జియాగూడ: ప్రియుడు మోసం చేశాడని మనస్తాపానికిలోనైన ఓ బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. కుల్సుంపురా ఎస్‌ఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జియాగూడ వెంకటేశ్వరనగర్‌లో నివసిస్తున్న మహారాష్ట్రకు చెందిన విష్ణు వాగ్మారే, పార్వతి కుమార్తె అంబిక(16) ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గత ఏడాది ఆదే ప్రాంతానికి చెందిన సురేందర్‌సింగ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల సురేందర్‌సింగ్‌కు పెళ్లి సంబంధాలు వస్తున్నట్లు తెలిసిన అంబిక అతడిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం, కలిసినా మాట్లాడకపోవడంతో మనస్తాపానికిలోనైనంది. ఈ నెల 14న ఉదయం ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment