వైఎస్సార్ సీపీ అభ్యర్థుల రోడ్‌షో | road show ysrcp candidates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ అభ్యర్థుల రోడ్‌షో

Published Sun, Apr 27 2014 2:29 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM

వైఎస్సార్ సీపీ అభ్యర్థుల రోడ్‌షో - Sakshi

వైఎస్సార్ సీపీ అభ్యర్థుల రోడ్‌షో

జహీరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మొహియొద్దీన్, అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌లు శనివారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని హమాలీ, బాలాజీ కాలనీ, డ్రైవర్స్ కాలనీల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో ఎంతోమంది పేదలు లబ్ధి పొందారన్నారు.

దీంతో పేదలు రాజశేఖరరెడ్డి తనయుడు ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వహీద్‌తోపాటు ఆయా కాలనీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement