![16 Year Old Girl Suspicious Death In Medak - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/20/minor.gif.webp?itok=gmYlZKrN)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నారాయణఖేడ్: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. నారాయణఖేడ్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్‌కు చెందిన కుమ్మరి పుష్పలత (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈనెల 17న రాత్రి పుష్పలతను అదే కాలనీకి చెందిన చాకలి పండరి మాయమాటలు చెప్పి ఇంటి వెనకాలకు తీసుకెళ్లగా బాలిక తండ్రి వెంకయ్య వెతుకుతూ వెళ్లగా ఆయనను చూసి పారిపోయారు.
చదవండి: హైదరాబాద్‌లో విషాదం: సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి
గంట తర్వాత పండరి గ్రామానికి రాగా పుష్పలత రాలేదు. ఆచూకీ కోసం వెతుకుతుండగా సోమవారం గ్రామ శివారులోని మంగలి లక్ష్మయ్య చేనులో చెట్టుకు చున్నీతో ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో బాలిక కనిపించింది. కూతురి మృతి విషయంలో పండరిపై అనుమానం ఉందని బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.
చదవండి: చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది..
Comments
Please login to add a commentAdd a comment