ఆండ్ర(మెంటాడ), న్యూస్‌లైన్: ఆండ్ర పోలీస్ స్టేషన్‌లో నమోదైన అట్రాసిటి కేసుపై బొబ్బి లి డీఎస్పీ ఫల్గుణరావు మంగళవా రం విచారణ నిర్వహించారు. మెం టాడ మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ శివారు మర్రివలస కాల నీకి చెందిన మండల నారాయణ మ్మ, ఈదుబిల్లి సావిత్రిల మధ్య బోరు బావి వద్ద నీటికోసం ఈనెల 7న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మండల నారాయణమ్మను ఈదుబిల్లి సావిత్రి కొట్టడంతో పాటు కుడి చేయి అరచేతిపై దంతాలతో కరిచి గాట్లు పడేలా చేసింది. దీంతో సావిత్రిపై మండల నారాయణమ్మ ఆండ్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మండల నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై ఆండ్ర పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె ఈనెల 9న కలెక్టర్ కాంతిలాల్ దండేకు గ్రీవెన్ సెల్‌లో ఫిర్యాదు చేసిం ది. మండల నారాయణమ్మతో పాటు అదే కాలనీకి చెం దిన తుమ్మి పోలిపల్లి, నరవ నారాయణమ్మ, తుమ్మి సింహాచలం, అద్దాల రాములు కులం పేరుతో తిట్టడం తో పాటు కొట్టారని ఈదుభిల్లి సావిత్రి కూడా ఆండ్ర పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఆండ్ర పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేసి బొబ్బిలి డీఎస్పీ ఫల్గుణరావు దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో ఈదుబిల్లి సావిత్రి ఫిర్యా దు మేరకు డీఎస్పీ బుధవారం ఆండ్ర పోలీసు స్టేషన్‌లో ఈదుబిల్లి సావిత్రితో పాటు ఆమె ఏర్పాటు చేసుకున్న సాక్షులు ఒంటి కళావతి, ఆకుల పార్వతి, జాడు సింహా చలం, తుమరిల్లి రాములమ్మ, పట్టాసి పైడితల్లిలను పిలిపించి కేసుకు సంబంధించిన వివరాలను సేకరించి, రికార్డు చేశారు. విచారణ అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించామని తెలిపారు. కార్యక్రమంలో ఆండ్ర ఎస్‌ఐ రొక్కం బాబూరావు, ఏఎస్‌ఐ ఈశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ
Published Thu, Dec 12 2013 3:53 AM | Last Updated on Fri, May 25 2018 5:49 PM
Advertisement
Advertisement