AP: MLA RK Roja Respond on Vijayawada Minor Girl Suicide - Sakshi
Sakshi News home page

బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరం: ఎమ్మెల్యే ఆర్‌కే రోజా

Published Sun, Jan 30 2022 2:08 PM | Last Updated on Sun, Jan 30 2022 7:11 PM

AP: MLA RK Roja Respond On Vijayawada Minor Girl Suicide - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా స్పందించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఓ తండ్రిలా చూసుకోవాల్సిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బాలికను ఎంతలా వేధించాడో ఆమె పుస్తకంలో రాసుకున్న విషయాలను బట్టి చూస్తే అర్థం అవుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక సూసైడ్‌ నోట్‌లో రాసిందని ఎమ్మెల్యే రోజా చెప్పారు.  

ప్రభుత్వం అండగా ఉంటుంది
విజయవాడ భవానీపురంలో బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక సూసైడ్‌ నోట్‌ రాసిందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. 
చదవండి: బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement