atracity case
-
కులాంతర వివాహం.. బంధువుల సమక్షంలో అత్తింటివారు దూషించడంతో..
సాక్షి, మిర్యాలగూడ(నల్లగొండ): అట్రాసిటీ కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్‌కు చెందిన గ్యార సాయికుమార్, ఇందిరమ్మకాలనీకి చెందిన సౌజన్యను ఏడాదిన్నర క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సౌజన్య కుటుంబ సభ్యులు సాయికుమార్‌ను బంధువుల సమక్షంలో కులం పేరుతో దూషించారు. ఈ విషయంపై సాయికుమార్ తల్లి సైదమ్మ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్య తీసుకోవాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని సాయికుమార్ మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న సాయికుమార్ వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తెరిచి తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఖేడ్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
నారాయణఖేడ్ : నాగల్గిద్దలో అంబేడ్కర్ గద్దె విషయంలో నారాయణఖేడ్ ఎస్ఐ నరేందర్ తన పరిధి కానప్పటికీ అగ్రవర్ణాలతో కుమ్మక్కై పోలీసు బలగాలు, లాఠీలతో వచ్చి దళితులను దూషించినందుకు ఆయనను సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ అంబేడ్కర్ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జీవన్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, ఖేడ్ నియోజకవర్గ అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కాన్షీరాం, నాగల్గిద్ద మండలశాఖ అధ్యక్షుడు గణపతి, అంబేడ్కర్‌సేన అధ్యక్షుడు రాజ్‌కుమార్, నియోజకవర్గ మాలమహానాడు అధ్యక్షుడు భీంసేనలు మాట్లాడుతూ.. నాగల్గిద్దలో గద్దె విషయంలో అభ్యంతరం ఉంటే దళిత సంఘాల వారిని పిలిపించి మాట్లాడాల్సిందని అన్నారు. కూల్చివేయాలనుకుంటే నోటీసులు ఇవ్వాల్సిందన్నారు. అవేమీలేకుండా పోలీసు బలగాలతో వచ్చిన ఎస్ఐ నరేందర్ దళితులను దూషిస్తూ జేసీబీతో గద్దెను కూల్చివేయడమే కాకుండ, నాగల్గిద్ద దళిత సర్పంచ్‌ని అవమనపర్చాని ఆరోపించారు. ఆయా విషయాలపై డీజీపీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర, జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేయడంతో పాటు, త్వరలోనే ఆత్మగౌరవసభ పెట్టి హక్కులను సాధించుకుంటామని అన్నారు. -
బలమైన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీసుకురావాలి
పరిగి (వికారాబాద్) : దళితులను వివక్ష, దాడుల నుంచి దూరం చేసేందుకు బలమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి. వివేక్ తెలిపారు. మంగళవారం పరిగిలోని కొప్పుల శారదా గార్డెన్లో అంబేడ్కర్ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలమైన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి దళితుడు బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. నేటికి దళితులు వేధింపులకు, దాడులకు గురవుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష పోవాలంటే ప్రతి దళితుడు తమ పిల్లలను చదివించాలని సూచించారు. చదువుకున్న వ్యక్తులు మిగతా వారిని చదువకునేలా అవగాహన కల్పించాలన్నారు. అంబేడ్కర్ జీవిత కాలంలో 23 డిగ్రీలు పొందారని ఆయన గుర్తు చేశారు. అనంతరం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీలు సంఘటితంగా ఉన్నప్పుడే తమ హక్కులు తాము సాధించుకోగలరని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అంబేడ్కర్ చూపిన బాటలో అందరూ నడవాలని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో మొదటి ప్రసంగం అంబేడ్కర్ గురించే చేశానని ఆయన గుర్తు చేశారు. అనంతరం రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొప్పుల మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేస్తుందని తెలిపారు. దళితులు బాగుపడాలంటే చదువొక్కటే మార్గమని తెలిపారు. అక్షరాస్యత అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం 281 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దళితులు సంక్షేమ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రవికుమార్, రాష్ట్ర దళిత నాయకులు అద్దంకి దయాకర్, మందాల భాస్కర్, దేవదాస్ మాట్లాడుతూ.. దళితులు పోరాటాల ద్వారా తమ హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభజించి పాలించే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. అనంతరం అంబేడ్కర్ విజ్ఞాన వేదిక అధ్యక్ష, ప్ర«ధాన కార్యదర్శులు టీ. వెంకటయ్య, శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ సామాజిక వర్గానికి ఎవరితోనూ శతృత్వం లేదని, తమ జనాభా ప్రాతిపదికన తమకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో తమ ప్రాధాన్యత తమకు ఇవ్వాలన్నారు. అనంతరం నాయకులు మాలల రణభేరి సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్ద్రావ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాదయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎస్పీ బాబయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్, సీనియర్ నాయకులు వెంకటయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ కేసుపై విచారణ
అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం మద్దనకుంట గ్రామానికి చెందిన రఘు తనపై దాడి చేశాడని నిద్రగట్ట గ్రామానికి చెందిన రాజమ్మ గత ఏడాది డిసెంబర్లో ఎస్సీ, ఎస్టీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన అట్రాసిటీ కేసుపై శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వెంకటరమణ విచారణ చేపట్టారు. అమరాపురంలో రాజమ్మను, రఘు, ఇతర సాక్షిదారుల నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేసిన నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
ఎనిమిది మందిపై అట్రాసిటి కేసు
జవహర్‌నగర్: కులంపేరుతో ఓ వ్యక్తిని దూషించి గాయపర్చిన 8 మందిపై జవహర్‌నగర్ పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్‌లో నివసిస్తున్న బొగ్గుల ప్రణయ్ (22) గతనెల 31న బోనాల పండుగ సందర్భంగా దేవాలయానికి వెళ్తుండగా కౌకూర్‌కు చెందిన వాసుదేవరెడ్డి, శంకర్‌రెడ్డి అతడిని అడ్డగించి కులంపేరుతో దూషించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎన్.హనుమంతరెడ్డి, జి.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదతరులు ప్రణయ్ తిరిగి దూషించి తీవ్రంగా దాడి చేసి చంపేస్తామని బెదిరించారు. ఆదివారం ఉదయం బాధితుడి సోదరుడు ఉదయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. -
అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ
ఆండ్ర(మెంటాడ), న్యూస్‌లైన్: ఆండ్ర పోలీస్ స్టేషన్లో నమోదైన అట్రాసిటి కేసుపై బొబ్బి లి డీఎస్పీ ఫల్గుణరావు మంగళవా రం విచారణ నిర్వహించారు. మెం టాడ మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ శివారు మర్రివలస కాల నీకి చెందిన మండల నారాయణ మ్మ, ఈదుబిల్లి సావిత్రిల మధ్య బోరు బావి వద్ద నీటికోసం ఈనెల 7న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మండల నారాయణమ్మను ఈదుబిల్లి సావిత్రి కొట్టడంతో పాటు కుడి చేయి అరచేతిపై దంతాలతో కరిచి గాట్లు పడేలా చేసింది. దీంతో సావిత్రిపై మండల నారాయణమ్మ ఆండ్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మండల నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై ఆండ్ర పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె ఈనెల 9న కలెక్టర్ కాంతిలాల్ దండేకు గ్రీవెన్ సెల్లో ఫిర్యాదు చేసిం ది. మండల నారాయణమ్మతో పాటు అదే కాలనీకి చెం దిన తుమ్మి పోలిపల్లి, నరవ నారాయణమ్మ, తుమ్మి సింహాచలం, అద్దాల రాములు కులం పేరుతో తిట్టడం తో పాటు కొట్టారని ఈదుభిల్లి సావిత్రి కూడా ఆండ్ర పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఆండ్ర పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేసి బొబ్బిలి డీఎస్పీ ఫల్గుణరావు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈదుబిల్లి సావిత్రి ఫిర్యా దు మేరకు డీఎస్పీ బుధవారం ఆండ్ర పోలీసు స్టేషన్లో ఈదుబిల్లి సావిత్రితో పాటు ఆమె ఏర్పాటు చేసుకున్న సాక్షులు ఒంటి కళావతి, ఆకుల పార్వతి, జాడు సింహా చలం, తుమరిల్లి రాములమ్మ, పట్టాసి పైడితల్లిలను పిలిపించి కేసుకు సంబంధించిన వివరాలను సేకరించి, రికార్డు చేశారు. విచారణ అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించామని తెలిపారు. కార్యక్రమంలో ఆండ్ర ఎస్ఐ రొక్కం బాబూరావు, ఏఎస్ఐ ఈశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.