‘వైఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం హడావుడి’ | Peddi Reddy Ramachandra Reddy Slams Kutami Govt Over Punganur Asmiya Anjum | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం హడావుడి’

Published Mon, Oct 7 2024 8:10 AM | Last Updated on Mon, Oct 7 2024 12:52 PM

Peddi Reddy Ramachandra Reddy Slams Kutami Govt Over Punganur Asmiya Anjum

సాక్షి,తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్‌ 9వ తేదీ (బుధవారం) పుంగనూరు పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హడావుడి కార్యక్రమాలు చేపట్టిందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రుల పర్యటనతో పాటు, ఆ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని సైతం అరెస్ట్‌ చేసిందన్నారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత వారం రోజులుగా చిన్నారి అశ్వియ అంజూమ్‌ హత్య కేసులో దోషుల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానివేసి ఇచ్చిన హామీలు సంక్షేమ పాలనపై దృష్టి పెట్టాలి’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.

కాగా, పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్‌ హత్య ఉదంతంపై కూటమి ప్రభుత్వం హైడ్రామాకు తెరతీసింది. అంజుమ్‌ కిడ్నాప్, ఆపై హత్య ఘటనను వారం రోజులుగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం... ఆది­వారం ఒక్కసారిగా హడావిడి చేసింది. వారంరోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కేసులో చిన్న క్లూ కూడా సాధించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలియడంతో హడావుడిగా  ఆదివారం ముగ్గురు మంత్రులు పుంగనూరులో వాలిపోయారు. అదే సమయంలో  ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement