
సాక్షి, తిరుపతి: తనపై నిరాధార వార్తలు వేసినందుకు బిగ్ టీవీకి పరువు నష్టం నోటీసులు ఇచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డిపై బిగ్ టీవీ తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి చర్యలకు దిగారు.
కాగా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు వెళ్లాయి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పరువు నష్టం వేసేందుకు బిగ్ టీవీకి ఇప్పటికే పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు నోటీసులు పంపించారు. ఇక, తాజాగా బిగ్ టీవీకి పరువు నష్టం కింద రూ.50కోట్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై నిరాధారంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయపరంగా బుద్ధి చెబుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు.
ఇక, గతంలో ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్‌కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని పెద్దిరెడ్డి నోటీసులు ఇచ్చారు. తనపై తప్పుడు వార్తలు రాసిన కారణంగా ఈనాడు, ఈటీవీకి రూ.50కోట్లు.. మహా న్యూస్‌కు రూ.50కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment