హైదరాబాద్: నారాయణఖేడ్ లో నీటిఎద్దడికి మంత్రి హరీష్ రావే కారణమని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ సింగూరు రిజర్వాయర్ నుంచి నీటిని మెదక్ తరలించారన్నారు. నారాయణ ఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ ను దత్తత తీసుకుంటానంటూ.. హరీష్ ప్రకటించడం ఆ నియోజక వర్గ ప్రజలను అవమానించడమే అని పొన్నం తెలిపారు.