Minor girl suicide
-
పెళ్లి చేసే వయస్సు రాలేదని..
నల్గొండ : ప్రేమించిన ప్రియుడు దక్కడేమో అన్న ఆందోళనలో ఓ బాలిక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలగిరి మండలం నాగార్జునపేటతండాకు చెందిన ఆంగోతు పాప, కమిలి దంపతులు హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె. కుమార్తె ఆంగోతు ఇందు(14) అలియాస్ అమ్ములు దేవరకొండకస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన బాణావత్ శ్రీను మంగ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. మొదటి కుమారుడు బాణావత్ వినోద్(20) దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదిలా ఉండగా కరోనాతో పాఠశాలలు మూతబడటంతో పాప, కమిలి దంపతులు తమ కూతురు ఇందును తీసుకుని బత్తాయి పనులకు వెళ్లేవారు. వినోద్‌ది కూడా అదే గ్రామం కావడంతో వారితో పాటే కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో వినోద్, ఇందు మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. పెళ్లి చేసే వయస్సు రాలేదని.. వినోద్, ఇందుల ప్రేమ విషయం కొన్ని నెలల క్రితం పెద్దలకు తెలిసింది. దీంతో వినోద్ తల్లిదండ్రులు మూడు మాసాల క్రితం పాప, కమలి దంపతులు వద్దకు వెళ్లి మీ కుమార్తెను మా అబ్బాయికి ఇవ్వాలని అడిగారు. అందుకు వారు తమ కుమార్తెకు ఇంకా పెళ్లి వయస్సు రాలేదని, ఇప్పుడు పెళ్లి చేయలేమని చెప్పారు. దీంతో కొద్దిరోజులుగా ఇందు తాను కోరుకున్న వాడు దక్కడేమోనని కలత చెందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. అనంతరం విషయాన్ని పెదనాన్న హరియాకు చెప్పింది. వెంటనే ఆయన ఇందును నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సోమవారం అదే ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, ఇందు మరణానికి ప్రియుడే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలి తండ్రి పాప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందు మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడిందా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అప్పటికే నా బిడ్డ ఐదు పేజీల సూసైడ్ నోట్ రాసుకుంది: అనురాధ
సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి బాలిక విజయవాడలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాలిక తల్లి అనురాధ సోమవారం సాక్షి టీవీతో మాట్లాడారు. 'నా బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకున్నాం. ఇప్పటివరకు బిడ్డ రక్తపు చుక్క కూడా చూడలేదు. చదువులో నా బిడ్డ టాపర్.. మల్టీ టాలెంటెడ్. పుట్టుకతోనే ఎన్నో మంచి లక్షణాలు వచ్చాయి. చనిపోవడానికి రెండ్రోజుల ముందు పాప ఏడ్చింది. అడిగితే మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ బాధపడింది. ఇంక ఏ సమస్యలు లేవని చెప్పింది. చదవండి: (కామాంధుడు! విజయవాడలో టీడీపీ నేత అకృత్యం) చనిపోయే రోజు సాయంత్రం చివరిసారిగా నాతో మాట్లాడండి. అమ్మ ఐ లవ్యూ అంటూ రెండుసార్లు పిలిచి గట్టిగా హగ్ చేసుకుంది. అప్పటికే ఐదు పేజీల సూసైడ్ నోట్ నా బిడ్డ రాసుకుంది. టుడే ఈజ్ లాస్ట్ డే.. డెత్ డే అంటూ సూసైడ్ నోట్లో రాసింది. ఎవరో ఒక పాప బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోయిందంటూ చెప్పడంతో వెళ్లి చూశాం. సూసైడ్ చేసుకువడానికి కారణమైన వినోద్ జైన్‌ని నడిరోడ్డులో ఎన్ కౌంటర్ చేయాలి. అప్పుడే నా బిడ్డకు ఆత్మ శాంతిస్తుంది. చదవండి: (‘నా బిడ్డ జీవితాన్ని చిదిమేసిన కామ పిశాచిని ఉరి తీయండి’) తాత లాంటి వయసులో నా బిడ్డను ఇంత దారుణంగా లైంగికంగా వేధించిన వినోద్ జైన్‌ను శిక్షించాలి. ఏ తల్లికీ మాలాంటి గర్భశోకం కలగకూడదు. పిల్లలను అందరూ జాగ్రత్తగా పెంచాలి. ముఖ్యమంత్రిని కలిసి నా గోడు వెళ్లబోసుకుంటాను. నాకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా వద్దు. మరో బిడ్డకు ఇలాంటి గతి పట్టకూడదు. సీఎం జగన్ చట్టాలను మరింత బలోపేతం చేసి మృగాళ్లను కఠినంగా శిక్షించాలి. మా పాపకు న్యాయం చేయాలి' అంటూ బాలిక తల్లి అనురాధ కన్నీటి పర్యంతమైంది. -
టీడీపీ నేత ఘాతుకంపై ఆగ్రహ జ్వాల
సాక్షి నెట్వర్క్: విజయవాడకు చెందిన టీడీపీ నేత వినోద్‌జైన్ ఘాతుకంపై రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. బాలికను లైంగిక వేధింపులకు గురిచేసి.. ఆత్మహత్యకు కారణమైన వినోద్‌జైన్‌ను కఠినంగా శిక్షించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అకృత్యాలపై కన్నెర్ర చేశారు. టీడీపీ నేతల లైంగిక నేరాలను నిరసిస్తూ కడపలోని ఏడురోడ్ల కూడలి నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ.. విజయవాడలో వినోద్‌జైన్ వేధింపులను తట్టుకోలేక బాలిక లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రజలందరినీ కలచివేసిందన్నారు. వినోద్‌జైన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై టీడీపీ నేతల అరాచకాలు కొత్త కాదని, అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలు ఎన్నో చేశారన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునిల్‌కుమార్, కార్పొరేటర్ షఫీ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు, అనంతపురం, కదిరి, పుట్టపర్తి, బుక్కరాయసముద్రం తదితర ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. రాప్తాడులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతపురంలో జెడ్పీ కార్యాలయం నుంచి సుభాష్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకూ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మహిళా కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. కదిరిలోని ఇందిరాగాంధీ కూడలిలో మునిసిపల్ చైర్పర్సన్ పరికి నజీమున్నీసా, వైస్ చైర్పర్సన్ కొమ్ము గంగాదేవి తదితరులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. పుట్టపర్తి హనుమాన్ కూడలిలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సతీమణి దుద్దుకుంట అపర్ణారెడ్డి ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడి నుంచి విద్యాగిరి ఆర్చ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుక్కరాయసముద్రంలోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి మహిళలు నివాళి అర్పించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల శ్రద్ధాంజలి టీడీపీ నేత వినోద్‌జైన్ వేధింపులను తాళలేక విజయవాడలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని మహిళా సంఘాల నాయకులు పేర్కొన్నారు. బాలికకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు, కార్పొరేటర్ మొయిళ్ల గౌరి మాట్లాడుతూ ఘటనకు కారణమైన టీడీపీ నేత వినోద్‌జైన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్టీ రూరల్ మహిళా విభాగం ఇన్చార్జి చేజర్ల కవిత, నేతలు పద్మజా యాదవ్, రమ, లక్ష్మి, మునిలక్ష్మీదేవి పాల్గొన్నారు. నాయుడుపేట, గూడూరు, ముత్తుకూరు తదితర ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి బాలికకు నివాళి అర్పించారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు పల్లా అనూరాధ, మహిళా కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి లక్ష్మీపురంలోని మదర్‌థెరిస్సా విగ్రహం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ 50 ఏళ్ల వయసున్న టీడీపీ నేత వినోద్‌జైన్ చిన్నారి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడో బాలిక లేఖను బట్టి అర్థమవుతోందన్నారు. వినోద్‌జైన్‌కు ఉరే సరి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. మామిడికుదురు మండలం నగరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. బాలిక ఆత్మహత్యకు కారకుడైన టీడీపీ నేత వినోద్‌జైన్‌ను ఉరి తీయాలని మహిళలు నినాదాలు చేశారు. సామర్లకోటలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. మహిళలపై టీడీపీ నేతల వేధింపులు నశించాలని, వినోద్‌జైన్‌ను ఉరి తీయాలని మహిళలు నినదించారు. మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ, అయ్యెరక కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తునిలో మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి ఆధ్వర్యాన మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగ పద్మలత తదితరులు పాల్గొన్నారు. విశాఖలోని అక్కయ్యపాలెం హైవేపై నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ పాల్గొన్నారు. జీవీఎంసీ 11వ వార్డు బాలాజీనగర్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళం, పలాస, వీరఘట్టం, నరసన్నపేట, రణస్థలం తదితర ప్రాంతాల్లో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరం: ఎమ్మెల్యే ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఓ తండ్రిలా చూసుకోవాల్సిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బాలికను ఎంతలా వేధించాడో ఆమె పుస్తకంలో రాసుకున్న విషయాలను బట్టి చూస్తే అర్థం అవుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక సూసైడ్ నోట్లో రాసిందని ఎమ్మెల్యే రోజా చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుంది విజయవాడ భవానీపురంలో బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక సూసైడ్ నోట్ రాసిందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. చదవండి: బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ -
బాలికకు మాయమాటలు చెప్పి.. ఇంటి వెనకాలకు తీసుకెళ్లి..
సాక్షి, నారాయణఖేడ్: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్‌కు చెందిన కుమ్మరి పుష్పలత (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈనెల 17న రాత్రి పుష్పలతను అదే కాలనీకి చెందిన చాకలి పండరి మాయమాటలు చెప్పి ఇంటి వెనకాలకు తీసుకెళ్లగా బాలిక తండ్రి వెంకయ్య వెతుకుతూ వెళ్లగా ఆయనను చూసి పారిపోయారు. చదవండి: హైదరాబాద్‌లో విషాదం: సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి గంట తర్వాత పండరి గ్రామానికి రాగా పుష్పలత రాలేదు. ఆచూకీ కోసం వెతుకుతుండగా సోమవారం గ్రామ శివారులోని మంగలి లక్ష్మయ్య చేనులో చెట్టుకు చున్నీతో ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో బాలిక కనిపించింది. కూతురి మృతి విషయంలో పండరిపై అనుమానం ఉందని బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. చదవండి: చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది.. -
ఆకతాయి వేధింపులతో బాలిక ఆత్మహత్య
చిత్తూరు పీలేరు : ఆకతాయి వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణం బండ్లవంకలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బండ్లవంకకు చెందిన సంపూర్ణమ్మ కుమార్తె విజయలక్ష్మి. ఇళ్లలో పాచిపని చేసుకుంటూ కుమార్తె ను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన గురు అనే యువకుడు విజయలక్ష్మీతో మాట్లాడాలని ఇంటిలోకి ప్రవేశించే యత్నం చేశాడు. అడ్డుకున్న సంపూర్ణమ్మపై దాడి చేశాడు. దీంతో ఆమె సాయం కోసం పక్కంటిలోని బంధువుల వద్దకు వెళ్లింది. వారు ఇంటికి వచ్చి తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పగులకొట్టి చూడగా అప్పటికే విజయలక్ష్మి ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపింది. అప్పటికే యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయంపై మృతురాలి తల్లి, బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంపూర్ణమ్మ ఫిర్యాదు మేరకు గురును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గురు తన స్నేహితులతో కలసి కొంతకాలంగా విజయలక్ష్మీని వేధించేవాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంపూర్ణమ్మ కోరారు. -
టీచర్‌పై సామూహిక అత్యాచారం
సిధి/దమోహ్/మోవ్: మధ్యప్రదేశ్‌లో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిపై సామూహిక అత్యాచారం జరగగా, మరో చోట వేధింపులు తాళలేక ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకుంది. రెండు ఘటనలు గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగులో కొచ్చాయి. సిధిలో సాయంత్రం స్కూల్ ముగించుకొని తిరిగి వస్తున్న టీచర్‌పై నలుగురు స్థానికులు దగ్గర్లోని ఓ ఫాంహౌజ్‌కు ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఆమె ఇంటికెళ్లి వివరాలను తెలపడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు, దమోహ్‌లో 17 ఏళ్ల బాలిక గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక యువకులు కొందరు ఆమెను వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
ప్రియుడు మోసం చేశాడని..బాలిక ఆత్మహత్య
జియాగూడ: ప్రియుడు మోసం చేశాడని మనస్తాపానికిలోనైన ఓ బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. కుల్సుంపురా ఎస్ఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జియాగూడ వెంకటేశ్వరనగర్‌లో నివసిస్తున్న మహారాష్ట్రకు చెందిన విష్ణు వాగ్మారే, పార్వతి కుమార్తె అంబిక(16) ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గత ఏడాది ఆదే ప్రాంతానికి చెందిన సురేందర్‌సింగ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల సురేందర్‌సింగ్‌కు పెళ్లి సంబంధాలు వస్తున్నట్లు తెలిసిన అంబిక అతడిని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం, కలిసినా మాట్లాడకపోవడంతో మనస్తాపానికిలోనైనంది. ఈ నెల 14న ఉదయం ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్ బాలిక ఆత్మహత్య
తెనాలి రూరల్(గుంటూరు జిల్లా): తెనాలి ముత్యంశెట్టి పాలెంలో సోమవారం ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.