peddi reddy rama chandra reddy
-
‘వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం హడావుడి’
సాక్షి,తిరుపతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 9వ తేదీ (బుధవారం) పుంగనూరు పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హడావుడి కార్యక్రమాలు చేపట్టిందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రుల పర్యటనతో పాటు, ఆ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని సైతం అరెస్ట్ చేసిందన్నారు.ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత వారం రోజులుగా చిన్నారి అశ్వియ అంజూమ్ హత్య కేసులో దోషుల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానివేసి ఇచ్చిన హామీలు సంక్షేమ పాలనపై దృష్టి పెట్టాలి’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.కాగా, పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య ఉదంతంపై కూటమి ప్రభుత్వం హైడ్రామాకు తెరతీసింది. అంజుమ్ కిడ్నాప్, ఆపై హత్య ఘటనను వారం రోజులుగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ఒక్కసారిగా హడావిడి చేసింది. వారంరోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కేసులో చిన్న క్లూ కూడా సాధించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో హడావుడిగా ఆదివారం ముగ్గురు మంత్రులు పుంగనూరులో వాలిపోయారు. అదే సమయంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. -
ఫేక్ వార్తలు ప్రచారం.. టీవీ ఛానెల్‌కు పెద్దిరెడ్డి పరువు నష్టం నోటీసులు
సాక్షి, తిరుపతి: తనపై నిరాధార వార్తలు వేసినందుకు బిగ్ టీవీకి పరువు నష్టం నోటీసులు ఇచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డిపై బిగ్ టీవీ తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి చర్యలకు దిగారు.కాగా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు వెళ్లాయి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పరువు నష్టం వేసేందుకు బిగ్ టీవీకి ఇప్పటికే పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు నోటీసులు పంపించారు. ఇక, తాజాగా బిగ్ టీవీకి పరువు నష్టం కింద రూ.50కోట్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై నిరాధారంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయపరంగా బుద్ధి చెబుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు.ఇక, గతంలో ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్‌కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని పెద్దిరెడ్డి నోటీసులు ఇచ్చారు. తనపై తప్పుడు వార్తలు రాసిన కారణంగా ఈనాడు, ఈటీవీకి రూ.50కోట్లు.. మహా న్యూస్‌కు రూ.50కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
కిరణ్‌కుమార్‌ను చిత్తుగా ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కారణమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, పెద్దిరెడ్డి శుక్రవారం పుంగనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. విద్య, వైద్యం కోసం వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం ఖర్చు చేసే పనిలేకుండా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకున్నారు. సీఎం జగన్‌ను మళ్లీ గెలిపించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకే కుటుంబం ఇక్కడ 30 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపించాం. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తాం. మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాను. మీ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ విజయానికి మనమంతా కృషి చేయాలి. ఇదే సమయంలో.. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఓడించాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఓడిస్తాం. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను వేధించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు. కిరణ్ కుమార్ నమ్మకద్రోహి’ అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి : మంత్రి పెద్దిరెడ్డి
-
పోలీసులను కొట్టేలా కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
-
ఎల్లో మీడియా పై ధ్వజమెత్తిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
చిత్తూర్ జిల్లా తిరుపతిలో టీనేజర్లకు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం
-
కుప్పంలో ఫలితాలే చంద్రబాబుపై వ్యతిరేకతకు నిదర్శనం
-
‘వాస్తవాలు తెలియకుండా లోకేష్ ట్వీట్లు’
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సస్పెండ్ జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగితే తమకు అంటగట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలియకుండా లోకేష్ ట్వీట్లు చేస్తే, చంద్రబాబు ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టారు. ‘‘జడ్జి సోదరుడిపై దాడి చేసింది టీడీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అని తేలింది. ఇప్పుడు చంద్రబాబు ఏమి సమాధానం చెప్తారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనించాలి. రామకృష్ణ అనే వ్యక్తి వెనుక టీడీపీ ఉందని తెలిసిపోతోంది. ప్రతాప్ రెడ్డి వైసీపీ అని తేలితే నేను రాజకీయాలు మానుకుంటా. టీడీపీకి దళితులు, మైనారిటిలపై గౌరవం లేదు. అధికారం పోయేసరికి వారిపై చంద్రబాబుకు ప్రేమ పుట్టింది’ అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. (చదవండి: ‘అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే కోపం’) సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకం ద్వారా 2 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘పాదయాత్ర సమయంలో సీఎం జగన్ కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలను గమనించారు. అన్ని జిల్లాల్లోనూ మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఆనాడే అన్ని ప్రాంతాలకు నీరు అందించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. సాగునీరందని భూములకు రూ. 2340 కోట్లతో బోర్లు వేయాలనుకున్నారు. కానీ అప్పటికప్పుడు మరో రూ.1600 కోట్లతో మోటార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.164 నియోజకవర్గాల్లో ఒక్కో రిగ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఒక్క రైతు వైఎస్ జగన్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
‘అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే కోపం’
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన మీద ప్రతిపక్షనేత చంద్రబాబు తప్పుడు లేఖ రాశారు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బి కొత్తకోటలో జరిగిన గొడవలో ఇరు వర్గాలు టీడీపీకి చెందిన వాళ్లేనని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం అబద్దాలతో లేఖ రాశారని వెల్లడించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు తెలిశాయని చెప్పారు. ఇలా తప్పుడు లేఖలు మరోసారి రాయకుండా ఉండేలా ఇప్పుడు చంద్రబాబు మీద కేసు పెట్టాలి అని నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచి విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. ఎస్వీయూ ఎన్నికల్లో చంద్రబాబుకు పెద్దిరెడ్డి వ్యతిరేకంగా పని చేశారని, అప్పటి నుంచి పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు కోపమని పేర్కొన్నారు. ఇప్పుడు కులం పేరుతో తప్పుడు ఆరోపణలు, నిందలు వేస్తున్నారని నారాయణ స్వామి మండిపడ్డారు. చదవండి: నిరూపిస్తే రాజీనామా చేస్తా: నారాయణ స్వామి -
నిరూపిస్తే రాజీనామా చేస్తా: నారాయణ స్వామి
సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు దమ్ముంటే మాజీ జడ్జి రామకృష్ణ సోదరుడిపై పెద్దిరెడ్డి మనుషులు దాడి చేసినట్లు నిరూపించాలి. అలా చేస్తే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. లేదంటే చంద్రబాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు. ఎంపీ రెడ్డెప్ప దళితుల పేరుతో కుట్రలకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో మాజీ జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్ర, ఇతరుల మధ్య గొడవ జరిగితే మంత్రి పెద్దిరెడ్డికి ఏం సంబంధం. దాడిలో పాల్గొన్న ప్రతాప్ రెడ్డి టీడీపీ నేత కాదా.. తెలుగుదేశం నాయకుల మధ్య గొడవలు జరిగితే మంత్రి పెద్దిరెడ్డి మీద నిందలు వేయడం సిగ్గు చేటు’ అన్నారు. ‘నిన్న బి కొత్తకోటలో జరిగిన గొడవ సందర్బంగా మాజీ జడ్జి రామకృష సోదరుడు రామచంద్ర మద్యం సేవించి ఉన్నారు. వైద్య పరీక్షల్లో ఇది నిర్ధారణ అయ్యింది. గొడవలో పాల్గొన్న ప్రతాప్ రెడ్డి తాను టీడీపీ నేతను అని చెప్పాడు. కానీ ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసింది’ అంటూ నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు) -
ఇసుక అక్రమాలపై నిఘా పెంపు
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గట్టి చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇసుక అక్రమంగా తవ్వినా, రవాణా చేసినా, పరిమితికి మించి నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన శిక్షలు అమలు చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాజాగా ఇలాంటి అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం టోల్ ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెచ్చింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఈ నంబర్‌కు కాల్చేసి కాల్ సెంటర్ ఉద్యోగులతో సీఎం మాట్లాడారు. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదులు చేసేవారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలన్న అంశంపై కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం కొన్ని సూచనలు చేశారు. మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, టాస్‌్కఫోర్స్ చీఫ్ సురేంద్రబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని టాస్క్‌ఫోర్స్ చీఫ్ సురేంద్రబాబును సీఎం ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు. వారోత్సవాలు విజయవంతం వరద తగ్గడంతో అవసరాల మేరకు ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు సక్సెస్ అవుతున్నాయి. రోజువారీ ఉత్పత్తిని లక్ష టన్నుల నుంచి 2 లక్షల టన్నులకు పెంచాలన్న లక్ష్యాన్ని వారోత్సవాలు ప్రారంభమైన 48 గంటల్లోనే అధికారులు అధిగమించారు. వరదలు తగ్గుముఖం పట్టడం, ఉత్పత్తికి అనుగుణంగా రవాణాకు తగినన్ని వాహనాలను అందుబాటులోకి తేవడంతో ఇది సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. శనివారం ఒక్కరోజే 2,03,387 టన్నుల ఇసుకను అందుబాటులోకి తేగా కేవలం 50,086 టన్నుల మేరకు మాత్రమే బుకింగ్‌లు వచ్చాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఆదివారం డిమాండ్ సగానికి తగ్గిపోయిందని వివరించారు. ఇక నుంచి రోజుకు సగటున 40వేల టన్నుల మేరకు ఇసుక డిమాండు ఉంటుందని భావిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. -
చంద్రబాబువి దొంగ దీక్షలు
-
పగలు మోసాలు.. రాత్రిళ్లు మంతనాలు
మైలవరం: సీఎం చంద్రబాబు రాత్రిళ్లు కాంగ్రెస్, బీజేపీలతో మంతనాలు చేస్తూ, పగలు మాత్రం రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగిందంటూ దీక్షలు, సభలతో ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబు మారారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మైలవరం రెడ్ గ్రౌండ్లో గురువారం జరిగింది. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడైన వసంత కృష్ణప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు పెట్టించారన్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేస్తే మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అదే కాంగ్రెస్‌కు దాసోహమయ్యి ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టించి టీడీపీ నేతలు వేధిస్తున్నా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అభినందించారు. మైలవరం మండల పార్టీ అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నేతలు సామినేని ఉదయభాను, జోగి రమేష్, ఎమ్మెల్యే రక్షణనిధి, మొండితోక జగన్మోహనరావు, అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, అప్పిడి సత్యనారాయణరెడ్డి, కాజా రాజకుమార్, వేములకొండ రాంబాబు, వేములకొండ తిరుపతిరావు పాల్గొన్నారు. -
బాబు అవినీతిపై పోరాటం ఉధృతం
వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి వెల్లడి సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, పాలన వైఫల్యాలపై ప్రజాపోరాటాన్ని ఉధృతం చేస్తామని పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే హక్కు ఉన్నప్పటికీ, ఉద్యోగులను అమరావతికి తరలిస్తూ, చంద్రబాబు పాలనా యంత్రాంగాన్ని నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు.విజయవాడలోని పార్టీ కార్యాలయం లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ అవినీతి, దురాగతాలను ఎదుర్కోవడంపై చర్చిస్తామన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం బాబు నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి: పార్థసారథి ఎన్నికల్లో వేలకోట్లు వెదజల్లిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని వేలంలో కొనుగోలు చేసినట్లు భావి స్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పార్థసారథి దుయ్యబట్టారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల హామీలను ఎంతవరకు అమలుచేసింది, ఎన్ని నిధులు కేటాయించింది శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. టీడీపీ నేత ఒకరు తెలంగాణాలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో రూ. 11వేల కోట్ల కాంట్రాక్టులు దక్కించుకోబట్టే మంత్రులు స్పందించడం లేదని ఆరోపించారు. రూ.వెయ్యి కోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను రూ. 22కోట్లకు టీడీపీ నేతలు అడ్డగోలుగా దక్కించుకున్నా దేవాదాయ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. -
బాబు వంద రోజుల పాలన శూన్యం
పుంగనూరు: సీఎం చంద్రబాబునాయుడు వంద రోజుల పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని, ఆయన ప్రమాణస్వీకారం చేసిన రోజున పెట్టిన ఐదు సంతకాలలో ఒక్కటీ అమలు కాలేదని పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం పుంగనూరులో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో సమావేశమయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల అభివృద్ధికి చంద్రబాబు అడ్డంకిగా మారారన్నారు. సొంత జిల్లాలో ఆదరణ కోల్పోయిన బాబు రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేసి, స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని ప్రకటి ంచి ప్రస్తుతం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లకోసంహామీలు గుప్పించి, పదవిలోకి రాగానే వాటిని తుంగలో తొక్కి చరిత్రహీనుడిగా చంద్రబాబు మిగిలిపోయాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు దాదాపుగా పూర్తికావచ్చాయని, 20 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టుల పనులను నిలిపేయడంతో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల భూమి బీడుగా మారుతోందన్నారు. రాయలసీమలో ఏనాడూ చంద్రబాబుకు అనుకూలంగా ఫలితాలు రాలేదని, అందుకే వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. రాజధాని ఏర్పాట్లలో రెఫరెండం చేపట్టాలని కోరారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అమలు చేయలేని హామీలను బడ్జెట్లో చూపెడుతూ నిధులు మాత్రం నామమాత్రంగా కేటాయించలేదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2004వ సంవత్సరానికి ముందు పరిస్థితులు మ ళ్లీ రాబోతున్నాయని తెలిపారు. రుణమాఫీ చేస్తే అభివృద్ధి ఆగిపోయినట్లేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడం చూస్తుంటే వారి నుంచి ఎలాంటి సహకారమూ అందేలా లేదని అన్నారు. సీఎం చంద్రబాబు రోజుకొక ప్రకటన తో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం మంత్రులను, ఎమ్మెల్యేలను, నేతలను ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షమీమ్‌షరీఫ్, ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ పాల్గొన్నారు. -
జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం
జిల్లాలో 14 స్థానాలు గెలుస్తాం 3 ఎంపీ స్థానాలు మావే కేంద్రంలోనూ జగన్ గాలి పెద్దిరెడ్డి ధీమా పుంగనూరు, న్యూస్‌లైన్: ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, కుప్పంలో సైతం వైఎస్సార్సీపీ విజయం సాధించి జిల్లాలో 14 ఎమ్మెల్యే స్థానాలు, మూడు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామని మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట ఎంపీ స్థానంలో అత్యధిక మెజారిటీ సాధిస్తామని, కేంద్రంలో సైతం జగన్ హవా కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన పుంగనూరులో ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు డాక్టర్లు శివ, ప్రభాకర్‌తోపాటు పలువురు నేతలతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో ప్రజలు వైఎస్.రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకునేందుకు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని, జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో అభిమానంతో జగన్‌కు ఓట్లు వేశారన్నారు. జగన్ నేతృత్వంలో రాజన్న సంక్షేమ పథకాలు రాష్ర్టంలో అమలవుతాయన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ మీద ఉన్న ప్రేమను, నమ్మకాన్ని చాటుకున్నారని, ఈ పోలింగ్ సరళి ప్రతిపక్ష పార్టీలకు నిద్రలేకుండా చేస్తోందని చెప్పారు. నాలుగేళ్ల పాటు ప్రజలు అండగా నిలిచి ఆదరించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మహాసంగ్రామం పూర్తయిందని, వైఎస్సార్సీపీ విజయ బావుటా ఎగురవేయడమే మిగిలి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, కొండవీటి నరేష్, సికె. శ్రీనివాసులు, రాజేష్, ఆటో సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేటితో ఎన్నికల ప్రచారం సమాప్తం
ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందంజలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సాక్షి, చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం గతనెల 19వ తేదీ వర కు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు 20వ తేదీ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ప్రధానం గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, తిరుప తి, చిత్తూరు, రాజంపేట లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు మూడుసార్లు కలిశారు. కూడళ్లలో సభలు పెట్టారు. గడప గడపా ఎక్కి దిగారు. దారిలో కనిపించిన వారికల్లా నమస్కారం పెట్టారు. అన్నా ఓటేయండి.. అక్కా.. మీ ఓటు.. తమ్ముడూ మరచిపోవద్దు.. పెద్దాయన గుర్తుపెట్టుకో.. బాషా భాయూ అంటూ వరుసలు పెట్టి పిలుస్తూ, ఆత్మీయం గా పలకరిస్తూ, దీనంగా ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. పల్లెపల్లెలో ఎన్నికల ప్రచార మైక్‌లు హోరెత్తాయి. ప్రచారంలో వైఎస్సార్ సీపీ ముందంజ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా ప్రచార బాధ్యతలను ప్రధానంగా మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూజానికెత్తుకున్నారు. ఆయన తాను ప్రాతినిథ్యం వహిస్తు న్న పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసుకుంటూనే కుప్పం ఎన్నికల ప్రచారంపై దృష్టి కేంద్రీకరించా రు. చిత్తూరు, చంద్రగిరి, పూతలపట్టు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచారం సాగిం చారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులు, పలమనేరులో అమరనాథరెడ్డి, గంగాధరనెల్లూరులో నారాయణస్వామి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నగరిలో ఆర్కే.రోజా, సత్యవేడులో ఆదిమూలం, తంబళ్లపల్లెలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మదనపల్లెలో దేశాయ్ తిప్పారెడ్డి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, పూతలపట్టులో డాక్టర్ సునీల్‌కుమార్, కుప్పంలో చంద్రమౌళి ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందున్నారు. రాజంపేట లోక్‌సభ పరిధిలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుపతి లోక్‌సభ పరిధిలో డాక్టర్ వరప్రసాద్, చిత్తూరు లోక్‌సభ పరి ధిలో డాక్టర్ సామాన్య కిరణ్ విస్తృతంగా ప్రచారం చేస్తూ, ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. వెనుకబడిన కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఇతర పార్టీలు ప్రచారం నిర్వహించలేకపోయాయి. కాంగ్రెస్‌కు ముఖ్యమైన నాయకులు లేకపోవటంతో దొరికిన వారికే బీఫారం ఇచ్చి అభ్యర్థులుగా బరిలోకి దింపారు. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థుల పరిస్థితి కూడా ఇంతే. మందీ మార్బలం లేకపోవటంతో చాలా చోట్ల ప్రచారం చేసుకోలేక ఈ రెండుపార్టీల అభ్యర్థులు డీలాపడ్డారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి కూడా స్పందన లేదు. లోక్సత్తాదీ సత్తాలేని ప్రచారమే. తిరుపతి, రాజంపేట లోక్‌సభ స్థానాలకు, మదనపల్లె అసెంబ్లీకి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో వెనుకబడ్డారు. ఈ పార్టీకి క్యాడర్ లేకపోవడమే అందుకు కారణం. -
పెద్దిరెడ్డి దెబ్బకు కిరణ్ ఔట్
రాజకీయ క్రికెట్ రంగంలో పెద్దిరెడ్డి దెబ్బకు కిరణ్‌కుమార్‌రెడ్డి డకౌట్ అయ్యూరు. సొంత నియోజకవర్గంలోనే ఆధిక్యతను కోల్పోవడంతో కిరణ్ దిక్కుతోచని పరిస్థితిల్లో పడ్డారు. చిరకాల రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రజలకు చేరువై పడమటి మండలాల్లో పూర్తి స్థారుులో పట్టు నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులోని కలికిరి మినహా అన్ని మండలాల్లోని అన్ని వర్గాల నాయకులు పెద్దిరెడ్డి పంచన చేరారు. దీంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సోనియూగాంధీ ఆదేశాల మేరకు నీరుగార్చారని ప్రజలు సైతం ఆగ్రహంగా ఉన్నారు.కిరణ్ సొంతంగా పలుమార్లు నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేట తెల్లం కావడంతో పరాభవం తప్పదని గ్రహించి కుంటి సాకులతో పోటీ నుంచి తప్పుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కు రాజకీయూలను పటాపంచలు చేస్తూ వైఎస్సార్ సీపీని పెద్దిరెడ్డి బలోపేతం చేశారు. పుంగనూరు, న్యూస్‌లైన్: నాలుగు దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, నల్లారి కుటుంబానికి మధ్య వైరం కొనసాగుతోంది. రెండు పర్యాలు పీలేరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్ ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య సీఎం అయ్యా రు. అధిష్టానం అనుగ్రహంతో కిరణ్ ముఖ్యమంత్రి అయ్యా రు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన పెద్దిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కిరణ్ ఓటమే తన లక్ష్యమని ఆనాడే సవాల్ చేశారు. పెద్దిరెడ్డి మీద వ్యక్తగత కక్షతో పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. తనమీద కక్షతో కిరణ్ ప్రజల్ని వేధిస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటూ మరో వైపు కిరణ్ కుమార్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యూరు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఏకమై కుమ్మక్కు రాజకీయాలు నడిపినా ఒంటరిపోరు చేసి తన మద్దతుదారుడు దేశాయ్ తిప్పారెడ్డిని గెలిపించుకుని సత్తా చాటారు. తర్వాత పీలేరుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఒకవైపు పెద్దిరెడ్డి, మరో వైపు మిథున్‌రెడ్డి అన్ని మండలాల్లో పర్యటిస్తూ పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి తమపై ఎన్నికల్లో తలపడాలని పలుమార్లు వారు సవాల్ విసిరారు. తండ్రీతనయులిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో ఉన్నారు. మిథున్‌రెడ్డి రాజం పేట పార్లమెంట్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, రాజంపేటలో ఉన్న పీలేరు అసెంబ్లీపై మిథున్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఒంటరైన కిరణ్ నియోజకవర్గంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారంతా నేడు పెద్దిరెడ్డి వర్గంలో చేరిపోయారు. కిరణ్‌కు విధేయుడుగా ఉన్న ముస్లిం మైనార్టీనేత జమీర్ ఆలీఖాన్ పెద్దిరెడ్డితో జత కట్టారు. ఈయనకు కలకడ, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాల్లో పూర్తి పట్టు ఉంది. అలాగే మరో సన్నిహితుడు కేవీపల్లె మండలం మాజీ వైస్ ఎంపీపీ వంగిమల్ల వెంకటరమణారెడ్డి కూడా పెద్దిరెడ్డి పంచన చేరిపోయారు. మాజీ ఎంపీపీ, ఎంవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల అధినేత ఎం.వెంకటరమణారెడ్డి కిరణ్‌కు అత్యంత సన్నిహితలో ఒకరు. ఆయన కూడా పెద్దిరెడ్డికి మద్దతుగా నిలిచారు. మరో సన్నిహితుడు మాజీ సర్పంచ్ ఏటీ రత్నాకర్ కూడా రామచంద్రారెడ్డి వైపు వెళ్లిపోయారు. ఇలా ముఖ్యులు దూరమైపోవడంతో కిరణ్ దాదాపు ఒంట రివాడయ్యారు. ఇదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది. ఒక వైపు కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడిగా ఉంటూనే సమైక్యాంధ్ర రాగం ఆలపించారు. ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకు ని ఉద్యమాన్ని నీరుగార్చారన్న ఆరోపణలు కిరణ్‌పై వచ్చా యి. విభజన జరిగిపోయిన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. జేఎస్పీ తరపున కిరణ్ పీలేరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరి గింది. అయితే నామినేషన్ల పర్యం మొదలైన తర్వా త కిరణ్ పోటీ చేయడంలేదని, తమ్ముడు కిషోర్ చేత నామినేషన్ వేయించారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తాను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉన్నందున పోటీ చేయడంలేదని చెబుతున్నా నియోజకవర్గంపై పూర్తిగా పట్టుసాధించిన రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలను ఎదుర్కొనలేక పోటీ నుంచి తప్పుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.