అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మల్కాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దాసరి వెంకయ్య(70) తన పొలంలో పెసర పంట వేసిన అనంతరం ఇంటికి వచ్చాడన్నారు.
ఇంట్లో ఒక్కడే ఉండడంతో ఆదివారం సాయంత్రం ఇంట్లో నుండి దుర్వాసన రాగా గ్రామస్థులు ఇంట్లోకి వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడన్నారు. అతని భార్య రుక్కమ్మ కోళాపల్లిలో ఉంటుంది. డబ్బుల కోసమే అతడిని హత్యచేశారని కటుంబీకులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని జోగిపేట సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ శ్రీధర్ పరిశీలించి మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.