ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి | please vote for real leaders | Sakshi
Sakshi News home page

ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి

Published Tue, May 6 2014 3:22 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి - Sakshi

ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి

 ఓబులవారిపల్లె, న్యూస్‌లైన్: ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ మండల కన్వీనర్ సాయికిషోర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మంగళంపల్లె దళితవాడలో పార్టీ నాయకులు శశికుమార్‌రెడ్డి, సీ.గంగిరెడ్డి, రాజమోహన్, వెంకటరెడ్డి, నాగేశ్వర్, బత్యాల వెంకటసుబ్బయ్యతో కలిసి సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా  మంగంపేట కాపుపల్లె దలితవాడలో వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు తల్లెం వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి సాయికిషోర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మంగంపేట పంచాయతీని అభివృద్ధి చేస్తామని, గృహాలకు ఏపీఎండీసీ ద్వారా ఉచితంగా 24గంటల విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఏపీఎండీసీ గనుల విస్తరణలో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పిస్తామని, తాత్కాళికంగా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పులపత్తూరు సుబ్బరామిరెడ్డి, జిల్లా యూత్‌స్టీరింగ్ కమిటీ మెంబర్ భరత్‌కుమార్‌రెడ్డి, గజ్జెల శ్రీనివాసులురెడ్డి, పులపత్తూరు సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పాపిరెడ్డి, కౌలూరు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.  చెన్నరాజుపోడు గ్రామంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, సింగిల్ విండో అధ్యక్షుడు టంగుటూరు కృష్ణారెడ్డి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్‌ను  ముఖ్యమంత్రిని చేయాలని కోరా రు. చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ రఫీ, నేతలు దశరధరామరాజు,  ఆనందబాబు, శంకర, మనోహర్, చలపతి, కదిరుల్లా, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement