ దంపతులకు 1930 నవంబర్ 3వ తేదీన జన్మించారు.1948 నుంచి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నిషేధ సమయంలో రహస్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. దామరమడుగు గ్రామంలో పార్టీ నేతలకు రక్షణ కల్పించారు. అప్పటి ప్రభుత్వం ఆయనను 15 రోజులు జైలుకు పంపించింది. 1956లో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.1964లో కమ్యూనిస్టు పార్టీ చీలికతో సీపీఎంలో చేరారు. 1965లో డిటెన్యూగా రాజమండ్రి జైలులో సంవత్సరం ఐదునెలల జైలు జీవితం గడిపారు. 1975 ఎమెర్జెన్సీలో డిటెన్యూగా 17 నెలలు నెల్లూరు జైలులో ఉన్నారు. అక్కడ గౌతు లచ్చన్న, సత్యనారాయణరెడ్డి తదితరులకు రాజకీయ తరగతులు బోధించారు. 1985,1994లో అల్లూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దీర్ఘకాలం పనిచేశారు. 2002లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పలువురి సంతాపం సీపీఎం సీనియర్ నేత జక్కా వెంకయ్య మృతికి సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని నివాళులు అర్పించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విజయవాడలో ఓ ప్రకటన విడుదల చేశారు.జక్కా వెంకయ్య మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర కార్యాలయంపై అరుణపతాకాన్ని అవనతం చేసినట్టు తెలిపారు.పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు తమ సంతాపాన్ని తెలియజేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది.పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓ ప్రకటనలో నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డితో పాటు వివిధ పార్టీకు చెందిన నాయకులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
జెండా వెంకయ్య
జెండా అంటే ఒక గుడ్డ పేలిక కాదు. ఒక గుర్తును చిత్రించుకున్న గుడ్డ ముక్క కాదు. కొన్ని రంగులు పులిమిన వస్త్రం కూడా కాదు. ఒక దేశ పోరాటాన్నీ, రక్తతర్పరణలనీ, త్యాగాలనీ జ్ఞప్తికి తెచ్చేది పతాకం. వాటికి ఆ జాతి ఇస్తున్న విలువని ఆకాశంలో రెపరెపలాడుతూ వెల్లడించేదే జెండా. ఒక జాతి చరిత్ర సారానికీ, తాత్వికతకూ పతాకమే ప్రతీక. 125 కోట్ల భారతీయుల వందనాన్ని స్వీకరించే మువ్వన్నెల జెండాలో ఇవన్నీ ప్రతిఫలిస్తాయి. అలాంటి పతాకాన్ని రూపొందించిన వారు తెలుగువారు కావడం గర్వ కారణమే. ఆయన పింగళి వెంకయ్య. భిన్న సంస్కృతుల భారతావనికి తగినట్టు, ప్రతి తరానికి స్వాతంత్య్రోద్యమాన్ని స్ఫురణకు తెచ్చేటట్టు గాంధీజీ ఊహ మేరకు పింగళి త్రివర్ణ పతాకాన్ని జాతికి అందించారు. రెండో బోయర్ యుద్ధంలో వెంకయ్యకీ, గాంధీజీకీ స్నేహం కుదిరింది. ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ పరిచయంతో, స్వాతంత్య్రోద్యమకారుడిగా తన అనుభవంతో వెంకయ్య జెండాకు రూపకల్పన చేశారు. దక్షిణాఫ్రికాలోని విట్వాటర్సాండ్ బంగారు గనుల మీద ఆధిపత్యం గురించి ఆఫ్రికన్లు (బోయర్లు) చేసిన తిరుగుబాటుకే బోయర్ యుద్ధమని పేరు. దక్షిణాఫ్రికా రిపబ్లిక్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్లు బ్రిటిష్ జాతితో చేసిన యుద్ధమిది. ఆ యుద్ధంలో క్షతగాత్రులకు సేవ చేయడానికి గాంధీజీ నెటాల్ ఇండియన్ అంబులెన్స్ దళాన్ని ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల వయసులో పింగళి వెంకయ్య బ్రిటిష్ సైనికునిగా అదే యుద్ధంలో పాల్గొన్నారు. తరువాత ఇద్దరూ స్వదేశం చేరుకుని స్వరాజ్యం కోసం పోరాడారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో, అంటే 1921లో గాంధీజీ భార త జాతీయ కాంగ్రెస్ ఉద్యమానికి ఒక పతాకం అవసరమని భావించారు. ఆ పని పింగళి వెంకయ్యకు తనకు తానై స్వీకరించారు. వెంకయ్య ఆగస్టు 2,1878న కృష్ణాతీరంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. తండ్రి హనుమంతరాయుడు. తల్లి వెంకటరత్నమ్మ. పెదకళ్లేపల్లితో కూడా వెంకయ్యగారికి అనుబంధం ఉంది. ఆయన మచిలీపట్నంలో ఉన్న హిందూ హైస్కూలులో చదివారు. ఆయన అభిరుచి ఏడురంగుల జెండాలా రెపరెపలాడుతూ ఉంటుంది. 1906లో కలకత్తాలో జరిగిన 22వ భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సభలకు హాజరు కావడం వెంకయ్యగారి జీవితంలో ఒక మలుపు. బెంగాల్ విభజన, వందేమాతరం ఉద్యమం నేపథ్యంలో జరిగిన ఈ సభలు జాతీయ చైతన్యాన్ని తట్టి లేపాయి. స్వదేశీయత, విదేశీ వస్త్ర బహిష్కరణ, జాతీయ విద్య, స్వరాజ్ అనే నాలుగు తీర్మానాలను ఆమోదించడం ద్వారా కాంగ్రెస్ సమావేశాలు భారతీయుల జాతీయ చైతన్యాన్ని మరో దిశకు మలిచాయి. ఈ సభలకు అధ్యక్షులు దాదాబాయ్ నౌరోజీ. ఆ నాలుగు అంశాలే వెంకయ్యగారి భావి జీవితాన్ని శాసించాయి. 1906 నుంచి 1911 వరకు వెంకయ్య కేవలం పత్తి పంట మీద పరిశోధనలు చేశారు. అప్పుడే ఆయనకు ‘పత్తి వెంకయ్య’ అన్న బిరుదు వచ్చేసింది. అమెరికా నుంచి కంబోడియా రకం విత్తనాలు తెప్పించి, వాటిని దేశవాళీ పత్తి విత్తులతో కలిపి ఒక కొత్త సంకర పత్తిని తయారు చేశారు. ఈ ప్రయోగాలన్నీ చల్లపల్లి దగ్గరగా ఒక గ్రామంలోనే చేశారు. అందులోని నాణ్యతని గుర్తించిన ది రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ (లండన్) ఆయనను ఫెలోషిప్తో గౌరవించింది. ఈ ప్రయోగాలు అయిన తరువాత వెంకయ్య కొద్దికాలం రైల్వేలలో కూడా పనిచేశారు. ఆ శాఖలో ఉండి బెంగళూరు, బళ్లారిలలో పనిచేసినప్పుడే మద్రాస్‌లో ప్లేగు వ్యాధి విజృభించింది. రోగులకు సేవ చేయడం కోసం వెంకయ్య తన ఉద్యోగం వదిలిపెట్టారు. సుభాష్‌చంద్రబోస్ పిలుపు మేరకు సైన్యంలో చేరి బోయర్ యుద్ధానికి వెళ్లారు. యుద్ధం, సైన్యంలో చేరడం ఆయన జీవితంలో ఒక చిరు ఘట్టమే. ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తరువాత మొదట తీవ్ర జాతీయవాదులతో కలసి బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అప్పుడు ఆయన ఏలూరులో ఉండేవారు. చదువు మీద ఆసక్తితో లాహోర్ వెళ్లి, అక్కడి ఆంగ్లో వేదిక్ స్కూల్లో సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలు నేర్చుకుని వచ్చారు. 1913లో ఒక సందర్భంలో ఆయన బాపట్లలో జరిగిన సభలో జపాన్ భాషలో ప్రసంగించవలసి వచ్చింది. పూర్తి స్థాయిలో ఆయన ఆ భాషలో ప్రసంగించి ‘జపాన్ వెంకయ్య’ అని కీర్తి గడించారు. విద్యార్జన వెంకయ్యగారిలో ఒక తీరని దాహంలా కనిపిస్తుంది. ఆయన కొలంబో వెళ్లి సీనియర్ కేంబ్రిడ్జ్ పూర్తి చేసుకుని వచ్చారు. భూగర్భశాస్త్రం అంటే ఆయనకు అపారమైన ప్రేమ. ఆ అంశంలో ఆయన పీహెచ్డీ చేశారు. దీనితో పాటు నవరత్నాల మీద కూడా ఆయన అధ్యయనం చేశారు. దీనితో ఆయనకు డైమండ్ వెంకయ్య అన్న బిరుదు కూడా వచ్చింది. మచిలీపట్నంలో కొద్దికాలం తన సొంత విద్యాలయాన్ని కూడా నిర్వహించారు. ఒక జాతికీ, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికీ ఒక పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం వెంకయ్యకు 1906లోనే కలిగిందని అనవచ్చు. కారణం కలకత్తా కాంగ్రెస్ సభలు. ఆయన 1916లో ’ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అన్న పుస్తకం రాశారు. 1916 నుంచి 1921 వరకు ఎంతో పరిశోధన చేశారు. 30 దేశాల పతాకాలను ఆయన సేకరించారు. 1918 సంవత్సరం మొదలు, 1921 వరకు జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో వెంకయ్య జెండా ప్రస్తావన తీసుకువస్తూనే ఉన్నారు. ఆఖరికి కాకినాడ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నప్పుడు (మార్చి 31, 1921) తొలిసారి ఆయన ఆశ నెరవేరింది. అంతకు ముందు కలకత్తా సమావేశాల సందర్భంగా ఒక పతాకం తయారయింది. దానిని ఆ నగరంలో బగాన్ పార్సీ పార్కు దగ్గర ఎగురవేశారు. అందుకే దానిని కలకత్తా జెండా అనేవారు. మేడమ్ బైకాజీ కామా, అనిబీసెంట్, సిస్టర్ నివేదిత కూడా భారత దేశానికి ఒక పతాకాన్ని రూపొందించాలని తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆ అవకాశం వెంకయ్యగారికి లభించింది. 1921లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు వెంకయ్య కలుసుకున్నారు. జెండా గురించి ప్రస్తావన వచ్చింది. తన పరిశోధనను, ప్రచురణను వెంకయ్య గాంధీజీకి చూపించారు. గాంధీజీ కూడా సంతోషించారు. ఉద్యమానికి అవసరమైన పతాకం గురించి ఆయన వెంకయ్యగారికి సూచించారు. స్థలకాలాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజితులను చేయగలిగిన జెండా కావాలని గాంధీ ఆకాంక్ష. మువ్వన్నెలలో గాంధీజీ తెల్లరంగును, వెంకయ్య కాషాయం ఆకుపచ్చ రంగులను సూచించారు. దీనికి ఆర్యసమాజ్ ఉద్యమకారుడు లాలా హన్స్‌రాజ్ ధర్మచక్రాన్ని సూచించారు. ‘‘ఒక జాతికి పతాకం అవసరం. పతాకాన్ని రక్షించుకునే పోరాటంలో లక్షలాది మంది కన్నుమూస్తారు. జెండా విగ్రహారాధన వంటిదే అయినా, చెడును విధ్వంసం చేసే శక్తి ఉన్నది. బ్రిటిష్ వాళ్లు వారి జెండా యూనియన్ జాక్‌ను ఎగురవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు.’’ అన్నారు గాంధీజీ. ఆఖరికి ధర్మచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. అందుకే ఆయన జెండా వెంకయ్య. ‘మన జాతీయ పతాకం’ పేరుతో యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ రాసిన మాటలు ప్రత్యేకమైనవి. ‘‘మన జాతీయ జెండా కోసం త్యాగం చేసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేస్తున్న (అప్పటికి పింగళి అక్కడ అధ్యాపకుడు) పింగళి వెంకయ్య ఒక పుస్తకం ప్రచురించారు. అందులో వివిధ దేశాల జెండాల నమూనాలు ఉన్నాయి. అలాగే మన జాతీయ పతాకం నమూనా ఎలా ఉండాలో కూడా ఆయన సూచించారు. జాతీయ పతాకాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్ సభలలో ఆయన పడిన శ్రమ, తపనలకు నేను అభినందిస్తున్నాను. నేను విజయవాడ వెళ్లినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు – ఆ రెండు రంగులతో పతాకాన్ని రూపొందించవలసిందని వెంకయ్యగారికి సూచించాను. పతాకం మధ్యలో ధర్మచక్రం ఉండాలని కూడా సూచించాను. తరువాత మూడు గంటలలోనే వెంకయ్యగారు పతాకం తెచ్చి ఇచ్చారు. తరువాత తెలుపు రంగు కూడా చేర్చాలని భావించాం. ఎందుకంటే ఆ రంగు మన సత్య సంధతకీ, అహింసకీ ప్రతీకగా ఉంటుంది.’’ అని గాంధీజీ తన పత్రికలో రాశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు రాశారు. ఈ విషయంలో ఆయన భారత ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు. జాతిరత్నాలు, వాటిని పోలి ఉండే రాళ్లు దేశంలో చాలా చోట్ల దొరుకుతాయని ఆయన చెప్పేవారు. ఆయన రాజకీయాల జోలికి వెళ్లలేదు. రాజకీయ నాయకులు ఈ జెండా నిర్మాత దగ్గరకు రాలేదు. దీపం చుట్టూనే చీకటి ఉంటుంది. మన జెండాకూ అది కొంత వర్తిస్తుంది. మన మువ్వన్నెల జెండా స్వాతంత్య్రోద్యోమ ప్రస్థానంలో ఉద్భవించింది. ఆ ఉద్యమంలోని తాత్వికతను రెపరెపలాడించింది. కానీ ఆ జెండా అందరి త్యాగాలను గుర్తించినట్టేనా? ఇందులో చిన్న మినహాయింపు పెద్ద చేదునిజమనే చెప్పాలి. పింగళి వెంకయ్యగారి త్యాగమే ఆ మినహాయింపు. ఆయన త్యాగం దేశానికి గుర్తులేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఆ గుర్తుంపును ఆయన కోరుకోలేదు కానీ, తన విల్లులో చివరి కోరిక ఒకటి వెలిబుచ్చారు. తన పార్థివదేహం మీద(జూలై 4,1963లో బెజవాడలో ఒక తాటాకు ఇంట్లో కన్నుమూశారు) జాతీయ పతాకాన్ని కప్పాలని కోరుకున్నారు. అది మాత్రం భారత జాతి తీర్చింది. కానీ ఆ జెండా ఆయన భౌతికదేహాన్నే కాదు, ఆయన త్యాగ నిరతినీ, ఆయన చరిత్రనీ కూడా కప్పేసింది. -
పుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ పెట్టాలి
-
వెంకయ్య అనుభవానికి సరైన పదవి
- వైఎస్సార్ సీపీ ఎంపీల హర్షం - వెంకయ్య ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు - పార్టీ తరపున ఆయనకు సంపూర్ణ మద్దతు సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడికి వైఎస్సార్సీపీ ఎంపీలు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, బుట్టా రేణుక మంగళవారం వెంకయ్యను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. వెంకయ్య అపారమైన అనుభవానికి సరైన పదవి దక్కనుందని పేర్కొన్నారు. ఇది తెలుగు ప్రజలందరికీ హర్షదాయకమని, ఆయనకు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి మీడియాతో మాట్లాడారు. వెంకయ్యతో తనకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉందన్నారు. 1978లో వెంకయ్య నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి పోటీ చేసినప్పుడు తమ తండ్రి పూర్తి మద్దతు ప్రకటించి ఆయనను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో వెంకయ్య మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని మేకపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకయ్య ఏ పదవిలో ఉన్నా ఏపీ, తెలంగాణ ఆభివృద్ధి విషయంలో ముందుం టారని వైవీ సుబ్బారెడ్డి కితాబిచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులకు పోటీ వద్దని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముందు నుంచి చెబుతున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు.. ఎన్నో పదవులు చేపట్టిన వెంకయ్య ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా తన బాధ్యతలను సమర్థంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్షాలను కలుపుకొనిపోయి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని నమ్ముతు న్నామన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో తాను పీజీ చదివే రోజుల్లో వెంకయ్య విద్యార్థి సంఘానికి నాయకుడిగా వ్యవహరించేవారని వరప్రసాదరావు గుర్తు చేసుకున్నారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవమని బుట్టా రేణుక చెప్పారు. -
వెంకయ్యకు పెద్ద పరీక్షే: చంద్రబాబు
- ఆయన రాజకీయాలు మాట్లాడకుండా కంట్రోల్‌గా ఉండాలి - ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు అభినందనలు సాక్షి, అమరావతి : గలగలా రాజకీయాలు మాట్లాడే వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతిగా రాజకీయాలు మాట్లాడకుండా ఉండటం పెద్ద పరీక్షని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన జీవనం మొత్తం రాజకీయమేనని, దానితో ఇప్పటికిప్పుడు వెంటనే తెగతెంపులు చేసుకోవాలంటే కష్టమేనన్నారు. ఆ పరీక్షలో ఆయన పాసవుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడికి ఫోన్‌చేసి హృదయ పూర్వక అభినందనలు తెలిపినట్లు చెప్పారు. ఆయన్ను ఎంపిక చేసిన ప్రధానికి, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందా అని ప్రశ్నించగా... అభివృద్ధిలో నష్టం ఉంటుందనుకోనని, కానీ రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో కొందరు సరిగా ఓటు వేయకపోవడంపై స్పందిస్తూ... తమ పార్టీ వారికి నాలుగైదు సార్లు అవగాహన కల్పించానని, వారు అక్కడికెళ్లి ఏంచేశారో తనకు తెలియదన్నారు. ఎమ్మెల్యేలు ఓటు వేయలేకపోవడం రాష్ట్రానికే అవమానమన్నారు. శ్రీలంకలో ఏపీ ఇండస్ట్రియల్ పార్కు పెడతాం: ఫార్మా, టూరిజం, హార్టికల్చర్ రంగాల్లో కలిసి పనిచేయాలని శ్రీలంక, ఏపీ నిర్ణయించాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి 600 ఎకరాల్లో ఏపీ కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు శ్రీలంక ప్రకటించింది. శ్రీలంక నుంచి వచ్చిన పారిశ్రామిక ప్రతినిధుల బృందం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. -
గాజువాక సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు
విశాఖపట్టణం: గాజువాక సబ్‌రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో వెంకయ్యనాయుడుకు చెందిన ఆస్తులపై విశాఖ, తిరుపతిలోని ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. గతంలో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది. గత మూడేళ్లుగా గాజువాక సబ్‌రిజిస్ట్రార్‌గా వెంకయ్యనాయుడు విధులు నిర్వహిస్తున్నారు. -
రాష్ట్రానికి మూడు హడ్కో అవార్డులు
- మిషన్ భగీరథకు వరుసగా రెండో ఏడాదీ అవార్డు - హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో వినూత్న ఆలోచనలను అమలు చేసినందుకు పలు సంస్థలకు, ప్రభుత్వ పథకాలకు ప్రదానం చేసిన అవార్డుల్లో తెలంగాణకు మూడు అవార్డులు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మంచి నీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్న పథకంగా భగీరథకు వరుసగా రెండో ఏడాది కూడా లభించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య చేతుల మీదుగా చీఫ్ ఇంజనీర్ సురేందర్ రెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భగీరథ పనులు 60–65 శాతం పూర్తయ్యాయని, త్వరలో మలివిడత పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభింపజేయాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కు అవార్డు లభించింది. హడ్కో సాయంతో సుమారు 14 వేల ఎకరాల్లో చేపడుతున్న హైదరాబాద్ ఫార్మా సిటీకి, అలాగే 12,500 ఎకరాల్లో చేపట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు కలిపి ఈ అవార్డు దక్కింది. వెంకయ్య చేతుల మీదుగా టీఎస్ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి అవార్డు అందుకున్నారు. గ్రామీణ స్థాయిలో ఆర్థికాభివృద్ధిని సాధించినందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం సురేందర్ రాజు అవార్డు అందుకున్నారు. -
సీఎంగా బీరేన్ ప్రమాణం
-
సీఎంగా బీరేన్ ప్రమాణం
మణిపూర్‌లో 8 మందికి మంత్రి పదవులు.. మోదీ శుభాకాంక్షలు ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బుధవారం కొలువైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రిగా నాంగ్తోంబం బీరేన్ సింగ్, మంత్రులుగా మరో ఎనిమిదితో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి ఉప ముఖ్యమంత్రి పదవి సహా అత్యధికంగా నాలుగు మంత్రి పదవులు దక్కాయి. దీంతో ఎన్పీపీ తరఫున గెలిచిన అందరికీ మంత్రిపదవులు లభించినట్లైంది. ఎన్పీపీకి చెందిన వై.జాయ్‌కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో బీజేపీ నుంచి బిశ్వజిత్ సింగ్, ఎన్పీపీ నుంచి జయంత్‌కుమార్ సింగ్, హావ్కిప్, కాయిసీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నుంచి దిఖో, ఎల్జేపీ నుంచి కరమ్ శ్యామ్, బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఉన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ, మణిపూర్ మాజీ సీఎం ఇబోబి సింగ్ తదితరులు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. మణిపూర్ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు బీరేన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాలేకపోయిన అమిత్ షా, వెంకయ్య విమానంలో సాంకేతిక లోపం కారణంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేకపోయారు. బుధవారం ఉదయం 9.39 గంటలకు వారి చార్టర్డ్ విమానం ఢిల్లీనుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు బయలుదేరింది. తదనంతరం విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని 10.17 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి వెనక్కు తీసుకొచ్చాడు. ఆ సమయంలో విమానంలో షా, వెంకయ్యలతోపాటు మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. -
ఏపీకి ఎక్కువ సాయం
• సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభంలో అరుణ్ జైట్లీ • ముందు చూపుతో వెళ్తున్నాం : ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: జాతీయ స్థాయి కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించే సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. దేశ జీడీపీ కంటే ఏటా మూడు నుంచి నాలుగు శాతం అధిక వృద్ధిరేటును నమోదు చేసే శక్తి సామర్థ్యాలు ఏపీకి ఉండటంతో అధిక నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో కొంత నష్టం జరిగినప్పటికీ రెండున్నరేళ్లలో ఏపీ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతోందన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న 23వ సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పార్ట్నర్ షిప్ సమ్మిట్‌ను శుక్రవారం ఆయన విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తయారీ, సేవల రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు. రాజదాని నిర్మాణంతో పాటు, పోలవరం తదితర భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, కోస్టల్ ఎకానమీ, టూరిజం వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. భారతీయుల ఆలోచనా ధోరణి క్రమేపీ మారుతోందని, అభివృద్ధి కోసం సంస్కరణలను స్వాగతిస్తున్నారన్నారు. అందుకే జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి కీలక సంస్కరణలను ప్రజల మద్దతుతో ప్రవేశపెట్టగలిగామన్నారు. పెద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా నడుస్తున్న ఇతర ఆర్థిక వ్యవస్థలను అంతమొందించామని, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా బ్లాక్‌మనీ లావాదేవీలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ఈ కీలక సంస్కరణలతో భవిష్యత్తులో కేంద్రానికి భారీగా ఆదాయం పెరగనుందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచమంతా పెట్టుబడుల కోసం ఇండియా వైపు చూస్తుంటే ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ పథకాల కోసం కేంద్రం ఇప్పటికే రూ.1.43 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. వీరితోపాటు కేంద్రమ ంత్రులు నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సురేష్ ప్రభు కూడా మాట్లాడారు. 2050 నాటికి ట్రిలియన్ పెట్టుబడులే లక్ష్యం: ముఖ్యమంత్రి వచ్చే ఏడాదికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. 2050 నాటికి ఒక ట్రిలియన్ పెట్టుబడులు రాబట్టాలనే పట్టుదలతో ముందు చూపుతో వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు గత ఏడాది దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. సీఐఐ సదస్సులో భాగంగా ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్–రెడీ ఫర్ ద వరల్డ్, రెడీ ఫర్ ద ఫ్యూచర్’ అంశంపై ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేశారు. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా రాజధాని ‘అమరావతి’ని నిర్మించనున్నట్లు తెలిపారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కేవలం 7.5 శాతం మాత్రమే వృద్ధి రేటు సాధించిందని, ఆంధ్రప్రదేశ్ మాత్రం 10.99 శాతం వృద్ధి రేటుతో ముందుందని తెలిపారు. గతేడాది సీఐఐ భాగస్వామ్య సదస్సులో జరిగిన ఒప్పందాలతో పాటు మిగిలినవి కూడా కలుపుకుంటే మొత్తం 927 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. వీటి మొత్తం పెట్టుబడి విలువ రూ. 5,30,715 కోట్లు కాగా, 10,05,506 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జి.ఎం.రావు, సుజ్లాన్ ఎనర్జీ చైర్మన్ తుల్సి తంతి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభన కామినేని, సీఐఐ ప్రెసిడెంట్ నౌషధ్ ఫోరబ్స్, కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్పి టక్కర్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్ అరోఖ్యారాజ్తో పాటు 50 దేశాలకు చెందిన అధికారులు, 2,500 మందికిపైగా పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. రూ.7,000 కోట్ల పెట్టుబడులు: బిర్లా ఏపీతో బిర్లా గ్రూపునకు సుదీర్ఘ అనుబంధముందని ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 11,000 మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. రెండేళ్లలో మరో 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాడిపత్రిలో ఉన్న సిమెంట్ పరిశ్రమను రూ.3,000 కోట్లతో విస్తరించడంతో పాటు, అనంతపురం జిల్లాలో రూ.3,000 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.1,300 కోట్లతో ఐడియా 3జీ, 4జీకి సంబంధించి 2,500 సెల్సైట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కళ్యాణి మాట్లాడుతూ రూ.1,400 కోట్లతో నెల్లూరులో ఆటో కాంపోనెంట్ యూనిట్, అనంతపురంలో రూ.1,300 కోట్లతో డిఫెన్స్, ఏరోస్పేస్ టెక్నాలజీ యూనిట్ ఏర్పాటు చేయాలని గత ఏడాది సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేస్తామని తెలిపారు. -
ఒకరినొకరు పొగుడుకోవడమే సరిపోయింది
-
2 కోట్ల చేప పిల్లల పెంపకం లక్ష్యం
శివ్వంపేట: డివిజన్ పరిదిలోని చెరువుల్లో 2కోట్ల25లక్షల చేప పిల్లలను పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మెదక్ డివిజన్ మత్స్యకార అదికారి ఎం.వెంకయ్య అన్నారు. సోమవారం శివ్వంపేటలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతు వర్షాలు సమృద్దిగా కురిసినందున గ్రామాల్లోని చెరువుల్లో జలకల సంతరించుకుందని చేపలపై జీవనోపాది పొందుతున్న మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం చేప పిల్లలను ప్రతి చెరువులో వేయడం జరుగుతుందన్నారు. మెదక్ డివిజన్ పరిదిలోని 300 చెరువుల్లో 2కోట్ల 25లక్షల బొచ్చ, రౌ, మిర్గ రకాల చేప పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి గ్రామాల్లోని చెరువుల్లో చేప పిల్లలను వేయడం ప్రారంబించడం జరిగిందని చెప్పారు. డివిజన్ పరిదిలో తూప్రాన్ పెద్దచెరువు, పోచారం ప్రాజెక్టుల్లో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా చేపలను వదిలే కార్యక్రమం జరుగనుందన్నారు. చేపలను పెంచుకొని ఆర్థిక అభివృద్ది చెందాలని మత్స్యకారులకు ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు ఎందుకు తేల్చి చెప్పడం లేదు’
హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, బీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ఏడు జిల్లాలకు కేంద్రం రాయితీలు ప్రకటించిందని హడావుడి చేస్తున్నారని, కేంద్రం ప్రకటించిన రాయితీలు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనివే తప్ప కొత్త విషయం కాదన్నారు. కేంద్రం ఏపీతో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బిహార్‌కు కూడా రాయతీలు ఇచ్చిందన్నారు. రాయితీలు గొప్ప విషయమైతే ఆ రాష్ట్రాలు ఎందుకు పట్టించుకోవడం లేదని బుగ్గన సూటిగా ప్రశ్నించారు. ప్రజలను గందరగోళంలో పడేయటమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని ఆయన ధ్వజమెత్తారు. హోదా తప్ప మాకేమీ వద్దని చంద్రబాబు ఎందుకు తేల్చి చెప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమైనదని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న చంద్రబాబు, వెంకయ్య లాంటి వారుకూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. -
'హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదు'
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... హోదాకు బదులుగా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించామన్నారు. హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని వెంకయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెవెన్యూ లోటును ఐదేళ్లపాటు కేంద్రమే భరిస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు అన్ని ముందుగానే తొలగించామని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. 1981లోనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని... కానీ నాటి నుంచి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఏ పారిశ్రామికవేత్త చెప్పలేదన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని మరోసారి వెంకయ్య స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదని తెలిపారు. అంతకుమందు విశాఖపట్నం విమాశ్రయంలో దిగిన ఎం వెంకయ్యనాయుడుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు కార్యాలయం వరకు ర్యాలీగా వెంకయ్యను తీసుకువచ్చారు. -
ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి
-
పెండింగ్ అంశాలు 2 వారాల్లో పరిష్కరిస్తాం
• కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ హామీ • వివరాలు వెల్లడించిన వెంకయ్య, సుజనా సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలను రెండు వారాల్లోపు పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలి పారు. మంగళవారం రాజ్‌నాథ్‌తో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, వెంకయ్య సమావేశమయ్యారు. విభజన చట్టం హామీల అమలుపై చర్చించారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు వెంకయ్య వెల్లడించారు. విభజన చట్టంలోని కొన్ని అంశాల అమలు పెండింగ్‌లో ఉందని, దీనిని సత్వరం పరిష్కరించాలని రాజ్‌నాథ్‌ను కోరామన్నారు. ఈ సందర్భంగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని రాజ్‌నాథ్ పిలిపించి పెండింగ్ అంశాలపై కూలంకషంగా చ ర్చించి నట్లు చెప్పారు. ఏ వివాదాలూ లేని అంశాలు, రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన వాటి విషయంలో చొరవ తీసుకొని, పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శిని రాజ్‌నాథ్ ఆదేశించారన్నారు. రెండు వారాల్లోపు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు, ఏపీకి ఇవ్వాల్సిన సంస్థల కేటాయింపునకు హోం మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండి సంబంధిత శాఖల్లో అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారానికి ఆదేశించాలని కోరామన్నారు. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలపై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చిస్తున్నట్లు చెప్పారు. సీట్ల పెంపుపై ఏజీ అభిప్రాయాన్ని అధ్యయనం చేస్తామన్నారు అసెంబ్లీ సీట్లు పెంపుపైనా సమావేశంలో రాజ్‌నాథ్‌తో చర్చించినట్లు వెంకయ్య తెలిపారు. ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుందామని హోం మంత్రి చెప్పారన్నారు. రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సమావేశమై నెలలోపు ఏపీలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే, ఈ నెల 19న మెడిటెక్ పార్క్ ప్రారంభించాలని కోరగా, సూత్రపాయంగా అంగీకరించారని తెలిపారు. -
పింగళి వెంకయ్యకు నివాళి
నడిగూడెం: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 140వ జయంతి కార్యక్రమాన్ని లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని రాజావారి కోటలో ఘన ంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు మాట్లాడారు. జాతీయ జెండాను పింగళి వెంకయ్య నాటి మునగాల పరగణాకు పాలనా కేంద్రమైన నడిగూడెం రాజావారి కోటలో రూపొందించారన్నారు. ఇక్కడ జాతీయ జెండా రూపొందడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జె.యల్లేశ్వరావు, రామ్‌తేజ, జె.నాగరాజు, గోపి, రంజిత్, అంజయ్య, దున్నా సురేష్, గంటెపంగు నడిపి తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుని అనుమానాస్పద మృతి
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మల్కాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దాసరి వెంకయ్య(70) తన పొలంలో పెసర పంట వేసిన అనంతరం ఇంటికి వచ్చాడన్నారు. ఇంట్లో ఒక్కడే ఉండడంతో ఆదివారం సాయంత్రం ఇంట్లో నుండి దుర్వాసన రాగా గ్రామస్థులు ఇంట్లోకి వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడన్నారు. అతని భార్య రుక్కమ్మ కోళాపల్లిలో ఉంటుంది. డబ్బుల కోసమే అతడిని హత్యచేశారని కటుంబీకులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని జోగిపేట సీఐ వెంకటయ్య, ఎస్ఐ శ్రీధర్ పరిశీలించి మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఛలో ఢిల్లీ కార్యక్రమంలో అపశ్రుతి..
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకయ్య గుండెపోటుతో మృతిచెందారు. లోక్‌నాయక్ ఆస్పత్రిలో ఆయన మృతదేహానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నివాళులర్పించారు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో 300మంది కాంగ్రెస్ నేతలు విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ప్రత్యేక హోదా అమలు డిమాండ్‌తో చేపట్టిన కోటి సంతకాలను రఘువీరా నేతృత్వంలో ప్రధాని మోదీకి సమర్పించనున్నారు. -
తాటిచెట్టుపై నుంచి పడి..
సంగెం: వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంగెం మండలం లోహిత గ్రామంలో కల్లు కోసం తాటిచెట్టు పైకెక్కిన గీతకార్మికుడు ప్రమాదవశాత్తూ కిందపడి మృతిచెందాడు. మృతుడిని అదే గ్రామానికి చెందిన కక్కెర్ల వెంకయ్య(48)గా గుర్తించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
రైతులకు సమగ్ర పంటల భీమా పథకం
-
'ఆ ముగ్గురు ప్రజలను మోసం చేశారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ ఏపీ ప్రజల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. ఏపీ ప్రజల ప్రత్యేక హోదా ఆశలపై మోదీ నీళ్లుచల్లారని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో లోపాలుంటే ఏడాదిన్నరగా ఎందుకు స్పందించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని రఘువీరా ప్రశ్నించారు. ప్రధాని మోదీ మోసపూరిత నిజస్వరూపాన్ని బీహర్ ఎన్నికల్లో ఎండగడతామని చెప్పారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఏ హోదాతో ఐఏఎస్ అధికారులకు సూచనలిచ్చారని నిలదీశారు. -
'అమరావతి అజరామరంగా నిలుస్తోంది'
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అమరావతి అజరామరంగా నిలుస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోది అభివృద్ధి మంత్రంతో ప్రపంచం మొత్తం ప్రస్తుతం భారత్ వైపు చూస్తుందన్నారు. దేశం మాత్రం తెలుగురాష్ట్రాల వైపు చూస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. తెలుగు ప్రజల క్షేమం కోరుకునే వ్యక్తిగా తాను హామీల అమలుకు కృషి చేస్తానన్నారు. స్వయానా భారత ప్రధాని నరేంద్రమోదీనే పార్లమెంట్ ప్రాంగణం నుండి మట్టిని, పవిత్ర యమునా నది నుండి నీటిని తీసుకొచ్చి నేను సైతం అంటూ రాజధాని నిర్మానానికి తీసుకొచ్చారని అన్నారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు లాంటి గొప్ప రాజవంశాల పాలనకు వారసత్వంగా అమరావతి అజరామరమై నిలుస్తోందన్నారు. -
'అమరావతి అజరామరంగా నిలుస్తోంది'
-
శంకుస్థాపనలో 1.15 గంటలు
-
ప్రతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు..
న్యూఢిల్లీ : ప్రతి విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని, అయితే ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఆయా రాష్ట్రాలు కోరితేనే పరిశీలిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ అన్ని విషయాల్లో కేంద్రం కల్పించుకోదని చెప్పారు. స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీల ఎంపికలో ఎటువంటి రాజకీయం లేదన్నారు. స్మార్ట్ సిటీలు, నగరాల అభివృద్ధి, అందరికీ ఇళ్లు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభిస్తారన్నారు. 40 క్రితం ఎమర్జెన్సీ తన జీవిత గమనాన్ని మార్చేసిందని వెంకయ్య అన్నారు. ఆనాటి ఆరాచకాలను యువతకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఇది చంద్రబాబు ఘోర వైఫల్యమే
- బడ్జెట్లో ఏపీకి ఏదీ సాధించలేకపోయారు: అంబటి రాంబాబు - రాష్ట్ర ప్రజలను బాబు, మోదీ, వెంకయ్య మోసగించారు సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ, రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేకపోవడం సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, కేంద్ర మం త్రి వెంకయ్యనాయుడు ఇద్దరూ కలిసి తెలుగు ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు తెచ్చేందుకు టీడీపీ, బీజేపీ కూటమికి ఓట్లేయాలని ఎన్నికలకు ముందు కోరిన వారిద్దరూ అధికారంలోకి వచ్చాక మాట మార్చడాన్ని చూస్తే అసలు రంగేమిటో తెలిసిపోతోందన్నారు. టీడీపీ, బీజేపీ కలయికతో రాష్ట్రానికి ఏదో ఒరుగుతుందని ఓట్లేసిన తెలుగు ప్రజలను సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ కలసి నిట్టనిలువునా ముంచేశారన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు ఇచ్చి దులిపేసుకున్నారని, విభజన చట్టంలో పేర్కొన్న వాటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని దుయ్యబట్టారు. మొసలి కన్నీళ్లతో ఏం లాభం? రాష్ట్రం రెక్కలు విరిచేసి పరిగెత్తమంటే ఎలా సాధ్యమని అడుగుతున్న సీఎం బడ్జెట్‌కు ముం దు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలను సమావేశపరిచి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయారన్నారు.బాబు సరైన తరుణంలో స్పందించకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ప్రయోజనం ఏమిటన్నారు. తీరిగ్గా రాష్ట్రానికి అన్యా యం జరిగిందంటే ప్రయోజనం ఏమిటన్నారు. ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేశానని సీఎం చెప్పడాన్ని అంబటి ఎద్దేవా చేశారు. ‘ఆయన ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లడంపై చూపే శ్రద్ధను రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవటంపై చూపితే బాగుండేది’ అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో ప్రగల్భాలు పలికిన వెంకయ్యనాయుడు బడ్జెట్లో ఆ విషయాన్ని ఎందుకు చేర్చలేదని అంబటి ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇస్తామని విభజన చట్టంలో పేర్కొనలేదని వెంకయ్య చెప్పటాన్ని చూస్తుంటే ఈ ప్రాజెక్టు ఇక రాదేమో అన్న అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీయే, టీడీపీ ప్రభుత్వాలు కూడబలుక్కునే పోలవరం ప్రాజెక్టును నీరుగారుస్తున్నట్లుగా ఉందన్నారు. కేంద్రం బడ్జెట్లో పోలవరానికి రూ.వంద కోట్లు , టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు కేటాయించడం చూస్తే పోలవరం ఇక రాదేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వాల్తేరులో రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని కూడా రైల్వే బడ్జెట్లో చేర్చకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ఏమీ సాధించలేక పోయారని అంబటి విమర్శించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా ఓ దేశాధ్యక్షుడి మాదిరిగా మలేసియా, సింగపూర్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు వారంతా రాష్ట్ర రైతులకు ఏదో ఒరగబెడతారనుకోవడం తప్పన్నారు. -
ఢిల్లీ స్మార్ట్ సిటీ నిర్మాణానికి బార్సిలోనా సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం న్యూఢిల్లీని స్మార్ట్ సిటీగా నిర్మించడంలో ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ)లకు సాంకేతిక సహకారం అందించడానికి స్పెయిన్‌లోని బార్సిలోనా నగర మేయర్ జేవియర్ ట్రియాస్ అంగీకరించారు. ఆయన ఆహ్వానం మేరకు బార్సిలోనాలో పర్యటిస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య బుధవారం బార్సిలోనా టౌన్ హాల్‌ను సందర్శించారు. న్యూఢిల్లీ స్మార్ట్‌సిటీ నిర్మాణానికి బార్సిలోనా ప్రాంతీయ అర్బన్ డవలప్మెంట్ ఏజెన్సీ సాంకేతిక సహకారాన్ని అందించడానికి మేయర్ ట్రియాస్ సుముఖత వ్యక్తం చేశారు. -
రైతుల పాలిట శాపం ఈ కర్మాగారం
శ్రీకాళహస్తి: కోకకోలా కర్మాగారం రైతుల పాలిట శాపంగా మారిందని సీపీఐకు అనుబంధంగా ఉన్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామిశెట్టి వెంకయ్య అన్నారు. మండలంలోని కాపుగున్నేరి,చల్లపాళెం గ్రామాల సమీపంలోని హిందుస్థాన్ కోకకోలా బేవరేజెస్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గ్రీన్‌బెల్ట్ భూములను బుధవారం ఆయనతోపాటు పలువురు సీపీఐ నాయకులు, స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకయ్య మీడియూతో మాట్లాడుతూ కిలోమీటర్ పొడవున పంట కాలువను కోకకోలా కర్మాగారం వారు ఆక్రమించారని ఆరోపించారు. అంతేకాకుండా 850అడుగుల లోతుతో 7బోర్లు వేసిన కారణంగా చుట్టుపక్కల చిన్నపాటిబావులు,బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయూరని ఆవేదన వ్యక్తంచేశారు. ఏఐటీయూ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ కర్మాగారం వదిలేస్తున్న కలుషితమైన నీళ్లతో పచ్చటి పంటపొలాలకు నష్టం వాటిలిల్లుతోందన్నారు. సోలార్‌పవర్ కోసం ఏర్పాటు చేసిన మిషనరీ నిబంధనల ప్రకారం పనిచేయకపోవడంతో సమీప ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయని విమర్శించారు. ఫ్యాక్టరీకి చెందిన మురుగునీరును రాత్రి సమయంలో పంటకాలువల్లోకి వదిలిపెడుతున్నారని.... దాంతో పంటలు సర్వనాశనం అవుతున్నాయని ఆవేదన చెందారు.గ్రీన్‌బెల్ట్ భూముల పేరుతో ప్రభుత్వ పంటకాలువలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ చల్లపాళెంకు చెందిన ఓ టీడీపీ నాయకుడు ఫ్యాక్టరీకి తొత్తుగా మారి పోయి రైతులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వపంట కాలువలు ఆక్రమించి...ఫ్యాక్టరీకి విక్రయించి నాయకులు లక్షలు నొక్కేశారని ఆరోపించారు. చల్లపాళెం మాజీ సర్పంచ్ జయరామిరెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీకి పొలాలు తీసుకునే సమయంలో ఇంటి కో ఉద్యోగం ఇస్తామని చెప్పిన యాజ మాన్యం... బోనస్‌గా ఇంటికో రోగిని త యారుచేసిందని ఆవేదనవ్యక్తంచేశారు. ఆక్రమణల మాట వాస్తవం కాదు.... లక్ష్మి బాలాజీ వారి నుంచి హిందూస్థాన్ కోకకోలా బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసింది. అంతేతప్ప మేము భూములు కొనుగోలు చేయలేదు. పవర్‌పాండే ద్వారా వ్యాధులు రావడంలోను నిజంలేదు. ఫ్యాక్టరీ కలుషితమైన నీటిని రాత్రి సమయంలో పంటకాలువలకు వదలడంలేదు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాం. స్థానికులకు అన్యాయం చేయడంలేదు. -బీఆర్సీ రెడ్డి,కోకకోలా ఫ్యాక్టరీ ఇన్చార్జి -
పారిశుద్ధ్య ప్రాజెక్టుకు సహకారం
మరుగుదొడ్ల నిర్మాణానికి గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సాయం న్యూఢిల్లీ: దేశంలో యూజర్ ఫ్రెండ్లీ మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కలసి పనిచేయాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించడానికి కేంద్రం ఇటీవలే స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్, ట్రస్టీ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. దేశంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించడం, దానికి సాంకేతిక సహకారం అందించడంపై వీరు చర్చించారు. ప్రస్తుతం దేశంలో 1.20 కోట్ల ఆవాసాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని, 2019 నాటికి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మిస్తామని వెంకయ్య వివరించారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పారిశుద్ధ్య పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నారని, దీనికి గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించాలని కోరారు. కేంద్రం చేపడుతున్న పథకాలను ప్రశ ంసించిన గేట్స్.. పరిశోధన, సాంకేతికత విస్తరణలో సమర్థత కలిగిన తమ ఫౌండేషన్ భారత ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, గేట్స్ ఫౌండేషన్ మరుగుదొడ్లు, మురుగు నీటి నిర్వహణలో నవీన సాంకేతిక పరిజ్ఞానం, మురుగు నీటి పారుదలలో వికేంద్రీకరణ పద్ధతులు, పారిశుద్ధ్య రంగ నిర్వహణలో సామర్థ్య పెంపు, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంచడం వంటి అంశాల్లో కలిసి పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వెంకయ్య ప్రశంసించారు. ప్రధాని మోదీతో బిల్ గేట్స్ భేటీ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్, ట్రస్టీ బిల్ గేట్స్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆయన చేస్తున్న కృషిని, పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేసేందుకు చేపట్టిన జన్‌ధన్ యోజన పథకాన్ని ఆయన ప్రశంసించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని అన్ని పాఠశాలల్లో ఓకే ఏడాదిలో మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారన్నారు. సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించి నాలుగు కొత్త వ్యాక్సిన్లను ప్రవేశపెట్టేందుకు భారత్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ రంగంలో భారత్‌తో తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. ప్రజాసేవ, దాతృత్వానికి సంబంధించి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. మురుగునీటి నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయం తదితర అంశాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి తన భావాలను బిల్, మిలిండాలతో మోదీ పంచుకున్నారు. -
షరతుల్లేని రుణమాఫీ కోసం పోరాటం
కాకినాడ సిటీ : షరతులు లేని రైతు రుణమాఫీ చేసేవరకు రైతు సంఘం దశలవారీ పోరాటం నిర్వహిస్తుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద రైతుసంఘం ఆధ్వర్యంలో 72గంటల రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతుల అండతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులతో దొంగాట ఆడుతున్నారని, ఆయన జిమ్మిక్కులను అన్నదాతలు నమ్మరని పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకులు బంగారం వేలం కోసం నోటీసులు జారీ చేశాయని, వాటిని ఉపసంహరించుకోకుంటే బ్యాంకుల ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతు కుటుంబానికి రూ.1.5లక్షల రుణమాఫీ చేస్తామని చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోకపోవడం దారుణమన్నారు. పాత రుణాలు రద్దు కాకపోగా, బ్యాంకులు కొత్త అప్పులను ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, రుణమాఫీ వర్తించని కౌలు రైతులకు రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు మూడు రోజులపాటు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రిలే నిరాహార దీక్షలో రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాళ్ల అయ్యన్న, కూరాకుల చినబాబు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తాటిపాక మధు, రైతుసంఘం నాయకులు పెదిరెడ్డి సత్యనారాయణ, కోమర్తి శ్రీనివాస్, ములికి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ వద్ద రైతు సంఘ నాయకుల ధర్నా బోట్‌క్లబ్ (కాకినాడ) : రుణమాఫీపై రోజుకోమాట చెబుతున్న ప్రభుత్వ తీరుపై రైతులు కదం తొక్కారు. రైతులందరికీ షరతులు లేని రుణమాఫీ వర్తింపజేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 174ను సవరించాలని కోరుతూ స్థానిక డీసీసీబీ కార్యాలయం వద్ద సోమవారం రైతు సంఘ నాయకులు, సహకార సంఘ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ధర్నా నిర్వహించారు. ఏపీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంకే సత్యాన్నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ షరతులతో చాలా మంది రైతులుకు రుణమాఫీ వర్తించని పరిస్థితి నెలకొందన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణమాఫీ అమలు నిబంధన సరికాదన్నారు. ఆధార్ కార్డు, పాస్‌బుక్‌లు లేనివారికి రుణమాఫీ వర్తించని పరిస్థితి ఉందన్నారు. డిసెంబర్ 2013 నాటికి అప్పు పొందిన పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని, ఆ తర్వాత మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని జీఓలో పేర్కొన్నారన్నారు. దీని కారణంగా 13 జిల్లాలో సుమారు రూ.మూడు వేల కోట్లు రుణమాఫీని కోల్పోతున్నారన్నారు. కౌలుదారులకు రుణమాఫీ వర్తింపు వల్ల సొంత భూమి ఉన్న రైతులకు రుణమాఫీ వర్తించడం లేదన్నారు. రైతులకు తెలియకుండా రెవెన్యూ అధికారులు కౌలు రైతులకు గ్రామంలోని ఏదో ఒక సర్వే నంబర్ వేసి కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేశారన్నారు. దీని వల్ల నిజమైన రైతుకు రుణమాఫీ వర్తించని పరిస్థితి నెలకొందన్నారు. రైతులు తిరగబడుతున్నారు : జీరో వడ్డీ వస్తుందని రైతుల నుంచి రుణాలు వసూలు చేసి, వాటిని రీ షెడ్యూల్ చేశామని, దీని కారణంగా ఎంతో మంది రైతులకు రుణమాఫీ వర్తించని పరిస్థితి నెలకొందని సహకార సంఘ ఉద్యోగులు వాపోయారు. ప్రస్తుతం గ్రామాల్లోకి వెళితే రైతులు రుణమాఫీ రాకుండా చేశారని తమపై తిరగబడుతున్నారన్నారు. ప్రభుత్వం షరతులు లేకుండా రుణమాఫీ చేయకుండా తాము ఉద్యోగాలు చేయలేమని వాపోయారు. ధర్నా చేస్తున్న రైతులకు డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మద్దతు పలికారు. కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి తోట వెంటకరామయ్య, జిల్లా అధ్యక్షుడు కె. ఆదినారాయణ, సీఐటీయూ నాయకులు దువ్వా శేషుబాబ్జి, అధిక సంఖ్యలో సహకార సంఘ అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. జీఓ సవరణతో రైతులకు ఉపయోగం రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 174 జీఓను సవరించి సోమవారం కొత్త జీఓ 181ని విడుదల చేసిందని డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత విడుదల చేసిన జీఓ ప్రకారం డిసెంబర్ 2013 వరకూ ఉన్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, ప్రస్తుత జీఓ ప్రకారం మార్చి 2014 వరకూ తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయని వివరించారు. -
ప్రభుత్వంలో జోక్యం చేసుకోం: ఆర్ఎస్ఎస్
సంఘ్‌కు ఎలాంటి పాత్ర ఉండదు: వెంకయ్య న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైన బీజేపీకి అవసరమైతే సలహాలు మాత్రమే ఇస్తామని, ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చమని ఆ పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. బీజేపీకి రిమోట్ కంట్రోల్‌గా వ్యవహరించబోమని పేర్కొంది. మరోవైపు ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి బీజేపీ నేతల తాకిడి కొనసాగుతోంది. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే సంఘ్ అగ్ర నేతలను కలిశారు. ఇతర ముఖ్య నేతలు కూడా సంఘ్‌తో మంతనాల్లో మునిగిపోయారు. కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని సంఘ్ జాతీయ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ ఆదివారం జైపూర్‌లో స్పష్టం చేశారు. తాము రిమోట్ కంట్రోల్‌గా వ్యవహరించబోమన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తాము బీజేపీకి ఎలాంటి మార్గనిర్దేశనం చేయలేదని చెప్పారు. సంఘ్ సిద్ధాంతాలు వారికి(బీజేపీ నేతలకు) తెలుసునని, ఆ దిశగానే వారు పనిచేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరులో కానీ, రాజకీయాల్లో కానీ తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే సలహాలు మాత్రం ఇస్తామని తెలిపారు. ఇక మోడీ ప్రభుత్వ పనితీరును ప్రజలే సమీక్షిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా ఇదే ధోరణిలో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటులో సంఘ్‌కు ఎలాంటి పాత్ర ఉండబోదన్నారు. -
అతివలకు స్వస్థతనిస్తూ ...
ఆ ఆసుపత్రిలో ముందురోజు రాత్రి ఏడుగురు మహిళలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. అప్పటికే ఆ ప్రాంతానికి వరద తాకిడి ఉందని హెచ్చరికలు అందుతున్నాయి. అనుకున్నంత పనీ అయింది. మర్నాడు పొద్దున వరదనీరంతా ఆసుపత్రిలోకి వచ్చేసింది. కిందగదిలో ఉన్న ఈ ఏడుగురు మహిళల మంచాల కిందకు నీరుచేరిపోయింది. ఎవరూ కూడా మంచం దిగే పరిస్థితుల్లో లేరు. విషయం డాక్టర్‌కి తెలియగానే మెడలో స్టెతస్కోప్ పక్కన పడేసి మరో ఇద్దరు అటెండర్ల సాయంతో మహిళల్ని భుజాలపై వేసుకుని నిచ్చెనసాయంతో ఆసుపత్రి పై అంతస్థుకి తీసుకెళ్లారు. కళ్లముందే మంచాలన్నీ నీటిలో కొట్టుకుపోవడం చూసి ఆ మహిళలంతా మాకోసం ఆ దేవుడే మీరూపంలో వచ్చాడంటూ డాక్టర్‌కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ డాక్టర్గారి పేరే వెంకయ్య. ప్రశాశం జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తన వైద్యజీవితాన్నంతా పల్లెకే అంకితం చేసిన ఆయన ఇవాళ ఎంతోమంది మహిళలకు ఆరోగ్యదాత. కుటుంబ నియంత్రణకు సంబంధించి ‘బటన్హోల్ ఆపరేషన్’ అనే పేరు వినే ఉంటారు. 1997 సంవత్సరంలో ఈ సరికొత్త పద్ధతిని తెలుగువారికి పరిచయం చేసిన వైద్యుడు వెంకయ్యే. ఆయన ఇప్పటివరకూ 90 వేల కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ శస్త్రచికిత్స ఎక్కువమందికి అందుబాటులోకి రావడం కోసం మరో 200మంది డాక్టర్లకు ఈ శస్త్రచికిత్సపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ప్రకాశం జిల్లాలోని మున్నూరు గ్రామానికి చెందిన కోటయ్య అనే రైతుకి ఏకైక సంతానం వెంకయ్య. పెద్దయ్యాక మెడిసిన్ చదివి తన ఊరివాళ్లకు వైద్యం చేయాలన్నది ఆయన చిన్ననాటి కల. తీరా డాక్టర్ అయ్యాక ఎక్కడ వైద్యం చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకునే చాలామందికి భిన్నంగా వెంకయ్య చిన్నప్పటి తన కలకే కట్టుబడ్డారు. ‘‘గుంటూరు మెడికల్ కాలేజీలో ఎమ్ఎస్ జనరల్ సర్జన్ పూర్తిచేశాక ప్రకాశం జిల్లాలో ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ఉలవపాడు ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. కుటుంబనియంత్రణ ఆపరేషన్‌లో ఇప్పటికీ అనుసరిస్తున్న పద్ధతి వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి ‘బటన్హోల్ ఆపరేషన్’ అవసరాన్ని గుర్తించి దాన్ని పరిచయం చేశాను. కర్ణాటకలోని రామకృష్ణారెడ్డి, గౌడ్ అనే ఇద్దరు డాక్టర్లతో కలిసి క్యాంపులకు వెళ్లినపుడు బటన్హోల్ ఆపరేషన్ గురించి తెలుసుకున్నాను. నగరాల్లో ఉన్న మహిళలకు ఆధునిక వైద్యవిధానాలన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ పల్లెటూరి మహిళలు కనీస వైద్యసదుపాయాలకు కూడా నోచుకోలేరు. అందుకోసం నేను నాలుగువేల వైద్యశిబిరాల్ని ఏర్పాటు చేసి బటన్హోల్ ఆపరేషన్లను నిర్వహించాను’’ అని చెప్పారు వెంకయ్య. సాహసాల డాక్టర్... డాక్టర్ వెంకయ్య సేవతో పాటు సాహసాలు కూడా చేశారు. సేవ చేయడానికి మనసుంటే చాలు...కాని సాహసం చేయడానికి ధైర్యం ఉండాలి. ఒకసారి 60ఏళ్ల వృద్ధుడికి రైలు ప్రమాదం జరిగింది. రైలు చక్రాలు అతని కాలిపై ఎక్కాయి. డాక్టర్గారికి సమాచారం అందడంతో వెంటనే సంఘటన స్థలానికి వచ్చారు. పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో అక్కడికక్కడే శస్త్రచికిత్స చేసి ఆ వృద్ధుడి కాలుని కట్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు అన్నిటికన్నా సంతృప్తినిచ్చిన సంఘటన మరొకటి ఉంది. ‘‘మా ఊరిపక్కన ఒక గిరిజన మహిళకు ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టారు. ఆ శిశువులందరినీ బతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయితే ఒకరు చనిపోయారు. మిగతా ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారు’’ అని వివరించారు వెంకయ్య. చిత్తూరు జిల్లాలో ఆయన ఎనిమిది గంటల్లో 381 కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ర్ట ప్రభుత్వం గత ఏడాది ‘స్త్రీ శక్తి అవార్డు’తో సత్కరించింది. ‘స్త్రీశక్తి’ అవార్డుని మొదటిసారి ఒక పురుషుడికివ్వడంలోని ఆంతర్యం ఏమిటో మనకు ఇప్పటికే అర్థమైంది. వైద్యులంతా పట్టణం చుట్టూ తిరగకుండా పల్లెప్రజలకు కూడా సేవలందించండంటూ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు కోరినా... అందరూ స్పందించడంలేదు. వెంకయ్యలాంటివారిని ఆదర్శంగా తీసుకుంటేగాని ఆ పని జరగదు. ‘నా దేశంలో ఏ ఒక్కరూ వైద్యం అందకుండా మరణించకూడదు’ అని కోరుకుంటున్న ఈ డాక్టర్గారి కోరిక పెద్దదే. కానీ, ఆత్మవిశ్వాసం, దానికి తగ్గ ఆచరణ ఉంటే అసాధ్యం ఏముంటుంది! -
బ్యాంక్ మేళా.. భళా
సాక్షి, సంగారెడ్డి: ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల లబ్ధిదారుల సౌకర్యార్థం ‘జీరో బ్యాలెన్స్’ ఖాతాలు తెరిచేందుకు ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక బ్యాంక్ మేళాలకు అనూహ్య స్పందన లభించిందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె గణాంకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 292 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్ బ్రాంచీలలో 93,249 ఖాతాలు తెరిచేందుకు దరఖాస్తులు అందగా 76,458 మంది లబ్ధిదారులకు కొత్త ఖాతాలు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. మిగిలిన 16,791 లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన ముగిసిన తర్వాత వారి ఖాతాలు సైతం ప్రారంభిస్తామన్నారు. ఎస్బీహెచ్ తన 36 బ్రాంచీల ద్వారా అత్యధికంగా 34,112 ఖాతాలు ప్రారంభిస్తే.. ఎస్బీఐ తన 41 బ్రాంచీల్లో 20,413 ఖాతాలు, ఏపీజీవీబీ 85 శాఖల ద్వారా 14,038 ఖాతాలు, ఆంధ్రాబ్యాంక్ 27 శాఖల ద్వారా 4600 ఖాతాలను తెరిచినట్లు కలెక్టర్ తెలిపారు. నగదు బదిలీ పథకం కింద వంట గ్యాస్, ఉపకార వేతనాలు, బంగారుతల్లి, పింఛన్లు, జననీ సురక్ష యోజన, ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంక్ మేళాలు నిర్వహించిన లీడ్ బ్యాంక్ మేనేజర్ టీటీ వెంకయ్య, ఆయా బ్యాంకుల మేనేజర్లకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎల్డీఎం వివరణ: ‘కొండాపూర్‌లో జీరో మేళాలు’ అనే శీర్షికతో గురువారం సాక్షిలో వచ్చిన కథనంపై లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకయ్య స్పందించారు. తొగరపల్లి ఎస్బీఐలో 150 ఖాతాలు, ఏపీజీవీబీ అనంతసార్లో 172 ఖాతాలు, తేర్పొల్ శాఖలో 148 ఖాతాలను తెరిచినట్లు ఆయన వివరణ ఇచ్చారు. -
కొత్త ఖాతాలకు రండి!
సాక్షి, సంగారెడ్డి: ‘బ్యాంకు అకౌంట్ లేదా .. కొత్త అకౌంట్ కావాలా ? అయితే, తక్షణమే సమీపంలోని బ్యాంకుకు వెళ్లండి. వ్యయ ప్రయాసలు లేకుండానే కొత్త అకౌంట్ ప్రారంభించండి. అది కూడా ‘జీరో బ్యాలెన్స్’తో...’ అంటూ బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులు జిల్లావ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో వినియోగదారుల అవసరార్థం కొత్త ఖాతాలు తెరవడానికి ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నాయి. గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ఈ మేళాకు వెళితే సరిపోతుంది. దరఖాస్తును వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తారు. అయితే, కొన్ని రోజుల తర్వాత బ్యాంకు పాసు పుస్తకం, ఏటీఎం కార్డులను పోస్టు ద్వారా ఖాతాదారుల చిరునామాకు పంపిస్తారు. ఎవరైనా వెళ్లవచ్చు .. ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాల లబ్ధిదారుల కోసం బ్యాంకు మేళాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఎవరొచ్చినా కొత్త ఖాతాలు తెరుస్తామని లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకయ్య ‘సాక్షి’కి తెలిపారు. స్కాలర్షిప్పులు, ఫీజు-రీయింబర్స్మెంట్, వంట గ్యాస్, బంగారుతల్లి, జననీ సురక్షయోజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల లబ్ధిదారులతో పాటు ఇతరులెవరు వచ్చినా దరఖాస్తులు అందించడంతో పాటు పూరించడంలో సైతం సహకరించడానికి సంబంధిత ప్రభుత్వ శాఖల సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ మేళాల ఏర్పాటుకు బ్యాంకర్లను ఒప్పించారు.