అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం మద్దనకుంట గ్రామానికి చెందిన రఘు తనపై దాడి చేశాడని నిద్రగట్ట గ్రామానికి చెందిన రాజమ్మ గత ఏడాది డిసెంబర్‌లో ఎస్సీ, ఎస్టీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన అట్రాసిటీ కేసుపై శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వెంకటరమణ విచారణ చేపట్టారు. అమరాపురంలో రాజమ్మను, రఘు, ఇతర సాక్షిదారుల నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేసిన నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.