
ఖేడ్ అభివృద్ధే టీఆర్‌ఎస్ ధ్యేయం
పెద్దశంకరంపేట : వెనుకబడిన నారాయణఖేడ్ అభివృద్ధే టీఆర్‌ఎస్ ధ్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపేందుకు వచ్చి ఓటేసిన ఓటర్లకు రుణపడి ఉంటానన్నారు. పోలింగ్ సరళి టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందన్నారు. భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించబోతున్న ఓటర్ల రుణం తీర్చుకుంటానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ విగ్రాం రామాగౌడ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు విజయరామరాజు, సర్పంచ్ జంగం శ్రీనివాస్, నాయకులు బక్కారెడ్డి, అయూబ్‌ఖాన్, క్రిష్ణమూర్తి, మాణిక్‌రెడ్డి, రాగం సంగయ్య, సత్యం, గంగారం, సలీం, బాగయ్య, భీంరావు, గంగారం, అశోక్, నాగభూషణం తదితరులున్నారు.