‘ఆయన కారణంగా చంద్రబాబు గెలిచారు’ | BJP National Secretary Sunil Deodhar Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌సీపీ, బీజేపీలతో బాబుకు నిద్ర పట్టడంలేదు’

Published Sat, Dec 15 2018 3:36 PM | Last Updated on Fri, Mar 29 2019 8:34 PM

BJP National Secretary Sunil Deodhar Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయనగరం :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ ధియోధర్‌ విమర్శలు గుప్పించారు.  2014 లో మోదీ మానియాతోనే టీడీపీ గెలిచిందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగు చెందారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరభావం తప్పదని హెచ్చరించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఆంద్రుల ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశాన్ని స్థాపిస్తే.. చంద్రబాబు దానిని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు. 2014 ఎన్నికల సందర్భంగా రాహుల్ సోనియాలు ఆంద్ర ద్రోహులుగా అభివర్ణించిన బాబు ..నేడు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను మోదీపై వేస్తున్నారు. ఆంద్రుల అసలైన ద్రోహి మోదీ కాదు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మోదీ ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తున్నాం’ అని ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6న ఏపీలో పర్యటించనున్నారని తెలిపారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలను చూస్తుంటే చంద్రబాబుకు నిద్రపట్టడంలేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామని వెల్లడించారు.

దొంగల ముఠాలు..
జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో దొంగల ముఠాలను ఏర్పాటు చేశారని సునీల్‌ ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ర్టాన్ని నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా మంచి నిటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందిచండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు కోసం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు దండుకోవడానికి బోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement