చిత్తూరు పీలేరు : ఆకతాయి వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణం బండ్లవంకలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బండ్లవంకకు చెందిన సంపూర్ణమ్మ కుమార్తె విజయలక్ష్మి. ఇళ్లలో పాచిపని చేసుకుంటూ కుమార్తె ను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన గురు అనే యువకుడు విజయలక్ష్మీతో మాట్లాడాలని ఇంటిలోకి ప్రవేశించే యత్నం చేశాడు. అడ్డుకున్న సంపూర్ణమ్మపై దాడి చేశాడు.
దీంతో ఆమె సాయం కోసం పక్కంటిలోని బంధువుల వద్దకు వెళ్లింది. వారు ఇంటికి వచ్చి తలుపు తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పగులకొట్టి చూడగా అప్పటికే విజయలక్ష్మి ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపింది. అప్పటికే యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయంపై మృతురాలి తల్లి, బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంపూర్ణమ్మ ఫిర్యాదు మేరకు గురును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గురు తన స్నేహితులతో కలసి కొంతకాలంగా విజయలక్ష్మీని వేధించేవాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంపూర్ణమ్మ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment