కృష్ణాజిల్లా విజయవాడలో సబ్ కలెక్టర్ మంగళవారం ఈవీఎంలను పరిశీలించారు.
విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడలో సబ్ కలెక్టర్ మంగళవారం ఈవీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తు పనిచేయక పోవటాన్ని అధికారులు గుర్తించారు. దాంతో ఈవీఎంలలోని సాంకేతిక లోపాలు సరిచేసి ఆయా ప్రాంతాలకు పంపిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. కృష్ణాజిల్లావ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. సీమాంధ్రలో బుధవారం పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.