పెద్దిరెడ్డి దెబ్బకు కిరణ్ ఔట్
రాజకీయ క్రికెట్ రంగంలో పెద్దిరెడ్డి దెబ్బకు కిరణ్‌కుమార్‌రెడ్డి డకౌట్ అయ్యూరు. సొంత నియోజకవర్గంలోనే ఆధిక్యతను కోల్పోవడంతో కిరణ్ దిక్కుతోచని పరిస్థితిల్లో పడ్డారు. చిరకాల రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రజలకు చేరువై పడమటి మండలాల్లో పూర్తి స్థారుులో పట్టు నిలబెట్టుకున్నారు.
ముఖ్యంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులోని కలికిరి మినహా అన్ని మండలాల్లోని అన్ని వర్గాల నాయకులు పెద్దిరెడ్డి పంచన చేరారు. దీంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సోనియూగాంధీ ఆదేశాల మేరకు నీరుగార్చారని ప్రజలు సైతం ఆగ్రహంగా ఉన్నారు.కిరణ్ సొంతంగా పలుమార్లు నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేట తెల్లం కావడంతో పరాభవం తప్పదని గ్రహించి కుంటి సాకులతో పోటీ నుంచి తప్పుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కు రాజకీయూలను పటాపంచలు చేస్తూ వైఎస్సార్ సీపీని పెద్దిరెడ్డి బలోపేతం చేశారు.
పుంగనూరు, న్యూస్‌లైన్: నాలుగు దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, నల్లారి కుటుంబానికి మధ్య వైరం కొనసాగుతోంది. రెండు పర్యాలు పీలేరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్ ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య సీఎం అయ్యా రు. అధిష్టానం అనుగ్రహంతో కిరణ్ ముఖ్యమంత్రి అయ్యా రు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన పెద్దిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కిరణ్ ఓటమే తన లక్ష్యమని ఆనాడే సవాల్ చేశారు.
పెద్దిరెడ్డి మీద వ్యక్తగత కక్షతో పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. తనమీద కక్షతో కిరణ్ ప్రజల్ని వేధిస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటూ మరో వైపు కిరణ్ కుమార్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యూరు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఏకమై కుమ్మక్కు రాజకీయాలు నడిపినా ఒంటరిపోరు చేసి తన మద్దతుదారుడు దేశాయ్ తిప్పారెడ్డిని గెలిపించుకుని సత్తా చాటారు. తర్వాత పీలేరుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఒకవైపు పెద్దిరెడ్డి, మరో వైపు మిథున్‌రెడ్డి అన్ని మండలాల్లో పర్యటిస్తూ పూర్తి స్థాయిలో పట్టు సాధించారు.
దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి తమపై ఎన్నికల్లో తలపడాలని పలుమార్లు వారు సవాల్ విసిరారు. తండ్రీతనయులిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో ఉన్నారు. మిథున్‌రెడ్డి రాజం పేట పార్లమెంట్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, రాజంపేటలో ఉన్న పీలేరు అసెంబ్లీపై మిథున్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
ఒంటరైన కిరణ్
నియోజకవర్గంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారంతా నేడు పెద్దిరెడ్డి వర్గంలో చేరిపోయారు. కిరణ్‌కు విధేయుడుగా ఉన్న ముస్లిం మైనార్టీనేత జమీర్ ఆలీఖాన్ పెద్దిరెడ్డితో జత కట్టారు. ఈయనకు కలకడ, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాల్లో పూర్తి పట్టు ఉంది. అలాగే మరో సన్నిహితుడు కేవీపల్లె మండలం మాజీ వైస్ ఎంపీపీ వంగిమల్ల వెంకటరమణారెడ్డి కూడా పెద్దిరెడ్డి పంచన చేరిపోయారు. మాజీ ఎంపీపీ, ఎంవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల అధినేత ఎం.వెంకటరమణారెడ్డి కిరణ్‌కు అత్యంత సన్నిహితలో ఒకరు. ఆయన కూడా పెద్దిరెడ్డికి మద్దతుగా నిలిచారు. మరో సన్నిహితుడు మాజీ సర్పంచ్ ఏటీ రత్నాకర్ కూడా రామచంద్రారెడ్డి వైపు వెళ్లిపోయారు. ఇలా ముఖ్యులు దూరమైపోవడంతో కిరణ్ దాదాపు ఒంట రివాడయ్యారు. ఇదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది.
ఒక వైపు కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడిగా ఉంటూనే సమైక్యాంధ్ర రాగం ఆలపించారు. ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకు ని ఉద్యమాన్ని నీరుగార్చారన్న ఆరోపణలు కిరణ్‌పై వచ్చా యి. విభజన జరిగిపోయిన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. జేఎస్పీ తరపున కిరణ్ పీలేరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరి గింది. అయితే నామినేషన్ల పర్యం మొదలైన తర్వా త కిరణ్ పోటీ చేయడంలేదని, తమ్ముడు కిషోర్ చేత నామినేషన్ వేయించారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తాను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉన్నందున పోటీ చేయడంలేదని చెబుతున్నా నియోజకవర్గంపై పూర్తిగా పట్టుసాధించిన రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలను ఎదుర్కొనలేక పోటీ నుంచి తప్పుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.