నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నామినేటెడ్ పోస్టులపై టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలోని నామినేటెడ్ పోస్టులపై టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. దీంతో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. నియోజకవర్గంలో ముఖ్యంగా రెండు నామినేటెడ్ పోస్టులు మాత్రమే ఉన్నాయి.
అవి రెండు కూడా వ్యవసాయాధారిత పోస్టులు కావడం విశేషం. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ (ఏఎంసీ) పదవి ఒకటి కాగా రెండోది ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య అథారిటీ) చైర్మన్ పదవి మరొకటి. రెండు చైర్మన్ పదవులతో పాటు పాలకవర్గాలను సైతం భర్తీ చేయాల్సి ఉంటుంది. కాగా ఆయా కమిటీల పదవీకాలం పూర్తి కాకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పటి లోగా జరుగుతుందోనని ఆశావహులు ఎదరుచూస్తున్నారు.
ఎదురు చూస్తున్న నేతలు
నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నేతలతో పాటు ఇతర ప్రధాన పార్టీల నేతలు సైతం చైర్మన్ పదవులు పొందేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మార్కెట్ కమిటీ చైర్మన్ల భర్తీలో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఖేడ్‌లోని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే తమకే పదవి దక్కుతుందని ఆశతో ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ప్రధానంగా కల్హేర్ మండలంలోనే పోటీ అధికంగా నెలకొంది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి సైతం తిరిగి తనకే దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి.
కల్హేర్ మండల నాయకులు గుండు మోహన్, కృష్ణమూర్తి, కిష్టారెడ్డి, నర్సింహారెడ్డి, గుండు మోహన్, కృష్ణమూర్తి, కిష్టారెడ్డి, నర్సింహారెడ్డి పోటీలో ఉంటూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖేడ్ మండలం నుంచి గిరిజన నాయకులు రవీందర్‌నాయక్, పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్, గొల్లకుర్మ యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్‌శెట్టియాదవ్, తదితరులు చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా ఆత్మ కమిటీ చైర్మన్ రేసులో మారుతిపటేల్ ముందున్నట్టు తెలిసింది. కాగా మరికొందరు నేతలు కమిటీల డెరైక్టర్ పదవులను పొందేందుకు తమ నేతల వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు.