
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...మళ్లీ అదే ఇబ్బంది
మళ్లీ అదే ఇబ్బంది. ముందస్తుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా .. సీమాంధ్రలో జరుగుతున్న పోలింగ్లో కూడా ఈవిఎంల సమస్య తలెత్తుతున్నాయి.
హైదరాబాద్ : మళ్లీ అదే ఇబ్బంది. ముందస్తుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా .. సీమాంధ్రలో జరుగుతున్న పోలింగ్లో కూడా ఈవిఎంల సమస్య తలెత్తుతున్నాయి. వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల బాకరాపురం పోలింగ్ బూత్ 124లో ఈవిఎంలు మొరాయిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈవిఎంలు పనిచేయట్లేదు, దీంతో ఓటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కర్నూలు జిల్లా బనగానపల్లి, నంద్యాల, పశ్చిమగోదావరిజిల్లా కొయ్యలగూడెం రామానుజపురంలో ఈవిఎంలు మొరాయించడంతో, పోలింగ్ ఇంకా ప్రారంభంకాలేదు. విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గం పరిధిలో కూడా ఈవిఎంలు పనిచేయట్లేదు. దీంతో త్వరితగతిన ఈవిఎంల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.