narayanakhed
-
నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
కి‘లేడి’.. మహిళ చెయ్యి పడిందంటే ఇక అంతే!
సాక్షి, మెదక్: చోరీలు చేస్తున్న మహిళను పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి అరెస్ట్ చేశారు. గురువారం నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం కంగ్టి మండలం చుక్కల్ తీర్థ్ గ్రామానికి చెందిన విఠాబాయి ఈనెల 16 తేదీన హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్‌కు వచ్చింది. స్టీలు దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసింది. దుకాణదారుడికి డబ్బులు చెల్లించేందుకు తన బ్యాగ్‌లో నుంచి నగదు తీస్తుండగా మరో మహిళ చూసింది. ఆమె చాకచక్యంగా బ్యాగులో నుంచి రెండు బంగారు ఉంగరాలు, కొంత నగదు చోరీ చేసింది. బంగారు ఉంగరాలు, నగదు పోగొట్టుకున్న బాధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 17 తేదీన పట్టణంలోని మార్కెట్లో మరో మహిళ పర్సును చోరీ చేసేందుకు యత్నించింది. చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజీలో చోరీకి యత్నిస్తున్న దృశ్యం కనిపించడంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు. నిందితురాలు మహారాష్ట్రలోని డెగ్లూర్కు చెందిన దుర్గావాడేకర్గా గుర్తించారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్రలో పలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు ఎస్ఐ వివరించారు. చదవండి: మహిళ అక్రమ నిర్బంధం.. అయిదుగురు జీఎస్టీ అధికారులపై కేసు -
బాలికకు మాయమాటలు చెప్పి.. ఇంటి వెనకాలకు తీసుకెళ్లి..
సాక్షి, నారాయణఖేడ్: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్‌కు చెందిన కుమ్మరి పుష్పలత (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈనెల 17న రాత్రి పుష్పలతను అదే కాలనీకి చెందిన చాకలి పండరి మాయమాటలు చెప్పి ఇంటి వెనకాలకు తీసుకెళ్లగా బాలిక తండ్రి వెంకయ్య వెతుకుతూ వెళ్లగా ఆయనను చూసి పారిపోయారు. చదవండి: హైదరాబాద్‌లో విషాదం: సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి గంట తర్వాత పండరి గ్రామానికి రాగా పుష్పలత రాలేదు. ఆచూకీ కోసం వెతుకుతుండగా సోమవారం గ్రామ శివారులోని మంగలి లక్ష్మయ్య చేనులో చెట్టుకు చున్నీతో ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో బాలిక కనిపించింది. కూతురి మృతి విషయంలో పండరిపై అనుమానం ఉందని బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. చదవండి: చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది.. -
మంత్రి హరీశ్‌రావు భావోద్వేగం: ఈ జన్మకిది చాలు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గినా ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ.7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.6,012 కోట్లను 57.67 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించతలపెట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మనూరు మండలం బోరంచ గ్రామం వద్ద ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యేలా బోరంచ నల్లపోచమ్మ దీవించాలని అంటూ, నిర్మాణం పూర్తయితే అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని మొక్కుకున్నారు. ఈ జన్మకిది చాలు.. బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుకు ఓ మహిళ తారసపడింది. ఆమెను గుర్తుపట్టిన మంత్రి.. ‘చిమ్నీబాయి కైసే హో’ అని ఆప్యాయంగా పలకరించారు. ఆమె కూడా ‘కాలుబాబా తల్లి ఆశీర్వాదంతో మీరు చల్లగా ఉండాలి’ అని బదులిచ్చారు. కాగా, కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి మధ్యలో ఆమె ప్రస్తావన తెచ్చారు. ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే కంగ్టి మండలానికి చెందిన చిమ్నీబాయి ఫోన్‌చేసి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ జన్మకు ఇది చాలనుకున్నానని వ్యాఖ్యానించారు. -
గ్రామంలో ఇలా.. నగరంలో అలా...
సాక్షి, నారాయణఖేడ్: పై చిత్రంలో ముఖానికి మాస్కు లేకుండా చూస్తున్న వ్యక్తి నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామ సర్పంచ్. అతన్నుంచి రూ. 500 జరిమానా వసూలు చేసి రశీదు ఇస్తున్నది పంచాయతీ కార్యదర్శి. సంగారెడ్డి జిల్లా పంచా యతీ అధికారి సురేశ్ మోహన్ ఆకస్మిక పర్యటన సందర్భంగా ఉపసర్పంచ్‌తో కలసి మాస్కు ధరించకుండా ఇంటి నుంచి బయటకు వచ్చినందుకు అధికారి వారిద్దరికీ రూ. 500 చొప్పున జరిమానా విధించారు. ఈ ఫొటో చూశారుగా... ముఖానికి మాస్కుల్లేకుండా, భౌతికదూరం నిబంధన పట్టించుకోకుండా నగరవాసులు ఇలా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మెహదీపట్నం సమీపంలోని గుడిమల్కా పూర్ పూల మార్కెట్‌కు వీరంతా ఇలా పోటెత్తారు. గ్రామాల్లో చూపుతున్న స్ఫూర్తిని నగరవాసులు కూడా ప్రదర్శిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. -
మృతదేహాన్ని పీక్కుతిన్న పందులు
సాక్షి, నారాయణఖేడ్ : బండరాళ్లతో మోది యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నారాయణఖేడ్ జంట గ్రామం మంగల్‌పేట్‌లో చోటుచేసుకుంది. మృతదేహన్ని పందులు పీక్కుతింటుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నారాయణఖేడ్–2 ఎస్ఐ మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్ మండలం ఖాజాపూర్‌కు చెందిన వడ్డె రాజు (23) ఇస్నాపూర్‌లో పని చేసేందుకు వెళ్తున్నానని సోమవారం ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణలోని చెట్లపొదల్లో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పందులు పీక్కు తింటుండగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సీఐ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్కా్వడ్‌ను పిలిపించారు. మృతదేహం గుర్తించడానికి వీలులేకుండా మారింది. మర్మాంగాలు కోసినట్లు గుర్తించారు. సమీపంలో రక్తపు మరకలతో రెండు బండరాళ్లు ఉండడంతో తలపై బండరాళ్లతో మోది హత్యచేసినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో రెండు జతల చెప్పులు, బెల్టు, మృతుడి ఒంటిపై ఉన్న దుస్తుల్లో ఓ పర్సు, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులను స్వా«దీనం చేసుకున్నారు. అందులోని వివరాల ఆధారంగా మృతుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చెందిన వడ్డె సునీల్ వచ్చి మృతదేహాన్ని పరిశీలించి తన సోదరుడు వడ్డె రాజుగా గుర్తించాడు. డాగ్ స్క్వాడ్ మృతదేహం వద్ద ఉన్న చెప్పుల వాసన చూసి సమీపంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలోంచి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వరకు వెళ్లి తిరిగి మృతదేహం సమీపానికి వచ్చి ఆగింది. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మొగులయ్య తెలిపారు. -
చెడ్డపేరు తెస్తే విధుల నుంచి తప్పిస్తాం
సాక్షి, సంగారెడ్డి: గురుకులానికి చెడ్డపేరు తీసుకు వచ్చేలా వ్యవహరిస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలతోపాటు అవసరమైతే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తామని గురుకుల పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) బాలస్వామి హెచ్చరించారు. నారాయణఖేడ్ మండలం జూకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రావుతోపాటు పలు పలువురు అధ్యాపకుల తీరును నిరసిస్తూ వర్కర్లు ధర్నా చేయడం, తల్లిదండ్రుల ఆరోపణలపై ఆర్సీఓ మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌తోపాటు కొందరు అధ్యాపకులపై ఆరోపణలు వచ్చాయని అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్ మద్యం సేవించి వర్కర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, భోజనం బాగుండడం లేదని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సరిపడా సరుకులు ఇవ్వడం లేదని, మటన్ కాంట్రాక్టర్‌తో ఇబ్బందులు ఎదురవడం, కాంట్రాక్టు మార్చడం, మెనూ ప్రకారం వంటకాలు ఉండడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై అంశాలవారీగా విచారణ చేసి గురుకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి డా.ప్రవీణ్‌కుమార్‌కు నివేదిస్తామని అన్నారు. కొందరు లెక్చరర్లు, సిబ్బందితో కూడా సఖ్యతగా ఉండడం లేదని తెలపారు. ఈ అంశాలను విచారణ చేసి నిజం అని తేలితే శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ కూడా చేస్తామని అన్నారు. గురుకుల పాఠశాలకు చెడ్డపేరు తీసుకువస్తే ఊరుకునేది లేదని అన్నారు. ప్రిన్సిపాల్ గతంలో సస్పెన్షన్‌కు గురై ఇక్కడ బాధ్యతల్లో చేరారని, ఆయన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని సూచిస్తామన్నారు. తాగుబోతు ప్రిన్సిపాల్ వద్దు.. పేరెంట్స్ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు ఆర్సీఓను కలిసి ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రిన్సిపాల్, కొందరు అధ్యాపకులు తాగివచ్చి గురుకులం పేరును చెడగొడుతున్నారని, ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాగుబోతు ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించి గురుకులాన్ని మెరుగుపర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఇదిలా ఉండగా ఆర్సీఓ విచారణ జరుపుతున్న తరుణంలోనే ప్రిన్సిపాల్ మధుసూదన్‌రావు తాను ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించనని రాజీనామా లేఖను ఆర్సీఓకు అందించారు. -
గూగుల్ పేతో డబ్బులు కాజేశాడు..
కంగ్టి(నారాయణఖేడ్): ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండా గూగుల్ పే యాప్ ద్వారా డబ్బులు కాజేసిన వ్యక్తిని పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 2.4 లక్షలు రికవరీ చేశారు. ఈ సంఘటనలో నిందితుడిని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగుర్(కే) గ్రామంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కంగ్టి సీఐ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నాగుర్(కే) గ్రామానికి చెందిన నడిమిదొడ్డి శాంతమ్మకు కంగ్టిలోని ఏపీజీవీబీలో సేవింగ్ ఖాతా ఉంది. తొమ్మిది నెలల క్రితం ఆమె భర్త బాబు మృతి చెందడంతో రైతు బీమా డబ్బులు రూ.5 లక్షలు, కూతురు వివాహం జరగడంతో కల్యాణలక్ష్మి డబ్బులు రూ. 75 వేలు ఖాతాలో జమయ్యాయి. అయితే ఈ ఖాతాల్లో సొమ్ము వచ్చేలా చూడాలని గ్రామంలో పైరవీలు చేసే వాగ్మారే తుకారాంకు బాధిత మహిళ బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చింది. ఈ క్రమంలో తుకారాం మహిళను నమ్మించి మాయ మాట లు చెప్పి ఏటీఎం కార్డు సైతం తస్కరించాడు. శాంతమ్మ ఖాతాలో ఉన్న డబ్బులు కాజేయాల ని పథకం వేశాడు. అంతలోనే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి సెల్‌ఫోన్ పోగొట్టుకున్నాడు. అది తుకారాంకు దొరికింది. రాజు తన సిమ్ కార్డును రిచార్జీ చేసి దాన్ని వేరే ఫోన్లో యాక్టివేట్ చేయించుకొన్నాడు. తనకు దొరికిన ఫోన్లోని నంబర్‌ను శాంతమ్మ బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకొనేందుకు మరో మహిళను తీసుకువెళ్లాడు. బ్యాంకులో మరో మహిళ ను పరిచయం చేసి ఆమె శాంతమ్మ అని ఫోన్ నంబర్ లింక్ చేయాలంటూ దరఖాస్తు చేయించాడు. దీంతో తుకారాం మార్గం సుగమం అయింది. తస్కరించిన ఏటీఎం కార్డును ఉపయోగించి తన మొబైల్లో గుగూల్‌పే యాప్‌లో డబ్బులను దశల వారీగా డ్రా చేయడం ప్రారంభించాడు. ఇలా రెండు నెలల వ్యవధిలో రూ. 2.5 లక్షలు డ్రా చేశాడు. గత నెల 29వ తేదిన శాంతమ్మ బ్యాంకుకు వెళ్లి ఆరా తీసి రూ. 2.5 లక్షలు డ్రా చేసినట్లు తేలడంతో గగ్గోలు పెట్టింది. ఏడుస్తూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వివరాలు తెలుసుకొన్న పోలీసులు గురువారం నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుంచి రూ. 2.4 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. నిందితున్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ నారాయణ, సిబ్బంది ప్రేమ్‌సింగ్, తుకారం ఉన్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు శనివారం మధ్యాహ్నం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల గాయాలయ్యాయి. నారాయణఖేడ్ డిపోకు చెందిన టీఎస్ 15 జెడ్ 0154 నంబరు గల బస్సు 30 మంది ప్రయాణికులతో నారాయణఖేడ్ నుంచి లింగంపల్లికి వెళుతుండగా పట్టణ శివారులో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న బోడగట్టుకు చెందిన సంజీవ్‌తోపాటు మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు పక్కన గోతులు ఉండడం, వాటిని పూడ్చే పనులు జరుగుతుండడంతో బస్సు అదుపుతప్పింది. కాగా, బస్సు డ్రైవర్ మద్యం తాగి నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. దీంతో ఆర్టీసీ అధికారులు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు జరపగా డ్రైవర్ మద్యం తాగ లేదని తేలింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు
సాక్షి,మెదక్ : నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తిలో భార్య, కొడుకును హత్యచేసిన సంఘటనను పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణరాజు, ఖేడ్ సీఐ వెంకటేశ్వరరావులు స్థానిక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి కథనం ప్రకారం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన చింతాకి వెంకట్‌రెడ్డి(32) ఈనెల 12న తన భార్య కవిత(28), కొడుకు దినేష్‌రెడ్డి(04)లను మధ్యాహ్నం భోజన సమయంలో తినే కూరలో మత్తుపదార్థం కలిపిడాన్నారు. తదనంతరం కాసేపటికి వారు నిద్రలోకి వెళ్లారని.. ఆ సమయంలో ఇంట్లో పూజగదిలోకి తీసుకెళ్లి భార్యపైన, కొడుకుపైన కిరోసిన్ పోసి నిప్పంటించాడని తెలిపారు. అనంతరం డ్రెస్ మార్చుకుని బయటకు వెళ్లి తనకు ఏమి తెలియనట్లు వ్యవహరించి ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేశాడన్నారు. రాత్రి ఇంటివద్ద ఉన్న తుఫాన్ వాహనం తీసుకెళ్లే ప్రయత్నంలో సమాచారం పోలీసులకు అందడంతో నిందితున్ని తమ అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నాడు. అనుమానం, ఆస్తి తగాదాలే కారణం తన భార్య కవితపై వెంకట్‌రెడ్డికి పలు అనుమానాలు ఉండేవని, వీటితోపాటు తనకు జన్మించిన కుమారుడు సైతం తనకు పుట్టలేడని అనుమానలు ఉండేవన్నారు. తన గ్రామంలో ఉన్న భూమిలో ఒక ఎకరం భూమి అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఒక తుఫాన్ వాహనం కొనుగోలు చేశాడన్నారు. కాగా మిగిలిన డబ్బులను మద్యం తాగుతూ జల్సా చేశాడన్నారు. దీంతో డబ్బులు అయిపోవడంతో తన భార్య పేరుమీదుగా ఉన్న భూమిని అమ్ముదామని నిత్యం భార్యను వేదింపులు చేసేవాడని ఇదే క్రమంలో భార్య ఒప్పుకోకపోవడంతో భార్యను హతమార్చి ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే పలు మార్లు గొడవలు జరుగగా పెద్దల సమక్షంలో పలు పంచాయితీలు సైతం చేశారన్నారు. హత్యరోజున వెంకట్‌రెడ్డి భార్య కవిత తన అన్నకు ఫోన్‌చేసి తన కుమారున్ని తీసుకెళ్లాలని కోరిందన్నారు. కాగా అంత లోపే భర్త వెంకట్‌రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడటం జరిగిందన్నారు. కాగా నిందితుని జహీరాబాద్ కోర్టులో హాజరుపర్చి రింమాండ్‌కు పంపడం జరుగుతుందన్నారు. సమావేశంలో నాగల్గిద్ద, మనూరు ఎస్ఐలు శేఖర్, నరేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
నారాయణఖేడ్‌లో ‘కింగ్’ ఏవరు..?
నారాయణఖేడ్: కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం త్రివేణీ సంగమంగా విరాజిల్లుతుంది. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడి ఉన్న ప్రాంతంగా ఈ నియోజకవర్గం పేరుగాంచింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పాగావేసింది. మళ్లీ ఈ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు ప్రచారన్ని సాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివకు పటోళ్ల, షెట్కార్, మహారెడ్డి కుటుంబాల పాలనే సాగుతూ వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి ఆ కుటుంబాల వారే బరిలో నిలిచారు. రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న ధీమాతో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. తన తండ్రి దివంగత ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టారెడ్డి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాడని గుర్తు చేస్తూ బీజేపీ అభ్యర్థి సంజీవరెడ్డి ప్రచారన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ గతంలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న ధీమాతో ఆ పార్టీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ చెబుతున్నారు. ఖేడ్‌లో ఈ ముగ్గురి నడమే ప్రధానంగా పోటీ నెలకొంది. పట్లోళ్ళ సంజీవరెడ్డి (బీజేపీ అభ్యర్థి) ఖేడ్ మండలం పంచగామకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు పట్లోళ్ళ సంజీవరెడ్డి. వృత్తి రిత్యా వైద్యుడు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2006 నుంచి 2011 వరకు ఖేడ్ జెడ్పీటీసీగా పనిచేశారు. 2013లో ఎంపీటీసీగా గెలుపొంది ప్రస్తుతం నారాయణఖేడ్ ఎంపీపీగా ఉన్నారు. తండ్రి వెంటే రాజకీయాల్లో ఉంటూ ఎన్నికల సమయంలో తండ్రి గెలుపుకోసం శ్రమించారు. కిష్టారెడ్డి హఠాన్మరణం చెందడంతో 2016 ఉప ఎన్నికల్లో పోటీచేశారు. ముక్కుసూటితనం ఉండడం, ఒక్కమారుగా పార్టీ మారడం కొంత ప్రతికూలత అయినా, తండ్రి క్యాడర్, ఉప ఎన్నికల ఓటమి సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, యువత సపోర్ట్ తదితర అంశాలతో గెలుపొందుతాననే ధీమాతో ఉన్నారు. సురేష్ షెట్కార్ (కాంగ్రెస్ అభ్యర్థి) ఖేడ్ పట్టణానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే శివరావు షెట్కార్ కుమారుడు సురేష్ షెట్కార్. 1997లో రాజకీయాల్లో ప్రవేశించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఒక పర్యాయం కొనసాగారు. డీసీసీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు. 2004లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2014లో అదే స్థానానికి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజా కూటమి తరఫుగా ఖేడ్ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలో నిలిచారు. స్థానికంగా అందుబాటులో ఉండడనే అపవాదు ఉండడం, ఉప ఎన్నికల్లో క్యాడర్ కొంత దూరం కావడం కొంత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎంపీగా ఖేడ్‌కు చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. సిట్టింగ్ ప్రొఫైల్.. భూపాల్‌రెడ్డిది కల్హేర్ మండలం ఖానాపూర్(కె). దివంగత మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు. కృష్ణాపూర్ ప్రాథమిక సహాకర సంఘం చైర్మన్‌గా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశాడు. 2008లో టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ రైతు విభాగం రాష్ట్ర నాయకులుగా> ఎన్నికయ్యారు. 2009లో టీఆర్ఎస్, టీడీపీ పొత్తులో భాగంగా టీఆర్ఎస్ టిక్కెట్ దక్కించుకొని ఓటమి చెందారు. తిరిగి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి రెండో సారి ఓటమిపాలయ్యారు. అనంతరం 2016లో అప్పటి ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. అభివృద్ధి పనులు.. ఖేడ్‌లో మార్కెట్ యార్డు, పెద్దశంకరంపేటలో సబ్‌మార్కెట్ యార్డు, మండలానికి ఒక గిడ్డంగి నిర్మాణం. మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం. 15 నూతన 33/11 కేవీ సబ్స్టేషన్లు ఒక 132కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం, 80మంది నిరుద్యోగులకు ఉపాది. విద్యుత్ సమస్య నివారణ రూ.24కోట్లతో నల్లవాగు కాల్వల ఆధునికీకరణ. 8 కొత్త చెరువులు మంజూరు, 12 చెరువులకు హైడ్రాలిక్ అనుమతులు. 7.5 కోట్లతో మనూరు, నాగల్గిద్ద మండలాలకు సాగునీటికోసం నాలుగు ఎత్తిపోతల పథకాల రమ్మతులు 15కిలోమీటర్లు ఉన్న డబుల్‌లైన్ రోడ్డు 130కిలోమీటర్లకు విస్తరించడం. పీఆర్, ఆర్‌అండ్‌బీలో 100కోట్లతో రోడ్ల మరమ్మతులు. ఏడు గురుకులాలు మంజూరు మనూరుకు జూనియర్ కళాశాల మంజూరుతోపాటు, కల్హేర్, కంగ్టిలో కళాశాల భవనాల ఏర్పాటు, ఖేడ్‌లో మోడల్ డిగ్రీ కళాశాల ప్రారంభం. ఖేడ్‌లో 100 పడకల ఆస్పత్రి ప్రారంభం. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, మండలాల్లోని పీహెచ్‌సీల స్థాయి పెంపు. ఖేడ్ డివిజన్ కేంద్రం, డీఎస్పీ కార్యాలయం, రెండు నూతన మండలాల ఏర్పాటు. రూ.70కోట్లతో 20 నూతన వంతెనల నిర్మాణం, రూ.30కోట్లతో నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం. ప్రధాన సమస్యలు.. ఖేడ్ నుండి వలసలు శాశ్వతంగా నిలిచిపోకపోవడం, కర్మాగారాల నిర్మాణం జరగకపోవడం. డబుల్బెడ్రూం ఇండ్లు ఇంకా లబ్ధిదారులకు అందకపోవడం. మంజీరా నీరు సాగుకు అందకపోవడం. మిషన్ భగీరథ పథకం పూర్తికాకపోవడం. రోడ్ల విస్తరణ పనులు పూర్తికాకపోవడం, ఖేడ్ ఆస్పత్రిలో సిబ్బంది కొరత. -
టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు
-
ఖేడ్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
నారాయణఖేడ్ : నాగల్గిద్దలో అంబేడ్కర్ గద్దె విషయంలో నారాయణఖేడ్ ఎస్ఐ నరేందర్ తన పరిధి కానప్పటికీ అగ్రవర్ణాలతో కుమ్మక్కై పోలీసు బలగాలు, లాఠీలతో వచ్చి దళితులను దూషించినందుకు ఆయనను సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ అంబేడ్కర్ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జీవన్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, ఖేడ్ నియోజకవర్గ అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కాన్షీరాం, నాగల్గిద్ద మండలశాఖ అధ్యక్షుడు గణపతి, అంబేడ్కర్‌సేన అధ్యక్షుడు రాజ్‌కుమార్, నియోజకవర్గ మాలమహానాడు అధ్యక్షుడు భీంసేనలు మాట్లాడుతూ.. నాగల్గిద్దలో గద్దె విషయంలో అభ్యంతరం ఉంటే దళిత సంఘాల వారిని పిలిపించి మాట్లాడాల్సిందని అన్నారు. కూల్చివేయాలనుకుంటే నోటీసులు ఇవ్వాల్సిందన్నారు. అవేమీలేకుండా పోలీసు బలగాలతో వచ్చిన ఎస్ఐ నరేందర్ దళితులను దూషిస్తూ జేసీబీతో గద్దెను కూల్చివేయడమే కాకుండ, నాగల్గిద్ద దళిత సర్పంచ్‌ని అవమనపర్చాని ఆరోపించారు. ఆయా విషయాలపై డీజీపీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర, జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేయడంతో పాటు, త్వరలోనే ఆత్మగౌరవసభ పెట్టి హక్కులను సాధించుకుంటామని అన్నారు. -
భారీ వర్షం.. అపార నష్టం
నారాయణఖేడ్: నియోజకవర్గాన్ని మళ్లీ భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీగా ఆస్తినష్టం మిగిల్చింది. వర్షాకాలం ప్రారంభం అయ్యాక ఒక్క రోజు ఇంత మేర వర్షం కురవడం ఇదే మొదటిసారి. శనివారం తెల్లవారు జామున వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెరపి ఇచ్చినా మళ్లీ సాయంత్రం మొదలయ్యింది. నారాయణఖేడ్ మండలంలో 11.9 సెంటీ మీటర్ల వర్షం పడింది. గంగాపూర్ మొండి మత్తడి, తుర్కాపల్లి పటేల్ చెరువులకు గండ్లు పడ్డాయి.నీరంతా వృథాగా పోయింది. మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పక్షం రోజులుగా వర్షాలు, వరదల వల్ల పంటలన్నీ దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంది, పెసర, మినుము, సోయా, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పంటలు నీట మునిగి కుళ్లిపోయాయి. నారాయణఖేడ్ పట్టణ శివారులో గల వాగు పొంగి ప్రవహించింది. కంగ్టి, సిర్గాపూర్- నారాయణఖేడ్ రూట్లో నెహ్రూ నగర్- మన్సుర్‌పూర్ గ్రామాల మధ్య ఉన్న వంతెనపై నుంచి ఐదు అడుగుల ఎత్తు మేర నీరు ప్రవహించింది. దీంతో వంతెన వద్ద గల రోడ్డు కొట్టుకుపోయింది. ఫలితంగా నారాయణఖేడ్- కంగ్టి, సిర్గాపూర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న రోడ్డును అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. -
టీఆర్ఎస్ ఎంపీటీసీ ఘనవిజయం
115 ఓట్లతో గెలిచిన జగన్నాథ్‌పూర్ ఎంపీటీసీ మాణిక్యం ఖేడ్ అభివృద్ధికి ప్రజాతీర్పే నిదర్శనం: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండల పరిధిలోని జగన్నాథ్‌పూర్ ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఆభ్యర్థి మాణిక్యం ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి నర్సింలుపై మాణిక్యం 115 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 490 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థికి 605, టీడీపీ అభ్యర్థికి 36 ఓట్లు వచ్చాయి. 7 ఓట్లు నోటాకు 7 పోలయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తల విజయోత్సావం ఎంపీటీసీగా మాణిక్యం గెలుపొందడంతో టీఆర్ఎస్ నాయకులు నారాయణఖేడ్‌తో పాటు బాణాపూర్, అంత్వార్, జగన్నాథ్‌పూర్ గ్రామాల్లో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారన్నారు. ఖేడ్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజల తీర్పే నిదర్శనమన్నారు. అంతకు ముందు ఖేడ్‌లో టీఆర్ఎస్ నాయకులు బాణాసంచా పేల్చి విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, సిద్దయ్య స్వామి, చెనబస్సప్ప, పండరియాదవ్, మలిశెట్టియాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏదైతే అదే!
జిల్లాల పునర్విభజన.. దగాపడ్డ నారాయణఖేడ్ అభిప్రాయ సేకరణ.. మెదక్ జిల్లాలోనే ఉండాలి లేదు.. ఎక్కడైనా పర్వాలేదు.. ఏదైనా మంచిదే కదా!.. ఖేడ్వాసుల అభిప్రాయాన్ని సేకరించిన ‘సాక్షి’ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి నెట్వర్క్: జిల్లా పునర్విభజనపై రైతులు, రైతు కూలీలు, సాధారణ ప్రజలు ఇంకా ఒక అంచనాకు రాలేదు. రాజకీయ నేతలు, పనిగట్టుకున్న ఒక వర్గం మాత్రమే తమ సొంత వాదనలను ప్రజాభిప్రాయంగా చూపించే ప్రయత్నం జరుగుతున్నట్లు తేలింది. బుధవారం ‘సాక్షి’ నెట్వర్క్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రతి మండలానికి 250 మంది చొప్పున మొత్తం 1,250 మంది నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. కేవలం 40 శాతం మంది మాత్రమే స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా మిగిలిన 60 శాతం ప్రజలు ఏ జిల్లా అయినా ఒకటే అని చెప్పారు. ఈ 60 శాతం మందిలో ఎక్కువగా రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు ఉన్నారు. విద్యావంతులు మాత్రం మిశ్రమంగా స్పందించారు. జీవితాన్ని చదివిన అనుభవజ్ఞులు, విశ్రాంత ఉద్యోగులు ‘నారాయణఖేడ్ మెదక్ జిల్లాలోనే కలవాలం’టూ తేల్చి చెప్పారు. ముందుకు చూద్దాం! ఈయన పేరు వీర్శెట్టి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు. నారాయణఖేడ్ మండలం రుద్రార్కి చెందిన ఈయన ‘సంగారెడ్డిలో ఖేడ్ కలిస్తే కొత్తగా పరిశ్రమలు రావు’ అంటున్నారు. ‘అవన్నీ జహీరాబాద్‌లోని నిమ్జ్‌కి వెళ్లిపోతాయి. ఫలితంగా ఖేడ్ పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది’ అని తన వాదన వినిపించారు. ‘ప్రత్యేక రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాలు, ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత అవసరాలను కాకుండా ముందు తరాలు, విద్యార్థుల భవిష్యత్తును ఆలోచిస్తే మెదక్ జిల్లాలోనే నారాయణఖేడ్ చేరడం అన్నివిధాలా మేలు. అప్పుడు ఖేడ్‌లోని పడావు భూముల్లో కర్మాగారాలు ఏర్పాటవుతాయి. ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి’ అని గట్టిగా చెప్పారు. రెండింధాలా మేలు కదా! ఈ యువకుడి పేరు సయ్యద్ కలీం. మాసాన్‌పల్లి క్రాస్‌రోడ్డులో సైకిల్ రిపేర్‌షాపు నడుపుతున్నాడు. ఖేడ్‌ను ఏ జిల్లాలో కలపాలని అడిగినప్పుడు ‘సంగారెడ్డిలో ఉంటే అక్కడ పనులు చేసుకుని అట్నుంచటే హైదరాబాద్‌కు వెళ్తాం. ఒకే రోజు రెండు పనులు చేసుకోవచ్చు కదా! మెదక్ పోయేందుకు బస్సులు సరిగా ఉండవు’ అని తన అనుభవాన్ని వివరించాడు. మెదక్ జిల్లాలోనే మేలు మన పిల్లలకు నౌకరీలు దొరకాలే. కార్ఖానాలు రావాలంటే మనందరం మెదక్ జిల్లాల ఉండాలె. లేకుంటే మనదిక్కు అధికారులు రారు. మనల్ని ఎవరూ పట్టించుకోరు. - డి.రాజులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, తడ్కల్ సంగారెడ్డిలెందుకు చేరుస్తున్నరు? మనకు దెగ్గరున్న మెదక్‌లో మనం ఉంటే బాగుంటది. కాదని సంగారెడ్డిలో చేరిస్తే పొయిరానికి దినం సరిపోదు. ఇప్పుడు బస్సులు లేకుంటే ఏమాయే. జిల్లా చేస్తే బస్సులు చాలయితయి. పనులేమయినా ఉన్నా చేసుకొని ఇంటికి రానీకి బాగుంటది. సంగారెడ్డికి ఎందుకు అంటున్నారో ఏమీ అర్థమవుతలేదు. - సాయిరెడ్డి, రైతు, ముర్కుంజాల్, కంగ్టి మండలం మానసికంగా ‘సంగారెడ్డి’కి అలవాటు పడ్డాం ప్రస్తుతం ఉన్న రవాణా సదుపాయాలు, విద్యాపరంగా ఖేడ్ నియోజకవర్గం సంగారెడ్డిలోనే కొనసాగితే బాగుంటుంది. హైదరాబాద్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. మానసికంగా సంగారెడ్డి జిల్లాకు అలవాటు పడ్డాం. - సంతోష్‌కుమార్, ఎస్ఏ, చాప్టా(కే) గ్రామం, కంగ్టి మండలం మెదక్‌లోనే ఉద్యోగావకాశాలు ఎక్కువ సంగారెడ్డిలోని పట్టణీకరణ, పోటీతత్వం ఉన్న విద్యార్థులతో ఖేడ్ విద్యార్థులు తట్టుకోలేరు. ఖేడ్, మెదక్ పిల్లల ఐక్యూ(ఇంటెలిజెంట్ కోషియంట్) స్థాయి దాదాపుగా సమానంగా ఉంది. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరగాలంటే ఖేడ్ మెదక్ జిల్లాలో కొనసాగడమే ఉత్తమం. - కాశీనాథ్‌రావు, ప్రధానోపాధ్యాయులు, జడ్పీహెచ్ఎస్ తడ్కల్, కంగ్టి మండలం ఉపాధి పెరగాలంటే మెదక్తోనే.. కంగ్టి మండలంలోని 70 శాతం ప్రజలు వలసలపై అధారపడి జీవిస్తున్నారు. వలసలు తగ్గాలంటే కొత్త జిల్లాలో ఏర్పడే పరిశ్రమలు, అభివృద్ధి పనులతోనే స్థానికులకు బతుకుదెరువు దొరుకుతుంది. దీంతో వలసలు తగ్గుతాయి. - యశ్వంత్, ఎస్ఏ, సుక్కల్తీర్థ్ తండా, కంగ్టి మండలం ‘ప్యాకేజీ’తో లబ్ధి పొందుతాం మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడితే మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వాలు విడుదల చేసే అభివృద్ధి ప్యాకేజీలు మన నియోజకవర్గానికి అందే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి తోడు కంగ్టిలాంటి రాళ్లరప్పల భూముల్లో పంటలు పండక రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు పరిశ్రమల అభివృద్ధితో తొలగుతాయి. మన ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. - ఎంఏ ఖాదర్, మండల కో-ఆప్షన్ సభ్యులు, కంగ్టి మండలం, తడ్కల్ మెదక్‌లో ఉంటేనే అభివృద్ధి మెదక్ జిల్లాలో ఉంటేనే ఖేడ్ అభివృద్ధి జరుగుతుంది. 70 ఏళ్లుగా సంగారెడ్డిలో ఉంటే మనం అభివృద్ధి చెందలేదు. మన ప్రాంతం వారు ఉద్యోగాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. మాకు ఉపాధి కూడా దొరక్క ఏదో పొట్టనింపుకొనే పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాం. పిల్లల బతుకులు బాగుండాలంటే చిన్న జిల్లాగా ఏర్పడుతున్న మెదక్‌లోనే ఖేడ్ ఉండాలి. - అంజి, పెయింటర్, తడ్కల్, కంగ్టి మండలం ఎక్కడైనా సరే.. జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్ ఏదైనా సరే. కల్హేర్ మండలం నుంచి రెండు పట్టణాలకు అంతే దూరంగా ఉంటుంది. మెదక్‌కు గుర్తింపు అంతగా లేదు. - సివేందర్, ఆటోడ్రైవర్, మాసాన్‌పల్లి పెద్దగా పట్టించుకోను.. మాసాన్‌పల్లి చౌరస్తా వద్ద పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాను. భార్య పిల్లలు లేరు. జిల్లాల ఏర్పాటు గురించి నేను పెద్దగా పట్టించుకోను. - అంబదాస్, పెట్రోల్‌బంక్ వర్కరు, హన్మంత్‌రావుపేట ఏదైనా పర్వానై.. జిల్లా ఏదైనా పర్వానై. మెదక్ పోతే అంత బస్సు సౌకర్యం ఉండదు. రెండు మూడు చోట్ల బస్సులు ఎక్కాల్సి వస్తాది. అన్ని సౌకర్యలు కలిపిస్తే బాగుంటది. - కాషప్ప, హోటల్ యజమాని, కల్హేర్ ఇప్పటికే ఎగతెగినట్లు ఉన్నాం .. ఉపయోగం ఉంటే ఒప్పుకోవాలి లేకుంటే లేదు. సంగారెడ్డి అంటున్నారు. కానీ ఏమైనా లాభం ఉందా..ఇప్పటికే ఎగతెగినట్లు ఉన్నాం. అభివృధ్ది లేకుంటే మరింత ఎగతెగినట్లు మారిపోతాం. - శివన్న, బాదల్గాం, మనూరు నాకేం తెలుస్తుంది.. ఖేడ్‌ను ఎండ్ల కలిపితే నాకేంది. పనిచేస్తే తప్ప బతుకుదెరువుకాదు. అదంతా పెద్దోళ్లు చూసుకుంటారు. మేమే పని చేసుకొని బతుకుతున్నాము. జిల్లా, మండలం అనేంది మాకేమి అవసరం లేదు. - శ్యాంసన్, పుల్కుర్తి, రైతు జిల్లా గురించి తెల్వదు.. ఏ జిల్లా అయితే ఏంది సారు?. పిల్లలకు ముందటి భవిష్యత్తు బాగుండాలి. కొలువులు రావాలి. అందరూ ఏది అంటే సర్కారు అదే చేయాలి. సర్కారోళ్లు సర్వే చేయాలి. ఆఫీసర్లు, నాయకులు వాళ్ల సేఫ్టీ చూసుకుంటరు. - గాళెప్ప, బోరంచ సంగారెడ్డిలో ఉంటేనే బాగు.. మెదక్ కంటే సంగారెడ్డిల ఉంటేనే బాగు. ఏదైనా పనికి పోతే తెలిసిన వారు ఉంటారు. అదే మెదక్ పోతే నీళ్లు ఇచ్చేవారు కూడా ఉండరు. సమయం తప్పితే ఉత్తిదే. - నర్సింహారెడ్డి, మనూరు అందరు ఎట్లంటే అట్లా.. కొత్త జిల్లా గురించి నాకు అస్సలే తెలియదు. ఊర్లో వారు అందరూ కొత్తగా సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా అంటున్నారు. ఏ జిల్లా అయితే లాభమో తెలియదు. ఏదైతే ఏమి బతుకు దెరువు ముఖ్యం. - పోతుల అశోక్‌రెడ్డి, బెల్లాపూర్ రవాణా సదుపాయం కావాలి సంగారెడ్డి అభివృద్ధి చెందడంతో పాటు రవాణాపరంగా అనుకూలంగా ఉంది. మెదక్‌కు రవాణా పరంగా ఇబ్బందులు ఉన్నాయి. రవాణా సౌకర్యాలు ఏర్పడితే సంగారెడ్డి కంటే మెదక్ దగ్గరవుతుంది. ప్రాంతం అభివృద్ధి ముఖ్యం. - గోపి జైస్వాల్, జిరాక్స్‌సెంటర్ నిర్వాహకుడు, మంగల్‌పేట జనానికి మేలు జరగాలి జిల్లా ఏర్పాటుతో జనాలకు మేలు జరగాలి. నారాయణఖేడ్ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇక్కడ అభివృద్ధి జరగాల్సి ఉంది. అందుకు ఏది బాగైతే సర్కారు అదే చేయాలి. - ఉప్పరి గోపాల్, మెకానిక్, అతిమ్యాల్ ఏదైనా సరే.. జిల్లా ఏదైనా సరే. సంగారెడ్డి, మెదక్ ఏది చేసినా మంచిగనే ఉంటుంది. ఇక్కడ పనులు దొరకవు.పనులులేక జనం గోస పడుతుండ్రు. చదువుకున్నోళ్లకు పనులు దొరికేలా ఉంటేనే లాభం. - నాగరాజు, దాబా నిర్వాహకుడు, నారాయణఖేడ్ -
‘కొత్త’ ఆశలు ఆవిరి!
భవిష్యత్తు ప్రశ్నార్థం పాలకులది పాత పల్లవే.. ‘మెదక్’తోనే అభివృద్ధి: మేధావులు సంగారెడ్డితో విడదీయరాని అనుబంధం: స్థానిక నేతలు ‘సాక్షి’ కథనానికి స్పందన పొద్దంతా కాయకష్టం చేసే జనం. సావైనా బతుకైనా ‘సాగే లోకం’. చెమటను పారించి.. దిగుబడి సాధించటమే వాళ్ల వ్యాపకం. నిజాం రాజుల ఏలుబడి నుంచి ఖేడ్‌కు ‘ఎద్దు– ఎవుసమే’ ఆదెరువు. స్వాతంత్య్రం వచ్చి కూడా 70 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి సంగారెడ్డితోనే నారాయణఖేడ్‌కు అనుబంధం. ఈ 70 ఏళ్ల కాలంలో ప్రాథమిక జీవన ఆధారమైన వ్యవసాయం రంగం ఏనాడూ ‘బాల్య’దశ దాటలేదు. ఈ ఏడాది మొదటి పాదం వరకు కనీసం నియోజకవర్గం కేంద్రంలోనే వ్యవసాయ మార్కెట్ లేదు. ఇక్కడి రైతును బీదర్, లాతూర్, ఉద్గీర్ వ్యవసాయ మార్కెట్లు చేరదీశాయి. కానీ సొంత జిల్లా మార్కెట్ ఏనాడూ దగ్గరకు రానివ్వలేదు. పునర్విభజనతోనైనా కొత్త ఆశలు చిగురిస్తాయకుంటే.. పాలకులు మళ్లీ పాత పల్లవినే ఎత్తుకోవడంతో ఖేడ్ రైతాంగం భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోందని వ్యవసాయ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ నియోజకవర్గం వ్యవసాయంపైనే ఆధారపడిన ప్రాంతం. పట్టా, ప్రభుత్వ, అటవీ భూములు కలుపుకుని మొత్తం 2.50 లక్షల ఎకరాలున్నాయి. దాదాపు 75 వేల రైతు కుటుంబాలున్నాయి. ఇందులో 1.85 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూములున్నప్పటికీ సాగు నీళ్లు లేక 1.20 లక్షల ఎకరాల్లో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పంట పండుతోంది. నల్లవాగు ప్రాజెక్టు కింద కలే్హర్ మండలంలో 6 వేల ఎకరాలు, 200 కుంటలు, 50 చెరువుల ద్వారామరో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. నియోజకవర్గం వ్యాప్తంగా చిన్న కమతాలు కలిగిన సన్న చిన్న కారు రైతులే ఎక్కువగా ఉన్నారు. ఉన్న కొద్దిపాటి భూమికి సాగునీటి వసతి చేసుకోలేక భూములను బీడు పెట్టి వలస బాట పడుతున్నారు. నియోజకవర్గం నుంచి యోటా కనీసం 75 వేలకు మందికి పైగా రైతులు, రైతు కూలీలు వలస పొతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో ప్రధానంగా పెసర, మినుము, కంది, జొన్న, పత్తి, సోయా, వరి, మొక్కజొన్న, ఉల్లి పంటలను సాగుచేస్తారు. కలే్హర్, పెద్దశంకరంపేట మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు అధికంగా సాగవుతాయి. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద వరి, మొక్కజొన్న, చెరకు, సాగుచేస్తారు. నియోజకవర్గం నుంచి ఏడాదికి సగటున 1352.37 టన్నుల వివిధ రకాల పంట దిగుబడి వస్తోంది. ఇందులో సోయా11094హెక్టార్లకు గాను 221.88 టన్నులు,పత్తి 13427హెక్టార్లులో 268.54 టన్నులు, వరి 25,368 హెక్టార్లకు గాను 203 టన్నులు, మొక్కజొన్న 4587 హెక్టార్లలో 321.09 టన్నులు దిగుబడితో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో ఉల్లి, పప్పుధాన్యాలున్నాయి. గడిచిన పదేళ్ల మార్కెట్ విక్రయాలను రికార్డును పరిశీలిస్తే.. నారాయణఖేడ్ రైతులు పండించిన ధాన్యంలో కేవలం 5 శాతం మాత్రమే సంగారెడ్డి, జోగిపేట మార్కెట్‌కు వచ్చాయి. 20 శాతం పంటను కర్ణాటకలోని బీదర్ మార్కెట్‌కు, తరువాత వరుసగా ఔరాద్, మహారాష్ట్రలోని ఉద్గీర్, లాతూర్, దెగులూర్ మార్కెట్‌కు ధాన్యం విక్రయించినట్టు రికార్డులు చెప్తున్నాయి. భౌగోళికంగా... సాగు జలాల లభ్యతను బట్టి చూస్తే నారాయణఖేడ్ ప్రాంతం భూమలు వ్యవసాయం కంటే పారిశ్రామికంగానే అనుకూలమైనవి, చవకైన భూములు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రాలేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల మీదనే దృష్టి పెట్టారు. ఎగుమతి, దిగుమతులకు హైదరాబాద్ అనుకూలం. మంచి రవాణా సౌకర్యంతో పాటు నాణ్యమైన పారిశ్రామిక ఉత్పత్తుల దిగుబడిని ప్రోత్సహించే వాతావరణం ఉండటంతో పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఇక నారాయణఖేడ్ ప్రాంత ఆర్థిక పరిపుష్టికి వ్యవసాయమే మూలం. నీటి వనరులు అభివృద్ధి పరుచుకొని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకోవటమే మార్గం. అది జరగాలంటే సంగారెడ్డి జిల్లా ఎలా అనుకూలం అవుతుంది అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో మెదక్‌జిల్లా వ్యవసాయక జిల్లాగా గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఘణపురం ఆయకట్టు కింద దాదాపు 20 వేల ఎకరాల్లో భూమి సాగు అవుతుంది. ఆనకట్ట ఎత్తు పెంచి మరో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు కదులుతోంది. అదే జరిగితే మెదక్ జిల్లా దక్షిణ తెలంగాణ ధాన్యాగారంగా మారడం ఖాయం. ఈ క్రమంలో జిల్లాకు మరిన్ని వ్యవసాయ రాయితీలు, ప్రోత్సాహకాలు వచ్చే అవకాశం ఉంది. పంట విధానాలపై, మేలైన వంగడాల సృష్టి కోసం విస్తృతమైన ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ఈ సంక్షేమ, ప్రయోగా ఫలాలు సహజంగానే జిల్లా అంతటికీ విస్తరించి వ్యవసాయ రంగం మెరుగుపడే అవకాశాలు అద్భుతంగా ఉంటాయని వ్యవసాయ పరిశోధకులు అంచనా వేస్తున్నాయి. సాక్షి కథనం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. మొదటి కథనంతోనే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు ‘సాక్షి’ కార్యాలయానికి ఫో¯ŒS చేసి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షట్కర్ సాక్షి కథనాలను ఖండించగా.. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్టు ఆర్ సత్యనారాయణ, మేధావులు, విద్యావంతులు, అధికారులు కథనాలను సమర్థించారు. -
ఘనంగా తిరంగ యాత్ర
నారాయణఖేడ్: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నారాయణఖేడ్‌లో తిరంగా యాత్ర కార్యక్రమాని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారి త్యాగాలను నేటి తరం గుర్తుచేసుకోవాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే తిరంగా యాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ దిలీప్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరాం, టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కక్కెరివాడ విఠల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంబీఆర్ యువసేన తాలూకా అధ్యక్షులు సతీష్‌యాదవ్, టైగర్ నరేంద్ర సేవా సమితి తాలూకా అధ్యక్షులు విలాస్‌రావు, బజరంగ్దళ్ నాయకులు ప్రవీణ్, జగదీష్, దేశ్‌ముఖ్, దుదన్‌కర్ సంతోష్, క్రిష్ణా జాదవ్, సంతోష్, నిరుద్యోగ జేఏసీ నాయకులు నీలేష్, నాగరాజు, సూరి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరనున్న కల!
నారాయణఖేడ్‌కు పూర్వవైభవం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఖేడ్ పట్టణం స్థానికుల్లో హర్షాతిరేకాలు నారాయణఖేడ్: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నారాయణఖేడ్ వాసులు కల నెరవేరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాలుగా నష్టపోయిన ఖేడ్ పట్టణం తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ కేంద్రం కానుంది. ఖేడ్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంత ప్రజల్లో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన అఖిలపక్షం సమావేశంలో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో జిల్లాలు, డివిజన్ల విభజనకు సంబంధించిన తుది ముసాయిదాను ప్రభుత్వం ప్రచురించడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమమమైంది. మొదట నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు, అందోల్ నియోజకవర్గంలోని పలు మండలాలను కలుపుతూ ఖేడ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తారని భావించారు. అయితే సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్‌ను ఓ డివిజన్‌గా, జహీరాబాద్‌ను మరో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏర్పాటు కానున్న ఖేడ్ రెవెన్యూ డివిజన్లో నియోజకవర్గంలోని ఖేడ్, మనూరు, కల్హేర్, కంగ్టి, అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలాలతోపాటు ఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు కానున్న నాగల్గిద్ద, సిర్గాపూర్ మండలాలను కలుపుతున్నారు. అంటే ఖేడ్ నియోజకవర్గంలోని ఆరు మండలాలు, అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలాలు కలపడంతో మొత్తం ఏడు మండలాలతో ఖేడ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఖేడ్ నియోజకవర్గంలో ఉన్న పెద్దశంకరంపేట మండలాన్ని ఆ ప్రాంత వాసుల కోరిక మేరకు మెదక్ రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెద్దశంకరంపేట మండలం మెదక్ నియోజకవర్గంలోనే ఉంది. పునర్విభజనతో ఖేడ్‌లో కలిసింది. ఇక ఈ డివిజన్లో అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలం ఒక్కటే అదనంగా చేరుతుంది. భౌగోళికంగా చూస్తే ఈ మండలాలన్నీ ఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోనే ఉంటాయి. మధ్యస్థంగా నారాయణఖేడ్ ఉండగా చుట్టూ మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం సైతం రవాణా, పరిపాలనా పరంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ డివిజన్‌ను ఏర్పాటు చేస్తోంది. గతంలో ఖేడ్ డివిజన్ కేంద్రమే! ఆరో నిజాం కాలం నుంచే నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉండేది. వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంగా ఉండేంది. ఈ ప్రాంతాన్ని నాడు నాలుగు సర్కిళ్లుగా విభజించారు. కల్హేర్, ఏల్గోయి, కంగ్టి, నారాయణఖేడ్ సర్కిళ్లుగా ఉండేవి. అప్పట్లో 16 జిల్లాలు ఉండగా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ రాష్ట్రాలను మూడుగా విభజించారు. దేశ్‌ముఖ్‌లు మాలీపటేళ్లుగా, దేశ్‌పాండేలు పట్వారీలుగా, మైనార్టీ ప్రముఖులు పోలీస్ పటేళ్లుగా కొనసాగారు. అనంతరం బీదర్ జిల్లా కింద నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలను మార్చారు. 1956లో రాష్ట్రాల పుర్వ్యవస్థీకరణలో నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో వీలీనం కావడంతో డివిజన్లను తొలగించారు. కేవలం నియోజకవర్గాలుగానే ఉంచారు. అభివృద్ధికి ఆస్కారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఖేడ్ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఆర్డీఓతోపాటు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, విద్య, వైద్య, పశువైద్య, వ్యవసాయ తదితర శాఖల్లో డివిజన్‌స్థాయి అధికారులు, ఎస్సీ స్థాయి అధికారులు ఇక్కడ కొలువుదీరే అవకాశం ఉంది. ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నాయి. నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా బీదర్ వరకు ఉన్న రహదారిని నేషనల్ హైవే 51గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంజీరా పరీవాహక ప్రాంతం కావడం, కర్మాగారాల ఏర్పాటుకు భూములు, నీటి అనుకూలత ఉంది. ఖేడ్ మండలం జూకల్ శివారులో పాలిటెక్నిక్, మార్కెట్ యార్డు తదితర ప్రభుత్వ భవనాలు ఉన్నందున ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు కూడా ఎటువంటి స్థల సమస్య లేదు. ఉప ఎన్నిక సమయంలో కూడా ఖేడ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. మంత్రి హరీశ్‌రావు ఖేడ్‌ను డివిజన్ చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు బహిరంగంగా ప్రకటించారు. మొత్తంగా ఈ ప్రాంత ప్రజల కల ఎన్నో ఏళ్లకు నెరవేరుతుండటంతో స్థానికులు సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమాయ్యారు. -
‘స్మార్ట్’గా దోచేశారు!
నారాయణఖేడ్: ఆఫర్లో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ ఇస్తామంటూ పనికి రాని వస్తువులు పంపించి తనను మోసం చేశారని మండలంలోని నమ్లిమేట్ గ్రామానికి చెందిన రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన మొబైల్ ఫోన్‌కు ఇటీవల ఓ ఫోన్ వచ్చిందని, రూ. 18వేల విలువ చేసే టచ్ స్క్రీన్ ఫోన్‌ను రూ.3,500లకే అందజేస్తామంటూ వివరించారని అన్నారు. దీంతో తాను నమ్మి ఫోన్లోనే ఆర్డర్ ఇచ్చి తన ఇంటి అడ్రస్ ఇచ్చినట్లు తెలిపారు. కాగా తన పేర హన్మంత్‌రావుపేట పోస్టాఫీస్‌కు పార్శిల్ వచ్చిందని, వారు కోరిన విధంగా రూ.3,500లు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నట్లు చెప్పారు. దాన్ని విప్పిచూడగా కుభేర యంత్రం, దేవుళ్ల ఫొటోలు ఉన్నాయన్నారు. ఇవన్నీ రూ.500ల విలువ కూడా చేయవని తెలిపారు. దీంతో తాను మోసపోయానని బాధితుడు రాజు ఆవేదన వ్యక్తంచేశారు. -
బాలుడి మృతి.. ఆందోళన
జ్వరంతో చేరిక.. తెల్లవారు జామున పెరిగిన వేడి వైద్యం వికటించిందని కుటుంబీకులు, బంధువుల వాదన నారాయణఖేడ్: వైద్యం వికటించి బాలుడు మరణించాడని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు, స్థానికులు పట్ణంలోని శ్రీ పద్మావతి ఆస్పత్రి ముందు గురువారం ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల కథనం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన సంగయ్య, సుజాత దంపతులకు ఓ కూతురు, ఇద్దరు కుమారులు. కాగా చిన్న కుమారుడు విష్ణు(5) జ్వరంతో బాధపడుతుండడంతో నారాయణఖేడ్‌లోని శ్రీ పద్మావతి ఆస్పత్రికి బుధవారం రాత్రి తీసుకు వచ్చారు. ఆస్పత్రిలో చేర్పించామని, జ్వరం అంతకంతకూ పెరిగిందని వారు తెలిపారు. రాత్రి పొద్దుపోయాక జ్వరం తీవ్రమైందని, ఆస్పత్రిలో సరైన వైద్యం అందలేదని ఆరోపించారు. దీంతో బాలుడు తెల్లవారు జామున మరణించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో సరైన చికిత్స అందకపోవడం, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మరణించాడని వారు ఆరోపించారు. ఉదయం పెద్దశంకరంపేట వాసులు, బంధువులు, స్థానికులు ఆస్పత్రి ముందు గుమిగూడి ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగేశ్వర్రావు తన సిబ్బందితో వచ్చి ఆస్పత్రి వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. దీనికి సంబంధించి ఆయన వైద్యుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆందోళన విషయంపై శ్రీ పద్మావతి ఆస్పత్రి వైద్యుడు డా.టి.వినయ్‌కుమార్ వద్ద విలేకర్లు ప్రస్తావించగా బాలుణ్ణి రాత్రి 8.30 గంటలకు ఆస్పత్రికి తీసుకు వచ్చారని, చికిత్స అందించడంతో 10.30వరకు జ్వరం తీవ్రత తగ్గిందని అన్నారు. 102.7 టెంపరేచర్ ఉండగా తగ్గిందని, వెళ్ళిపోవాల్సిందిగా సూచించామని అన్నారు. వారు ఆస్పత్రిలోనే ఉన్నారని, తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో తమ సిబ్బంది వచ్చి బాలుడికి జ్వరం తీవ్రమైందని చెప్పడంతో పరీక్షించామన్నారు. అప్పుడు 104 టెంపరేచర్ ఉందని తెలిపారు. తాము ఇతర ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించినట్లు వైద్యుడు తెలిపారు. రక్త నమూనాలు సేకరించామని, టైఫాయిడ్, మలేరియా లేదని, బాలుడికి మరేదైనా సమస్య ఉండి ఉండవచ్చని తెలిపారు. -
మంజీరా నీటి సరఫరా పునరుద్ధరణ
బోరంచ నీటిపథకం ప్రారంభం ఖేడ్ సంప్‌కు నీటిపంపింగ్ నారాయణఖేడ్:మంజీరా నీటిపథకం బోరంచ జాక్వెల్ నుంచి నారాయణఖేడ్ పట్టణానికి తాగునీటి సరఫరాను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆదివారం ప్రారంభించారు. గత వేసవిలో మంజీరా నదిలో నీరు లేకపోవడంతో దాదాపు ఐదారు నెలలుగా నారాయణఖేడ్‌కు మంజీరా నీటిసరఫరా నిల్చిపోయింది. ఎగువ కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో మంజీరా నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువన సింగూరు ప్రాజెక్టుకు నీరు వెళ్తున్నా మంచినీటి పథకాల వద్ద కొద్దిగా నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మరమ్మతులు పూర్తిచేసి బోరంచ నీటిపథకం నుండి తాగునీటిని సరఫరాను అధికారులు పునరుద్ధరించారు నారాయణఖేడ్ పట్టణ శివారులోని సంప్‌లో నీటి పంపింగ్ ప్రారంభమైంది. నదిలోకి మరింత వరద నీరు వచ్చిచేరితే తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇదిలా ఉండగా పలువురు టీఆర్ఎస్ నాయకులు ర్యాకల్‌లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఫ్లెక్సీలకు జలాభిషేకం నిర్వహించారు. -
ఖేడ్‌లో భారీ వర్షం
భారీగా వచ్చిన వరద.. మునిగిపోయిన రోడ్లు స్తంభించిన రాకపోకలు నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లో శనివారం భారీ వర్షం కురిసింది. పైనుంచి కూడా వరద నీరు భారీగా వచ్చింది. దీంతో మండలంలోని రుద్రారం-పైడిపల్లి రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణఖేడ్-రాయిపల్లి రూట్లో రుద్రారం, పైడిపల్లి గ్రామాల మధ్య నూతనంగా వంతెనలు నిర్మిస్తున్నారు. వాహనాలను తాత్కాలికంగా దారి మళ్లించారు. వర్షం వరద నీటితో డైవర్షన్ రహదారి కొట్టుకుపోయింది. నీరు భారీగా రావడంతో నూతనంగా నిర్మిస్తోన్న వంతెన పిల్లర్లుసైతం మునిగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కొందరు నీటిలో నుంచే ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్డు దాటారు. మండలంలో వర్షపాతం 5.6మి.మీగా నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. -
ప్రియుడి ఇంటి ముందు ధర్నా
►పెళ్లి చేసుకోవాలని బైఠాయింపు.. ప్రియుడు కానిస్టేబుల్ నారాయణఖేడ్: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనను మోసం చేశాడంటూ పెళ్లి చేసుకోవాలని కానిస్టేబుల్ ఇంటి ముందు బైఠాయించింది. ఈ సంఘటన మండలంలోని కొండపూర్ స్కూల్ తండాలో బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మనూరు మండలం శేరి దామర్గిద్ద పంచాయతీ పరిధిలోని గోప్యానాయక్ తండాకు చెందిన విస్లావత్ లలిత(21) పెద్దశంకరంపేటలో డిగ్రీ చదువుతోంది. కొండాపూర్ స్కూల్ తండాకు చెందిన రాథోడ్ విశ్వనాథ్ ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు వీరు పరస్పరం ప్రేమించుకున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ విశ్వనాథ్ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు మనూరు పోలీసులను రెండు రోజుల క్రితం ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సదరు మహిళ బుధవారం స్వయంగా కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి తనను విశ్వనాథ్ మోసం చేశాడని, పెళ్లి చేసుకొని న్యాయం చేసేవరకు కదిలేది లేదని బైఠాయించింది. మూడు గంటలపాటు ఇంటిముందే ధర్నా చేపట్టింది. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ సీఐ సైదానాయక్ తండాకు వెళ్లి యువతికి నచ్చచెప్పారు. నిందితుడిపై తగు చర్యలు తీసుకునేలా తాము చూస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారు. -
మం‘జీరో’!
నదిలోని నీరొస్తున్నా కళతప్పిన నీటి పథకాలు ‘శాపూర్’ వద్ద పనులు చేపట్టని అధికారులు ఎగువున మరిన్ని భారీ వర్షాలు కురిస్తేనే ఆశలు నారాయణఖేడ్: మంజీరా నదిలోకి చేరుతున్న వరద.. నీటి పథకాలకు ఏమాత్రం ఊతమివ్వడం లేదు. ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే నదికి జీవకళ వచ్చేది. ఈసారి సరైన వర్షాలు లేకపోవడంతో నది వట్టిపోయింది. ఈనేపథ్యంలో రెండ్రోలుగా ఎగువు ప్రాజెక్టుల నుంచి కొద్దికొద్దిగా నీరు వస్తుండటం కొంత ఊరట కలిగిస్తోంది. అయితే, భారీ వరదలు వస్తే తప్ప సింగూరు వద్ద నిర్మించిన ప్రాజెక్టుకు నీరు చేరని పరిస్థితి. ప్రస్తుతం చిన్నపాటి ఇన్‌ఫ్లో వల్ల సింగూరు ప్రాజెక్టుకు ఆదివారానికి కొద్దిగా నేరు చేరే పరిస్థితి ఉంది. మంజీరా నది జిల్లాలో మనూరు మండలం గౌడ్గాం జన్వాడ వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, మెదక్ నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తుంది. సింగూరు ప్రాజెక్టు ఎగువున మంజీరాపై నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ తదితర నియోజకవర్గాల నీటి పథకాలు ఉన్నాయి. వరద పెరిగి బ్యాక్‌వాటర్ నిలిస్తే తప్ప నీటిపథకాలు పనిచేయని పరిస్థితి. శాపూర్ నీటిపథకం వద్ద భారీ లోయ ఉండటంతో అక్కడ కొద్దిగా నీరు పంపింగ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పథకం వద్ద మోటార్ల మరమ్మతులతో పాటు చిన్నపాటి పనులు చేయాలని ఎమ్మెల్యే ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించినా పనులు ప్రారంభం కాలేదు. ఖేడ్ నియోజకవర్గం బోరంచ, గూడూరు ఇన్‌టేక్‌వెల్.. జహీరాబాద్ నియోజకవర్గం పుల్కుర్తి వద్ద ఉన్న ఇన్‌టేక్‌వెల్ వరకు పూర్తిస్థాయిలో వరద నీరు రాలేదు. ఇవీ పథకాలు గూడూరు వద్ద 13 ఏళ్ల క్రితం రూ.14కోట్లతో మంజీరా నదిపై 74 గ్రామాలకు తాగునీరు అందించేందుకు నీటిపథకం నిర్మించారు. ఎన్ఏపీ పథకం ద్వారా బోరంచ నుంచి 28 గ్రామాలకు, ఇదే ప్రాంతం నుంచి ఫేజ్-1 కింద 32 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 24 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. పెద్దశంకరంపేట నియోజకవర్గంలో ఇటీవల పథకాన్ని ప్రారంభించారు. దీంతో పాటు పుల్కుర్తి సమీపంలోని నీటి పథకం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గానికి తాగునీటి సరఫరా జరుగుతోంది. నీరు నిలవాల్సిందే సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరితే తప్ప నీటి పథకాలు పనిచేసేందుకు పరిస్థితి లేదు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఉన్నా.. మంజీరా నదిలో నీరు లేని కారణంగా వరద నీరు కిందకు పోతోంది. సింగూరు ప్రాజెక్టు నిండితేనే మంజీరా నదిలో నీరు నిలిచి బ్యాక్‌వాటర్ పెరిగే అవకాశం ఉంది. ఇందుకు మరిన్ని వరదలు రావాల్సి ఉంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నదిలోకి నీరు చేరకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వారం రోజుల పాటు కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే తప్ప.. నీటి పథకాలు పనిచేయని దుస్థితి ఉంది. మంజీరా నదిలోకి నీరు చేరితే భూగర్భ జలాలు పెరిగి బోరు, బావులు రీచార్జ్ కానున్నాయి.