అక్కడక్కడా ఈవీఎంలలో స్వల్ప సాంకేతిక సమస్యలు మినహా సీమాంధ్రలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
హైదరాబాద్ : అక్కడక్కడా ఈవీఎంలలో స్వల్ప సాంకేతిక సమస్యలు మినహా సీమాంధ్రలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చాలా చోట్ల ఏజెంట్లు రాక ఆలస్యం కావడంతో పోలింగ్ ప్రారంభంలో జాప్యం చోటుచేసుకుంది. ఉదయం ఆరున్నరకే చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపించాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. కాగా సీమాంధ్రలోని 25 పార్లమెంట్ స్థానాలకు 333 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2243 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.