మిథున్‌ను ఢీకొనలేకే నామినేషన్‌పై ఫిర్యాదు
- జైసమైక్యాంధ్ర, బీజేపీ కుట్ర రాజకీయం
- నామినేషన్‌ను ఓకే చేసిన ఆర్వో
సాక్షి, చిత్తూరు: రాజంపేట లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఎదుర్కొని గెలిచే దమ్ములేకపోవటంతో జైసమైక్యాంధ్రపార్టీ అభ్యర్థి ద్వారా బీజేపీ నాయకులు పరోక్షంగా పావు లు కదిపారు. మిథున్‌రెడ్డి రైల్వే కాంట్రాక్టరుగా కంపెనీ పెట్టి పనులు చేయిస్తున్నారని చెప్పి జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి ముజీబ్‌హుసేన్ ద్వారా చివరి నిమిషంలో అతని నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవంగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించటంగానీ, అలా చేసే కంపెనీలతోగానీ ఎలాంటి సంబధంగానీ లేదు.
ఈ మేరకు వివరాలన్నింటినీ ఆడిటర్లు మూలంగా ఇదివరకే రిటర్నింగ్ అధికారికి మిథున్‌రెడ్డి సమర్పించారు. ఉదయం 11 గంటలకు స్క్రూటినీ ప్రారంభం కాగానే మిథున్ రిటర్నింగ్ అధికారి ముందు హాజరై నిర్ణీత సమయం వరకు ఉండి అధికారులు సూచించిన ప్రకారం సంతకాలు చేసి వె ళ్లిపోయారు. అప్పటివరకు జై సమైక్యాంధ్రపార్టీ అభ్యర్థి నోరు విప్పలేదు. కొందరు బీజేపీ నాయకులు సూచన మేరకు మిథున్‌రెడ్డి వెళ్లిన తరువాత అభ్యంతరం లేవనెత్తి రాజకీయం చేయాలని చూశారు.
సరైన సాక్ష్యాధారాలు లేకుండా, స్క్రూటినీ సమయం ముగిసిన తరువాత చేసే అభ్యంతరాలు స్వీకరించలేమని రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తిరస్కరించారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నామినేషన్‌ను అంగీకరించారు. బీజేపీ డమ్మీ అభ్యర్థి చిన్నం వాసుదేవరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి గంగిరెడ్డి నామినేషన్లు నిబంధనల ప్రకారం లేవని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
కుమ్మక్కు చర్య
రోజూ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు కిరణ్‌కుమార్‌రెడ్డిని విమర్శిస్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చంద్రబాబును విమర్శిస్తారు. క్షేత్రస్థాయిలో వచ్చేటప్పటికి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఈ రెండు పార్టీలు పాలు, నీళ్లలా కలిసిపోతారుు. ఇందుకు నిదర్శనమే తెరవెనుక తెలుగుదేశం, తెర ముందు బీజేపీ, జై సమైక్యాంధ్ర పార్టీలు కలిసి రాజంపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేయడమనేది స్పష్టమవుతోంది.
ఇది నీచమైన పని: మిథున్
తనను ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేకే రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రల్లో భాగమే తన నామినేషన్‌పై ఫిర్యాదని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. స్క్రూటినీ జరుగుతున్నంతసేపు తాను రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే ఉన్నా అప్పుడు వ్యక్తం చేయని అభ్యంతరాలను తరువాత చేయటం వారి నీచరాజకీయూన్ని తెలియజేస్తుందన్నారు. తనను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో ఎదుర్కోలేక ఇలాంటి కుతంత్రాలు చేయాలని చూస్తున్న జైసమైక్యాంధ్ర, బీజేపీ, టీడీపీ నాయకులకు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు వైఎస్సార్‌సీపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.