సాక్షి, హైదరాబాద్: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ ముగ్గురు టాలీవుడ్ హీరోలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహం సంచలన రేపుతోంది. ఓ మహిళ చేతిలో అంత ఈజీగా మోసపోయింది ఓ హీరోలు, సెలబ్రెటీలు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల శిల్ప ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
చదవండి: ముగ్గురు టాలీవుడ్ హీరోలకు రూ. 200 కోట్లు కుచ్చు టోపి!
తాజాగా వారి రిమాండ్ రిపోర్డును విడుదల చేసిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో శిల్ప పెద్ద మొత్తంలో డబ్బులు గుంజినట్లు సమాచారం. సైబరాబాద్ పరిధిలో అధునాతన హంగులతో శిల్ప దంపతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ పేరుతో దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా శిల్పా వసూలు చేసింది. డబ్బులు ఇవ్వకుండా, స్థలాన్ని చూపెట్టకుండా ఇబ్బందులకు గురి చేసింది.
చదవండి: బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. వీకెండ్ ఎపిసోడ్స్‌కి భారీ ప్లాన్!
దీంతో డబ్బు తిరికి ఇవ్వాలని ఇంటికి వెళ్లిన దివ్యరెడ్డిని తన బౌన్సర్ల బెదిరిస్తూ ఇంటి నుంచి తరిమేసింది. ఎలాగైన తన డబ్బు ఇవ్వాలని గట్టిగా అడిగినందుకు ప్రముఖుల పేర్లు చెప్పి దివ్య రెడ్డిని బెదిరించింది. డబ్బులు ఇవ్వకుండా ఫోన్‌లో చాలా సార్లు చంపేస్తానంటూ శిల్ప బెదిరింపులకు పాల్పడింది. దీంతో శిల్ప నుంచి ప్రాణభయం ఉందంటూ దివ్యరెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది’ అని పోలీసులు పేర్కొన్నారు. అలాగే శిల్ప బాధితుల్లో దివ్య రెడ్డి మాత్రమే కాకుండా టాలీవుడ్ ముగ్గురు హీరోలు, నగరానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment