peddi reddy midhun reddy
-
హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రైతులను మభ్యపెట్టడానికే రుణమాఫీపై కమిటీ బాబు వచ్చె.. ఉన్న ఉద్యోగాలు పోయే ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి పీలేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం తప్పదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన పీలేరు, కేవీపల్లె మండలాల్లో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి పర్యటించారు. తలపులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలతోపాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటి సంతకం రుణమాఫీపైనే అంటూ రైతులు, డ్వాక్రా మహిళలను మభ్య పెట్టడానికి కోటయ్య కమిటీని ఏర్పాటుచేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులకు సరైన సమయంలో విత్తనాలు అందక, మరోవైపు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సత్వరం అన్ని రకాల రుణాలను ఎటువంటి షరతులూ లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బాబొస్తారు..జాబొస్తుందని ఎన్నికల్లో గొప్పలు చెప్పుకుని ఓట్లు దండుకున్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ప్రాతిపదికన ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగించడమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓ విధంగా, అధికారం వచ్చాక మరోవిధంగా ప్రవర్తించడం తగదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీ సభ్యులు ఎం.రెడ్డిబాషా, జీ.జయరామచంద్రయ్య, పార్టీ నాయకులు మల్లికార్జునరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి, ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, కేశవరెడ్డి, ఆనంద్, మస్తాన్, మదనమోహన్‌నాయుడు, ఉదయ్‌కుమార్, స్టాంపుల మస్తాన్, ఎస్.హబీబ్‌బాషా, మస్తాన్, సర్పంచ్‌లు రజియాబేగం, రవీంద్రనాథరెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాసులు, మల్లికార్జునగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పీలేరులో భూ సంతర్పణపై విచారణ
సబ్‌కలెక్టర్ ఆదేశాలు జారీ ఖాదర్షరీఫ్ హయాంలో ఇచ్చిన పట్టాలపై విచారణ పీలేరు తహశీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం స్థానికేతరులకు ఖరీదైన స్థలాలు ఎలా ఇస్తారు? అధికారికంగా వెయ్యి, అనధికారికంగా వందల్లో పట్టాలు పంపిణీ ఆక్రమణదారులు, దళారుల్లో ఆందోళన భూ సంతర్పణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ పీలేరు, న్యూస్‌లైన్: నిబంధనలకు వ్యతిరేకంగా అధికారం మాటున కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూముల సంతర్పణపై మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్ నారాయణగుప్త విచారణకు ఆదేశించారు. శుక్రవారం సబ్‌కలెక్టర్ పీలేరు తహశీల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అనర్హులు, స్థానికేతరులకు ఎలా పంపిణీ చేశారని నిలదీశారు. నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించడమేంటని మండిపడ్డారు. ఇప్పటి వరకూ పంపిణీచేసిన పట్టాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రెండు సంవత్సరాల్లో పీలేరు మండలంలో దాదాపు వంద కోట్ల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట ఎంపీగా గెలుపొందిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు గతంలో ఆరోపించారు. పీలేరులో జరిగిన భూ సంతర్పణపైనా జిల్లా ఉన్నతాధికారులతోపాటు లోకాయుక్తలో కేసువేశారు. ఇళ్ల స్థలాలు. భూ పంపిణీలపై పూర్తి స్తాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్ నారాయణగుప్త అధికారులను ఆదేశించారు. పీలేరుకు వచ్చిన సబ్‌కలెక్టర్‌ను పంచాయతీ కార్మికులు, పలువురు బాధితులు కలిశారు. తమకు కాకుండా వేరేవారికి పట్టాలు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఇవే.. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పీలేరు తహశీల్దార్‌గా ఎం ఖాదర్షరీఫ్ జూలై 16, 2012 నుంచి ఫిబ్రవరి 20, 2014 వరకు పనిచేశారు. ఈ కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కర్పూర హారతిలా కరిగిపోయాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా పీలేరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ఖరీదైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినా మొక్కుబడి చర్యలతో సరిపెట్టారు. పీలేరు పట్టణంతో పాటు, పట్టణ శివారు ప్రాంతమైన నాగిరెడ్డి కాలనీలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రాత్రికి రాత్రే అప్పటి అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఆక్రమించుకున్నారు. మరోవైపు మండలస్థాయిలో అధికారులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట బినామీ పట్టాలు మంజూరు చేశారని ఆరోపణలు ఉన్నాయి. క ళ్లముందు అక్రమ కట్టడాలు వెలుస్తున్నా అధికారుల చేతివాటంతో ఏమీచేయలేక మిన్నకుండిపోయారు. అలాగే తిరుపతి మార్గంలో జాతీయ రహదారికిరువైపులా ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. చిత్తూరు మార్గంలో ఆటోనగర్, కోళ్లఫారం మిట్టన వెలసిన ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలు ఆక్రమణకు గురైనా పట్టించుకోలేదు. మదనపల్లె మార్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో అడ్డూ అదుపులేకుండా స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. పలువురు నిరుపేదలకు ఇచ్చిన స్థలాలను సైతం ఇక్కడ ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. పట్టణానికి సమీపంలో ఖరీదైన ప్రభుత్వ భూములకు బినామీ పట్టాలు సృష్టించి ఆక్రమించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. కుల సంఘాలు పేరిట మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో స్థానికేతరులకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. అధికారికంగా దాదాపు వెయ్యి పట్టాలు పంపిణీ చేయగా, అనధికారికంగా వందల సంఖ్యలో అక్రమంగా పట్టాలు పుట్టుకొచ్చాయని ఆరోపణలు లేకపోలేదు. వీవర్స్, రజకులు, నాయిబ్రాహ్మణులు, వెలుగు, ఐకేపీ, ఎమ్మార్పీఎస్, పంచాయతీ వర్కర్లు, ఆటో వర్కర్లు, తదితరులకు మంజూరు చేసిన పట్టాల్లో అర్హులైన స్థానికులకు కాదని, స్థానికేతరులు ఎక్కువగా ఇచ్చారని ఆరోపిస్తూ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి
ఓబులవారిపల్లె, న్యూస్‌లైన్: ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ మండల కన్వీనర్ సాయికిషోర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మంగళంపల్లె దళితవాడలో పార్టీ నాయకులు శశికుమార్‌రెడ్డి, సీ.గంగిరెడ్డి, రాజమోహన్, వెంకటరెడ్డి, నాగేశ్వర్, బత్యాల వెంకటసుబ్బయ్యతో కలిసి సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా మంగంపేట కాపుపల్లె దలితవాడలో వైఎస్సార్సీపీ యువ నాయకుడు తల్లెం వెంకటరమణారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి సాయికిషోర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మంగంపేట పంచాయతీని అభివృద్ధి చేస్తామని, గృహాలకు ఏపీఎండీసీ ద్వారా ఉచితంగా 24గంటల విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఏపీఎండీసీ గనుల విస్తరణలో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పిస్తామని, తాత్కాళికంగా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పులపత్తూరు సుబ్బరామిరెడ్డి, జిల్లా యూత్‌స్టీరింగ్ కమిటీ మెంబర్ భరత్‌కుమార్‌రెడ్డి, గజ్జెల శ్రీనివాసులురెడ్డి, పులపత్తూరు సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పాపిరెడ్డి, కౌలూరు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. చెన్నరాజుపోడు గ్రామంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, సింగిల్ విండో అధ్యక్షుడు టంగుటూరు కృష్ణారెడ్డి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరా రు. చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ రఫీ, నేతలు దశరధరామరాజు, ఆనందబాబు, శంకర, మనోహర్, చలపతి, కదిరుల్లా, సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
చంద్రబాబుతో కిరణ్ చీకటి ఒప్పందం
బీజేపీకి ఓట్లేయండంటున్న కిరణ్ అనుచరులు వైఎస్సార్సీపీని ఎదుర్కోలేకే ఈ పన్నాగం ముస్లిం మైనారిటీల ద్రోహి చంద్రబాబు జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పీలేరు, న్యూస్‌లైన్: ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యంలేక టీడీపీ అధినేత చంద్రబాబు, జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆరోపించారు. పీలేరులో కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరులు కమలం గుర్తుకు ఓటెయ్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారని, ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గురువారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం ఎంతటికైనా దిగజారే నైజం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలకు కేంద్రబిందువులైన నారా, నల్లారిలకు ప్రజలు ఓటుతో గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే రూ.9 లక్షల కోట్లు అవసరమన్నారు. ఆ నిధులను ఎక్కడి నుంచి తీసుకువస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 2004లో ఇచ్చిన హామీలను 2009 ఇవ్వలేదని, 2009లో చెప్పినవి ఇప్పుడు పేర్కొనకపోవడం ఆయన అబద్ధాల కోరు అనడానికి నిదర్శనమన్నారు. అడ్డదారిలో అధికారంలోకి రావాలన్న దురాశతో ఓ వైపు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని, మరో వైపు జై సమైక్యాంధ్రతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు, బీజేపీ కుమ్మకు కుట్రలను ముస్లిం మైనారిటీలు తిప్పికొట్టాలన్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. అదే తరహాలో మైనారిటీలకు జగన్మోహన్రెడ్డి ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు. సమైక్య ద్రోహులైన కిరణ్, చంద్రబాబు, బీజేపీలకు ఇవే చివరి ఎన్నికలన్నారు. సీమాంధ్రలో ఓటుహక్కు లేని చంద్రబాబుకు మనం ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా తనపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థిని పురందేశ్వరి స్థానికురాలు కాదన్నారు. ఆమెను చూడాలంటే హైదరాబాద్ లేదా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండిగ్లో ఉన్న హంద్రీ-నీవా, సుజల-స్రవంతి ప్రాజెక్టులను పూర్తిచేసి తాగునీటితోపాటు రైతులకు సాగునీరందిస్తామన్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 135కు పైగా సీట్లు వస్తాయని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. జగనన్న తమ్ముడిగా తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలి పారు. పార్టీ నాయకులు ఎం.వెంకట్రమణారెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, వినయ్‌రెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, చక్రపాణిరెడ్డి, కేశవరెడ్డి, ఉదయ్‌కుమార్, ఆనంద్, నాగరాజనాయక్ పాల్గొన్నారు. -
కిరణ్‌కుమార్‌రెడ్డికి షాక్
వైఎస్సార్ సీపీలో బరకం రవికుమార్‌రెడ్డి చేరిక తుడుచుకుపెట్టుకుపోయిన జేఎస్పీ కలకడ, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సొంత నియోజకవర్గమైన పీలేరులో పెద్ద షాక్ తగిలింది. ఐదు దశాబ్దాలకు పైగా, రెండు తరాలుగా నల్లారి కుటుంబంతో అనుబంధం ఉన్న బరకం రవికుమార్‌రెడ్డి బుధవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ రాజంపేట లోక్‌సభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన చేరికను వైఎస్సార్ సీపీ సీనియుర్ నాయకులు వంగి మళ్ల మాధుసూదన్‌రెడ్డి, జెల్లా రాజగోపాల్‌రెడ్డి స్వాగతించారు. అలాగే కోన సర్పంచ్ పుల్లమ్మ, టీడీపీ నాయకులు రెడ్డెప్ప తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి జేఎస్పీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. అయితే బరకం రవికుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరడంతో జే ఎస్పీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ముడేళ్ల క్రితం మాజీ మండలాధ్యక్షులు వంగివుళ్ల మధుసూదన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని విభేదించి పక్కకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి బరకం రవికుమార్‌రెడ్డి రాకతో కలకడ మండలంలో నల్లారి వర్గం దాదాపుగా తుడుచుపెట్టుకు పోయినట్టు అయింది. అదే సమయంలో పీలేరు నియోజకవర్గంలో వంగిమళ్ల మాధుసూదన్‌రెడ్డి వర్గం బలపడడం, వైఎస్సార్ సీపీకి మంచి పట్టు లభించినట్టు అయింది. బరకం నేపథ్యం ఇదీ క్లాస్-1 కాంట్రాక్టరుగా ఉన్న బరకం రవికుమార్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి అమర్నాథరెడ్డిలు దశాబ్దాల కాలం కలిసి ఉన్నారు. నరసిం హారెడ్డి వాయల్పాడు సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులుగా, పీలేరు సమితి సభ్యులుగా, జిల్లా బోర్డు సభ్యులుగా ఉండి మండలంలో, నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడుగా ఉన్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గంలోని ఆంతరంగికుల్లో ముఖ్యమైన వ్యక్తుల్లో రవికుమార్‌రెడ్డి ఒకరు. రవికుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీ చేరికలో కడప డీసీసీబీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతలరావుచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయుకు లు వంగిమళ్ల మాధుసూదన్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి జెల్లారాజగోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
పెద్దిరెడ్డి దెబ్బకు కిరణ్ ఔట్
రాజకీయ క్రికెట్ రంగంలో పెద్దిరెడ్డి దెబ్బకు కిరణ్‌కుమార్‌రెడ్డి డకౌట్ అయ్యూరు. సొంత నియోజకవర్గంలోనే ఆధిక్యతను కోల్పోవడంతో కిరణ్ దిక్కుతోచని పరిస్థితిల్లో పడ్డారు. చిరకాల రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రజలకు చేరువై పడమటి మండలాల్లో పూర్తి స్థారుులో పట్టు నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులోని కలికిరి మినహా అన్ని మండలాల్లోని అన్ని వర్గాల నాయకులు పెద్దిరెడ్డి పంచన చేరారు. దీంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సోనియూగాంధీ ఆదేశాల మేరకు నీరుగార్చారని ప్రజలు సైతం ఆగ్రహంగా ఉన్నారు.కిరణ్ సొంతంగా పలుమార్లు నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేట తెల్లం కావడంతో పరాభవం తప్పదని గ్రహించి కుంటి సాకులతో పోటీ నుంచి తప్పుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కు రాజకీయూలను పటాపంచలు చేస్తూ వైఎస్సార్ సీపీని పెద్దిరెడ్డి బలోపేతం చేశారు. పుంగనూరు, న్యూస్‌లైన్: నాలుగు దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, నల్లారి కుటుంబానికి మధ్య వైరం కొనసాగుతోంది. రెండు పర్యాలు పీలేరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్ ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య సీఎం అయ్యా రు. అధిష్టానం అనుగ్రహంతో కిరణ్ ముఖ్యమంత్రి అయ్యా రు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన పెద్దిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కిరణ్ ఓటమే తన లక్ష్యమని ఆనాడే సవాల్ చేశారు. పెద్దిరెడ్డి మీద వ్యక్తగత కక్షతో పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. తనమీద కక్షతో కిరణ్ ప్రజల్ని వేధిస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటూ మరో వైపు కిరణ్ కుమార్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యూరు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఏకమై కుమ్మక్కు రాజకీయాలు నడిపినా ఒంటరిపోరు చేసి తన మద్దతుదారుడు దేశాయ్ తిప్పారెడ్డిని గెలిపించుకుని సత్తా చాటారు. తర్వాత పీలేరుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఒకవైపు పెద్దిరెడ్డి, మరో వైపు మిథున్‌రెడ్డి అన్ని మండలాల్లో పర్యటిస్తూ పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి తమపై ఎన్నికల్లో తలపడాలని పలుమార్లు వారు సవాల్ విసిరారు. తండ్రీతనయులిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో ఉన్నారు. మిథున్‌రెడ్డి రాజం పేట పార్లమెంట్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, రాజంపేటలో ఉన్న పీలేరు అసెంబ్లీపై మిథున్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఒంటరైన కిరణ్ నియోజకవర్గంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారంతా నేడు పెద్దిరెడ్డి వర్గంలో చేరిపోయారు. కిరణ్‌కు విధేయుడుగా ఉన్న ముస్లిం మైనార్టీనేత జమీర్ ఆలీఖాన్ పెద్దిరెడ్డితో జత కట్టారు. ఈయనకు కలకడ, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాల్లో పూర్తి పట్టు ఉంది. అలాగే మరో సన్నిహితుడు కేవీపల్లె మండలం మాజీ వైస్ ఎంపీపీ వంగిమల్ల వెంకటరమణారెడ్డి కూడా పెద్దిరెడ్డి పంచన చేరిపోయారు. మాజీ ఎంపీపీ, ఎంవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల అధినేత ఎం.వెంకటరమణారెడ్డి కిరణ్‌కు అత్యంత సన్నిహితలో ఒకరు. ఆయన కూడా పెద్దిరెడ్డికి మద్దతుగా నిలిచారు. మరో సన్నిహితుడు మాజీ సర్పంచ్ ఏటీ రత్నాకర్ కూడా రామచంద్రారెడ్డి వైపు వెళ్లిపోయారు. ఇలా ముఖ్యులు దూరమైపోవడంతో కిరణ్ దాదాపు ఒంట రివాడయ్యారు. ఇదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది. ఒక వైపు కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడిగా ఉంటూనే సమైక్యాంధ్ర రాగం ఆలపించారు. ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకు ని ఉద్యమాన్ని నీరుగార్చారన్న ఆరోపణలు కిరణ్‌పై వచ్చా యి. విభజన జరిగిపోయిన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. జేఎస్పీ తరపున కిరణ్ పీలేరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరి గింది. అయితే నామినేషన్ల పర్యం మొదలైన తర్వా త కిరణ్ పోటీ చేయడంలేదని, తమ్ముడు కిషోర్ చేత నామినేషన్ వేయించారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తాను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉన్నందున పోటీ చేయడంలేదని చెబుతున్నా నియోజకవర్గంపై పూర్తిగా పట్టుసాధించిన రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలను ఎదుర్కొనలేక పోటీ నుంచి తప్పుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
మిథున్‌ను ఢీకొనలేకే నామినేషన్‌పై ఫిర్యాదు
జైసమైక్యాంధ్ర, బీజేపీ కుట్ర రాజకీయం నామినేషన్‌ను ఓకే చేసిన ఆర్వో సాక్షి, చిత్తూరు: రాజంపేట లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఎదుర్కొని గెలిచే దమ్ములేకపోవటంతో జైసమైక్యాంధ్రపార్టీ అభ్యర్థి ద్వారా బీజేపీ నాయకులు పరోక్షంగా పావు లు కదిపారు. మిథున్‌రెడ్డి రైల్వే కాంట్రాక్టరుగా కంపెనీ పెట్టి పనులు చేయిస్తున్నారని చెప్పి జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి ముజీబ్‌హుసేన్ ద్వారా చివరి నిమిషంలో అతని నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవంగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించటంగానీ, అలా చేసే కంపెనీలతోగానీ ఎలాంటి సంబధంగానీ లేదు. ఈ మేరకు వివరాలన్నింటినీ ఆడిటర్లు మూలంగా ఇదివరకే రిటర్నింగ్ అధికారికి మిథున్‌రెడ్డి సమర్పించారు. ఉదయం 11 గంటలకు స్క్రూటినీ ప్రారంభం కాగానే మిథున్ రిటర్నింగ్ అధికారి ముందు హాజరై నిర్ణీత సమయం వరకు ఉండి అధికారులు సూచించిన ప్రకారం సంతకాలు చేసి వె ళ్లిపోయారు. అప్పటివరకు జై సమైక్యాంధ్రపార్టీ అభ్యర్థి నోరు విప్పలేదు. కొందరు బీజేపీ నాయకులు సూచన మేరకు మిథున్‌రెడ్డి వెళ్లిన తరువాత అభ్యంతరం లేవనెత్తి రాజకీయం చేయాలని చూశారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండా, స్క్రూటినీ సమయం ముగిసిన తరువాత చేసే అభ్యంతరాలు స్వీకరించలేమని రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తిరస్కరించారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నామినేషన్‌ను అంగీకరించారు. బీజేపీ డమ్మీ అభ్యర్థి చిన్నం వాసుదేవరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి గంగిరెడ్డి నామినేషన్లు నిబంధనల ప్రకారం లేవని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కుమ్మక్కు చర్య రోజూ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు కిరణ్‌కుమార్‌రెడ్డిని విమర్శిస్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చంద్రబాబును విమర్శిస్తారు. క్షేత్రస్థాయిలో వచ్చేటప్పటికి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఈ రెండు పార్టీలు పాలు, నీళ్లలా కలిసిపోతారుు. ఇందుకు నిదర్శనమే తెరవెనుక తెలుగుదేశం, తెర ముందు బీజేపీ, జై సమైక్యాంధ్ర పార్టీలు కలిసి రాజంపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేయడమనేది స్పష్టమవుతోంది. ఇది నీచమైన పని: మిథున్ తనను ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేకే రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రల్లో భాగమే తన నామినేషన్‌పై ఫిర్యాదని వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. స్క్రూటినీ జరుగుతున్నంతసేపు తాను రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే ఉన్నా అప్పుడు వ్యక్తం చేయని అభ్యంతరాలను తరువాత చేయటం వారి నీచరాజకీయూన్ని తెలియజేస్తుందన్నారు. తనను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో ఎదుర్కోలేక ఇలాంటి కుతంత్రాలు చేయాలని చూస్తున్న జైసమైక్యాంధ్ర, బీజేపీ, టీడీపీ నాయకులకు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు వైఎస్సార్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడాలి
పీలేరు, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని, అందుకోసం పార్టీ కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని ఆ పార్టీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలో మంగళవారం విస్తృతంగా పర్యటించా రు. కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరి బెదిరింపులకు భయపడొద్దని, అండ గా ఉంటామని భరోసా ఇచ్చారు. పీలేరులో చింతల రామచంద్రారెడ్డి ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల కొనసాగుతున్నాయని తెలిపారు. మూడేళ్ల పాలనలో కిరణ్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన పీలేరులో మంచినీటి ఎద్దడితో జనం అల్లాడుతున్నారని, బిందె తాగునీరు రూ.3 వెచ్చించి కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పరిశ్రమల ఏర్పాటు పేరిట వందలాది ఎకరాలను రైతుల నుంచి లాక్కొన్నారని ఆరోపించారు. ఆ భూముల్లో కిరణ్ వేసిన శిలాఫలకాలు తప్ప ఒక్క పరిశ్రమ కూడా లేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాగానే తిరిగి భూములను అప్పగిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావన్నారు. లాస్ట్బాల్ అంటూనే చివరి ఫైల్ వరకు రేయింబవళ్లు సంతకాలు పెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ అడ్ర స్సు గల్లంతు అవుతుందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమన్నారు. సమావేశంలో పార్టీ నాయకు లు నారే వెంకట్రమణారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి మల్లెల రెడ్డిబాషా, భానుప్రకాష్‌రెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, ఎం.ఆదినారాయణ, ఎం.రవీంద్రనాథరెడ్డి, డి.జగన్మోహన్రెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, షామియానా షఫీ, రామిరెడ్డి, బాబ్జిరెడ్డి, సదుం నాగరాజ, ఉదయ్‌కుమార్, శ్రీనివాసు లు, కాకులారంపల్లె రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
జగన్‌తోనే పీలేరు అభివృద్ధి సాధ్యం
పీలేరు, న్యూస్‌లైన్ : పీలేరు నియోజకవర్గ అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని పార్టీ రాజంపేట పార్లమెం ట్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అ న్నారు. మంగళవారం పీలేరు నియోజకవర్గంలో జ రిగిన జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం యా త్రలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్లుగా పీలేరు ప్రాంత ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారని తెలిపారు. నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూడా ఎ లాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మరో నాలుగు నెలల్లో జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నా రు. వెంటనే పీలేరు పట్టణంతోపాటు నియో జ కవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. జగన్మోహన్రెడ్డి అండతో న్యాయం కోసం ఎవరినైనా ఎదిరిస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. జాతీయపార్టీల మద్దతు కూడగట్టారని చెప్పారు. ముఖ్యమం త్రి కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మ హానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అ మలుకావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చోద్యం చూస్తోందని విమర్శించారు. త్వరలోనే రాజన్న సువర్ణయుగం వ స్తుందన్నారు. ఈ నెల 9వ తేదీ మధ్నాహ్నం పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. పీలేరులో జరిగే భారీ బహిరంగ సభ చరిత్ర పుటల్లో నిలచిపోయేలా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, షామియానా షఫీ, హబీబ్‌బాషా, మోహన్‌రెడ్డి, చిన్నబాబు, విక్టరీ వెంకట్రమణారెడ్డి, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.