Punganur constituency
-
‘వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం హడావుడి’
సాక్షి,తిరుపతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 9వ తేదీ (బుధవారం) పుంగనూరు పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హడావుడి కార్యక్రమాలు చేపట్టిందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రుల పర్యటనతో పాటు, ఆ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని సైతం అరెస్ట్ చేసిందన్నారు.ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత వారం రోజులుగా చిన్నారి అశ్వియ అంజూమ్ హత్య కేసులో దోషుల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానివేసి ఇచ్చిన హామీలు సంక్షేమ పాలనపై దృష్టి పెట్టాలి’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.కాగా, పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య ఉదంతంపై కూటమి ప్రభుత్వం హైడ్రామాకు తెరతీసింది. అంజుమ్ కిడ్నాప్, ఆపై హత్య ఘటనను వారం రోజులుగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ఒక్కసారిగా హడావిడి చేసింది. వారంరోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కేసులో చిన్న క్లూ కూడా సాధించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో హడావుడిగా ఆదివారం ముగ్గురు మంత్రులు పుంగనూరులో వాలిపోయారు. అదే సమయంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. -
కమ్మపల్లిలో ఆగని టీడీపీ అరాచకం
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని కమ్మపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. పదిరోజుల నుంచి వైఎస్సార్సీపీ కుటుంబాలు గ్రామంలోంచి బయటకు వెళ్లకుండా, వెలుపల ఉన్నవారు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలో జరుగుతున్న ఆటవిక చర్యల గురించి సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. నాలుగు రోజుల కిందట టీడీపీ నేతల దాడుల్లో తీవ్రంగా గాయపడినవారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియని దుస్థితి నెలకొంది.రెండురోజుల కిందట పోలీసులు గ్రామంలోకి వెళ్లి ఇరువర్గాల వారితో మాట్లాడినా.. టీడీపీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో జరుగుతున్న దౌర్జన్యకాండ బయటకు పొక్కకుండా చూసేందుకు వారి ఫోన్లు కూడా లాగేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ గ్రామంలోకి పాల సరఫరా నిలిపివేశారు. వైఎస్సార్సీపీ వారి పశువులకు గ్రాసం కూడా వేయనీయడంలేదని తెలిసింది. గ్రామంలోని వైఎస్సార్సీపీ కుటుంబాలకు చెందిన టమాటా దిగుబడులను మార్కెట్‌కు తరలించకుండా నిలిపేశారు. పొలాల్లో నాలుగు రోజులుగా నిల్వ ఉన్న టమాటా దిగుబడికి సంబంధించినవీడియోలు బయటకు వచ్చాయి.గ్రామంలో సుమారు వెయ్యి బాక్సుల వరకు టమాటా నిల్వలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక బాక్సు విలువ రూ.500కు పైనే. ఒకటి రెండురోజుల్లో మార్కెట్‌కు తరలించకపోతే ఈ టమాటా దిగుబడి మొత్తం కుళ్లిపోయే ప్రమాదం ఉంది. టీడీపీ దౌర్జన్యకాండను జీర్ణించుకోలేని ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఈవీడియోలు, ఫొటోలను వైరల్ చేసినట్లు తెలిసింది. మీడియా, పత్రికల వారికి పంపినట్లు సమాచారం. గ్రామంలో జరుగుతున్న టీడీపీ నేతల దాష్టీకంపై మానవహక్కుల కమిషన్ స్పందించాలని మానవతావాదులు కోరుతున్నారు. -
చిత్తూరు: పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
-
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
సదుం/పిచ్చాటూరు/సోమల/తిరుమల: చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తహసీల్దారు గుర్రప్ప తెలిపిన వివరాల ప్రకారం.. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, పెద్దడివి నుంచి జోగివారిపల్లె అటవీ ప్రాంతానికి సమీపంలోని పంట పొలాలపై సుమారు 15 ఏనుగులు దాడి చేశాయి. పదిహేను మంది రైతులకు చెందిన మామిడి తోటల్లో చెట్ల కొమ్మలను విరిచేయడంతో పాటు, నలుగురు రైతుల చెరుకు గానుగలను ధ్వంసం చేశాయి. గ్రామ సమీపంలోని చెరుకు తోటలో నిద్రిస్తున్న గొల్లపల్లెకు చెందిన ఎల్లప్ప(38)పై ఏనుగులు దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే సత్యవేడు నియోజకవర్గం, పిచ్చాటూరు పట్టణంలోకి బుధవారం అర్ధరాత్రి మూడు ఏనుగులు ప్రవేశించాయి. స్థానికులు, ఫారెస్టు అధికారులు పట్టణ పొలిమేరల్లోకి తరిమికొట్టారు. గురువారం వేకువజామున మండలంలోని వేలూరు, వెంగళత్తూరు, రామాపురం గ్రామాల్లోని వరి, సంపంగితోటలను ధ్వంసం చేశాయి. పంట పొలాలను ఆనుకుని నివాస ప్రాంతాలు ఉండడంతో ప్రజలు, రైతులు భయాందోళనకు లోనయ్యారు. సోమల మండలం, అన్నెమ్మగారిపల్లెకు చెందిన శేఖర్, ఆవులపల్లెకు చెందిన ఏసయ్య పెద్దపంజాని మండలంలోని మాధవరం నుంచి గురువారం వేకువ జామున పెద్ద ఉప్పరపల్లెకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలోని సోమల–పెద్ద పంజాని మండలాల సరిహద్దులోని దాబా సమీపంలో రోడ్డుపై ఏనుగులు కనిపించాయి. ద్విచక్ర వాహనాన్ని అక్కడే ఆపే ప్రయత్నం చేయగా.. గమనించిన ఏనుగులు వారిపై దాడికి యత్నించాయి. వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ద్విచక్రవాహనాన్ని ఏనుగులు ధ్వంసం చేశాయి. అలాగే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై పాపవినాశనం మార్గంలో వెళ్తుండగా ఆకాశగంగ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఒక్కసారిగా రెండు ఏనుగులు రోడ్డుపైకి వచ్చి ద్విచక్రవాహనంపై ఉన్న వారి వెనుకపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన యువకులు ద్విచక్రవాహనంపై వేగంగా వెనక్కు మళ్లారు. -
ఓటర్లపై ఎస్ఐ జులుం
పుంగనూరు: ఓటు వేసేందుకు వచ్చిన దళిత మహిళలపై ఎస్ఐ జులుం ప్రదర్శించి, ఓటర్లను చితకబాదిన సంఘటన సోమల పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది. అలాగే విధి నిర్వహణలో కానిస్టేబుల్‌పై ఉన్న దౌర్జన్యం చేసి, అతని సెల్‌ను లాక్కుని పగులగొట్టిన సంఘటన వనమలదిన్నెలో జరిగింది. గురువారం ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. సోమలలోని 149 పోలింగ్ కేంద్రంలో సరైన వసతులు లేకపోవడంతో ఎండవేడిమికి తట్టుకోలేక దళిత మహిళ తిమ్మిలమ్మ ఓటర్ల పక్కన కూర్చుని ఉండడంతో ఆగ్రహించిన ఎస్ఐ శ్రీనివాసులు లాఠీతో ఆమెను చితకబాదారు. దీంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు మహిళలు, యువకులకు కూడ గాయపడ్డారు. దీనిపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. ఇది తెలుసుకుని అక్కడికి వెళ్లిన వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై కూడ ఎస్ఐ చెయ్యి చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులను పరామర్శించి, ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దాష్టీకంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చే శారు. దళిత మహిళలపై దాడి చేయడం, తప్పుడు కేసులు బనాయించడంపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే హెచ్చరించారు. -
మంత్రి అమర్నాథ్రెడ్డికి షాక్
సాక్షి, తిరుపతి: పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా అనీషారెడ్డిని ప్రకటించడం జిల్లా మంత్రి అమర్నాథ్రెడ్డికి మింగుడుపడటం లేదని తెలిసింది. ఈమె అభ్యర్థిత్వాన్ని అమర్నాథ్రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు భోగట్టా. ఈమె ఎంపిక విషయంలో సీఎం నుంచి తనకు ఎటువంటి సమాచారం లేకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పుంగనూరు అసెంబ్లీ స్థానం టీడీపీ అధినేతకు మొదటి నుంచీ పెద్ద సవాలు. ఇక్కడ పాగా వేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీకొనే అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడ్డారు. జిల్లా నాయకులతో పలుమార్లు సమావేశమై చర్చించారు. ఈ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం అసాధ్యమని, తెలిసి చేతులు కాల్చుకోవడం ఎందుకని పలువురు టీడీపీ నేతలు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. మంత్రి అమర్నాథ్రెడ్డి ఈ సారి పుంగనూరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా... పోటీ చేయడానికి ఇష్టపడలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో తనే ఎవరో ఒకరిని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా పలువురితో చర్చలు జరిపారు. ఈ చర్చలు కొలిక్కి వచ్చే సమయంలో సీఎం చంద్రబాబు అనీషారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అమర్నాథ్రెడ్డి షాక్ అయ్యారు. అమర్‌కి ఇష్టం లేదు.. అయినా ఇస్తున్నా పుంగనూరు అభ్యర్థిగా పోటీ చేయాలని టీడీపీ నేత శ్రీనాథ్‌రెడ్డి సతీమణి, మంత్రి అమర్నాథ్రెడ్డి మరదలు అనీషారెడ్డి 2004 నుంచి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు 2004లో వెంకటరమణరాజును అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరి టికెట్ ఆశించినా ప్రయోజనం లేకుండా పోయింది. మళ్లీ టీడీపీలోకి వచ్చి 2014లోనూ పుంగనూరు టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. రెండు పర్యాయాలు టీడీపీ నుంచి తిరస్కారం ఎదురైంది. టికెట్ రాకపోవడానికి బంధువులతో పాటు అమర్నాథ్రెడ్డి కూడా కారణమనే ప్రచారం జరిగింది. క్వారీ వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా అమర్నాథ్రెడ్డి నుంచి అనీషారెడ్డి విడిపోయినట్లు తెలిసింది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్రెడ్డి తనకు నమ్మకంగా ఉన్న వారిని పుంగనూరు అభ్యర్థిగా ఎంపిక చేయాలని భావించారు. ఈ విషయమై చంద్రబాబు పలుమార్లు ప్రస్తావించినా మంత్రి వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో అనీషారెడ్డి పేరు ప్రస్తావనకు వస్తే అమర్నాథ్రెడ్డి వ్యతిరేకించినట్లు సమాచారం. చివరకు మంత్రికి సమాచారం లేకుండా చంద్రబాబు అనీషారెడ్డిని టీడీపీ ఇన్చార్జ్గా ప్రకటిం చారు. ‘అమర్నాథ్రెడ్డి వ్యతిరేకించినా... నీకే పుంగనూరు బాధ్యతలు అప్పగిస్తున్నా’ అని సీఎం స్వయంగా చెప్పినట్లు ఆమె వర్గీయులంటున్నారు. సీఎం ప్రకటనతో రెండు కుటుంబాల మధ్య మరింత అంతరం పెరిగింది. -
రేపు పుంగనూరు నియోజవర్గంలో జగన్ సమైక్య శంఖారావం
చిత్తూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర గురువారం చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది. పుంగనూరు నియోజకవర్గంలో జగన్ పర్యటించనున్నారు. సాదుంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించి, అనంతరం బహిరంగం సభలో మాట్లాడుతారు. బాలంవారిపల్లి, శివరాంపురం మీదుగా పర్యటించి పీలేరు క్రాస్ రోడ్స్ వద్ద జరిగే బహిరంగం సభలో పాల్గొంటారు. పీలేరు కాలనీ మీదుగా పర్యటన సాగనుంది. కల్లూరులో YSR విగ్రహాన్ని ఆవిష్కరించి, కల్లూరులో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పడిపుట్ల బైలు మీదుగా పర్యటన కొనసాగుతుంది. జగన్ సమైక్య శంఖారావం యాత్ర గురువారం దామలచెరువు (చంద్రగిరి) వరకూ కొనసాగనుంది.