మనూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి సా ధ్యమని ఆ పార్టీ నారాయణఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ అన్నారు. ఆదివారం ఆయన మనూరు మండలం మోర్గిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగానే ఆంధ్ర, కర్ణాటక సరిహద్దున మంజీర నదిపై వంతెన నిర్మాణం జరిగిందన్నారు. వంతెన అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని మహా నేత హయాంలోనే వంతెన నిర్మాణం పూర్తయిందన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చేందుకు వైఎస్ రూ.70 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలి పారు. రాజన్న ఉంటే అన్ని గ్రా మాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలి పించాలని అప్పారావు షెట్కార్ అభ్యర్థించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం నిర్వహించే రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
వైఎస్సార్ సీపీలో చేరికలు..
మనూరు మండలం మోర్గిలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు అప్పారావు షెట్కార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మోర్గి కి చెందిన ఇబ్రహీమ్, తుకారం, శిరోమణి, సంగప్ప, కల్లప్ప, శర్ణప్ప, ఏశ ప్ప, అబ్రహం, చంద్రమ్మ, పెంటమ్మ, కాంత మ్మ, బాలమ్మ, శాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు జగన్నాథ్ తన అనుచరులతో పార్టీలో చేరారు.
పంచగామలో భారీగా..
నారాయణఖేడ్: మండలంలోని పంచగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పలువురు ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు. పార్టీలో చేరిన వారిలో దేవిదాస్, డాని యల్, మానిక్యయ్య, సుకుమార్, విష్ణు, సురేశ్, నవీన్, ప్రభాకర్, జైలు, సుభాష్, బాబు, మల్లేశ్, నాగయ్య, ఏసయ్య, నర్సింలు, జాన్, లాజర్ ఉన్నారు.
వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి సాధ్యం
Published Mon, Apr 21 2014 12:20 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement