Fan symbol
-
ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ
సాక్షి, తిరుపతి: ఏ ఎన్నిక చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. సాధారణ ఎన్నికలు మొదలుపెట్టుకుని మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ గిర్రున తిరుగుతోంది. వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని శక్తిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను మెచ్చి ఇప్పుడు అనివార్యంగా వచ్చిన తిరుపతి లోక్‌సభ ఎన్నికలోనూ ఓటర్లు వైఎస్సార్సీపీకి తిరిగి ఎంపీ స్థానం కట్టబెట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ ఇప్పుడు ఉప ఎన్నికలోనూ సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది. డాక్టర్ గురుమూర్తి తిరుపతి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందడం విశేషం. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రచారానికి రాకపోయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీ అభ్యర్థి గురుమూర్తి తిరుగులేని ఆధిక్యంతో దూసుకు వచ్చారు. రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యం పెంచుకుంటూ చివరకు విజయబావుటా ఎగురవేశారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' -
వైఎస్సార్ సీపీకి ఓటేశారని..
శ్రీకాకుళం, ఆమదాలవలస: బూర్జ మండలంలోని తోటవాడ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసిందని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఆమెపై దాడికి దిగి చితకబాదారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వండాన సరస్వతి, ఆమె అక్క వండాన దుర్గమ్మ (మూగ) ఇద్దరూ మగదిక్కు లేకుండా తోటవాడ గ్రామంలో నివాసముంటున్నారు. ఎన్నికల ముందురోజు ఆ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సీపాన ధనుంజయరావు వీరి ఇంటికి వెళ్లి.. టీడీపీకి ఓటు వెయ్యమని ప్రలోభ పెట్టి రూ.1,000 ఇచ్చారు. ఆ డబ్బు వద్దని, తీసుకోమని సరస్వతి వారి మొహం మీద చెప్పినా సరే ఇంట్లో దూరి దేవుడుబల్లపై రెండు రూ.500ల నోట్లు పెట్టేసి వెళ్లిపోయారు. సరస్వతి ఇంటిపక్కనే ఉన్న కొత్తకోట రమణమూర్తి, ఆయన భార్య సీతామహాలక్ష్మి గురువారం సాయంత్రం దుర్గమ్మను ‘నువ్వు, మీ చెల్లి ఏ పార్టీకి ఓటు వేశార’ని ప్రశ్నించగా మూగదైన దుర్గమ్మ ఫ్యాను గుర్తుకు వేశామని సైగ చేసి చెప్పింది. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ టీడీపీ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటు వేస్తారా అంటూ ఆ అక్కా చెల్లెళ్ల పైకి దూసుకుపోయి చితకబాదారని స్థానికులు చెబుతున్నారు. తాము ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిత్రహింసలు పెట్టగా.. ‘ఆ డబ్బు మాకు ధనుంజయరావు ఇచ్చాడని, ఆయనకే ఇస్తాన’ని చెబుతూ సరస్వతి ఆ వెయ్యి రూపాయలు తీసుకెళ్లి ఆయనకు ఇచ్చేసింది. అయితే టీడీపీకి ఓటు వెయ్యవా అంటూ రమణమూర్తి, అతని భార్య కలిసి చితగబాదారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బూర్జ మండల కేంద్రంలోగల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా వారు కూడా పట్టించుకోవడంలేదని, పోలీసులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. -
కృష్ణాజిల్లాలో పూర్తయిన ఎన్నికల ఏర్పాట్లు
విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడలో సబ్ కలెక్టర్ మంగళవారం ఈవీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తు పనిచేయక పోవటాన్ని అధికారులు గుర్తించారు. దాంతో ఈవీఎంలలోని సాంకేతిక లోపాలు సరిచేసి ఆయా ప్రాంతాలకు పంపిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. కృష్ణాజిల్లావ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. సీమాంధ్రలో బుధవారం పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. -
ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి
ఓబులవారిపల్లె, న్యూస్‌లైన్: ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ మండల కన్వీనర్ సాయికిషోర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మంగళంపల్లె దళితవాడలో పార్టీ నాయకులు శశికుమార్‌రెడ్డి, సీ.గంగిరెడ్డి, రాజమోహన్, వెంకటరెడ్డి, నాగేశ్వర్, బత్యాల వెంకటసుబ్బయ్యతో కలిసి సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా మంగంపేట కాపుపల్లె దలితవాడలో వైఎస్సార్సీపీ యువ నాయకుడు తల్లెం వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి సాయికిషోర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మంగంపేట పంచాయతీని అభివృద్ధి చేస్తామని, గృహాలకు ఏపీఎండీసీ ద్వారా ఉచితంగా 24గంటల విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఏపీఎండీసీ గనుల విస్తరణలో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పిస్తామని, తాత్కాళికంగా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పులపత్తూరు సుబ్బరామిరెడ్డి, జిల్లా యూత్‌స్టీరింగ్ కమిటీ మెంబర్ భరత్‌కుమార్‌రెడ్డి, గజ్జెల శ్రీనివాసులురెడ్డి, పులపత్తూరు సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పాపిరెడ్డి, కౌలూరు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. చెన్నరాజుపోడు గ్రామంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, సింగిల్ విండో అధ్యక్షుడు టంగుటూరు కృష్ణారెడ్డి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరా రు. చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ రఫీ, నేతలు దశరధరామరాజు, ఆనందబాబు, శంకర, మనోహర్, చలపతి, కదిరుల్లా, సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
ప్రజల సైగలతో బాలయ్యకు షాక్
-
ప్రజల సైగలతో బాలయ్యకు షాక్!
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చలివెందులలో టిడిపి అభ్యర్ధి బాలకృష్ణకు చుక్కెదురైంది. ప్రజల సైగలు ఆయనకు షాక్ ఇచ్చాయి. చలివెందుల గ్రామంలో టిడిపికి ఓటు వెయ్యాలని బాలయ్య విక్టరీ సింబల్ చూపించారు. అందుకు ప్రతిగా అక్కడ గుమిగూడిన జనం ఫ్యాన్ తిరుగుతున్నట్లు చేతితో సైగలు చేశారు. చేతులు తిప్పుతూ ఫ్యాన్ తిరిగినట్లు చూపారు. దాంతో బాలయ్యకు మతిపోయినట్లు అయింది. ఆ గ్రామంలో వైఎస్ఆర్ సిపి అభిమానులు అధికమంది ఉన్నట్లున్నారు. అందుకే వారు ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ తిరుగుతున్న సైగలు చేశారు. అంతేకాకుండా బాలయ్య సమక్షంలో జగన్ జిందాబాద్ అని కూడా వారు నినాదాలు చేశారు. -
వైఎస్సార్ రుణం తీర్చుకుందాం
సాక్షి, నెల్లూరు: ఈ నెల 7న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్ రుణం తీర్చుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి మహానేత వైఎస్సార్ అహర్నిశలు కృషి చేశారన్నారు. వనంతోపు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత శ్రీనివాసరావు (ఆర్ఎస్సార్) వెయ్యి మంది అనుచరులతో బుధవారం పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమక్షంలో స్థానిక మేకపాటి అతిథిగృహంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, మేయర్ అభ్యర్థి అబ్దుల్అజీజ్ పాల్గొన్న కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ కుట్రలతోనే జగన్ ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన అవసరముందన్నారు. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జగన్ సీఎం అయితేనే రాష్ర్ట అభివృద్ధి చెందుతుందన్నారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వైఎస్సార్ వల్లే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ఎంపీ సమక్షంలో కాంగ్రెస్ నేత ఆర్ శ్రీనివాసరావు, ఆయన అనుచరులు భరత్, శేషయ్య, చెన్నమ్మ, చౌడమ్మ, మాతాశేఖర్, శ్రీని వాసులు, మురుగ, నాగేంద్ర, మల్లి, ఉష మ్మ, శంకరమ్మ, అనీల్, మస్తాన్, పాపిరెడ్డి, వేణుతో పాటు వెయ్యి మంది పార్టీలో చే రారు. ఆర్ఎస్సార్ ఆధ్వర్యంలో 300 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. -
పనిచేయని వైఎస్సార్ సీపీ బటన్
న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి ఖానాపూర్లోని 73వ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈవీఎంలో వైఎస్సార్ సీపీకి కేటాయించిన బటన్ పని చేయకుండానే అధికారులు పోలింగ్ నిర్వహించారు. 226 ఓట్లు పోలైన తర్వాత ఓటర్లు గమనించి ఆ పార్టీ ఏజెంట్‌కు విషయం తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన బటన్లను నొక్కగానే శ బ్ధం వస్తున్నా.. ఫ్యాన్ గుర్తుపై నాలుగైదు సార్లు నొక్కినా శబ్ధం రావడం లేదని వారు పేర్కొన్నారు. విషయాన్ని పార్టీ అభ్యర్థి ఈసీ శేఖర్‌గౌడ్‌కు తెలపడంతో ఆయన అధికారుల సమక్షంలోనే వైఎస్సార్ సీపీకి చెందిన బటన్‌ను పరిశీలించగా.. దాని నుంచి ఎలాంటి శబ్ధం రాలేదు. దీంతో పోలింగ్‌ను నిలిపేయాలని శేఖర్‌గౌడ్ పట్టుబట్టారు. రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తేరుకున్న అధికారులు రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించి మరో ఈవీఎంను తెప్పించి.. పోలింగ్‌ను యథావిధిగా కొనసాగించేందుకు యత్నించారు. అధికారుల తీరుపై శేఖర్‌గౌడ్ నిరసన వ్యక్తం చేశారు. తనకు సంబంధించిన బటన్ పనిచేయకుండానే 226 ఓట్లు పోలయ్యాయని.. ఇప్పుడు అదే సంఖ్య నుంచి పోలింగ్ కొనసాగించడం అన్యాయమన్నారు. రీపోలింగ్‌కు పట్టుబట్టడంతో పోలింగ్ ఆగిపోయింది. ఖానాపూర్‌లో చోటుచేసుకున్న ఘటన ఉన్నతాధికారులు, పోలీస్ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఇబ్రహీంపట్నం ఏసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ మహ్మద్‌గౌస్ పోలీస్ బలగాలతో అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి అభ్యర్థి, అధికారులు, ఏజెంట్లతో మాట్లాడారు. కొత్త ఈవీఎం ద్వారా పోలింగ్‌ను కొనసాగించాలని స్పష్టం చేశారు. సుమారు గంటన్నర తర్వాత పోలింగ్ తిరిగి కొనసాగింది. అయితే ఇది చాలా అన్యాయమని.. పోలింగ్‌ను పర్యవేక్షించే అధికారులు కనీసం గుర్తింపు కార్డులు కూడా పెట్టుకోకుండా పోలింగ్‌లో ఎలా పాల్గొంటారని.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనకు నష్టం కలుగజేశారని శేఖర్‌గౌడ్ మండిపడ్డారు. ప్రిసైడింగ్ అధికారి లక్ష్మీరమణ, మైక్రో ఆఫీసర్ శ్రీనివాస్ తన అభ్యర్థన పట్ల సరిగా స్పందించలేదన్నారు. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు శేఖర్ గౌడ్ స్పష్టంచేశారు. -
ఖానాపూర్ బూత్ నెం.73లో పనిచేయని ఫ్యాన్ గుర్తు బటన్
-
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల రోడ్‌షో
జహీరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మొహియొద్దీన్, అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌లు శనివారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని హమాలీ, బాలాజీ కాలనీ, డ్రైవర్స్ కాలనీల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో ఎంతోమంది పేదలు లబ్ధి పొందారన్నారు. దీంతో పేదలు రాజశేఖరరెడ్డి తనయుడు ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వహీద్తోపాటు ఆయా కాలనీల నాయకులు పాల్గొన్నారు. -
జగన్ కోసం.. జన ప్రభంజనం
నల్లగొండ/ఖమ్మం: జననేత జగన్మోహన్రెడ్డి కోసం జనం ప్రభంజనంలా కదిలొచ్చారు. జననేతను చూడ్డానికి, వీలైతే మాట్లాడ్డానికి, అవకాశం దొరికితే కరచాలనం చేయడానికి యువకులు, యువతులు, మహిళలు పోటెత్తారు. మహానేత తనయుడిని కళ్లారా చూడాలని వృద్ధులు సైతం ముందుకొచ్చారు. దీంతో రోడ్లన్నీ జనగోదారులయ్యాయి. సభలన్నీ జనసంద్రాలయ్యాయి. శనివారం నిర్ణీత సమయం కన్నా ఒక గంట ఆలస్యంగా నల్లగొండ జిల్లా కోదాడకు చేరుకున్న వైఎస్ జగన్‌కు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో హెలిప్యాడ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని సభాస్థలికి చేరుకోవడానికి గంటకు పైగా పట్టింది. రోడ్ షోకు అనుమతి లేదని, వాహనంలో కూర్చునే వెళ్లాలని పోలీసులు అభ్యంతరం చెప్పారు. అయితే, వేలాదిగా ఎదురేగి వస్తున్న ప్రజలను కలవకుండా, మాట్లాడకుండా వాహనంలో ఎలా వెళ్లిపోతానని పోలీసులతో జగన్ వాగ్వాదానికి దిగారు. కావాలంటే అరెస్టు చేసుకోండని సీఐ మొగిలయ్యతో అన్నారు. జన హోరు చూసి వారు వెనక్కి తగ్గారు. ఇక, జగన్ దారిపొడవునా ఎదురొచ్చే మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ సభాస్థలికి చేరుకున్నారు. కోదాడ సభ తర్వాత 20 కిలోమీటర్ల దూరంలోని హుజూర్‌నగర్‌కు చేరుకోవడానికి జగన్‌కు రెండున్నర గంటల సమయం పట్టింది. బాలాజీనగర్, చిలుకూరుల్లోనూ కొద్ది సేపు ఆగారు. హుజూర్నగర్ శివారులో మిల్లులో పనిచేసే కార్మికులతో మాట్లాడారు. కిక్కిరిసిన మధిర, కొత్తగూడెం.. హుజూర్నగర్ సభ అనంతరం హెలికాప్టర్లో ఖమ్మం జిల్లా మధిరకు వెళ్లిన జగన్‌కు.. అక్కడి ప్రజలు నీరాజనం పలికారు. మధిర సభకు ఎంత మంది జనం హాజరయ్యారో.. వారిలో సగం మంది మధిరలో హెలిప్యాడ్ దగ్గర జగన్‌కు ఎదురేగి స్వాగతం పలికారు. మధిర సభలో జగన్ మాట్లాడిన ప్రతి మాటకూ అద్భుతమైన జనస్పందన. ఇక్కడ సభ అనంతరం జగన్ కొత్తగూడెం వెళ్లే దారిలో పెద్ద ఎత్తున ప్రజలు ఎదురేగి హారతులు పట్టారు. కొత్తగూడెం సభకు వేలాది మంది హాజరై అభిమానం చాటుకున్నారు. మీలో ఫ్యాన్ గుర్తు తెలిసిన వాళ్లు చేతుల్లేపండి.. అని జగన్ అన్నప్పుడూ సభలోని అందరూ చేతులు పెకైత్తి.. జై జగన్ అంటూ నినదించారు. ఇక్కడ సభ అనంతరం జగన్ సత్తుపల్లి మండలం గంగారంలో బస చేశారు. -
రంపచోడవరం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రాజేశ్వరి
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వంతెల రాజేశ్వరి పోటీ చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను ఆమోదించి ఫ్యాన్ గుర్తు కేటాయించారు. ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా అనంత సత్య ఉదయభాస్కర్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన స్థానంలో రాజేశ్వరి ఫ్యాన్ గుర్తుపై రంగంలో ఉంటారన్న విషయాన్ని ఓటర్లు గుర్తించాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ సోమవారం తెలిపారు. రాజేశ్వరికి అవకాశం రావడంతో అసెంబ్లీకి పోటీపడుతున్న వైఎస్సార్సీపీ మహిళా అభ్యర్థుల సంఖ్య 12కు పెరిగింది. -
ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి.. జగన్‌ను సీఎం చెయ్యండి
కార్యకర్తలకు ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పిలుపు మందస,న్యూస్‌లైన్: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ైవైఎస్సార్సీిపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జగన్మోహన్రెడ్డిని సీఎం చేసి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఆదివారం సాయింత్రం హరిపురంలో మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదటి సారిగా 2004 ఎన్నికల్లో మత్య్సకార కోటాలో అప్పటి సోంపేట అసెంబ్లీ స్థానానికి టెకెట్ ఇచ్చార న్నారు. అయితే అప్పట్లో ఓటమి పొందినప్పటికి మరల ఆయన 2009లో పలాస నియోజకవర్గానికి టికెట్ ఇచ్చారన్నారు. దివింగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో టీడీపీ అభ్యర్ధి గౌతు శ్యామసుందర శివాజీపై అఖండ మెజారిటీతో గెలిచానన్నారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. మహానేత ఆశయాలను కొనసాగించడానికి, ఆయన ప్రవేశపెట్టిన పధకాలను పూర్తిస్థాయిలో అందించేందుకు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందిరిపైనా ఉందన్నారు. ఆ పార్టీలోకి కాస్త ఆలస్యంగా చేరడంతో నాకు టికెట్ రాలేదని, అయితే మడమ తిప్పని, మాట తప్పని నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డితో ఉంటే మనకు మంచి రోజలు వస్తాయన్నారు. అంతేకాకుండ తనకు ఎమ్మెల్సీ ఇస్తామని వైఎస్ జగన్ తన గురువుగారైన ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. తన గురువుగారైన ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీిపీ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. రాజశేఖర్‌రెడ్డిపై ఎంత అభిమానం ఉందో అంతే అభిమానం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఉందన్నారు. కార్యకర్తలంతా కలసి మెలసి వైఎస్ఆర్ సీపీ పలాస నియోజకవర్గ అభ్యర్ధి వజ్జ బాబూరావు గెలుపుకు కృషి చేసి వైఎస్ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా అంతా పని చేయాలని కార్యకర్తలను కోరారు. మన ప్రధాన లక్ష్యం తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించడమేనని అన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటను ఎప్పటికీ జవదాటమని అన్నారు. ఎమ్మెల్యే జగన్నాయకులు ప్రకటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం పొంగి పొర్లింది. జై జగన్...జై జై జగన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెట్ట కుమారస్వామి, ఏఎమ్‌సీ చైర్మన్ పాలిన శ్రీనివాసరావు, వజ్రపుకొత్తూరు పీఏసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ మదుకేశ్వరరావు, డొక్కరి దానయ్య,మరడ భాస్కరరావు, బోర క్రష్ణారావు, దుంపల లింగరాజు, జెడ్పీటిసి అభ్యర్ధి దొరబాబు, దుంపల లింగరాజు, కర్రి గోపాలక్రిష్ణ, బమ్మిడి ధర్మారావు, వాయిలపల్లి ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి సాధ్యం
మనూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి సా ధ్యమని ఆ పార్టీ నారాయణఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ అన్నారు. ఆదివారం ఆయన మనూరు మండలం మోర్గిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగానే ఆంధ్ర, కర్ణాటక సరిహద్దున మంజీర నదిపై వంతెన నిర్మాణం జరిగిందన్నారు. వంతెన అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని మహా నేత హయాంలోనే వంతెన నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు వైఎస్ రూ.70 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలి పారు. రాజన్న ఉంటే అన్ని గ్రా మాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలి పించాలని అప్పారావు షెట్కార్ అభ్యర్థించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నిర్వహించే రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీలో చేరికలు.. మనూరు మండలం మోర్గిలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు అప్పారావు షెట్కార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మోర్గి కి చెందిన ఇబ్రహీమ్, తుకారం, శిరోమణి, సంగప్ప, కల్లప్ప, శర్ణప్ప, ఏశ ప్ప, అబ్రహం, చంద్రమ్మ, పెంటమ్మ, కాంత మ్మ, బాలమ్మ, శాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు జగన్నాథ్ తన అనుచరులతో పార్టీలో చేరారు. పంచగామలో భారీగా.. నారాయణఖేడ్: మండలంలోని పంచగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పలువురు ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు. పార్టీలో చేరిన వారిలో దేవిదాస్, డాని యల్, మానిక్యయ్య, సుకుమార్, విష్ణు, సురేశ్, నవీన్, ప్రభాకర్, జైలు, సుభాష్, బాబు, మల్లేశ్, నాగయ్య, ఏసయ్య, నర్సింలు, జాన్, లాజర్ ఉన్నారు. -
ఫ్యాన్‌కి వెస్తే ఉద్యోగం కూడా వస్తుంది
-
యువత ఓట్లన్నీ వైఎస్సార్సీపీకే : ఎస్వీ
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: యువకుల్లో అత్యధిక శాతం వైఎస్సార్సీపీవైపే చూస్తున్నారని పార్టీ కర్నూలు అసెంబ్లీ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని 44వ వార్డు రోజా వీధికి చెందిన అక్రమ్, జిలానీ ఆధ్వర్యంలో సమీర్, ఉస్మాన్, తౌఫిక్, గౌస్‌పీర్, ఇద్దూ, చాంద్, రహిమాన్‌తో పాటు మరో 300 మంది యువకులు, 20వ వార్డు జోహరాపురానికి చెందిన తిరుపతయ్య, అయ్యస్వామి, రాముడు, శేఖర్, బాలు, యోగి, రాజు, శివ, ప్రసాద్, సుధాకర్, మరో 50 మంది మాలగేరి వాసులు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఎస్వీ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఒకటో వార్డుకు చెందిన బేస్త నవీన్, మాబు, చంటి, భరత్, తేజ, చిన్న, అశోక్, మాను, శ్రీను, మరో 100 మంది ఎస్వీ నివాసంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం వైఎస్సార్ ఎన్నో పథకాలు అమలు చేశారని, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన బాటలో నడుస్తున్నారని తెలిపారు. రాజన్న పాలన మళ్లీ రావాలంటే జగన్ సీఎం కావాల్సి ఉందన్నారు. వరుసగా జరిగే అన్ని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. -
ఓటేస్తే అభివృద్ధి చేస్తా
పలాస రూరల్, న్యూస్‌లైన్: పలాస మండలంలో వైఎస్సార్ సీపీ తరఫున బరిలో దిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు గురువారం ముమ్మర ప్రచారం చేశారు. ఫ్యాన్‌గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థి పేరాడ భార్గవి, పెదంచల, లక్ష్మీపురం, టెక్కలిపట్నం, చినంచల ప్రాదేశికాల నుంచి పోటీ చేస్తున్న దువ్వాడ దేశమ్మ, బమ్మిడి చంద్రకళ, సవర తులసీ, బమ్మిడి వరహాలు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయూలని ఓటర్లను అభ్యర్థించారు. తమకు ఓటు వేస్తే అభివృద్ధి చేస్తామని భార్గవి చెప్పారు. ప్రచారంలో నందిగాం మండలం మాజీ ఉపాధ్యక్షుడు పేరాడ తిలక్, లొద్దభద్ర ఎంపీటీసీ అభ్యర్థి కొయ్య శ్రీనువాసరెడ్డి, పెదంచల సర్పంచ్ రౌతు జగదీశ్వరి, టెక్కలిపట్నం, పెదంచల, చినంచల మాజీ సర్పంచ్‌లు కె. కృష్ణమూర్తి, టి.శ్రీరాములు, పి.జోగారావు, టెక్కలిపట్నం ఎంపీటీసీ మాజీ సభ్యుడు జె.రామారావు, రౌతు శంకరరావు, బి.గోపి, ఆర్.షణ్ముఖరావు, షిష్టి మురళీ, ఎస్.చంద్రమౌళి, బి.హనుమంతరావు, బి.ధర్మారావు, బి.తేజేశ్వరరావు, కె.కృష్ణారావు, బి.వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
‘జగన్‌ను సీఎం చేసేంత వరకు పని చేయాలి’
బొబ్బిలి, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, నిత్యం ప్రజల మధ్యన ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకూ ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు పిలుపునిచ్చారు. తెర్లాం మండలంలోని పెరుమాళి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. కేతి సత్యనారాయణ ఆధ్వర్యంలో చేరిన వీరికి సుజయ్ కండువాలు వేసి ఆహ్వానించారు. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సుజయ్ అన్నారు. ప్రజల కోసం ఆలోచించడం వల్లనే అమ్మ ఒడి, పింఛను పెంపు, డ్వాక్రా రుణాల రద్దు, జన సేనా కేంద్రాల వంటి పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని అన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కె.రవిశంక ర్, కె.గణేష్, జరజాన గోవింద, పుల్లాజి, ఎల్లయ్యదాసు, వెలగాడ నాగభూషనమ్మ, పొడగ ముగదమ్మ, రేగాన కమలమ్మ, ఎజ్రగడ చిన్నమ బోనెల రాంబాబులు కుటుంబాలతో చేరారు. కార్యక్రమంలో మండల నాయకుడు నర్సుపల్లి వేంకటేశ్వరరావు,సర్పంచ్ వెంకటరావు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ తిరగాలి
ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి కోరారు. ఆది వారం సాయంత్రం మున్సిపాలిటీలోని 5, 6,7, 8, 9 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. ఓటర్లను పలకరించి, పార్టీ కరపత్రాలను అందజేస్తూ వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీని గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నా రు. మహిళలు శాంతికి పూల మాలలు వేసి హారతులిచ్చి స్వాగతం పలికారు. కాగా వృద్ధులకు పూలమాల లు వేసి వారిని శాంతి గౌరవించారు. మంగళవారం పేటలొ ఓ వృద్ధురాలు తన ఇంటికి వచ్చిన రెడ్డి శాంతిని అప్యాయంగా పలకరించి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌కే తన మద్దతు అని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు నరేంద్రయాదవ్, మాజీ ఎమ్యెల్యే పిరియా సాయిరాజ్, జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ ఎస్.దేవరాజ్, నాయకులు కాళ్ల దేవరాజ్, ఏఎంసీ చైర్మన్ శ్యాంపురియా, మున్సిపల్ కన్వీనర్స్ పిలక పోలారావు, మున్సిపల్ అభ్యర్థులు సోమయ్య, పి.మంజులత, నం దిక హరిత, పల్లంటి తారకేశ్వరి పాల్గొన్నారు. -
త్వరలో కష్టాలన్నీ తీరతాయి
సామర్లకోట/పిఠాపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సామర్లకోటలో నిర్వహించిన రోడ్‌షోలో అడుగడుగునా ప్రజలు తమ ఆప్యాయతానురాగాలు పంచారు. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. వాటన్నింటినీ ఆయన ఓపికగా విని వారికి ధైర్యం చెప్పారు. ‘నా పెద్ద కొడుకు రాజన్న మళ్లీ వచ్చినట్టుంది.. మనవడా నీవు చల్లగా ఉండాలి. ఆ మహానేత కొడుకుగా ఆయన ఆశయాలు నెరవేర్చడానికి నీవు మళ్లీ మాముందుకు ముఖ్యమంత్రిగా వస్తావు బాబూ’ అంటూ సామర్లకోటకు చెందిన ఎ. బుల్లమ్మాయి అనే వృద్ధురాలు ఆప్యాయంగా పలకరించింది. ఆమెను జగన్మోహన్రెడ్డి ముద్దాడి ‘నీ ఆశీర్వాదంతో మళ్లీ వస్తా నాయనమ్మా’ అని అన్నారు. నాకు గతంలో కంటితుడుపుగా పింఛను అందేది, అది కూడా నెలల తరబడి ఇచ్చేవారు కాదు. వైఎస్సార్ మాకష్టాలు తెలుసుకుని రూ.200 మంజూరు చేశారు. ప్రస్తుతం అది ఎప్పుడు ఇస్తారో తెలియక సతమతమవుతున్నాను. అంటూ ఆ వృద్ధురాలు జగన్మోహన్రెడ్డికి విన్నవించింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుంది, త్వరలో రూ.700 పింఛను మీకు అందిస్తా అని ఆమెకు భరోసా ఇచ్చారు. ‘తమ్ముడూ నీవు ఏం చదువుకుంటున్నావు’ అంటూ సామర్లకోటకు చెందిన ఎస్.వినోద్ అనే విద్యార్థిని స్థానిక సాయిబాబా గుడి దగ్గర జగన్మోహన్రెడ్డి పలకరించారు. సార్, నేను పెద్దాపురం కిట్స్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాను, నాకు ఫీజురీయింబర్స్‌మెంటు అందడం లేదు. దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ రాలే దు అని వివరించాడు. త్వరలోనే అన్ని ఇబ్బందులు తీరుతాయి అని ఆలింగనం చేసుకోవడంతో అతడు ఉబ్బితబ్బిబయ్యాడు. అమ్మను కూడా అడిగానని చెప్పు తమ్మూడూ అని జగన్మోహన్రెడ్డి చెప్పడంతో ఆ విద్యార్థి ఆనందపరవశుడయ్యాడు. వయసుమళ్లుతుండడంతో జీవనోపాధి కరువైందని సామర్లకోట మున్సిపల్ కార్యాలయం వద్ద కోరుకొండ సూరిబాబు, మహాలక్ష్మి దంపతులు జగన్మోహన్రెడ్డికి విన్నవిం చారు. నాన్న ఆశయాలను నేను నెరవేరుస్తా, మీరు నన్ను ఆశీర్వదించండి. మీకు అండగా నేనుంటాను అని ఆయన భరోసా ఇచ్చారు.ఆధార్ కార్డు లేకపోవడంతో ఏ పథకం వర్తించడం లేదని సామర్లకోటకు చెందిన అనుసూరి దుర్గ అనే మహిళ జగన్మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు తీసుకుని వెంటనే సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని తన వెంట ఉన్న తోట సుబ్బారావు నాయుడిని ఆయన ఆదేశించారు. అధికారులతో మాట్లాడి ఆమెకు ఆధార్ కార్డు వచ్చేలా చూడాలని చెప్పారు. ఏ కార్డూ లేకుండానే అన్ని పథకాలు అందరికీ అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. మీరంతా నన్ను ఆశీర్వదించి వైఎస్సార్ సీపీని గెలిపించాలని జగన్మోహన్రెడ్డి కోరారు. మహానేత వైఎస్సార్‌ను మీలోనే చూసుకుంటున్నామని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని దుర్గ చెప్పింది. ఎందరికో సొంత గూడు కల్పించిన మహానేత వైఎస్సార్ మృతి చెందాక తమను పట్టించుకునేవారే కరువయ్యారని సామర్లకోటకు చెందిన జి.సీతాలక్ష్మి, దారా కామేశ్వరి జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని వాపోయారు. మీ కష్టాలు తీరే సమయం దగ్గరలోనే ఉందని జగన్మోహన్రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. -
వైఎస్సార్సీపీ విజయకేతనం ఖాయం
ఫ్యాన్ గుర్తును ప్రతి గడపకూ పరిచయం చేయండి పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సమన్వయకర్తల సమావేశంలో ప్రణాళిక రూపకల్పన విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ నాలుగేళ్లుగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుట్రలు పన్ని నిలిపి వేసిన స్థానిక ఎన్నికలను ఎట్టకేలకు సుప్రీంకోర్టు మొట్టికాయలతో ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. ఆదివారం అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ సమన్వయకర్తలు, కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 17 నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశంలో పాల్గొని రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు ఏవిధంగా కృషిచేయాలో ప్రణాళికను రూపొందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల నగారా మోగినందున తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ కేవలం ప్రజాసేవ, ప్రజల సంక్షేమం దిశగా ఎన్నికల బరిలోకి దిగనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేయటం ఖాయమన్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన ఉప ఎన్నికలలో మాచర్ల, ప్రత్తిపాడుల్లో వచ్చిన భారీ మెజారిటీ నేడు రానున్న ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వస్తుందన్నారు. పార్టీ సింబల్ ఫ్యాను గుర్తుపైనే ఎన్నికలు జరుగనున్నాయన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళిక సిద్ధమైందని , కారకర్తలు నాయకులు పార్టీ గుర్తు ఫ్యాను సింబల్‌ను ప్రతి ఓటరుకు పరిచయం చేయాలన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మాట్లాడుతూ నాలుగేళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు భయపడ్డ ప్రభుత్వం గత్యంతరంలేక కేవలం రెండు నెలల వ్యవధిలోనే మూడు రకాల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కేవలం కాంగ్రెస్, టీడీపీ కుట్రల వల్లే ఈవిధంగా జరిగిందన్నారు. కాంగ్రెస్, టీడీపీల నీచమైన కుట్రలను ప్రజలు గమనించారని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని తెలిపారు. పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందన్నారు. రాజన్న కుమారుడు జగన్మోహన్రెడ్డి సారధ్యంలో ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు రావి వెంకటరమణ, మేరుగ నాగార్జున, కోన రఘుపతి, కిలారి రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, జంగా కృష్ణమూర్తి, నన్నపనేని సుధ, బొల్లా బ్రహ్మనాయుడు, కత్తెర సురేష్‌కుమార్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నసీర్ అహ్మద్, షౌకత్, పార్టీ నాయకులు గోగినేని శ్రీనివాసరెడ్డి, గుదిబండ చిన వెంకటరెడ్డి, ముస్తఫా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సిపికి కామన్ గుర్తుగా సీలింగ్ ఫ్యాన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి) సీలింగ్ ఫ్యాన్‌ను కామన్ గుర్తుగా కేటాయించింది. రాష్ట్రంలోని 294 శాసనసభ, 42 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు సీలింగ్ ఫ్యాన్ కామన్ గుర్తుగా ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఉత్తర్వులు ఆ పార్టీ కార్యాలయానికి అందాయి. ఈ పార్టీ లోక్‌సభ, శాసనసభ సభ్యులు గత ఉప ఎన్నికల్లో ఈ గుర్తుపైనే గెలిచారు. అదే సీలింగ్ ఫ్యాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి కేటాయించడం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్ గుర్తును రాష్ట్రంలో ఎవరికీ కేటాయించరు.