సాక్షి, అమరావతి: విభజన తర్వాత కూడా ఒక దశలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు 8 శాతానికి పెరిగినట్లు ఓ సర్వేలో తేలిందని, ఆ సమయంలో ఆ పార్టీ పెద్దలు హఠాత్తుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, ఇలాంటి నిర్ణయాల వల్ల ఆ పార్టీ ఎలా ముందుకు పోతుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండోసారి తాను కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానన్నా.. తాను నిరాకరించానని తెలిపారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన బుధవారం విజయవాడ వచ్చారు.
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉండే వారికి ప్రజాజీవితంలో కొనసాగే పరిస్థితి లేదని.. తాను ఇంకా ప్రజాజీవితంలో కొనసాగాలనే బీజేపీలో చేరినట్టు వివరించారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నప్పటికీ.. గతంలో కేంద్రం హోదాకు బదులు ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధపడగా అప్పటి ప్రభుత్వం దానికి అంగీకరించిందని పరోక్షంగా చంద్రబాబు నిర్ణయాన్ని గుర్తుచేశారు.
మూడు రాజధానులపై పార్టీ అభిప్రాయమే తన అభిప్రాయమని తెలిపారు. తన తమ్ముడు టీడీపీలో కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏ పా ర్టీలో కొనసాగాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment