మాట్లాడుతున్న దళిత సంఘాల నాయకులు
నారాయణఖేడ్ : నాగల్‌గిద్దలో అంబేడ్కర్ గద్దె విషయంలో నారాయణఖేడ్ ఎస్‌ఐ నరేందర్ తన పరిధి కానప్పటికీ అగ్రవర్ణాలతో కుమ్మక్కై పోలీసు బలగాలు, లాఠీలతో వచ్చి దళితులను దూషించినందుకు ఆయనను సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
నారాయణఖేడ్ అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జీవన్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, ఖేడ్ నియోజకవర్గ అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కాన్షీరాం, నాగల్‌గిద్ద మండలశాఖ అధ్యక్షుడు గణపతి, అంబేడ్కర్‌సేన అధ్యక్షుడు రాజ్‌కుమార్, నియోజకవర్గ మాలమహానాడు అధ్యక్షుడు భీంసేనలు మాట్లాడుతూ..
నాగల్‌గిద్దలో గద్దె విషయంలో అభ్యంతరం ఉంటే దళిత సంఘాల వారిని పిలిపించి మాట్లాడాల్సిందని అన్నారు. కూల్చివేయాలనుకుంటే నోటీసులు ఇవ్వాల్సిందన్నారు. అవేమీలేకుండా పోలీసు బలగాలతో వచ్చిన ఎస్‌ఐ నరేందర్ దళితులను దూషిస్తూ జేసీబీతో గద్దెను కూల్చివేయడమే కాకుండ, నాగల్‌గిద్ద దళిత సర్పంచ్‌ని అవమనపర్చాని ఆరోపించారు. ఆయా విషయాలపై డీజీపీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర, జాతీయ కమిషన్‌లకు ఫిర్యాదు చేయడంతో పాటు, త్వరలోనే ఆత్మగౌరవసభ పెట్టి హక్కులను సాధించుకుంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment